30 March 2020

మరచిపోయిన కన్నడ ముస్లిం స్వాతంత్ర్య సమరయోధుడు మరియు సామాజిక సేవకుడు ముస్లిం వెల్లోరి Muslim Vellori A forgotten freedom fighter& Social Worker



A forgotten freedom fighter - The Hindu
ముస్లిం వెల్లోరి ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు మరియు  సామాజిక సేవకుడు.

ముస్లిం వెల్లోరి పేరు ఈ తరం వారికి అంతగా తెలియదు కాని పాత తరం బెంగళూరువాసులకు  ముఖ్యంగా నగరంలోని ముస్లింలకు అతను చిరపరిచితుడు.
చారిత్రాత్మక పట్టణం శ్రీరంగపట్న సమీపంలోని గంజాంలో 1883 లో మొహమ్మద్ అబ్దుల్ వాహిద్ ఖాన్ గా జన్మించిన ముస్లిం వెల్లోరి తన బాల్యంలో ఎక్కువ భాగం వెల్లూరులోని మదర్సా (ఇస్లామిక్ సెమినరీ) లో చదువుతున్నందున ముస్లిం వెల్లోరిగా పేరు పొందాడు. అతని తండ్రి సైన్యంలో ఉన్నప్పటికీ, వెల్లోరి బ్రిటిష్ వ్యతిరేక భావన తో పెరిగాడు.

వెల్లూరులో చదువు పూర్తయ్యాక బొంబాయి (ఇప్పుడు ముంబై) లోని తన బంధువుల యాజమాన్యంలోని షిప్పింగ్ కంపెనీలో వెల్లోరి పనిచేయసాగాడు. షిప్పింగ్ కంపెనీలో పనిచేయడం వలన అతను బర్మా, సుమత్రా మరియు జావా (ఇప్పుడు ఇండోనేషియాలో భాగం), మారిషస్, సిలోన్ (ఇప్పుడు శ్రీలంక), మడగాస్కర్ మరియు మధ్యప్రాచ్యంలోని అనేక నగరాలకు వెళ్లారు. ఆయన సముద్ర ప్రయాణాల సమయంలోనే డర్బన్‌లో మహాత్మా గాంధీని కలిశారు మరియు గాంధీజీకి  చాలా సన్నిహితంగా మారారు. వెల్లోరి జీవితంపై గాంధి చాలా నిర్మాణాత్మక ప్రభావాన్ని చూపారు.

యువకుడిగా వెల్లోరి స్వతంత్ర ఉద్యమం లో పాల్గొన్నాడు మరియు మంచి వక్తగా ఖ్యాతిని సంపాదించాడు.  దేశవ్యాప్తంగా అనేక వలసవాద వ్యతిరేక పోరాటాలలో పాల్గొన్నాడు. ఖిలాఫత్ ఉద్యమం (1919-1922) లో ఆయన పాత్రకు ప్రశoశనియం. మహాత్మా గాంధీ, అలీ సోదరులు: మహ్మద్ అలీ మరియు షౌకత్ అలీ, డాక్టర్ ముఖ్తర్ అహ్మద్ అన్సారీ, హకీమ్ అజ్మల్ ఖాన్, సైఫుద్దీన్ కిచ్లెవ్‌తో సహా పలువురు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులను కలిసాడు.

ముంబయిలో ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇవ్వమని ప్రేక్షకులను కోరుతూ అతను చేసిన ఉద్వేగభరితమైన ప్రసంగాలను జాతీయ కవి మహ్మద్ ఇక్బాల్ కూడా ప్రశంసించారు. వెల్లోరి తన రెచ్చగొట్టే ప్రసంగాల కోసం అనేకసార్లు జైలు శిక్ష అనుభవించారు మరియు 1924 మరియు 1927 మధ్య బెంగళూరు సెంట్రల్ జైలులో జైలు శిక్ష అనుభవించారు. జైలులో జైలర్ల అధికారాన్ని తరచుగా ప్రశ్నించేవాడు.

వెల్లోరి సామాజిక సేవలో కూడా ప్రముఖ పాత్ర పోషించారు. మైసూర్ (ఇప్పుడు మైసూరు) మరియు కుడపా (ఇప్పుడు కదపా) లోని అనాథాశ్రమాలకు నిధులు సేకరించారు. అతను రాష్ట్రంలోని పలువురు కాంగ్రెస్ నాయకులతో సన్నిహితంగా ఉన్నాడు మరియు రెండు దేశాల సిద్ధాంతాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ప్రముఖ ముస్లిం నాయకుడిగా గుర్తింపు పొందాడు.

అతను మైసూర్ శాసన మండలికి నామినేట్ అయ్యాడు మరియు 1950లలో కెంగాల్ హనుమంతయ్య ముఖ్యమంత్రి పరిపాలణా కాలంలో శాసన మండలి సభ్యుడిగా ఉన్నాడు., జవహర్ లాల్ నెహ్రూ మైసూరు రాష్ట్రాన్ని సందర్శించినప్పుడు ఆయనను కలిసేవారు. కాలక్రమం లో  భారతీయ జాతీయ కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం మరియు రాష్ట్రం లోని ముస్లింలచే విస్మరించబడి అయన రాజకీయంగా కనుమరుగు అయ్యారు. బెంగళూర్ లోని జయానగర్ ప్రాంత యొక్క ప్రారంభ నివాసి, వెల్లోరి అక్టోబర్ 31, 1977 న మరణించారు.







No comments:

Post a Comment