13 March 2020

ముస్లిం రిజర్వేషన్ల-ఆవశ్యకత-ఒక పరిశీలన



Image result for muslims in india

భారతదేశంలోని 172 మిలియన్ల ముస్లింల పాలిట వరం మహారాష్ట్రలోని విద్యా సంస్థలలో ఐదు శాతం రిజర్వేషన్లు ప్రసాదించే ఆలోచన.  

ముస్లింల సామాజిక-విద్యా అభివృద్ధిని అధిగమించడానికి రిజర్వేషన్ల ఆలోచన కొత్తది కాదు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, బీహార్, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ వంటి రాష్ట్రాలు ఇప్పటికే వెనుకబడిన ముస్లింల కోసం ఇటువంటి చర్యలను ప్రవేశపెట్టాయి.



2013లో ప్రభుత్వo ఉపాధి మరియు విద్యలో ముస్లింలకు ఎనిమిది శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రచారానికి ప్రతిస్పందనగా, మహారాష్ట్ర ప్రభుత్వం 2014 లో ఆర్డినెన్స్ ద్వారా 50వెనుకబడిన ముస్లిం కులాలకు ఐదు శాతం రిజర్వేషన్లను ఆమోదించింది. అయితే దానిపై  బొంబాయి హైకోర్టు ప్రభుత్వ ఉపాధిలో రిజర్వేషన్ల పై స్టే(stay)  ఇచ్చింది  కానీ విద్యా సంస్థలలో రిజర్వేషన్లు  అనుమతించబడినవి.


కానీ అప్పటి బిజెపి ప్రభుత్వం 2014 డిసెంబర్‌లో వెనుకబడిన ముస్లిం రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ లాప్స్(lapse) అయ్యేట్టు చేసింది.

ముస్లింలకు రిజర్వేషన్లు అనేవి ప్రభుత్వ ఉపాధి లేదా విద్యా సంస్థలలో లేదా సమాజంలోని సామాజిక-విద్యా సూచికలను మెరుగుపరచడానికి ఒక పరిష్కారం కాదా? ఈ ప్రశ్నకు సులభమైన సమాధానం లేదు.

వాస్తవానికి, రిజర్వేషన్లు సమాజంలోని సామాజికంగా మరియు విద్యాపరంగా అట్టడుగున ఉన్నవారికి ఇవ్వబడిన ప్రత్యేక హక్కు. భారతీయ సమాజాన్ని ప్రభావితం చేసే చారిత్రక అసమానలతను తొలగించడం దీని లక్ష్యం. కాని ఆశ్చర్యకరంగా, రిజర్వేషన్ల ఆలోచన వివాదాస్పదమైంది మరియు ఇది ఎక్కువగా ఎన్నికల డివిడెండ్లతో ముడిపడి ఉంది.


భారతీయ సమాజంలోని ప్రతి వర్గం, ధనిక లేదా పేద, అణగారిన లేదా అభివృద్ధి చెందినవారి ఆకాంక్షగా రిజర్వేషన్లు మారినవి. ప్రస్తుత కాలం లో రిజర్వేషన్ యొక్క అసలు ఉద్దేశం అర్థరహితంగా మారుతుంది.


భారతదేశంలోని ముస్లింల స్థితిని పరిశిలించండి. భారతీయ ముస్లింలు అభివృద్ధి చెందని స్థితిలో ఉన్నారని నిరూపించడానికి బలమైన ఆధారాలు ఉన్నాయి.


·        అనధికారిక రంగాలలో (informal sectors) (68%) ఉండగా, వారు అధికారిక రంగాలలో (formal sectors) (8%ఎనిమిది శాతం) ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

·        2007-08 మరియు 2011-12 సంవత్సరాలకు ఎన్‌ఎస్‌ఎస్ వినియోగ వ్యయ డేటా NSS consumption expenditure data తో వెళితే, 25 శాతం ముస్లింలు దారిద్య్రరేఖకు(BPL) దిగువన జీవిస్తున్నారని మనం గమనించవచ్చు.


·        ఆస్తుల యాజమాన్యంలో ముస్లింల కొరత చాలా ఎక్కువగా ఉందని ఇండియా హ్యూమన్ డెవలప్‌మెంట్ రిపోర్ట్ 2011 వెల్లడించింది.

·        అదేవిధంగా, ముస్లింలలో నిరుద్యోగిత రేటు (ఆరు శాతం) ఉంది.

·        2014 లో అఖిల భారత స్థాయిలో అక్షరాస్యత రేటు 75.8 శాతంగా ఉంది మరియు ముస్లింలలో అది 73 శాతంగా ఉంది.

·        భారత దేశం లో 21 శాతం మంది ప్రాధమిక స్థాయి కంటే తక్కువ అక్షరాస్యులు, 33.7 శాతం మంది ప్రాథమిక మరియు మధ్య స్థాయి విద్యను కలిగి ఉన్నారు, 14 శాతం మంది మాధ్యమిక మరియు ఉన్నత మాధ్యమిక విద్యను పూర్తి చేశారు మరియు 3.8 శాతం మంది మాత్రమే ఉన్నత విద్యను పూర్తి చేశారు.

·        ముస్లింలలో వివిధ స్థాయిలలో విద్య ఎన్రోల్మెంట్ /నమోదు తక్కువగా ఉంది.


·        ముస్లింలు ప్రభుత్వ విద్య కంటే మదర్సా విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తారన్న వాదన కలదు.  కాని అది నిజం కాదు, వాస్తవానికి, వారిలో నాలుగు శాతం మంది మాత్రమే మదర్సాలకు హాజరవుతారు.

·        ముస్లింలు ఇతర మత సమూహాల వెనుక మాత్రమే కాదు, దాదాపు అన్ని సామాజిక-ఆర్థిక మరియు విద్యా సూచికలలో దళితులు మరియు ఆదివాసుల కంటే కొంచెం మెరుగ్గా ఉన్నారు.

·        గోపాల్ సింగ్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీ, సచార్ కమిటీ, కుండు కమిటీ వంటి అనేక కమిటీలనివేదికలు ఈ విషయాన్నీ స్పష్టం చేస్తున్నవి..


.
ఈ పరిస్థితులలో ఏమి చేయాలి? ముస్లింలకు రిజర్వేషన్ అవసరమా?


·        చాలాకాలంగా భారత దేశం లోని  ముస్లింసమాజ  డిమాండ్లు ప్రధానంగా భౌతిక భద్రతకు మాత్రమె పరిమితం చేయబడ్డాయి. తక్కువ అక్షరాస్యత రేటు మరియు ఆర్థిక వెనుకబాటుతనం కారణంగా, ఇతర ముఖ్యమైన సమస్యలు ద్వితీయ ప్రాముఖ్యతను పొందినాయి. కానీ గత ఏడు దశాబ్దాలలో పరిస్థితి మారిపోయింది. ముస్లింలలో ఉపాంతీకరణ /marginalisation భావన పెరుగుతోంది, అది పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

·        ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనే ప్రచారం దాని రాజ్యాంగబద్ధత వల్లనే కాక, పోలిరైజేషణ్ మరియు పాతుకు పోయిన సంస్థాగత వ్యతిరేకత వలన సమస్యాత్మకంగా మారింది.


·        ముస్లింలకు రిజర్వేషన్ అవసరాన్ని హేతుబద్దంగా తిరస్కరించలేము. పరిమితుల దృష్ట్యా, ఓబిసి జాబితాలో మరిన్ని  ముస్లిం కులాలను చేర్చడానికి ప్రయత్నాలు చేయాలి మరియు  రాష్ట్రపతి ఉత్తర్వులలోని సవరణల కోసం సంఘాన్ని నియమించేటట్లు ముస్లిం సమాజం ప్రయత్నాలు చేయాలి.

·        1950 లో దళిత ముస్లింల ఉనికిని గుర్తించి గుర్తించడానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 కింద క్రింద జారీ చేయబడింది. షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్ల ప్రయోజనాన్ని ఈ దళిత ముస్లింలకు కూడా విస్తరించాలి, 1956, 1990 లో 1950 అధ్యక్ష ఉత్తర్వులకు సవరణలు చేసి, దీనిని సిక్కులకు మరియు బౌద్దులకు విస్తరించారు.

·        ముస్లింలకు కుల ఆధారిత రిజర్వేషన్ల డిమాండ్ పరిశీలించదగినది.

·        ముస్లింలలో బలహీన వర్గాల (weaker sections among Muslims) జీవనోపాధిని మెరుగుపరచడానికి అనుకూలమైన పథకాలు మరియు కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది.

·        ముస్లిం కేంద్రీకృత జిల్లాల్లో మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు, విద్యా సంస్థలు, పెద్ద మరియు చిన్న తరహా పరిశ్రమలు, వృత్తి కేంద్రాలు, రహదారి మరియు రవాణా సౌకర్యాలు మొదలైనవి కల్పించాలి..


·        అదే సమయంలో, సర్వవ్యాప్త అభివృద్ధి మరియు సమర్థవంతమైన అమలు కోసం ఈ ప్రబుత్వ కార్యక్రమాలను ముస్లిం సమాజం పర్యవేక్షించాలి మరియు అవి సమాజానికి అందుబాటులోనికి తేవాలి.
ముస్లిం సమాజం తన వనరులను సమగ్ర విద్యను ప్రోత్సహించడానికి మరియు ఉపాధిని కల్పించడానికి మరిన్ని సంస్థలను తెరవడానికి అర్దికబలం తో ముందుకు రావాలి.



No comments:

Post a Comment