మౌల్వి లియాఖత్ అలీ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్‌కు చెందిన ముస్లిం మత
నాయకుడు. 1857 లో బ్రిటిష్ వారికి
వ్యతిరేకంగా జరిగిన ఇండియన్ తిరుగుబాటు
లేదా సిపాయి తిరుగుబాటులో పాల్గొన్న ప్రముఖ నాయకులలో ఆయన ఒకరు ఈ యుద్ధాన్ని మొదటి భారత స్వాతంత్ర్య
యుద్ధం అని కూడా పిలుస్తారు.
మౌల్వి లియాకత్ అలీ జిల్లా ప్రయాగ్రాజ్ లోని పరగనా చైల్ లోని విలేజ్ మహగావ్ కు
చెందినవారు. అతను మత గురువు, నీతిమంతుడైన ముస్లిం మరియు గొప్ప ధైర్యం మరియు శౌర్యం కలిగిన వ్యక్తి. అతని
కుటుంబం మూలాలు హష్మిస్(Hashmis)లోని జౌన్‌పూర్ మరియు ఇతర ప్రదేశాలలో గల జైనాబీ జాఫ్రీ శాఖకు చెందినవి. అతను స్వాతంత్ర్య పోరాటం లో పాల్గొని బ్రిటిష్
వారికి భయంకరమైన శత్రువు అయ్యాడు.
అతను తన
మాతృభూమి అయిన భారతదేశం ను బ్రిటిష్ వారి కభంద హస్తలనుంచి విదిపించుటకుగాను ప్రధమ
భారత స్వాతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టినాడు.
మౌల్వి లియాఖత్ అలీ ఒక కవి కూడా. అతను మొదటి భారత స్వాతంత్ర సంగ్రామ మార్చింగ్
సాంగ్ “హం హాయ్ ఇస్కే మాలిక్... హిందూస్తాన్ హమారా పాక్ వతన్ హై ఖోoమ్ఖా జన్నత్ సే
భి ప్యారా ham
hy eske malik... Hindustan hamara . pak watan hy
quoumkaa janath se bhi pyara” రచించినాడు.
మౌల్వి బంధువులు అయిన చైల్ యొక్క
జమీందార్లు మరియు వారి అనుచరులు అందరు మందుగుండు సామగ్రితో మౌల్వికి మద్దతు ఇచ్చారు. మౌల్వి ఖుస్రో బాగ్‌ను
స్వాధీనం చేసుకుని, భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని ప్రకటించిన తరువాత బ్రిటీష్
వారు అలహాబాద్ నగరంపై తిరిగి నియంత్రణ సాధించారు. ఖుస్రో బాగ్ మౌల్వి లియాఖత్ అలీ
ఆధ్వర్యంలోని సిపాయిలకు ప్రధాన కార్యాలయంగా మారింది మరియు మౌల్వి అలహాబాద్ గవర్నర్
గా నియమించబడినాడు. ఏదేమైనా త్వరలోనే తిరుగుబాటు విఫలంఅయి ఖుస్రో బాగ్‌ను బ్రిటిష్ వారు రెండు వారాల్లో
తిరిగి స్వాధీనం చేసుకొన్నారు.
బ్రిటీష్ వారు నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న తరువాత మౌల్వి అలహాబాద్
నుండి తప్పించుకున్నాడు, కాని 1871 సెప్టెంబర్‌లో సూరత్‌లోని బైకుల్లా రైల్వే స్టేషన్‌లో 14 సంవత్సరాల తరువాత పట్టుబడ్డాడు. అతన్ని విచారించి మరణశిక్ష విధించారు, కాని 1892 మే 17 న రంగూన్‌లో నిర్బంధంలో మరణించారు. అతను వివాహం చేసుకున్నాడు మరియు ఒక
కుమార్తెను కలిగి ఉన్నాడు. ఆమె వారసులు మరియు తరువాతి తరాలు ఇప్పటికీ పరగనా చైల్
మరియు చుట్టుపక్కల ఉన్నాయి మరియు కొంతమంది స్వాతంత్ర్యం తరువాత పాకిస్తాన్కు వలసపోయారు.
ప్రఖ్యాత 17 ఏళ్ల అమేలియా హార్న్
(అమీ హార్న్ మరియు అమేలియా బెన్నెట్ అని కూడా పిలుస్తారు) కాన్‌పూర్ ముట్టడి నుండి
ప్రాణాలతో బయటపడింది. లియాఖత్ అలీ యొక్క 1872 విచారణకు ఆమె ఒక సాక్షి. మౌల్వి కాన్‌పూర్ ముట్టడి లో ఆమె ప్రాణాలను కాపాడినాడు. అండమాన్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌లో ఉన్న సెల్యులార్
జైలులో మౌల్విలియాఖత్ అలీకి జీవిత ఖైదు విధించబడింది.