ఇస్లామిక్ దృక్పథంలో మతం అనేది సంపూర్ణ
జీవన విధానాన్ని కలిగి ఉన్న విస్తృత నిర్మాణం. ఇస్లాం మానవునికి దేవునితో ఉన్న సంబందాన్ని
వివరిస్తుంది. ఇస్లామిక్ జీవన విధానంలో
మతం మరియు ఆధ్యాత్మికత మధ్య విభజన సాధ్యం కాదు. ఇస్లాంలో మతం
మరియు ఆధ్యాత్మికత ఏకీకృత జీవన విధానంగా మిళితం చేయబడ్డాయి.
ఇస్లామిక్ ఆధ్యాత్మికత
పవిత్ర ఖుర్ఆన్ లోని దేవుని మాటలపై ఆధారపడింది. ముస్లింలు తమ ఆధ్యాత్మిక జీవితాన్ని పవిత్ర ఖుర్ఆన్ లో
నిర్దేశించినట్లుగా గడపాలి. చాలా మంది ముస్లిం రోగులకు దేవుని చిత్తంపై
నమ్మకం మరియు విశ్వాసం ఉంది మరియు అనారోగ్యాన్ని వారు శిక్షగా భావించరు, పాపాలకు
ప్రాయశ్చిత్తం చేసే మార్గంగా భావిస్తారు.
ఇస్లాంలో అనారోగ్యాన్ని
నిర్వహించడం అనగా శారీరక లేదా మానసిక ఆరోగ్యo పొందడం కాక జ్ఞానోదయం వైపు ప్రయాణించడం. ఇస్లామిక్
సాంప్రదాయం కష్టాలను దేవునిపై సంపూర్ణ ఆధారపడటానికి, ఆయనకు లొంగిపోవడానికి, సత్యాన్ని
నేర్చుకోవడానికి మరియు ధర్మాన్ని నిర్మించడానికి అవకాశాలుగా చూస్తుంది. లోతైన
మానసిక అంతర్దృష్టులను గ్రహించడం మరియు అందరికీ ప్రయోజనం చేకూర్చే అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వాన్ని
పొందడం చాలా ముఖ్యం.
ప్రపంచం లో రోగులు అధిక స్థాయి లో ఉన్నారు కాని అధ్యయనాలు
అధిక స్థాయిలో ఆధ్యాత్మిక శ్రేయస్సు ఉన్న రోగులు నిరాశకు గురయ్యే అవకాశం తక్కువని
చూపిస్తున్నాయి. అంతర్గత శాంతిని కనుగొనడం జీవితాన్ని ఆస్వాదించడానికి బాగా
సహాయపడుతుంది. చాలా మంది రోగులు జీవించడానికి బలమైన సంకల్పం కూడా కావాలని అల్లాహ్
ను ప్రార్ధిస్తారు.
చికిత్స సమయంలో ఆధ్యాత్మిక
కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తులు అనారోగ్యంతో బాధపడుతున్న అనుభవం తమను మంచిగా
మార్చిందని భావిస్తారు.
No comments:
Post a Comment