వెస్ట్ ఆఫ్రికన్ నగరం అయిన టింబక్టు
చాలా కాలం భూమికి అంతిమంగా end of the Earth పిలవబడేది. 1988లో టింబక్టు
నగరం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది
టింబక్టు అనేక ఆఫ్రికన్
సామ్రాజ్యాల క్రింద ఇస్లామిక్ స్కాలర్‌షిప్‌కు కేంద్రంగా ఉంది. టింబక్టు నగరం 25,000-విద్యార్థులతో విశ్వవిద్యాలయం మరియు ఇతర మదర్సాలు కలిగి 13
నుండి 16వ శతాబ్దాల వరకు ఆఫ్రికా అంతటా ఇస్లాం వ్యాప్తికి మూలo గా పనిచేసింది.
కైరో, బాగ్దాద్, పర్షియా మరియు
ఇతర ప్రాంతాల నుండి వచ్చి టింబక్టు నగరంలో నివాసం ఉండే ప్రముఖ ఇస్లామిక్ పండితుల ఉపయోగం కోసం పవిత్ర ముస్లిం గ్రంథాలు, బైండ్ ఎడిషన్లలో, ఉండేవి.
ఖగోళ శాస్త్రం మరియు
గణితం నుండి వైద్యం మరియు చట్టం వరకు ఇస్లాం యొక్క గొప్ప బోధనలు అనేక లక్షల
మాన్యుస్క్రిప్ట్‌లలో పొందుపరిచి టింబక్టు లో ఇక్కడ తయారు చేయబడ్డాయి. ఆఫ్రికన్
చరిత్ర యొక్క అమూల్యమైన వ్రాతపూర్వక రికార్డును రూపొందించడానికి అనేక మంది రచయితలు
టింబక్టు లో ఉన్నారు.
వెస్ట్ ఆఫ్రికాలో ఇస్లామిక్
ఒయాసిస్‌గా టింబక్టు నగరం ఖ్యాతి దాని మూడు గొప్ప మట్టి మరియు కలప మసీదులలో:
జింగారేబర్, సంకోర్ మరియు సిడి
యాహియా ప్రతిధ్వనించింది. ఇవి టింబక్టు నగర స్వర్ణయుగాన్ని గుర్తుచేస్తాయి. 14వ మరియు
15వ శతాబ్దపు ఈ ప్రార్థనా స్థలాలు శాంతి రాయబారులుగా పిలువబడే ఇస్లామిక్ పండితుల
నివాసాలు కూడా.
టింబక్టు విశ్వవిద్యాలయం
అనేది మాలిలో ఉన్న టింబక్టు నగరంలోని మూడు మసీదులు- సాంకోర్, జింగురేబెర్
మరియు సిడి యాహ్యాలోని మసాజిద్ తో అనుబంధించబడిన బోధనకు సమిష్టి పదం.
టింబక్టు విశ్వవిద్యాలయం ప్రపంచంలోని మూడవ
పురాతన విశ్వవిద్యాలయం. టింబక్టు విశ్వవిద్యాలయం అధికారికంగా 13BCలో
స్థాపించబడింది మరియు ముఖ్యంగా మాన్సా మూసా (1307-1332) మరియు అస్కియా రాజవంశం (1493-1591) పాలనలో చాలా అభివృద్ధి
చెందిన అభ్యాస స్థానంగా మారింది. సాంకోర్
విశ్వవిద్యాలయం దాని మూలాలను సంకోర్ మసీదుతో కలిగి ఉంది, దీనిని 989 ADలో టింబక్టు యొక్క సుప్రీం న్యాయమూర్తి
అల్-ఖాదీ అకిబ్ ఇబ్న్ మహమూద్ ఇబ్న్ ఉమర్ స్థాపించారు.' యూరోపియన్లు
విశ్వవిద్యాలయాలను నిర్మించడానికి చాలా కాలం ముందు, టింబక్టులోని విశ్వవిద్యాలయం లో 25 000 మంది విద్యార్థులు
అబ్యాసిoచే వారు.
టింబక్టులోని అన్ని
విశ్వవిద్యాలయాలు ఇస్లాం కంటే ముందే ఉన్నాయి మరియు వెస్ట్ ఆఫ్రికాలో ముఖ్యంగా మాలి
లో ఇస్లాం అభివృద్ది చెందిన తరువాత మాలి లోని టింబక్టు మరియు అనేక ఇతర పురాతన
ఆఫ్రికన్ నగరాలు లో ఉన్న స్వదేశీ ఆఫ్రికన్ విశ్వవిద్యాలయాలు మస్జిద్‌లుగా మారినవి.. టింబక్టు విశ్వవిద్యాలయాలు
989 CEలో మసీదులకు
కేటాయించబడ్డాయి.
టింబక్టు-మాలి లోని విశ్వవిద్యాలయ నిర్మాణ శైలి ఇస్లామిక్ పూర్వపు సహేలియన్ అడోబ్ ఆర్కిటెక్చర్‌కు ప్రతిబింబంగా ఉంది
14వ శతాబ్దంలో లండన్ కంటే టింబక్టు నగరం 5 రెట్లు పెద్దదిగా ఉండేది మరియు ఆ సమయంలో టింబక్టు ప్రపంచంలోనే అత్యంత
సంపన్న నగరం. మాలియన్ నావికులు కొలంబస్ కంటే దాదాపు 200 సంవత్సరాల ముందు అమెరికాకు వచ్చారు.
14వ శతాబ్దంలో, మాలిలోని టింబక్టు అనే నగరంలో 115,000 మంది ప్రజలు
నివసిస్తున్నారు. ఆ సమయంలో లండన్‌లో నివసించిన వారి కంటే ఇది ఐదు రెట్లు ఎక్కువ.
నేషనల్ జియోగ్రాఫిక్ ద్వారా
టింబక్టు యొక్క మేధో సంస్కృతి, మధ్య యుగాల "పారిస్" అని పిలవబడినది.ప్రొఫెసర్
హెన్రీ లూయిస్ గేట్స్ 25,000 మంది విద్యార్ధులు
చదువుకోవడానికి టింబక్టు వెళ్లారని చెప్పారు.
"పశ్చిమ ఆఫ్రికా దేశాలలో లో అనేక కుటుంబాలు
వందల సంవత్సరాల నాటి పుస్తకాలతో ప్రైవేట్ లైబ్రరీలను కలిగి ఉన్నాయి. మౌరిటానియన్‌లోని
చింగెట్టి మరియు ఔడనే పట్టణాలలో మధ్య యుగాల నుండి 3,450 చేతితో వ్రాసిన పుస్తకాలు ఉన్నాయి.ఊలాటా
నగరంలో మరో 6,000 పుస్తకాలు
ఉన్నాయని భావిస్తున్నారు. కొన్ని ఎనిమిదవ శతాబ్దానికి చెందినవి. నైజర్‌లో ప్రైవేట్
సేకరణలలో కేవలం 11,000 పుస్తకాలు
ఉన్నాయి.
మాలిలోని టింబక్టులో
ఇప్పటికీ దాదాపు 700,000 పుస్తకాలు
ఉన్నాయి. ఈ రచనలు మండే, సుకి, పీల్ మరియు
సుడానీ భాషలలో కలవు. మాన్యుస్క్రిప్ట్‌లలో వ్రాయబడిన విషయాలు గణితం, వైద్యం, కవిత్వం, చట్టం మరియు ఖగోళ
శాస్త్రానికి సంబంధించినవి.
టింబక్టు గ్రంధాలయం లో 14వ శతాబ్దంనాటి మొదటి ఎన్సైక్లోపీడియా కలదు. 18వ శతాబ్దంలో
యూరోపియన్లు మొదటి ఎన్సైక్లోపీడియా ప్రచురించారు. వారి కంటే ముందే టింబక్టులో ఎన్సైక్లోపీడియా
కలదు.
1600లలో, పశ్చిమ ఆఫ్రికా పండితుని 1,600 పుస్తకాల సేకరణ ఇతరులతో పోలిస్తే అతి చిన్న లైబ్రరీ గా పరిగణించ బడినది
TV షో "సహారా చుట్టూ Around the Sahara," మైఖేల్ పాలిన్ ఈ
పాత మాన్యుస్క్రిప్ట్‌ల గురించి మాట్లాడాడు మరియు టింబక్టు యొక్క ఇమామ్
"సూర్యుని చుట్టూ గ్రహాలు స్పష్టంగా కదులుతున్నట్లు చూపించే శాస్త్రీయ
గ్రంథాల సేకరణను కలిగి ఉన్నాడు" అని చెప్పాడు.
టింబక్టు లోని శాస్త్రీయ
గ్రంథలు కొన్ని వందల సంవత్సరాల నాటివి.
టింబక్టు పండితులకు, యూరోపియన్ పండితుల కంటే
చాలా ఎక్కువ తెలుసని అనటానికి చాలా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి
No comments:
Post a Comment