6 February 2023

2 జస్టిస్ సయ్యద్ మహమూద్ (1850-1903). Justice Syed Mahmood (1850-1903).

 

జస్టిస్ సయ్యద్ మహమూద్(1850 - 1903)  ను సయ్యద్ మహమూద్ అని కూడా పిలుస్తారు.  సయ్యద్ మహమూద్ తాత్కాలిక హోదాలో హైకోర్టులో 1882 నుండి నాలుగు మునుపటి కాలాలకు  న్యాయ అధికారిగా పనిచేసిన అనంతరం 1887 నుండి 1893 వరకు బ్రిటీష్ ఇండియా యొక్క నార్త్-వెస్ట్రన్ ప్రావిన్సులలో హైకోర్టులో ప్యూస్నే న్యాయమూర్తిగా పనిచేశారు.

సయ్యద్ మహమూద్ అలహాబాద్‌లోని హైకోర్టుకు నియమితులైన మొదటి భారతీయ న్యాయనిపుణుడు మరియు బ్రిటిష్ రాజ్‌లో హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన మొదటి ముస్లిం. సయ్యద్ మహమూద్ తన తండ్రి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్‌ కు  మహమ్మదన్ ఆంగ్లో-ఓరియంటల్ కళాశాల(తరువాత అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం)ను స్థాపించడంలో సహాయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించాడు.

న్యాయనిపుణుడిగా, సయ్యద్ మహమూద్ బెంచ్‌లో ఉన్న సంవత్సరాలలో సయ్యద్ మహమూద్ తీర్పులు ఇండియన్ లా రిపోర్ట్స్: అలహాబాద్ సిరీస్‌లో ప్రచురిoపబడినవి. సయ్యద్ మహమూద్ భారతదేశ గవర్నర్-జనరల్ మరియు నార్త్-వెస్ట్రన్ ప్రావిన్స్‌ల లెఫ్టినెంట్ గవర్నర్ కు   శాసన మండలిలకు ప్రతిపాదిత చట్టాలపై సుదీర్ఘ లేఖలు రాయడం ద్వారా చట్టాల రూపకల్పనలో చురుకుగా పాల్గొన్నారు. సయ్యద్ మహమూద్‌ను N.-W.P. మరియు 1896 నుండి 1898 వరకు ఔద్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో సబ్యుడు.

సయ్యద్ మహమూద్ 1850 మే 24న ఢిల్లీలో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ రెండవ కుమారుడిగా జన్మించాడు. సయ్యద్ మహమూద్ మొరాదాబాద్ మరియు అలీగఢ్ నగరాల్లో చదువుకున్నాడు. సయ్యద్ మహమూద్ 1868లో కలకత్తా విశ్వవిద్యాలయంలో మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ముందు ఢిల్లీలోని ప్రభుత్వ కళాశాలలో మరియు బెనారస్‌లోని క్వీన్స్ కళాశాలలో కూడా చదువుకున్నాడు. ఆ తర్వాత సయ్యద్ మహమూద్ ఇంగ్లాండ్‌లో చదువుకోవడానికి భారతదేశంలోని బ్రిటిష్ ప్రభుత్వం నుండి స్కాలర్‌షిప్ పొందాడు.1869లో, సయ్యద్ మహమూద్ని లింకన్స్ ఇన్లో చేర్చారు మరియు ఏప్రిల్ 1872లో బార్కి పిలిచారు. 1870 నుండి, సయ్యద్ మహమూద్కేంబ్రిడ్జ్లోని క్రైస్ట్స్ కాలేజ్లో రెండు సంవత్సరాలు లాటిన్, గ్రీక్ మరియు ఓరియంటల్ భాషలను అభ్యసించాడు, కానీ గ్రాడ్యుయేట్ కాలేదు.

భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, సయ్యద్ మహమూద్ 1872లో అలహాబాద్‌లోని హైకోర్టులో న్యాయవాదిగా నమోదు చేసుకున్నాడు, ఆ కోర్టులో ఆ ఘనతను సాధించిన మొదటి భారతీయుడు. సయ్యద్ మహమూద్ 1878 వరకు అలహాబాద్‌లో బారిస్టర్‌గా పనిచేశాడు. మరుసటి సంవత్సరం సయ్యద్ మహమూద్ ను వైస్రాయ్ ఆఫ్ ఇండియా లార్డ్ లిట్టన్ ఔద్‌లో జిల్లా మరియు సెషన్స్ జడ్జిగా నియమించారు. 1887లో అలహాబాద్‌లోని హైకోర్టుకు ప్యూస్నే న్యాయమూర్తిగా నియమితులయ్యే వరకు సయ్యద్ మహమూద్ ఇండియన్ సివిల్ సర్వీస్‌లో కొనసాగారు. హైకోర్టులో అధికారిక న్యాయమూర్తి officiating judge గా తాత్కాలిక నియామకాలతో ఇండియన్ సివిల్ సర్వీస్‌ సేవ కు చాలాసార్లు అంతరాయం కలిగింది. సయ్యద్ మహమూద్ హైదరాబాద్ స్టేట్‌లోనిజాంకు 1881లో న్యాయ పరిపాలనలో సహాయం చేశాడు.

1882లో, సయ్యద్ మహమూద్ అలహాబాద్‌లోని వాయువ్య ప్రావిన్స్‌ల హైకోర్టుకు న్యాయమూర్తిగా తన మొదటి అధికారిక నియామకాన్ని అందుకున్నాడు, సయ్యద్ మహమూద్ 1887లో పుయిస్నే న్యాయమూర్తిగా పూర్తి నియామకాన్ని స్వీకరించడానికి ముందు మరో మూడుసార్లు అధికారిక న్యాయమూర్తిగా పనిచేశాడు. సయ్యద్ మహమూద్ సమకాలీనులు అతను అసాధారణమైన సామర్ధ్యం కలిగి ఉన్నారని భావించారు.

 

కేంబ్రిడ్జ్‌లో చదువుతున్నప్పుడు సయ్యద్ మహమూద్ సంపాదించిన అరబిక్ భాష యొక్క జ్ఞానం మరియు ముస్లిం చట్టాన్ని అర్ధం చేసుకోవటానికి తోడ్పడినది. కోజ్లోవ్స్కీ Kozlowski ప్రకారం అమూల్యమైన అతని తీర్పులు, స్పష్టత మరియు చురుకుదనం కలిగి ఉన్నాయి.  బెంచ్‌లో ఉన్న సమయంలో, మహమూద్ తన సుదీర్ఘమైన, వివరణాత్మక వ్రాతపూర్వక తీర్పులకు ప్రసిద్ధి చెందాడు, వీటిలో చాలా వరకు ఆ సంవత్సరాలకు సంబంధించిన లా నివేదికలలో  ప్రచురించబడ్డాయి.

 

1877 నుండి 1882 సంవత్సరాలలో భారతదేశంలోని వైస్రాయ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క న్యాయ సభ్యుడైన విట్లీ స్టోక్స్, ఆంగ్లో-ఇండియన్ కోడ్‌లలో మహమూద్ యొక్క తీర్పులను ప్రశంసించాడు.సయ్యద్ మహమూద్ యొక్క యువ సమకాలీనుడైన తేజ్ బహదూర్ సప్రూ, సయ్యద్ మహమూద్ యొక్క సుదీర్ఘమైన మరియు వివరణాత్మక తీర్పులను ప్రశంసించాడు. సహచర న్యాయమూర్తులతో విభేదాలు మరియు ప్రధాన న్యాయమూర్తి జాన్ ఎడ్జ్ యొక్క అసూయ కారణం గా 1893లో జస్టిస్ సయ్యద్ మహమూద్ ముందస్తు పదవీ విరమణ పొందారు.

న్యాయవ్యవస్థ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత, సయ్యద్ మహమూద్ లక్నోలో లీగల్ ప్రాక్టిస్ ప్రారంభించి 1896 నుండి 1898 వరకు నార్త్-వెస్ట్రన్ ప్రావిన్సులు మరియు ఔద్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో సబ్యునిగా పని చేసారు.  

1872లో ఇంగ్లండ్‌లో తన చదువు తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన కొద్దికాలానికే, సయ్యద్ మహమూద్ కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో తాను అనుభవించిన నమూనా ఆధారంగా భారతదేశంలో స్వీయ-సహాయక ముస్లిం కళాశాల స్థాపనకు ప్రతిపాదన రాశాడు.  అలీఘర్‌లో మహమ్మదన్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజీMAOని స్థాపించడంలో సయ్యద్ మహమూద్ తన తండ్రి సర్ సయ్యద్‌కు సహాయం చేశాడు మరియు అలహాబాద్‌లో న్యాయవాదిగా మరియు న్యాయమూర్తిగా పనిచేస్తున్నప్పుడు కూడా MAO పరిపాలనలో కీలక పాత్ర పోషించాడు. 1883లో, సయ్యద్ మహమూద్ థియోడర్ బెక్‌ను MAO పాఠశాల ప్రిన్సిపాల్‌గా నియమించుకోవడానికి ఇంగ్లాండ్‌కు తిరిగి వచ్చాడు. సయ్యద్ మహమూద్ MAO లో  ఆంగ్ల తరగతులను బోధించడంలో మరియు పాఠశాలలో ఒక న్యాయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో చురుకుగా పాల్గొన్నాడు, చట్టపరమైన గ్రంథాలయాన్ని legal library ఏర్పాటు చేయడానికి తన స్వంత చట్టపరమైన గ్రంథాల సేకరణలో ఎక్కువ భాగాన్ని విరాళంగా ఇచ్చాడు.

1889లో, సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ తన కుమారుడు సయ్యద్ మహమూద్‌ను పాఠశాల ధర్మకర్తల మండలి జాయింట్ సెక్రటరీగా నామినేట్ చేశాడు. 1898లో సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ మరణానంతరం జీవిత గౌరవ జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు. మరుసటి సంవత్సరం గౌరవ అధ్యక్షునిగా నియమించబడ్డాడు. 

సయ్యద్ మహమూద్ MAOC వెలుపల కూడా విద్యా వ్యవహారాలలో చురుకుగా ఉండేవారు. రిప్పన్  పరిపాలన సమయంలో, సయ్యద్ మహమూద్ భారతదేశంలోని విద్యా స్థితిని పరిశోధించే 1882 ఎడ్యుకేషన్ కమిషన్ యొక్క కమీషనర్లలో ఒకరిగా నియమించబడ్డాడు. సయ్యద్ మహమూద్ ఆల్ ఇండియా ముహమ్మద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్‌లో చురుకుగా పాల్గొనేవాడు, 1893 మరియు 1894 ఆల్ ఇండియా ముహమ్మద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్‌ వార్షిక సమావేశాలలో భారతదేశంలో ఆంగ్ల విద్యా చరిత్రపై వరుస ఉపన్యాసాలు ఇచ్చాడు.

1888లో, సయ్యద్ మహమూద్, నవాబ్ ఖ్వాజా షర్ఫుద్దీన్ అహ్మద్ కుమార్తె ముషారఫ్ జహాన్‌ను వివాహం చేసుకున్నాడు. వారికి రాస్ మసూద్ అనే ఒక కుమారుడు ఉన్నాడు. సయ్యద్ మహమూద్ అలహాబాద్‌లో తానూ కొన్న  ఒక ఇంటిని అలహాబాద్ కోర్టులో బారిస్టర్‌గా పనిచేస్తున్న మోతీలాల్ నెహ్రూకి విక్రయించినాడు  మరియు చివరికి అది  స్వరాజ్ భవన్‌గా పేరు మార్చబడింది.అంతకుముందు 1876లో, సయ్యద్ మహమూద్ అలీఘర్ నగరంలో మరొక నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు; ఇది ప్రస్తుతం సర్ సయ్యద్ అకాడమీని కలిగి ఉంది. 1900 నుండి 1903లో మరణించే వరకు తన బంధువు సయ్యద్ ముహమ్మద్ అహ్మద్‌తో కలిసి సీతాపూర్‌లో  సయ్యద్ మహమూద్ నివసించాడు.

 

సయ్యద్ ముహమ్మద్ రచనలు:

 

బ్రిటీష్ ఇండియా యొక్క న్యాయ సాహిత్యానికి సయ్యద్ మహమూద్ యొక్క మొదటి సహకారం 1872 Law of Evidence యొక్క ఉర్దూ అనువాదం మరియు తదుపరి సవరణలు, అవి 1876లో ప్రచురించబడ్డాయి. సయ్యద్ మహమూద్ మహమ్మదీయ విద్యా సదస్సులో తను ఇచ్చిన  ఉపన్యాసాలను సవరించి ఆంగ్లంలో ఎ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్‌గా ప్రచురించాడు.

1895లో సయ్యద్ మహమూద్ అలీఘర్ ఇన్‌స్టిట్యూట్ గెజిట్ మరియు కలకత్తా రివ్యూకు వ్యాసాలను రాసాడు.  సయ్యద్ మహమూద్ ప్రధాన వ్రాతపూర్వక సహకారం 1882 మరియు 1892 సంవత్సరాల మధ్య భారతీయ న్యాయ నివేదికలు: అలహాబాద్ సిరీస్‌లో నమోదు చేయబడి సుమారు 300 చట్టపరమైన తీర్పులను కలిగి ఉన్నాయి. వీటిలో గణనీయమైన సంఖ్యలో ఇరవై పేజీలకు పైగా నిడివి ఉంది. సయ్యద్ మహమూద్ బెంచ్ నుండి పదవీ విరమణ చేసిన తర్వాత మరణ సమయంలో ముస్లిం చట్టంపై సిద్ధం చేయబడని, అసంపూర్తి బహుళ-వాల్యూమ్ పై కృషి చేస్తున్నాడు.

 

 

No comments:

Post a Comment