ఇటీవలి శాస్త్రీయ
పరిశోధనలో, రోగిని
సందర్శించడం సందర్శకుడి రోగనిరోధక శక్తిని పెంచుతుందని నిరూపించబడింది. మానవ రోగనిరోధక వ్యవస్థ అది భావించే లేదా
నమ్మే వాటి పట్ల చాలా సున్నితంగా ఉంటుంది. మరియు అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని
సందర్శించడం మరియు పరామర్శ చేయడం సందర్శకుని రోగనిరోదక వ్యవస్థను బలోపేతం
చేస్తుంది. అందువల్లనే ప్రవక్త (స) రోగులను సందర్శించి వారిని పరామర్శ చేయడం చేయమని
ఆదేశించారు.
అల్లాహ్ యొక్క దూత (ﷺ) ఇలా అన్నారు: “ప్రతి ముస్లింకు
మరొక ముస్లింపై ఆరు హక్కులు ఉన్నాయి (అనగా, ఒక ముస్లిం మరొక ముస్లిం కోసం ఆరు విధులను నిర్వర్తించాలి):
సలాం చెప్పడం, భోజన ఆహ్వానంను అంగీకరించడం, సలహా అడినప్పుడు ఇవ్వడం, రోగులను సందర్శించడం, అంత్యక్రియలకు
వెళ్లడం, తుమ్మిన
వ్యక్తికి, 'యర్హముక్-అల్లాహ్’
(అల్లాహ్ మీపై తన దయను ప్రసాదించుగాక)' అని చెప్పడo, (తుమ్మేవారు అల్లాహ్‌ను స్తుతించినప్పుడు].” [అల్-బుఖారీ మరియు
ముస్లిం].
అల్లాహ్ యొక్క ప్రవక్త (ﷺ) ఇలా అన్నారు: "రోగులను
సందర్శించండి, ఆకలితో
ఉన్నవారికి ఆహారం ఇవ్వండి మరియు బందీల విడుదలకు ఏర్పాట్లు చేయండి."
[అల్-బుఖారీ].
దైవప్రవక్త సల్లల్లాహు
అలైహివ సల్లం ఇలా అన్నారు: "విశ్వాసంతో తన సోదరుడిని సందర్శించేవాడు, అతను తిరిగి
వచ్చే వరకు జన్నా తోట నుండి తాజా పండ్లను కోయడంలో నిమగ్నమై ఉంటాడు."
[ముస్లిం].
No comments:
Post a Comment