పరిచయం
8-14 శతాబ్దం
కాలాన్ని ఇస్లామిక్ స్వర్ణయుగం అని పిలుస్తాము. ఈ యుగంలో, ఇస్లామిక్ మరియు
అరబిక్ పండితులు చరిత్ర అంతటా సేకరించిన జ్ఞానాన్ని, ముఖ్యంగా గ్రీకు
మరియు రోమన్ పండితుల రచనలను (హిప్పోక్రేట్స్ మరియు గాలెన్ రచనలు) కాపాడుకోవడంలో
విజయం పొందారు.హిప్పోక్రేట్స్ మరియు గాలెన్ రచనల అరబిక్ వెర్షన్‌లు మినహా వారి
రచనల యొక్క అన్ని ఇతర కాపీలు పోయాయి లేదా నాశనం చేయబడ్డాయి.
ఇస్లామిక్ స్వర్ణ యుగంలోని
పండితులు ఇతర గొప్ప నాగరికతలకు సంబంధించిన జ్ఞాన సంపదను కాపాడుకోవడంతో పాటు, అవిసెన్నా, అల్బుకాసిస్ మరియు
రేజెస్ వంటి ప్రముఖ ఇస్లామిక్ వైద్యులు ఔషధం మరియు న్యూరో సర్జరీ విభాగం లో
అభివృద్ధికి కృషి చేసారు.
న్యూరోసర్జరీకి
సహకారం మరియు అభివృద్ధి:
1)అబూ బకర్ అల్
రాజీస్ (రాజెస్ 850-923)
న్యూరోఅనాటమీకి అబూ
బకర్ అల్‌రాజీ (రాజెస్ 850-923) యొక్క సహకారం అతని రచనలు అయిన “కితాబ్ అల్-హవి ఫి అల్-టిబ్ (మెడిసిన్ యొక్క సమగ్ర పుస్తకం) మరియు కితాబ్
అల్-మన్సూరి ఫి అల్-టిబ్ (మెడిసిన్‌పై అంకితం చేయబడిన పుస్తకం)”లో చక్కగా నమోదు చేయబడినవి.
అల్ రాజీస్, నరాలు
మోటారు మరియు ఇంద్రియ sensory పనితీరును కలిగి ఉంటాయని మరియు అవి మెదడు మరియు వెన్నుపాము నుండి మెంబ్రేన్ కవరింగ్‌లతో
జతగా ఉద్భవించాయని వివరించాడు. అల్ రాజీస్ కంకషన్ concussion గురించి వివరించిన మొదటి వైద్యుడు.
అల్ రాజీస్ తన
పుస్తకంలో సర్జికల్ ఫ్లాప్ చేసేటప్పుడు చిన్న నరాలను గాయపరచకుండా ఉండటానికి తన
విద్యార్థులకు జాగ్రతలను చెప్పాడు. అల్ రాజీస్ ఇలా పేర్కొన్నాడు: " సర్జన్, నరాలు, సిరలు మరియు ధమనుల
యొక్క అనాటమీని తప్పక తెలుసుకోవాలి, వాటిని పొరపాటున కూడా విచ్చేదం(cut)
చేయ రాదు."
మెదడు, వెన్నుపాము
మరియు వెంట్రిక్యులర్ వ్యవస్థ ఒకే నిర్మాణాలు అన్న గాలెన్ యొక్క నమ్మకానికి విరుద్ధంగా, ఇవి జత చేసిన నిర్మాణాలు paired
structures అని రేజెస్
సరిగ్గా ఊహించాడు.
అల్ రాజీస్ పెరిఫిరల్
peripheral నరాలను ఎనిమిది సర్వికల్
cervical జంటలుగా, 12 థొరాసిక్ జతలుగా, కటి వెన్నెముక lumbar spine లో ఐదు జతలుగా
మరియు త్రికాస్థి వెన్నెముక sacral spine లో మూడుగా విభజించాడు మరియు రోగులలో గాయాల యొక్క స్థానికీకరణకు
మార్గదర్శకత్వం వహించడానికి అల్ రాజీస్ సెగ్మెంటల్ నరాల ఆవిష్కరణల యొక్క ఈ
జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఈ పద్దతి ఇప్పుడు క్లినికల్ పరీక్షలలో ప్రాథమిక
భాగాన్ని ఏర్పరుస్తుంది, దీని ద్వారా నిర్దిష్ట నరాల పరిస్థితిని అంచనా వేయడానికి నిర్దిష్ట మోటార్
మరియు ఇంద్రియ విధులు పరీక్షించబడతాయి.
మెడ గాయం తర్వాత తన
చిటికెన వేలిలో తిమ్మిరి ఉందని ఫిర్యాదు చేసిన ఒక రోగికి చివరి వెన్నుపూస cervical
vertebra లో సమస్య ఉందని రేజెస్ చెప్పాడు, ఎందుకంటే చివరి
వెన్నుపూస నుండి వచ్చే నాడి ఆ వేలికి వెళుతుందని తన శరీర నిర్మాణ శాస్త్ర అధ్యయనాల
ద్వారా అల్ రాజీస్ కి తెలుసు.
రేజెస్ ఆరోహణ స్వరపేటిక నాడి ascending
laryngeal nerveని
వివరించాడు మరియు కుడి వైపున రెండు లేదా డబుల్ శాఖలు two or
double branches ఉండవచ్చని
గుర్తించాడు మరియు మెదడు, వెన్నుపాము
మరియు జఠరికలు ఒకే నిర్మాణాలు అనే గాలెన్
భావనను మార్చాడు అవి జత
నిర్మాణాలు paired structures అని రేజెస్ ధృవీకరించారు.
2)అబూ అల్కాసెమ్ అల్
జహ్రావి (అల్బుకాసిస్ 936-1013)
"సందేహం లేకుండా, ఆల్బుకాసిస్ అందరు సర్జన్లలో ముఖ్యుడు"-పియట్రో అర్గల్లాటా (d. 1423)
అల్బుకాసిస్ ఆపరేటివ్ సర్జరీకి పితామహుడిగా పరిగణించబడతాడు మరియు ఆధునిక
శస్త్రచికిత్స యొక్క పితామహుడు అని పిలవబడినాడు. (అల్-జహ్రావి – వికీపీడియా, 2021). ఇస్లామిక్ శకానికి
ముందు, శస్త్రచికిత్స అనేది మెడిసిన్ కంటే
తక్కువగా పరిగణించబడేది మరియు సర్జన్లు తక్కువ గౌరవంతో ఉండేవారు. శస్త్రచికిత్సను
ఇంటర్నల్ మెడిసిన్ నుండి వేరు చేసి వర్గీకరించిన మొదటి వారిలో అల్బుకాసిస్ ఒకరు.
శస్త్రచికిత్సను
చేతిపని లేదా ఇనుపపనిగా సూచిస్తారు మరియు ఇది అల్బుకాసిస్ యొక్క అద్భుతమైన పుస్తకం
‘అటాస్రీఫ్’ యొక్క 30వ అధ్యాయం "ఆన్ సర్జరీ ఆర్ హ్యాండ్‌వర్క్" యొక్క టైటిల్ గా ఉంది. ఆ
సమయంలో అల్బుకాసిస్ స్పెయిన్ రాజధాని (అండలూసియా) కార్డోబాకు వాయువ్యంగా ఆరు మైళ్ల
దూరంలో ఉన్న అల్-జహ్రా'లో క్రీ.శ. 936లో జన్మించాడు. అల్బుకాసిస్ పూర్వీకులు అల్ మదీనా అల్ మునవ్వరా యొక్క అల్
అన్సార్ తెగలకు చెందినవారు, వీరు అరేబియా ద్వీపకల్పం నుండి స్పెయిన్‌లో విజయం సాధించి నివసించిన ముస్లిం
సైన్యాలతో పాటు వచ్చారు. అల్బుకాసిస్ చాలా అరుదుగా ప్రయాణించాడు మరియు తన జీవితంలో
ఎక్కువ భాగం వైద్యుడు-ఫార్మసిస్ట్-సర్జన్‌గా తన స్వగ్రామంలో గడిపాడు.
అల్బుకాసిస్ మొదటిసారిగా మత్తుమందు స్పాంజ్‌ను అభివృద్ధి చేశాడు. ఆ యుగానికి
ముందు, శస్త్రచికిత్స కోసం రోగులను అపస్మారక స్థితికి తీసుకురావడానికి మత్తుమందు
ద్రావణాన్ని అనేక మోతాదులలో ఇచ్చే వారు. అల్బుకాసిస్ సుగంధ
ద్రవ్యాలు మరియు సోపోరిఫిక్ aromatics and soporifics లతో నిండిన ఎండిన dried స్పాంజ్‌ను ఉపయోగించిన మొదటి
వ్యక్తి. అనస్థీషియా అవసరమైనప్పుడు, తేమగా ఉన్న స్పాంజ్,
రోగి యొక్క పెదవులు మరియు నాసికా రంధ్రాలకు అప్లై చేయ బడుతుంది.
అరబ్బు డాక్టర్స్ , మత్తుమందు స్పాంజ్‌ను ఉడికించిన నీరు మరియు హషీష్/ నల్లమందు, సి-హయోసిన్ మరియు జోవాన్
(అరబిక్‌లో “గోధుమ కషాయం నుండి) తో ముంచడం చేసేవారు. ఇది యాక్టివ్‌కు క్యారియర్‌గా పనిచేసింది
తల గాయాలు, పుర్రె పగుళ్లు, వెన్నెముక గాయాలు మరియు తొలగుటలు dislocations, హైడ్రోసెఫాలస్, సబ్‌డ్యూరల్ ఎఫ్యూషన్స్ తలనొప్పి మరియు అనేక ఇతర పరిస్థితుల నిర్వహణతో సహా
న్యూరో సర్జికల్ డయాగ్నోసిస్ మరియు చికిత్స యొక్క ప్రారంభ వివరణలకు early descriptions అల్బుకాసిస్ దోహదపడినాడు.
సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ డ్రైనేజ్ కారణంగా పుట్టుకతో వచ్చే హైడ్రోసెఫాలస్ యొక్క
కేసును అల్బుకాసిస్ స్పష్టంగా వివరించాడు:
"నేను ఒక మగబిడ్డను చూశాను, అతని తల, నుదురు forehead మరియు పక్కలకు అసాధారణంగా విస్తరించి శరీరం
దానిని పట్టుకోలేకపోయింది hold it up ".
అల్బుకాసిస్
రక్తస్రావాన్ని నియంత్రించడానికి వైద్యపరమైన డ్రెస్సింగ్‌గా సర్జికల్ కాటన్‌ను ఉపయోగించినాడు.
అల్బుకాసిస్ తన వీణ
తీగలను, కోతి తిన్నప్పుడు క్యాట్‌గట్
కరిగిపోయే స్వభావాన్ని గమనించడం ద్వారా అంతర్గత కుట్టు కోసం క్యాట్‌గట్‌ను
కనుగొన్నాడు మరియు నాళాల vessels రక్తస్రావం ఆపడానికి థర్మల్ కాటరైజేషన్‌ను ఉపయోగించాడు.
అల్బుకాసిస్ నవజాత శిశువులో
ఇంట్రాక్రానియల్ హైడ్రోసెఫాలస్ యొక్క మొదటి అధ్యయనాన్ని first study వివరించాడు, మరికొందరు
సెరెబ్రోస్పానియల్ ఫ్లూయిడ్ యొక్క అదనపు వెంట్రిక్యులర్ సేకరణ గురించి మాట్లాడారు
(అల్-జహ్రావి - వికీపీడియా, 2021).
న్యూరోసర్జరీ
రంగంలో అల్బుకాసిస్ తన సమయం కంటే ముందున్నాడు. 15వ శతాబ్దం తర్వాత మధ్య యుగాల నుండి ఆధునిక కాలం వరకు వైద్య
ప్రపంచంలోని జ్ఞాన అంతరాన్ని తగ్గించడంలో అల్బుకాసిస్ రచనలు కీలకమైనవి మరియు
అల్బుకాసిస్ శస్త్రచికిత్స బోధనలు మధ్య యుగాలలో పదమూడవ శతాబ్దం వరకు అత్యంత
అధునాతనమైనవి.
‘అల్-తస్రీఫ్’ అనేక
శతాబ్దాలుగా యూరోపియన్ దేశాలలో వైద్య పాఠ్యాంశాలలో ముఖ్యమైన భాగంగా ఉంది. ప్రసిద్ధ
ఫ్రెంచ్ సర్జన్ గై డి చౌలియాక్ (1300-1368) అల్బుకాసిస్ ను తన
పుస్తకంలో 200 సార్లు ఉటంకించాడు. అల్-తస్రీఫ్ యొక్క లాటిన్ ఎడిషన్‌ను శస్త్ర చికిత్స
పై తన స్వంత పుస్తకానికి జోడించారు. ఈ పుస్తకం యొక్క అనేక సంచికలు (శస్త్రచికిత్స
అధ్యాయం)వెనిస్, బాసెల్ మరియు ఆక్స్ఫర్డ్ లో ప్రచురించబడ్డాయి.
అల్బుకాసిస్ ప్రభావం కనీసం ఐదు శతాబ్దాల పాటు కొనసాగింది మరియు యూరప్ పునరుజ్జీవనోద్యమం
వరకు విస్తరించింది. ఇది ఫ్రెంచ్ సర్జన్
జాక్వెస్ డెలెచాంప్స్ (1513-1588) అల్బుకాసిస్ యొక్క అల్-తస్రిఫ్స్ తరచుగా
ప్రస్తావించడం ద్వారా రుజువు చేయబడింది. అల్బుకాసిస్ సానుకూల వైద్యుడు-రోగి సంబంధం
యొక్క ప్రాముఖ్యత గురించి కూడా వ్రాసాడు మరియు అల్బుకాసిస్ తన విద్యార్థులను ఆప్యాయంగా
"నా పిల్లలు" అని పిలిచే వాడు. సామాజిక హోదాతో సంబంధం లేకుండా రోగులకు
చికిత్స చేయడం యొక్క ప్రాముఖ్యతను కూడా అల్బుకాసిస్ నొక్కి చెప్పారు.
అత్యంత ఖచ్చితమైన
రోగనిర్ధారణ మరియు ఉత్తమమైన చికిత్స (అల్-జహ్రావి – వికీపీడియా, 2021) చేయడానికి వ్యక్తిగత కేసులను నిశితంగా
పరిశీలించాలని అల్బుకాసిస్ ప్రోత్సహించారు. ఐరోపా మధ్య యుగాలలో బహుశా ఐదు శతాబ్దాల
పాటు, ఇది యూరోపియన్
వైద్య పరిజ్ఞానానికి ప్రాథమిక మూలం మరియు వైద్యులు మరియు సర్జన్లకు సూచనగా
పనిచేసింది.
అబు అల్-ఖాసిమ్ తన “అల్-తస్రిఫ్” లో, ఆంబ్రోయిస్‌పికి దాదాపు 600 సంవత్సరాల ముందు
కాటరైజేషన్‌కు బదులుగా ధమనుల రక్త నియంత్రణ కోసం లిగేచర్ ligature ను ఉపయోగించారు. ఆల్బుకాసిస్ ఆధునిక ప్లాస్టర్ మరియు
అంటుకునే adhesive బ్యాండేజ్‌ను
ఉపయోగించినాడు మరియు అభివృద్ధి చేసినాడు.
నేడు వీటిని ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో ఉపయోగిస్తున్నారు
ఫ్రాక్చర్ల కోసం ప్లాస్టర్‌లను ఉపయోగించడం అరబ్ వైద్యులకు ప్రామాణిక పద్ధతిగా
మారింది, అయితే 19వ శతాబ్దం
వరకు ఐరోపాలో ఈ పద్ధతి విస్తృతంగా ఆమోదించబడలేదు. ఆల్బుకాసిస్ నివసించిన
కార్డోబాలోని వీధికి ఆల్బుకాసిస్ గౌరవార్థం "కాల్లే అల్బుకాసిస్" అని
పేరు పెట్టారు మరియు ఆల్బుకాసిస్ ఆధునిక శస్త్రచికిత్స పితామహుడిగా
పరిగణించబడ్డాడు.
పియట్రో అర్గల్లాటా (d. 1453) ఆల్బుఇలా
వర్ణించారు."సందేహం లేకుండా ఆల్బుకాసిస్ అందరు సర్జన్లలో చీఫ్" (అల్-గజల్, 2004).
3)అబ్న్ ఆల్ అల్-హుసేన్ ఇబ్న్ అబ్ద్ అల్లా ఇబ్న్ సినా (అవిసెన్నా980-1037):
అవిసెన్నా రచించిన ‘కానన్
ఫి టిబ్ Canon fi Tibb’, బైబిల్ తర్వాత ప్రపంచం లో అత్యధికంగా ప్రచురించబడిన రెండవ పుస్తకం. ఇబ్న్ సినా (అవిసెన్నా 980-1037) ఇస్లామిక్
స్వర్ణయుగానికి చెందిన ప్రముఖ తత్వవేత్తలు మరియు వైద్యులలో ఒకరు. ఇబ్న్ సినా ‘ఎన్సైక్లోపీడియా, ది కానన్ ఆఫ్
మెడిసిన్’, తూర్పు మరియు పాశ్చాత్య సంస్కృతుల మధ్య అంతరాన్ని తగ్గించింది. ఇబ్న్ సినా,
వైద్యుల యువరాజు అనే బిరుదుతో పశ్చిమంలో గౌరవించబడ్డాడు.
ఇబ్న్ సినా తన రచనలు
ఒకదానిలో, కపాలపు కోత మరియు కనురెప్పల నరాల కోతను cranial incision
and the way to avoid eyelid nerves నివారించే మార్గాన్ని వివరించాడు: ఒక కోత లేదా
తెరవడానికి incision or opening
నిర్ణయించుకున్నప్పుడు, చర్మం యొక్క వివిధ చిన్న మరియు పెద్ద మడతలను folds పరిగణనలోకి తీసుకోవాలి. అయితే, నుదిటి విషయంలో, ఒక కోత మడతల లోని కండరాలను విభజించి, కనురెప్పలు
పడిపోవడానికి drooping కారణమవుతుంది.
కండరాల ఫైబర్స్ ఉపరితల మడతలకు భిన్నమైన కోర్సును తీసుకునే సందర్భంలో ఇలాంటి
జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి సర్జన్ తప్పనిసరిగా నరాలు, సిరలు మరియు ధమనుల
యొక్క శరీర నిర్మాణ శాస్త్రాన్ని anatomy తెలుసుకోవాలి, తద్వారా పొరపాటున కూడా వాటిని విడదీయకూడదు sever.
వెన్నుపాము
పరిస్థితి యొక్క విలువలను కూడా వివరిస్తుంది:
“చేతులు మరియు
కాళ్లను కనిపెట్టే innervating నరాలు ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి మరియు తద్వారా
గాయానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది…అందుకే, దేవుడు మెదడు
క్రింద వెన్నుపామును సృష్టించాడు. ఫౌంటెన్ నుండి బయటకు వచ్చే ఛానల్ లాగా వెన్నుపాము
రెండు వైపుల నుండి నరాలు ఉద్భవించి క్రిందికి వెళ్ళే విధంగా అవయవాలను మెదడుకు
దగ్గరగా ఉంచుతుంది. ”
సర్వికల్, థొరాసిక్ మరియు కటి
వెన్నుపూస lumbar spine, అలాగే త్రికాస్థి
మరియు కోకిక్స్ sacrum and coccyx యొక్క
వెన్నుపూసలను కూడా ఇబ్న్ సీనా వివరంగా వివరించాడు, ఇబ్న్ సీనా, వర్మిస్ మరియు
టెయిల్డ్ న్యూక్లియస్ అనే పదాలను ఇచ్చాడు, వాటి నుండి కాడేట్ న్యూక్లియస్ ఉద్భవించింది. ఇంకా, ఇబ్న్ సీనా మెనింజైటిస్‌ను వర్ణించాడు, దానిని మెదడు యొక్క
ఎన్విలాప్‌ల వాపు లేదా కణితిగా భావించాడు.
అవిసెన్నా మూర్ఛ
మరియు మానసిక రోగులకు చికిత్స చేయడానికి, థండర్ ఫిష్ లేదా
ఎలక్ట్రికల్ ఫిష్‌ని ఉపయోగించి విద్యుత్ షాక్‌లను ఉపయోగించాడు, థండర్ ఫిష్ లేదా
ఎలక్ట్రికల్ ఫిష్ తమ ఛార్జ్‌ను కోల్పోకుండా ఉండటానికి వాటిని నీటిలో సజీవంగా ఉంచాడు. ఇది నిజంగా ఒక
గొప్ప ఆవిష్కరణ. బెంజోడియాజిపైన్స్
అయిన లోరాజెపామ్ వంటి సాధారణ
యాంటీపిలెప్టిక్‌లకు ప్రతిస్పందించని తీవ్రమైన మూర్ఛ ఉన్న రోగులలో
ఎలక్ట్రోకాన్వల్సివ్ థెరపీ (ECT)వాడతారు.
కానన్‌ను 12వ శతాబ్దంలో
గెరార్డ్ ఆఫ్ క్రెమోనా లాటిన్‌లోకి అనువదించారు మరియు ఇది ఆరు శతాబ్దాలకు పైగా
యూరోపియన్ పాఠశాలల్లో వైద్య విద్య కోసం ఉపయోగించే పాఠ్య పుస్తకంగా మారింది ఆ కాలంలో, బైబిల్ తర్వాత
అత్యధికంగా ప్రచురించబడిన రెండవ పుస్తకం కానన్.
అవిసెన్నా శరీర
నిర్మాణ లక్షణాలకు anatomic వివరణను
కనుగొనడానికి ప్రయత్నించాడు మరియు అవిసెన్నా
వెన్నుపూస మరియు వెన్నెముక vertebra and the spine యొక్క బయోమెకానికల్ లక్షణాలను దాదాపుగా వివరించాడు.
పృష్ఠ రేఖాంశ
స్నాయువు anterior longitudinal ligament, పృష్ఠ స్నాయువు posterior ligament కంటే ఎలా బలంగా ఉందో కూడా ఇబ్న్ సీనా వివరించాడు, ఎందుకంటే పృష్ఠ
కదలిక anterior movement కంటే ముందు కదలిక posterior movement అవసరం.
వెన్నెముక అనాటమీపై
ఇబ్న్ సీనా అవగాహన వెన్నెముకను స్థిరీకరించే stabilizing మార్గాలను
అందించిన మొదటి వ్యక్తిగా గుర్తించినది. అవిసెన్నా “ది కానన్ ఆఫ్ మెడిసిన్”లో, కైఫోసిస్ వంటి
వెన్నెముక వైకల్యాలకు అలాగే వెన్నుపూస యొక్క తొలగుట dislocations మరియు పగుళ్లకు
చికిత్స ఎంపికలను అందిస్తుంది
ఇంకా, అవిసెన్నా
క్రానియోవెర్టెబ్రల్ జంక్షన్ మరియు దాని గాయాలను వివరించినాడు మరియు C1- C2 ప్రాంతం యొక్క
గాయాలు స్థిరంగా ప్రాణాంతకం అని మరియు వాటికి చికిత్స చేయలేమని చెప్పారు. పురాతన
గ్రీకు వైద్యుల వలె కాకుండా, ఇబ్న్ సీనా ఎగువ సర్వికల్ వెన్నుపూస యొక్క తొలగుట
యొక్క ప్రాముఖ్యతను గమనించాడు మరియు దాని చికిత్సను వివరించాడు.
ఈ సహకారం మోడెమ్
ఫిజియోథెరపీపై భారీ ప్రభావాన్ని చూపింది, అది నేటి
అగ్రశ్రేణి అథ్లెట్లలో రికవరీ మరియు డిస్‌లోకేషన్ ట్రీట్‌మెంట్‌లపై ఎక్కువ
ప్రాధాన్యత కలిగి ఉంది. అదనంగా, ఇబ్న్ సీనా డోర్సల్ మరియు కటి వెన్నుపూస dislocations of dorsal and lumbar vertebrae డిస్లోకేట్/తొలగిన
రోగులలో ఫ్లాసిడ్ మరియు స్పాస్టిక్-రకం ప్రేగు flaccid and spastic-type bowel మరియు మూత్రాశయం bladder పనిచేయకపోవడాన్ని వివరించాడు.
ఇబ్న్ సీనా యొక్క ఈ పరిశీలన ఇతర వైద్యులకు కాడా ఈక్వినా సిండ్రోమ్ వంటి
తీవ్రమైన పరిస్థితులను కనుగొనడానికి పునాదులు వేసింది. ఇబ్న్ సీనా తన పుస్తకంలో
శ్వాసనాళం మరియు దాని మృదులాస్థి, స్నాయువులు ligaments మరియు మాట, శ్వాస మరియు మ్రింగడంలో పనితీరు గురించి చాలా మంచి వివరణ ఇచ్చాడు. బంగారం లేదా
వెండితో తయారు చేసిన ట్యూబ్‌ని ఉపయోగించి ట్రాచల్ ఇంట్యూబేషన్‌ను వివరించేటప్పుడు, ఇబ్న్ సీనా ఇలా
అన్నాడు:“అవసరమైనప్పుడు, ఊపిరి పీల్చుకోవడానికి సహాయం చేయడానికి శ్వాసనాళానికి బంగారం లేదా వెండితో
చేసిన లోహపు గొట్టాన్ని అందించవచ్చు.”.
మొత్తంమీద, ఈ వ్యాసం
ఇస్లామిక్ స్వర్ణయుగ శాస్త్రవేత్తలు వైద్య
శాస్త్రానికి, ప్రత్యేకంగా
న్యూరోసర్జరీకి చేసిన కృషిని పరిశీలించింది. ఇస్లామిక్ స్వర్ణయుగ శాస్త్రవేత్తలు చేసిన ఆవిష్కరణలు విస్తారమైనవి, సంచలనాత్మకమైనవి
మరియు ఆధునిక కాలంలో ఇప్పటికీ అనేకం ఉపయోగించబడ్డాయి మరియు వర్తింపజేయబడ్డాయి.
No comments:
Post a Comment