6 March 2020

బేగం హజ్రత్ మహల్



Image result for begam hajrath mahal





బేగం హజ్రత్ మహల్ గా ప్రసిద్ది చెందిన ముహమ్మది ఖానుమ్  ఫైజాబాద్, అవధ్ లో 1820 లో జన్మించారు.. ఆమెను బేగం ఆఫ్ అవధ్ అని కూడా అందురు. ఆమె భర్త నవాబ్ వాజిద్ అలీ షా.  ఆమె నవాబ్ వాజిద్ అలీ షా యొక్క రెండవ భార్య. వారు ఇరువురికి  కుమారుడు బిర్జిస్ ఖాద్రా జన్మించిన తరువాత ఆమెకు 'హజ్రత్ మహల్' అనే బిరుదు లభించింది.

బ్రిటిష్ వారు 1856 లో అవధ్‌ను స్వాధీనం చేసుకున్నారు మరియు వాజిద్ అలీ షా కలకత్తాకు బహిష్కరించబడ్డారు. తన భర్త కలకత్తాకు బహిష్కరించబడిన తరువాత, ఆమె అవధ్ రాజ్య వ్యవహారాల బాధ్యతలు చేపట్టింది మరియు లక్నో పాలించసాగింది.

ఆమె మహిళల సైన్యాన్ని ఏర్పాటు చేసి, ఉమా దేవిని దానికి  కమాండర్‌గా నియమించింది. రాజ్య సంక్రమణ సిద్ధాంతం/Doctrine of Lapse అనుగుణంగా లక్నోను అప్పగించాలని కోరిన నాటి గవర్నర్ జనరల్ డల్హోసి కోరికకు వ్యతిరేకంగా 1857 లో జరిగిన తిరుగుబాటులో ఆమె చురుకుగా పాల్గొంది,

1857 నాటి ఆమె భారతీయ తిరుగుబాటు సమయంలో ఆమె  బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కు వ్యతిరేకంగా  తిరుగుబాటు చేసింది. ఆమె చాలా ధైర్యవంతురాలు మరియు నాటి పురుష-ఆధిపత్య సమాజంలో ఇటువంటి ధైర్యశాలి అయిన అబించడం  అపూర్వమైనది. ఆమె తన కుమారుడు, ప్రిన్స్ బిర్జిస్ ఖాదర్ ను  అవధ్ యొక్క వాలి (పాలకుడు) ను చేసింది; స్వల్ప పాలన తరువాత ఆమె పరిపాలనను విడిచిపెట్టవలసి వచ్చింది.

ఆమె కంపెనీ వారితో జరిగిన యుద్దంలో    గట్టి ప్రతిఘటన ఇచ్చింది. కానీ లక్నో పతనం తరువాత ఆమె ఖాట్మండుకు పారిపోయింది 1857 యుద్ధంలో ఆమెను   పాసి పల్టన్ /పటాలం బ్రిటిష్ వారు నిర్భందించ కుండా రక్షించినదని  పల్టన్ వర్గాలు పేర్కొన్నారు

1857 యొక్క భారతీయ తిరుగుబాటు
ప్రధమ భారతీయ తిరుగుబాటు 1857 నుండి 1858 సమయం లో ఆమె  మద్దతుదారుల బృందం రాజా  జైలాల్ సింగ్ నేతృత్వంలో బ్రిటిష్ దళాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసింది; తరువాత, వారు లక్నోపై నియంత్రణను స్వాధీనం చేసుకున్నారు మరియు ఆమె తన కుమారుడు బిర్జిస్ ఖాదర్ ను ధ్ పాలకుడు (వాలి) గా ప్రకటించింది.

బేగం హజ్రత్ మహల్ యొక్క ప్రధాన ఫిర్యాదులలో ఒకటి, ఈస్ట్ ఇండియా కంపెనీ దేవాలయాలను మరియు మసీదులను కూల్చివేసి రోడ్లను నిర్మించుట  మరియు వారు అనుసరిస్తున్న విచ్చినకర మత విధానాలు.

బ్రిటీష్ నాయకత్వంలోని దళాలు లక్నోను మరియు ధ్‌ లోని అధిక ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకున్నప్పుడు, ఆమె వెనుకంజ వేయక తప్పలేదు. హజ్రత్ మహల్ నానా సాహెబ్‌తో కలిసి పనిచేసింది కాని నానా సాహెబ్ ఫైజాబాద్‌కు చెందిన మౌల్వి తో కలసి షాజహన్‌పూర్‌పై జరిగిన దాడి చేసాడు.

చివరకు  ఆమె నేపాల్‌కు వెళ్లి అక్కడ ఆశ్రయం కోరింది.  మొదట రానా ప్రధాన మంత్రి జంగ్ బహదూర్ ఆశ్రయం నిరాకరించారు, కానీ తరువాత అక్కడ ఉండటానికి అనుమతించారు. ఆమె అక్కడ 1879 లో మరణించింది మరియు ఖాట్మండు యొక్క జామా మసీదు మైదానంలో పేరులేని సమాధిలో ఖననం చేయబడింది. ఆమె మరణం తరువాత, క్వీన్ విక్టోరియా (1887) జూబ్లీ సందర్భంగా, బ్రిటిష్ ప్రభుత్వం బిర్జిస్ ఖాదర్ ను క్షమిoచి  మరియు అతన్ని స్వదేశానికి తిరిగి రారడానికి అనుమతించారు.

బేగం హజ్రత్ మహల్ సమాధి ఖాట్మండు మధ్య భాగంలో ఉన్న ఘంటాఘర్ లోని జామా మసీదు సమీపంలో ఉంది.

ఆగష్టు 15, 1962, మహల్ లక్నోలోని హజ్రత్‌గంజ్‌లోని ఓల్డ్ విక్టోరియా పార్కులో భారత ప్రధమ తిరుగుబాటులో ఆమె పాత్రకు గాను సత్కరించారు. ఉద్యానవనం పేరు మార్చడంతో పాటు, ఒక పాలరాయి స్మారక చిహ్నం నిర్మించబడింది.

10 మే 1984, భారత ప్రభుత్వం మహల్ గౌరవార్థం స్మారక తపాల బిళ్ళను జారి చేసింది.
భారతదేశంలోని మైనారిటీ వర్గాలకు చెందిన మెరిటోరియస్ బాలికల కోసం బేగం హజ్రత్ మహల్ నేషనల్ స్కాలర్‌షిప్‌ను భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ స్కాలర్‌షిప్ మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ద్వారా అమలు చేయబడింది.

No comments:

Post a Comment