2 February 2023

ఇస్లాం చరిత్రకు పరీక్షగా నిలుస్తుంది Islam Stands the Test of History

 


ఇస్లాం తానూ ఒక శాశ్వతమైన ధర్మము  అని పేర్కొంది. చారిత్రక ప్రాతిపదికన ఈ వాదన చెల్లుబాటును నిర్ధారించడానికి ప్రజలను ఆహ్వానిస్తుంది. తరువాతి తరం చరిత్ర, దాని వాదనను ఆమోదిస్తే  అది ఆమోదించబడుతుంది లేకుంటే అది తిరస్కరించబడుతుంది.

20వ శతాబ్దంలో చారిత్రక తిరస్కరణకు స్పష్టమైన ఉదాహరణగా మార్క్సిజం నిలిచినది. ఆధునిక పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం తన స్వంత విధ్వంసానికి బీజాలను కలిగి ఉంటుందని కార్ల్ మార్క్స్ అభిప్రాయపడ్డాడు. కార్ల్ మార్క్స్ ప్రకారం పెట్టుబడిదారితనం  లోని  లోపాలే దానిని నాశనం చేస్తాయి. కార్ల్ మార్క్స్ అంచనాకు పూర్తి విరుద్ధంగా, పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం మనుగడ సాగించడమే కాకుండా, గొప్ప పురోగతిని సాధిస్తోంది. కాని చారిత్రక సంఘటనలు మార్క్సిస్టు సిద్ధాంతాన్ని సమాధి చేశాయి.

జర్మన్లు, గొప్ప జాతి అని మరియు వారు  ఐరోపా/ప్రపంచం  మొత్తాన్ని పాలించడానికి ఉద్దేశించబడ్డారని అన్న అడాల్ఫ్ హిట్లర్, అతని  నాజీ పార్టి రెండవ ప్రపంచ యుద్ధం ముగింపులో పరాజయం పొంది తగిన మూల్యం చెల్లించినది.

కానీ ఇస్లాం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పదియేను వందల సంవత్సరాల కాలం తరువాత కూడా, ఇస్లాం ఎటువంటి క్షీణతను చవిచూడలేదు. సుప్రసిద్ధ బ్రిటీష్ చరిత్రకారుడు, ఎడ్వర్డ్ గిబ్బన్, ఇస్లాం యొక్క ఆవిర్భావం మరియు విస్తరణను “ప్రపంచ దేశాలపై నూతన మరియు శాశ్వత ప్రభావం కలిగించిన చిరస్మరణీయ విప్లవాలలో ఒకటి” అని పేర్కొన్నాడు.

భారతీయ చరిత్రకారుడు, M.N. రాయ్ "ముహమ్మద్(స) అతనికి ముందు లేదా తర్వాత ఉన్న ప్రవక్తలలో అందరికంటే గొప్ప వ్యక్తి మరియు  ఇస్లాం యొక్క విస్తరణ అన్ని అద్భుతాలలో అత్యంత అద్భుతం" అని అన్నాడు. (ది హిస్టారికల్ రోల్ ఆఫ్ ఇస్లాం, pp. 4-5)

అమెరికన్ రచయిత, మైఖేల్ హార్ట్, తన పుస్తకం, "ది 100" లో ప్రపంచ చరిత్రలో అత్యంత అద్భుతమైన విజయాన్ని సాధించిన అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులను ఎంపిక చేశారు. ఈ జాబితాలో అగ్రస్థానంలో ప్రవక్త ముహమ్మద్(స) ఉన్నారు. “మతపరమైన మరియు లౌకిక స్థాయిలలో అత్యున్నత విజయం సాధించిన ఏకైక వ్యక్తి గా ముహమ్మద్ చరిత్రలో ఉన్నాడు” అని మైఖేల్ హార్ట్ అన్నాడు.

క్రీ.శ. 610లో, ప్రవక్త ముహమ్మద్ (స) మొదటిసారిగా దైవిక ద్యోతకాలను పొందడం ప్రారంభించిన సంవత్సరం లో తన సొంత కుటుంబం నుండి మరియు బయటి ప్రపంచం నుండి గట్టి వ్యతిరేకతను పొందినప్పటికీ,  తన దైవిక మిషన్ కోసం తానూ ముందుగా ఊహించిన గొప్ప విజయం, సరిగ్గా నిజమైంది. ఈ దశలో ముహమ్మద్(స)పూర్తిగా నిస్సహాయంగా భావించాడు కాని ఈ ప్రతికూల పరిస్థితిలో కూడా ముహమ్మద్(స) దేవుని నుండి ఒక వహి/ప్రత్యక్షతను/ద్యోతకం  పొందాడు, అది ఇలా చెప్పింది:

వారు అల్లాహ్ జ్యోతిని తమ నోటితో ఊది అర్పివేయాలనుకొంటున్నారు.వాస్తవానికి అల్లాహ్ తన జ్యోతిని పరిపూర్ణ చేసిగాని వదలడు-సత్య తిరస్కారులకు అది ఎంతగా సహిoచరానిదయినాసరే! ఆయనే తన ప్రవక్తను మార్గదర్సకత్వంతో, సత్య ధర్మం తో సహా పంపాడు-దానిని ఇతర మతధర్మాలన్నిoటిపై ఆధిక్యం వహించేలా చేయటానికి! బహుదైవారధకులు దీనిని జీర్ణించుకోలేకపోయినాసరే!”-(61:8-9)

ముహమ్మద్(స) తన దైవిక మిషన్‌లో ఖచ్చితంగా విజయం సాధిస్తాడని దివ్య ఖురాన్ ప్రకటించింది.ప్రవక్త(స) ప్రత్యర్థులందరు, వారు ఎంత శక్తిమంతులైనప్పటికీ, చివరికి ఓడిపోతారు. (ఇది దివ్యఖురాన్‌ లోని అనేక చోట్ల వేర్వేరు పదాలలో సూచించబడింది) చరిత్రలో మహోన్నతమైన పనిని ప్రారంభించిన అనేక మంది వ్యక్తులు తాము ఊహించిన విజయాన్ని సాధించలేదు. మానవ చరిత్రలో, ప్రవక్త ముహమ్మద్ (స)మాత్రమే ఈ నియమానికి మినహాయింపు, ప్రవక్త(స)అంచనాలు పూర్తి స్థాయిలో నెరవేరాయి.ప్రవక్త(స) మరియు అతని సహచరులు క్లుప్త కాలంలోనే అరేబియాను జయించడమే కాకుండా వారి కాలంలోని రెండు గొప్ప సామ్రాజ్యాలు-రోమన్ మరియు సస్సానిద్‌లపై కూడా విజయం సాధించారు. చరిత్రలో ఈ అసాధారణ దశను చరిత్రకారులు దాదాపు అందరూ గుర్తించారు.

ఆధునిక విజ్ఞాన యుగానికి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం వెల్లడైన దైవవాణి ‘దివ్య ఖురాన్’ సమకాలీన మరియు అన్ని భవిష్యత్ సమయాల్లో చేసిన ఆవిష్కరణలకు అనుగుణంగా నిలిచినది. మానవ జ్ఞానంలో పురోగతి సాధించవచ్చు, కానీ అవి దివ్య ఖురాన్ భోధనలకు విరుద్ధంగా ఉండవు. చరిత్ర దీనికి సాక్ష్యంగా ఉంది. అన్ని పురాతన పుస్తకాలలో ఉన్న అనేక ప్రకటనలు తాజా శాస్త్రీయ ఆవిష్కరణలతో విభేదిస్తున్నప్పటికీ, దివ్య ఖురాన్ అటువంటి వైరుధ్యాలన్నింటినీ తొలగించడంలో ప్రత్యేకత కలిగి ఉంది.

దివ్య ఖురాన్ చెప్పినట్లుగా: "ఏమిటి, వారు ఖురాన్ పై  చింతన చేయరా? ఒకవేళ ఇది దేవుని నుండిగాక వేరొకరి తరుపు నుండి వచ్చి ఉంటె ఇందులో తీవ్రమయిన విభేదం (వైరుద్యం) కానవచ్చెది. (4:82)

ఆధునిక కాలంలో ఫ్రెంచ్ శాస్త్రవేత్త, మారిస్ బుకైల్, తన పుస్తకం, బైబిల్, ఖురాన్ మరియు ఆధునిక శాస్త్రం The Bible, the Qur’an and Modern Science లో, దివ్య ఖురాన్‌లో ఉన్న ప్రకటనలు ఎలా ఆశ్చర్యకరంగా ఆధునిక శాస్త్ర ఆవిష్కరణలకు అనుగుణంగా ఉన్నాయో వివరంగా చూపించాడు. దివ్య ఖురాన్ శాస్త్రీయ ప్రమాణాలకు సరిగ్గా సరిపోతుందని ఇది చూపిస్తుంది.

దివ్య ఖురాన్ లోని విషయాలకు అనుకూలంగా ఉన్న మానవ జ్ఞానం,  దివ్య ఖురాన్ అనేది విశ్వ సృష్టికర్త ద్వారా వెల్లడి చేయబడిన గ్రంథమని, దీని జ్ఞానం,  స్థలం మరియు కాల పరిమితులకు కట్టుబడి ఉండదు  అనేదానికి మరొక చారిత్రక రుజువు.

దివ్య ఖురాన్‌ ఇలా  అంటుంది :అనతి కాలం లోనే మేము వారికీ మా సూచనలను చూపిస్తాము- జగతి లోనూ, స్వయంగా వారిలోనూ! కడకు ఇదే (ఈ ఖురాన్ గ్రంధమే)సత్యమన్న విషయం వారికి సుభోధకం అవుతుంది. నీ ప్రభువు ప్రతి దానికి సాక్షిగా ఉన్నాడనే విషయం సరిపోదా?” (41:53)

దివ్య ఖురాన్ మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్రం యొక్క తులనాత్మక అధ్యయనాన్ని పూర్తి చేసిన తర్వాత, మారిస్ బుకైల్ క్రింది  నిర్ణయానికి వచ్చాడు:

ముహమ్మద్ కాలంలోని విజ్ఞాన స్థాయిని దృష్టిలో ఉంచుకుని, దివ్య ఖురాన్‌లో సైన్స్ తో  అనుసంధానించబడిన అనేక ప్రకటనలు ఒక వ్యక్తి యొక్క పని అని ఊహించలేము. అంతేకాకుండా, దివ్య ఖురాన్‌ను ద్యోతకం యొక్క వ్యక్తీకరణగా పరిగణించడమే కాకుండా, అది అందించే ప్రామాణిక హామీ మరియు దానిలోని  శాస్త్రీయ ప్రకటనల ఉనికిని బట్టి దానికి చాలా ప్రత్యేక స్థానాన్ని ఇవ్వడం కూడా పూర్తిగా చట్టబద్ధమైనది మరియు  నేడు అధ్యయనం చేసినప్పుడు, మానవ పరంగా వివరణకు సవాలుగా కనిపిస్తుంది.(p.252)

సంగ్రహంగా చెప్పాలంటే, దివ్య ఖురాన్ లాగా దాని ప్రామాణికతను నిరూపించమని మానవాళిని సవాలు చేసిన మరే ఇతర గ్రంథం లేదు. దివ్య ఖురాన్ అతీంద్రియ మూలం మరియు ఖచ్చితత్వానికి, దాని తీవ్ర వ్యతిరేకుల నుండి కూడా పూర్తి హేతుబద్ధమైన మద్దతును పొందింది. అంతిమంగా ఇంతటి అత్యున్నత విజయం పొందిన ప్రవక్త ముహమ్మద్‌(స) వంటి మరొక చారిత్రక వ్యక్తి లేరు.

1)ప్రవక్త(స) భవిష్యదృష్టి:

ముహమ్మద్ 570 AD లో మక్కాలో జన్మించాడు మరియు 632 A.D లో మదీనాలో మరణించాడు. ముహమ్మద్  తండ్రి అబ్దుల్లా, ముహమ్మద్ పుట్టకముందే చనిపోయాడు. ముహమ్మద్ తల్లి అమీనా కూడా ముహమ్మద్ పుట్టిన వెంటనే మరణించింది. ముహమ్మద్   బాల్యం నుండి అసాధారణమైన వ్యక్తిత్వం కలవాడు. ముహమ్మద్   తాత, అబ్దుల్ ముత్తలిబ్, ముహమ్మద్  తన జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకుంటాడని వ్యాఖ్యానించేవారు.

దివ్య ఖురాన్ యొక్క 93 మరియు 94 అధ్యాయాలు ముహమ్మద్ ప్రారంభ సంవత్సరాల పరిస్థితులను క్లుప్తంగా వివరిస్తాయి మరియు దేవుడు అతని పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడని నొక్కి చెప్పాయి. యవ్వనంలో ముహమ్మద్ సత్యo కోసం అన్వేషించినప్పుడు దేవుడు ముహమ్మద్ కి వహి/ద్యోతకం ద్వారా మార్గదర్శకత్వం ఇచ్చాడు.

మక్కాలోని సంపన్న మహిళల్లో ఒకరు, ముహమ్మద్ అసాధారణ వ్యక్తిత్వం మరియు మంచి లక్షణాలకు ముగ్ధురాలై  ముహమ్మద్ ని వివాహం చేసుకోన్నది. వివాహం ముహమ్మద్ కు అనుకూలమైన అవకాశాలను గుర్తించడానికి మరియు ప్రతి ప్రతికూలతను ప్రయోజనంగా మార్చడానికి వీలు కల్పిస్తుంది.

సుప్రసిద్ధ జర్మన్ మనస్తత్వవేత్త ఆల్ఫ్రెడ్ అడ్లెర్ తన పుస్తకం, ది ఇండివిడ్యువల్ సైకాలజీ’లో తన జీవితమంతా మానవులను అధ్యయనం చేసిన తర్వాత, వారిలో తాను కనుగొన్న గొప్ప సామర్ధ్యం " ప్రతికూలతను,  అనుకూలత గా మార్చే వారి శక్తి" అని రాశారు.

బ్రిటిష్ రచయిత, Mr. ఇ.ఇ. కెల్లెట్ E.E. Kellet: "వైఫల్యం నుండి విజయం సాధించాలనే సంకల్పంతో ముహమ్మద్ కష్టాలను ఎదుర్కొన్నాడు” అని పేర్కొన్నాడు.

ప్రవక్త(స) యొక్క విజన్ సామాన్య మానవుని విజన్ కు పూర్తిగా భిన్నమైనది. ప్రవక్త కాని వ్యక్తిలో ఇంత అసాధారణమైన విజన్ ఎప్పుడూ కనిపించలేదని చెప్పడం కూడా నిజం. ప్రవక్త(స) యొక్క అసాధారణ స్వభావం, భూత, వర్తమాన మరియు భవిష్యత్తును కలిగి ఉన్న సర్వశక్తిమంతుడి నుండి పొందాడనటం సత్యం.

ప్రవక్త(స) జీవితంలోని కొన్ని సంఘటనలు ప్రవక్త(స)వ్యక్తిగత ఔన్నత్యానికి నిదర్శనాలు మాత్రమే కాదు, వాటి ప్రకారం, ప్రవక్త(స) సామాన్యుడు కాడు, దైవ ప్రేరేపిత వ్యక్తి అని దేవుని నుండి నేరుగా జ్ఞానాన్ని పొందిన వ్యక్తి అని రుజువుని అందిస్తాయి.

2)భవిష్యత్తును ఊహించడం:

తోలి రోజులలో ప్రవక్త(స)ను  మక్కావాసులు చాలా సాధారణ వ్యక్తిగా భావించారు మరియు  అతన్ని 'ముహమ్మద్, అబ్దుల్లా కుమారుడు' అని పిలవడానికి బదులుగా, వారు అతనిని 'అబూ కబ్షా కుమారుడు' అని పిలిచే వారు.  'అబూ కబ్షా భార్య ముహమ్మద్(స)కు  పాలు ఇచ్చిన దాయి/ తడి నర్సు.

ప్రవక్త(స) యొక్క ప్రారంభ సంవత్సరాల్లో, మక్కన్ నాయకులు ప్రవక్త(స) యొక్క మేనమామ అబూ తాలిబ్ ఇంటి వద్ద సమావేశమయ్యారు, ప్రవక్త (స) చేసే దైవ సందేశ ప్రచారం గురించి  ప్రవక్త(స)ను అడిగారు. ప్రవక్త(స) పూర్తి దృఢ నిశ్చయంతో ఇలా సమాధానమిచ్చాడు: నాకు మీ నుండి ఒకే ఒక్క మాట కావాలి, మీరు దానిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే, మీరు మొత్తం అరేబియాను స్వాధీనం చేసుకుంటారు మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలన్నీ మీ ముందు లొంగిపోతాయి. (హయాత్ సహబాగా, 1/56)

ప్రవక్త(స) ఈ ప్రకటన చేసిన రోజు, అతనికి మద్దతు ఇవ్వడానికి ఒక్కరు  కూడా లేరు. కాని  ప్రవక్త(స) ఇతరులకు అనూహ్యంగా కనిపించేదాన్ని వాస్తవం చేయగలడు. ఆరోజు ఆయన చెప్పిన మాటలు చరిత్రలో భాగమైన సంగతి మనందరికీ తెలిసిందే.

ప్రవక్త (స)తన దైవ దౌత్యం  ప్రారంభించిన కేవలం ఇరవై మూడు సంవత్సరాలలో, ఇస్లాం అరేబియా మొత్తం వ్యాపించినది తరువాత రెండు దశాబ్దాలలో ప్రపంచంలోని రెండు గొప్ప సామ్రాజ్యాలు-రోమన్ మరియు సస్సానిడ్ సామ్రాజ్యాలపై ఇస్లాం విజయం సాధించినది. చాలా మంది  చరిత్రకారులు దీనిని మానవ చరిత్రలో గొప్ప అద్భుతంగా పేర్కొన్నారు. చరిత్రకారుడు ఎం.ఎన్. రాయ్ “ప్రతి ప్రవక్త అద్భుతాలను ప్రదర్శించడం ద్వారా తన అభిరుచిని స్థాపించాడు. ఆ లెక్కన ముహమ్మద్ ప్రవక్తలందరిలోకెల్లా గొప్ప వ్యక్తిగా గుర్తించబడాలి మరియు  ఇస్లాం యొక్క విస్తరణ అన్ని అద్భుతాలలో అత్యంత అద్భుతం" అని అన్నాడు. (ది హిస్టారికల్ రోల్ ఆఫ్ ఇస్లాం, pp. 4)

3)ప్రతికూలతల మధ్య అనకూలత పొందటం:

ప్రవక్త(స) పదవిని పొందిన తరువాత, ముహమ్మద్ ప్రవక్త(స) పదమూడు సంవత్సరాలు మక్కాలో నివసించారు. ఇది ముహమ్మద్ ప్రవక్త(స) జీవితంలో అత్యంత కష్టతరమైన కాలం. మక్కావాసులలో  కొద్దిమంది మాత్రమే ముహమ్మద్  (స) ను, అతని దైవ దౌత్యంను  విశ్వసించారు. మెజారిటీ ఖురైషి  నాయకులు ముహమ్మద్(స) ధార్మిక విచారాలను తీవ్రంగా తీవ్ర వ్యతిరేకించారు మరియు ప్రవక్త(స), అతని సహచరులకు అన్ని రకాల కష్టాలను కలిగించారు. ప్రవక్త(స) సహచరులలో కొందరిని చంపారు. ప్రవక్త(స) కుటుంబంతో పాటు ప్రవక్త(స)పై పూర్తి బహిష్కరణ విధించబడింది మరియు చివరకు ఇస్లాంను శాశ్వతంగా తుడిచిపెట్టడానికి ప్రవక్త(స)ను చంపాలని నిర్ణయించుకున్నారు.

పరిస్థితులు చాలా ప్రతికూలంగా ఉన్నవి. అది గిరిజన యుగం. ఒక వ్యక్తి యొక్క అసలు శక్తి అతని మగబిడ్డలో ఉందని నమ్మేవారు  మరియు ప్రవక్త(స)కు కొడుకు లేనందున, ప్రవక్త(స)ప్రత్యర్థులు అతన్ని 'అబ్తార్' (మూలాలు లేని) అని పిలిచేవారు, అంటే ప్రవక్త(స)కి భవిష్యత్తు లేదు. ఈ పరిస్థితులలో, ప్రవక్త(స) ఇలా సమాధానమిచ్చారు: "అన్ని ఇతర పట్టణాలను మింగేసే పట్టణాన్ని,  దేవుడు నాకు వాగ్దానం చేసాడు. ప్రజలు దీనిని యాత్రిబ్ అని పిలుస్తారు, కానీ అది మదీనా." (మువత్తా ఇమామ్ మాలిక్, 641).

దీని సారాంశం ప్రవక్త(స) మక్కాను విడిచిపెట్టి మరొక పట్టణo మదీనా కు  వలస వెళ్లాలని దేవుడు ఆదేశించాడని, ఆ పట్టణం ప్రవక్త(స)దైవదౌత్యం కు కేంద్రంగా ఉంటుంది.  మదీనా అన్ని ఇతర పట్టణాల కన్నా శక్తివంతంగా ఉంటుందని మరియు ప్రపంచ దేశాలన్నీ దీనికి లొంగిపోతాయని చెప్పబడినది. ఈ మాటలు తన సొంత పట్టణమైన మక్కాలో ఒక సాధారణ వ్యక్తిగా అత్యంత కఠినమైన పరిస్థితులలో జీవిస్తున్న వ్యక్తి నుండి వచ్చినాయి.  

ప్రవక్త(స) మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళినప్పుడు అతని  పాదాలకు ఒక జత బూట్లు కూడా లేవు.ప్రవక్త(స)మక్కా నాయకుల వేధింపులకు తాళలేక రహస్యంగా దాక్కుని మదీనా చేరుకున్నాడు. మదీనా ఆ రోజుల్లో యాత్రిబ్ అని పిలవబడేది మరియు ఎటువంటి ప్రాముఖ్యత లేని పట్టణం. మదీనా  నివాసులందరూ ఇస్లాం లోకి ప్రవేశించారు, అంతేకాకుండా, మదీనా వెలుపల చెల్లాచెదురుగా ఉన్న ముస్లింలు, మదీనా పట్టణంలో స్థిరపడటం ప్రారంభించారు. మదీనా ఇస్లాం యొక్క శక్తివంతమైన కేంద్రంగా మారింది. కొన్ని సంవత్సరాల వ్యవధిలో, ప్రవక్త(స)మిషన్,  మదీనా లో వ్యాపించింది.  తరువాత అరేబియాలోని అన్ని ఇతర పట్టణాలలో  వేగంగా అభివృద్ధి చెందింది. అంతిమంగా, అరేబియా మొత్తం ఇస్లాం లోకి ప్రవేశించింది.

మక్కాకు 300 మైళ్ల దూరంలో ఉన్న మదీనాలో ప్రవక్త (స) భవిష్యత్తు గమనించడానికి  ప్రవక్త(స) వైపు నుండి గొప్ప అంతర్దృష్టి అవసరం. ప్రవక్త(స)మదీనా లో గొప్ప భవిష్యత్తును ఊహించిన వాస్తవం, ప్రవక్త(స) అద్భుతమైన అంతరదృష్టికి స్పష్టమైన  రుజువు. మక్కా మరియు మదీనా రెండు పట్టణాల నివాసులు విగ్రహారాధకులు, అయినప్పటికీ ఇరు పట్టణాల ప్రజల మద్య  ప్రాథమిక వ్యత్యాసం ఉంది. మక్కాలోని  ప్రజలు  విగ్రహారాధనతో ముడిపడి ఉన్నారు, అయితే మదీనా వాసులకు  విగ్రహారాధన అనేది పూర్వీకుల వారసత్వం మాత్రమే; దానికి వేరే ప్రాముఖ్యత లేదు.

మక్కాలో నీటి కొరత కారణంగా వ్యవసాయం, ఉద్యానవనాలు లేవు. అయితే, విగ్రహారాధన పట్టణ ప్రజల జీవనోపాధికి ఒక గొప్ప వనరుగా ఉంది. మక్కన్లు అరేబియా లోని అన్ని తెగలకు చెందిన 360 విగ్రహాలను కాబాలో ఉంచారు. అరేబియా తెగలు తమ విగ్రహాలను పూజించడానికి కాబాను సందర్శించేవారు, మరియు భక్తిపూర్వక కానుకలను కూడా సమర్పించేవారు. వారి సందర్శన కారణంగా మక్కాలో వ్యాపారం అభివృద్ధి చెందింది. భక్తుల సందర్శన ద్వారా, మక్కన్లు పెద్ద ఎత్తున ప్రయోజనం పొందారు. ఇంకా, మక్కన్లు ఈ విగ్రహారాధన వ్యవస్థకు సంరక్షకులుగా ఉన్నందున, వారు మొత్తం అరేబియా యొక్క రాజకీయ నాయకత్వ స్థానాన్ని సంపాదించారు. విగ్రహారాధనను విడిచిపెట్టడం,  వారి రాజకీయ మరియు ఆర్థిక వ్యవస్థ పతనానికి పర్యాయపదంగా వారికి కనిపించింది.

మదీనాలో పరిస్థితి మక్కా పరిస్థితికి  భిన్నంగా ఉంది. మదీనా లో నీరు మరియు సారవంతమైన నేల ఉంది. వ్యవసాయం మరియు ఉద్యానవనాల ద్వారా, దాని నివాసులు సులభంగా తమ జీవనోపాధిని పొందగలిగారు. అందుచేత, ఏకేశ్వరోపాసన కోసం విగ్రహారాధనను విడిచిపెడితే, తమ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుందని వారు భయపడలేదు. మదీనావాసులు ఏకేశ్వరోపాసనను విగ్రహారాధనను విడిచిపెట్టి, ఎటువంటి సంకోచం లేకుండా ఇస్లాంను స్వీకరించారు. మక్కా మరియు మదీనాల మధ్య ఉన్న ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడానికి మరియు మక్కా కంటే మదీనా పురోగమనానికి అర్ధం చేసుకోవటానికి నిశితమైన అవగాహన అవసరం. ఇది ముహమ్మద్ ప్రవక్త(స) యొక్క  అంతరదృష్టి కు సజీవ రుజువు మరియు అక్షరాలా చరిత్ర యొక్క సాక్ష్యం.

4)శాంతి అత్యంత శక్తివంతమైన ఆయుధం:

మహమ్మద్ ప్రవక్త(స) జన్మించిన కాలం యుద్ధం మరియు సంఘర్షణలతో కూడుకున్నది. ప్రపంచవ్యాప్తంగా కత్తిని శక్తికి చిహ్నంగా పరిగణించారు. అరబ్బులకు ఒక సామెత ఉంది: “యుద్ధం యొక్క ముగింపు యుద్దమే”. ప్రవక్త (స)"దేవుడు హింసకు ఇవ్వని దానిని,  అహింసకు ఇస్తాడు." అని అన్నారు. (అల్-తిర్మిది)

పదిహేను వందల సంవత్సరాల క్రితం ఉన్న పరిస్థితుల్లో ఇటువంటి పరిశీలనలు అసాధారణంగా అనిపించాయి. ఇటువంటి భావాలు కాలానికి విరుద్ధంగా ఉన్నాయి మరియు ఒక ఉన్నతమైన జ్ఞాన మూలం నుండి ప్రేరణ పొందిన  వ్యక్తి మాత్రమే అనగలడు. ఇస్లాం యొక్క ప్రారంభ మరియు తరువాతి కాలం రెండూ ప్రేరణ సూత్రానికి పూర్తిగా సాక్ష్యమిస్తున్నాయి.

అరేబియా లో నాయకత్వాన్ని అనుభవించిన ఖురైషులు,  ప్రవక్త ముహమ్మద్ (స) పై ద్వేషం పెంచుకొన్నారు.  సీరా పుస్తకాల ప్రకారం, ఖురేషులు ఎనభైకి పైగా సందర్భాలలో ప్రవక్త (స) తో చిన్న లేదా పెద్ద యుద్దాలు  జరిపారు.  కానీ ప్రవక్త(స) శాంతియుత విధానాన్ని అవలంబించడం ద్వారా అశాంతి పెరగకుండా ఉండేందుకు  తన వంతు కృషి చేశారు. ఉదాహరణకు, అహ్జాబ్ యుద్ధం  సందర్భంగా, ప్రవక్త(స) తనకు  మరియు తన శత్రువుల మధ్య కందకం ఏర్పాటు చేసారు. ఆ తర్వాత హుదైబియా సందర్భంగా శత్రువుతో శాంతి ఒప్పందం కుదుర్చుకునే విషయంలో ప్రవక్త(స) అవిశ్వాసులు  పెట్టిన షరతులన్నింటినీ అంగీకరించారు.

తన   ప్రవక్తత్వం 23 సంవత్సరాల కాలంలో, ప్రవక్త(స) తన విరోధులను బద్ర్, ఉహుద్ మరియు హునైన్ వద్ద, అది సంఘర్షణ పూర్తిగా అనివార్యం అయినప్పుడు భౌతికంగా కేవలం మూడు సందర్భాలలో మాత్రమే ఎదుర్కొన్నారు. ఈ మూడు సందర్భాలలో ప్రతి ఒక్క యుద్ధం సగం రోజు మాత్రమే కొనసాగింది. అనగా ప్రవక్త(స) తన జీవితమంతా కేవలం ఒకటిన్నర రోజులు మాత్రమే పోరాడారు. మొత్తం ప్రాణనష్టం రెండు వైపుల నుండి 130 కంటే ఎక్కువ కాదు. ఎల్లప్పుడూ శాంతి శక్తిని కోరే ప్రవక్త(స) తక్కువ రక్తపాతంతో యుద్ధానికి దిగిన  వ్యక్తులపై విజయం సాధించారు.

ప్రవక్త(స) జీవితకాలంలో అరేబియా జయించబడింది. ఈ ప్రక్రియలో జరిగిన యుద్ధాల వల్ల కేవలం నూట యాభై మందిలోపే ప్రాణాలు కోల్పోయారు. మహమ్మద్ ప్రవక్త(స) తీసుకొచ్చిన ఈ విప్లవం నిజంగా రక్తరహిత విప్లవం మరియు ఈ రక్తరహిత విప్లవం ప్రవక్త(స) శాంతి శక్తిపై నమ్మకంతో పని చేయడం వల్లనే సాధ్యమైంది.

ఇస్లాం యొక్క తరువాతి శతాబ్దాలలో కూడా ఈ శాంతి సూత్రాన్ని అనుసరించబడినది. అందుకే ఇస్లాం ఇంత గొప్ప విజయాలు సాధించింది. పదమూడవ శతాబ్దంలో అనాగరిక మంగోల్ తెగలు తుర్కిస్తాన్ నుండి ప్రారంబించి సమర్కండ్ నుండి అలెప్పో వరకు మొత్తం ముస్లిం సామ్రాజ్యాన్ని నాశనం చేశారు. గ్రాండ్ అబ్బాసిద్ కాలిఫేట్ పూర్తిగా కనుమరుగైంది. మంగోలులు ఓడిపోయారని చెబితే ఎవరు నమ్మని స్థితి ముస్లిములలో వ్యాపించింది. ఈ పరిస్థితిలో ఇస్లామిక్ శాంతి విధానం అద్భుతం చేసింది. ముస్లిం పురుషులు మరియు ముస్లిం మహిళలు శాంతియుత దావా పనిలో నిమగ్నమయ్యారు. ఫలితం అద్భుతం: 50 సంవత్సరాల వ్యవధిలో పలితం పూర్తిగా మారిపోయింది. దివ్య ఖురాన్ (41:34) మాటలలో, శత్రువులు సన్నిహిత మిత్రులుగా మార్చబడ్డారు. మెజారిటీ మంగోలులు ఇస్లాం స్వీకరించారు.

ఆయుధాలు విఫలమైన చోట ఇస్లాం జయించింది”.(ది ప్రీచింగ్ ఆఫ్ ఇస్లాం, T.W. ఆర్నాల్డ్).

మరొక చరిత్రకారుడు ఇలా పేర్కొన్నాడు: "విజేతలు,  పరాజీతుల ధర్మాన్ని  స్వీకరించారు."

ప్రవక్త ముహమ్మద్ (స)హింస శక్తి కంటే శాంతి శక్తి చాలా గొప్పదని భావించారు మరియు అనేక సందర్భాల్లో, ప్రవక్త(స)మరియు అతని అనుచరులు దీనిని విజయవంతంగా ఆచరణలో పెట్టారు. ఫలితంగా ఈ శాంతి భావన తరువాతి తరాలపై ప్రభావం చూపుతూనే ఉంది.

ప్రస్తుత కాలంలో మహాత్మా గాంధీ తన అహింసా ఉద్యమo లో  ఈ శాంతియుత క్రియాశీలత సూత్రం ఆధారంగా పనిచేసారు మరియు భారత దేశానికి స్వాతంత్ర్యo సంపాదించారు.  అలాగే శాంతియుత క్రియాశీలత సూత్రం ఉపయోగించి నెల్సన్ మండేలా దక్షిణ ఆఫ్రికా లో తన రాజకీయ ఉద్యమంలో విజయం సాధించాడు.

ముహమ్మద్ ప్రవక్త(స) క్రీస్తు శకం ఆరవ శతాబ్దం రెండవ భాగంలో జన్మించారు. ఇది నిరంతరం ఘర్షణల యుగం. ఆ రోజుల్లో ప్రజలు సమస్యతో సంబంధం లేకుండా హింసను ఆశ్రయించారు. అటువంటి వాతావరణంలో మహమ్మద్ ప్రవక్త(స) హింస శక్తి కంటే శాంతి శక్తి చాలా గొప్పదని ప్రకటించారు. ఈ శాంతియుత కార్యకలాప వాస్తవికతను అరుదైన అంతర్దృష్టి మరియు వర్తమానంలోకి చొచ్చుకుపోయి భవిష్యత్తును చూడగల లోతైన దృష్టి ఉన్న వ్యక్తి మాత్రమే అర్థం చేసుకోగలడు. ప్రస్తుత తాజా ఆయుధాల ఆవిష్కరణ మరియు ఉపయోగం యుద్ధం లేదా హింస యొక్క విధ్వంసకతను పెంచాయి. ఆధునిక సైన్స్ అండ్ టెక్నాలజీలో పురోగతి ఉదా. నేటి సమాచార వ్యవస్థలు, ఇప్పటివరకు ఊహించలేని స్థాయిలో, శాంతియుత పద్ధతికి బలమైన మద్దతునిచ్చాయి.

పదిహేను వందల సంవత్సరాల క్రితం మానవ  భవిష్యత్ అంధకారంలో ఉన్న దశలో ప్రవక్త(స) యొక్క అసాధారణ అంతర్దృష్టి,  శాంతి సాధనకు ఒక సాధనంగా రుజువు అయింది.

5)ప్రవక్త(స)ప్రవచనాలు చరిత్ర యొక్క మార్గాన్ని నిర్ణయిస్తాయి:

"ప్రవక్తత్వం మరియు దేవుని దూత యొక్క గొలుసు రద్దు చేయబడింది మరియు నా తర్వాత ఒక ప్రవక్త లేదా దూత దేవుని చే  పంపబడడు" (సహీహ్ ముస్లిం).

“ముహమ్మద్ దైవసందేశహరుడు, ప్రవక్తల పరంపరను పరిసమాప్తం చేసే చివరి వాడు”.-దివ్య ఖురాన్‌ (33:40)

అలాంటి ప్రకటన ఆయనకు  ముందు ఎప్పుడూ చేయబడలేదు, ఆయన తర్వాత కూడా చేయబడలేదు. కాని ఈ మాటలు చరిత్రలో నిలిచిపోవడం మరింత విస్మయం కలిగిస్తోంది. తానూ భగవంతుని ప్రవక్త అని చెప్పుకోవడానికి ఇప్పటివరకు ఎవరూ సాహసించలేదు.

ప్రవక్తత్వానికి సంబంధించి కొoదరు  ఆధ్యాత్మిక వ్యక్తులు ప్రవక్త ముహమ్మద్(స) చేసినట్లు స్పష్టoగా నేను  దేవుని దూత అని ప్రకటన చేయలేదు. సందేహం లేదు, నేను దేవుని ప్రవక్తను అని కేవలం ముహమ్మద్(స) మాత్రమే ప్రకటించారు. (ఇబ్న్ హిషామ్).

దీనికి సంబంధించి మొదటి ఉదాహరణ క్రీ.శ. 633లో మరణించిన  ప్రవక్త(స) యొక్క సమకాలీనుడైన యమమా (అరేబియా)కు చెందిన  ముసైలామా. ప్రవక్తత్వాన్ని ముసైలామా ప్రకటించాడని చెబుతారు. కానీ ముసైలామా స్వతంత్ర ప్రవక్త కాదు, ముహమ్మద్ ప్రవక్త(స) ప్రవక్తత్వo  లో తన్ను తానూ సహ-భాగస్వామిగా ప్రకటించుకొన్నాడు. ముసైలామా, మదీనాలోని ప్రవక్త ముహమ్మద్(స) వద్దకు ఇద్దరు సభ్యుల ప్రతినిధి బృందo తో  ఒక లేఖను పంపాడు.  అందులో స్పష్టంగా ఇలా పేర్కొనబడింది: "నేను అతనితో (ముహమ్మద్) ప్రవక్త విషయంలో భాగస్వామిగా చేయబడ్డాను." (సీరత్ ఇబ్న్ హిషామ్, పేజి 244)

ముసైలామా తన్ను తానూ స్వతంత్ర ప్రవక్తగా ఎన్నడూ ప్రకటించలేదని ఇది స్పష్టం చేస్తుంది. ముసైలామా ప్రకారం తానూ  ముహమ్మద్ ప్రవక్త(స) ప్రవక్తత్వo లో   భాగస్వామి మాత్రమే. దీనర్థం ముసైలామా స్వయంగా ప్రవక్త ముహమ్మద్‌(స) ను ప్రవక్త(స) గా అంగీకరించాడు. ముసైలామా వాదనను ప్రవక్త ముహమ్మద్(స) అoగీకరిస్తేనే అది చెల్లుబాటు అవుతుంది. కాని ముహమ్మద్ ప్రవక్త (స) అలా సాక్ష్యం చెప్పనందున, ముసైలామా వాదన నిరాధారమైనది.

గురునానక్‌ భక్తులు కొన్నిసార్లు గురునానక్ ను "దూత" అని పిలుస్తారు. గురునానక్ తాను దేవుని ప్రవక్త అని ఎప్పుడూ చెప్పుకోలేదు. సిక్కు మతం యొక్క పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహబ్ అనే పుస్తకం వాస్తవానికి వివిధ వ్యక్తుల రచనల సమాహారం. ఈ పుస్తకంలో ఎక్కడా, గురునానక్ తనను తాను భగవంతుని దూతగా భావించినట్లు లేదా తాను దైవ దూతలలో ఒక్కడినని చెప్పుకోవడం జరగడం లేదు. కావున గురునానక్ ను ప్రవక్తల జాబితాలో చేర్చడం సరి కాదు.

ఆ తర్వాత ఇరాన్‌లో జన్మించిన బహౌల్లా (మ. 1892), అతని అనుచరులచే ప్రవక్తగా పరిగణించబడ్డాడు. బహౌల్లా బోధలపై ఆధారపడిన మతాన్ని బహాయి విశ్వాసం అంటారు. ఇప్పుడు ప్రశ్న ' బహౌల్లా దేవుని ప్రవక్త అని చెప్పుకున్నాడా?'

బహౌల్లా దేవుని ప్రవక్త అని మౌఖికంగా లేదా వ్రాతపూర్వకంగా చెప్పుకోలేదు. బహాయి రికార్డుల ప్రకారం బహౌల్లా కేవలం మహది (మార్గదర్శక వ్యక్తి) మరియు అజ్ఞాత దేవుడు అని మజర్-ఎ-హక్ అభిప్రాయపడ్డారు. (EB-732).

భారతదేశంలో జన్మించిన మీర్జా గులాం అహ్మద్ ఖాదియానీ (మ. 1908) ని , కొంతమంది ప్రవక్తగా భావిస్తారు. కానీ, మీర్జా గులాం అహ్మద్ ఖాదియానీ రచనలలో ఈ భావనకు అనుమతిoచ లేదు. ఖాదియానీ తనకు  తాను దేవుని ప్రవక్తగా ఎన్నడూ ప్రకటించుకోనందున ప్రవక్తల జాబితాలో చేర్చబడలేదు. ఖాదియానీ కేవలం తానూ ప్రవక్త ముహమ్మద్(స) యొక్క నీడ అని పేర్కొన్నాడు.

ప్రవక్త ముహమ్మద్(స) తన తర్వాత ప్రళయకాలానికి ముందు ఎటువంటి ప్రవక్త లేదా దూత రాలేదని ప్రకటించారు.

ఈ విషయంలో నాకు రెండు వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయి, ఒకటి గురు గుర్బచన్ సింగ్ (మ.1980)కి సంబంధించినది మరియు మరొకటి త్రివేండ్రంలోని శాంతిగిరికి చెందిన శ్రీ కరుణాకర గురువు (మ మే 6, 1999). ఇద్దరు పవిత్ర పురుషుల భక్తులు మరియు తమ తమ గురువులు దేవుని ప్రవక్తలు అని నాకు చెప్పారు. భగవంతుని ప్రవక్త అనే జ్ఞానం ఉన్నది గురువుకే తప్ప ఆయన భక్తులు కాదని నేను చెప్పాను. అందువల్ల, సంబంధిత వ్యక్తి "నేను దేవుని ప్రవక్తను”  అనే  పదాలను పలికినప్పుడు మాత్రమే అటువంటి వాదనను తీవ్రంగా పరిగణించాలనే ప్రశ్న తలఎత్తుతుంది.

ఢిల్లీకి చెందిన గురుబచన్ సింగ్, నిరంకారీ మిషన్ చీఫ్, అతని భక్తులు కొందరు నా కార్యాలయాన్ని సందర్శించి, తమ గురువు ఈనాటి ప్రవక్త అని పేర్కొన్నారు. అది నిజమని వారు విశ్వసిస్తే, నేను వారి గురువును చూడటానికి వస్తానని మరియు అతను దేవుని ప్రవక్త అని చెప్పమని వారు అతనిని అడగాలని నేను చెప్పాను. అలా చేయమని తమ గురువును అభ్యర్థిస్తామని, ఆయన నా సమక్షంలో తప్పకుండా ఈ మాటలు చెబుతారని వారు  చెప్పారు. అయితే అప్పుడు నేను గురువు వాదనపై చర్చ చేయను అని కూడా అన్నాను. గురువుగారి నుండి ఆ మాటలు వింటే చాలు నేను ప్రశ్నించకుండానే వచ్చేస్తాను అని అన్నాను.

భక్తులు తమ గురువుతో మాట్లాడి తేదీ మరియు సమయాన్ని నిర్ణయించారు. నిర్ణీత సమయంలో నేను సంత్ నిరంకారి మండల్ (న్యూ ఢిల్లీ)కి వెళ్లాను, అక్కడ నన్ను గురువుగారి గదిలోకి తీసుకువెళ్ళారు. నాతో పాటు ఆయన భక్తులు కూడా ఉన్నారు. గురువు తాము కోరిన మాటలు పలుకుతారని ఆయన భక్తుల ముఖాలు నిశ్చయించుకున్నాయి. దాదాపు గంటసేపు గురువుగారి దగ్గరే ఉండిపోయాను. అతను ఈ సమయంలో తన మిషన్ గురించి నాతో మాట్లాడటం కొనసాగించాడు, కానీ అతను ఎప్పుడూ ఈ మాటలు (దేవుని ప్రవక్త) చెప్పలేదు. నేను అతనిని ప్రశ్నించనని, ఎలాంటి చర్చకు దిగనని ముందుగా ఆయన భక్తులకు మాట ఇచ్చాను, కాబట్టి ఒక గంట వేచి ఉండి చివరకు నేను బయలుదేరాను.

మరొక సందర్భంలో, శాంతిగిరికి చెందిన శ్రీ కరుణాకర గురువు, ఆయన భక్తుల బృందం త్రివేండ్రం నుండి ఢిల్లీకి వచ్చింది, అక్కడ వారు మా కేంద్రాన్ని సందర్శించి, తమ గురువు దేవుని ప్రవక్త అని నాకు చెప్పారు. గురువుగారి నుండి ఈ మాటలు వినాలని నేను వారికి చెప్పాను. వారు నన్ను శాంతిగిరిలోని వారి ఆశ్రమానికి ఆహ్వానించారు మరియు వారి గురువు ఖచ్చితంగా ఈ మాటలు చెబుతారని నాకు హామీ ఇచ్చారు.

నేను ఫిబ్రవరి 1999లో త్రివేండ్రం వెళ్ళాను. త్రివేండ్రం విమానాశ్రయం నుండి దాదాపు 20 కి.మీ దూరంలో ఉన్న శాంతిగిరి ఆశ్రమంలో గురువును కలిశాను. ఈ సమావేశం ఒక విశాలమైన గదిలో జరిగింది, అందులో అతని భక్తులు మరియు కొంతమంది విదేశీయులు, పురుషులు మరియు మహిళలు కూడా ఉన్నారు. ఈ భక్తులు కార్పెట్ మీద నిలబడి లేదా కూర్చున్నారు. గురువు ఒక మంచం మీద పడుకుని, పక్కనే నా కోసం ఒక కుర్చీని ఉంచారు.

ఆ విధంగా గురువు మరియు నా మధ్య దూరం ఒక మీటరు కంటే తక్కువ. గురువుగారికి హిందీ రాదు కాబట్టి సంభాషణ ఆంగ్లంలో జరిగింది. కొంత ఉపోద్ఘాతo  తర్వాత, నేను అసలు పాయింట్‌కి వచ్చి గురువుగారుని నేరుగా అడిగాను:

మోసెస్, జీసస్ మరియు ముహమ్మద్ లు తాము దేవుని ప్రవక్తలుగా చెప్పుకున్న అర్థంలో మీరు దేవుని ప్రవక్త అని చెప్పుకుంటున్నారా? నా ప్రశ్న కు కొన్ని సెకన్ల నిశ్శబ్దం అనంతరం గురువు చాలా స్పష్టంగా సమాధానం ఇచ్చారు: "లేదు, నేను అలాంటి ప్రకటన చేయను”. ఆ తర్వాత ఈ అంశంపై తదుపరి ప్రశ్నలు వేయనవసరం లేదు. నేను గురువుతో కొంత సమయం పాటు అతని మిషన్ గురించి మాట్లాడాను, ఆపై అతని ప్రత్యేక ప్రసాదం -నారింజను స్వీకరించిన తర్వాత అక్కడి నుంచి సెలవు తీసుకున్నాను.

అంతిమంగా,  ముహమ్మద్ ప్రవక్త(స) అటువంటి దైవిక దృష్టిని కలిగి ఉన్నారని నమ్మకంగా చెప్పవచ్చు.  తద్వారా ముహమ్మద్ ప్రవక్త(స) భవిష్యత్తును చాలా స్పష్టంగా చూడగలడు. ముహమ్మద్ ప్రవక్త(స) మత, సామాజిక మరియు రాజకీయ విజయాల వెనుక ఉన్న రహస్యం అదే. ఈ దృష్టి కారణంగా, ముహమ్మద్ ప్రవక్త(స) తన ప్రవక్తత్వం యొక్క కొనసాగుతున్న సైద్ధాంతిక ఆధిపత్యాన్ని కూడా అంచనా వేయగలిగాడు

6)చరిత్ర -ఇస్లామిక్ దృక్పదం:

దివ్య ఖురాన్ ప్రకారం, దేవుడు ఒక నిర్దిష్ట ఉద్దేశ్యంతో విశ్వాన్ని సృష్టించాడు మరియు విశ్వం లోని అన్ని భాగాలు,  దేవుని నియంత్రణలో,  దైవిక పథకాన్ని మార్పు లేకుండా అమలు చేస్తున్నాయి. అదేవిధంగా, మనిషి కూడా ఒక నిర్దిష్ట ఉద్దేశ్యంతో సృష్టించబడ్డాడు. అయితే, మనిషి దీనికి విరుద్ధంగా, పూర్తి స్వేచ్ఛను కలిగి  ఉన్నాడు. మానవుడు తన స్వంత నిర్ణయంతో తానూ కోరుకున్నది ఏమైనా చేయగలడు. కాని దేవుడు, మానవుని నిరంతరం గమనిస్తూనే ఉన్నాడు. మానవ చరిత్రలో తన సృష్టి ప్రణాళికను నిర్వీర్యం చేసే ఎటువంటి విచలనాన్ని దేవుడు అనుమతించడు.

7)దేవుని సృష్టి ప్రణాళిక:

భగవంతుడు సృష్టించిన విశ్వం చాలా విశాలమైనది, విశ్వం గురించి తెలుసుకోవడానికి మానవులు చేసిన ప్రయత్నాలలో అపారమైన పురోగతి ఉన్నప్పటికీ, దానిలోని అనేక రహస్యాలు ఇప్పటికీ తెలియవు. విశ్వం లో భాగంగా భగవంతుడు సృష్టించిన భూగ్రహం మొత్తం విశ్వంలో ఇప్పటికీ ప్రత్యేకమైనది. భూగ్రహం లో  మనిషికి నివాసయోగ్యం అయ్యే వాతావరణం ఇంకా అవసరమైన అన్ని ఇతర కారకాలు ఉన్నాయి.

భూమిని సృష్టించిన తర్వాత, దేవుడు మొదటి మానవుడైన ఆదామును మరియు అతని స్త్రీలింగ ప్రతిరూపమైన హవాను సృష్టించాడు. ఈ సంఘటన యొక్క ఖచ్చితమైన తేదీ తెలియనప్పటికీ, భూమిపై అడుగు పెట్టిన మొదటి మానవ జంట ఆదాము  మరియు హవా(Adam and Eve) అనేది వాస్తవం.

ఆదాము  మొదటి మనిషి మరియు మొదటి ప్రవక్త కూడా. మానవాళికి తన సందేశాలను  పంపడానికి మానవుల నుండి ఒక వ్యక్తిని తన దూతగా ఎన్నుకోవడం దేవుని మార్గం. కాబట్టి, దేవుడు ఆదాముకు, ఒక దేవదూత ద్వారా భూమిపై మానవుడు నివసించే ఉద్దేశ్యాన్ని వెల్లడించాడు. ఈ ప్రణాళిక ప్రకారం, దేవుడు మనిషి రూపంలో ఒక జీవిని సృష్టించాడు, అతనికి స్వేచ్ఛను ప్రసాదించాడు. విశ్వంలోని మిగిలిన వాటికి భగవంతుని చిత్తానికి లొంగిపోవడం తప్ప వేరే మార్గం లేనప్పుడు, మనిషి తన స్వంత బుద్ధితో ఈ దైవిక ప్రణాళికను ఎంచుకోవడం మంచిది.

దైవిక సంకల్పం యొక్క ప్రణాళిక రెండు ప్రాథమిక సూత్రాలపై ఆధారపడింది-ఒకే ధర్మం మరియు న్యాయం. ఏకేశ్వరోపాసన మనిషిని ఒక్క దేవుడిని మాత్రమే ఆరాధించేలా చేస్తుంది. ఇతర మానవులతో వ్యవహరించడంలో మరియు అన్ని రకాల అన్యాయం మరియు అణచివేతలకు దూరంగా ఉండటంలో నైతిక సూత్రాలకు పూర్తిగా కట్టుబడి ఉండాలని న్యాయం మానవునికి చెబుతుంది.

దీనితో పాటు, స్వేచ్చగా ఉన్నప్పటికీ మానవుడు తనకు పూర్తిగా జవాబుదారీ అని దేవుడు వివరించాడు. మానవుని చర్యల గురించి దేవునివద్ద పూర్తి వివరాలు కలవు. మరణానంతరo  తీర్పుదినాన దేవుడు ఈ రికార్డు ప్రకారం ప్రతి ఒక్కరికీ తీర్పుఇస్తాడు. తన స్వేచ్ఛను తప్పుగా ఉపయోగించుకునే వ్యక్తి నిత్య నరకాగ్నిలో పడవేయబడతాడు.

ఆదాము  మట్టి ఫలకాలను తయారు చేసి వాటిపై ప్రాథమిక దైవిక బోధనలను చెక్కాడు, తరువాత వాటిని అగ్నిలో వేసి  వేడి చేశాడు. రాబోయే తరాల కోసం  దైవిక మార్గదర్శకత్వాన్ని భద్రపరిచాడు. ఈ దైవిక బోధనలు సిరియాక్ భాషలో ఆదాము రాసినట్లు నమ్ముతారు.

ఆదాము  పరిపూర్ణ వృద్ధాప్యంలో మరణించాడు. చాలా కాలం పాటు ప్రజలు, నమ్మకంగా ఆదాము సూచించిన  దైవిక మార్గదర్శకత్వానికి కట్టుబడి ఉన్నారు. అయితే తర్వాత ప్రజల్లో ఏకేశ్వరోపాసన స్థానంలో విగ్రహారాధన వచ్చింది. ప్రజలు న్యాయం మరియు నిజాయితీకి బదులుగా అన్యాయం మరియు అణచివేత మార్గాలను అనుసరించడం ప్రారంభించారు. సుమారు వెయ్యి సంవత్సరాల తర్వాత ఆదామ్ చూపిన షరియత్/న్యాయ  మార్గానికి పూర్తిగా దూరమయ్యే  వక్రబుద్ధి మానవ ప్రపంచం అంతా వ్యాపించింది.

8)వక్ర మార్గ కాలం/ది ఏజ్ ఆఫ్ పర్వర్షన్:

దేవుడు నోవహును తన దూతగా పంపాడు. నోవహు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు జీవించాడు.  సుదీర్ఘ జీవితం కాలం లో నోవహు తరతరాలుగా ప్రజలకు సరైన మార్గాన్ని చూపుతూనే ఉన్నాడు. అయితే కొద్ది మంది మాత్రమే నోవహు మాటలను పట్టించుకున్నారు. మిగిలిన వారు తమ పాపపు మార్గాలను కొనసాగించారు. అప్పుడు, దేవుని శిక్ష గా భారీ వరద వారిని ముంచెత్తింది. నోహ్ మరియు అతని అనుచరుల చిన్న బృందం ఒక పడవలో రక్షించబడింది, మిగిలిన వారందరూ మునిగిపోయారు.

ఆ సమయంలో, మానవ జనాభా బహుశా ఆసియా లోని మెసొపొటేమియా ప్రాంతంలో మాత్రమే కేంద్రీకృతమై ఉండవచ్చు. వరదల నేపథ్యంలో రక్షించబడిన పురుషులు మరియు మహిళలు ఆ తర్వాత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో స్థిరపడ్డారు. ఆసియా, ఆఫ్రికా మరియు ఐరోపా మూడు ఖండాలలో మానజాతి విస్తరించబడినారు.

నోవహు మరణం తరువాత, అతని ప్రజలు అతను చూపిన దైవిక మార్గానికి కట్టుబడి చాలా కాలం పాటు కొనసాగారు. కానీ తరువాతి తరాలలో మళ్లీ వారు ఏకేశ్వరవాదం మరియు న్యాయం యొక్క మార్గం నుండి తప్పుకున్నారు. దివ్య ఖురాన్ ఇరవై ఆరు దేవుని దూతల పేర్లను ప్రస్తావించింది. ప్రపంచానికి సుమారు లక్ష మంది దూతలు వచ్చినట్లు హదీసులు చెబుతున్నాయి. ఈ విధంగా ఆడమ్ మరియు మెస్సీయా మధ్య చాలా కాలం గడిచిపోయింది. దాదాపు ప్రతి తరంలో దేవుని దూతలు ప్రపంచానికి వస్తూనే ఉన్నారు. కానీ ప్రతిసారీ కొంతమంది వ్యక్తులు మాత్రమే వాటిని విశ్వసిస్తారు. ప్రతి యుగంలో మెజారిటీ ప్రజలు  ఈ ప్రవక్తలను తిరస్కరించారు.

9)మానవ వక్రబుద్ధికి కారణాలు:

ఈ నిరంతర ఉల్లంఘనకు కారణాలు ఏమిటి? రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి; ఒకటి, రాజకీయ నిరంకుశత్వం; మరొకటి, ప్రకృతి ప్రపంచం గురించి అజ్ఞానం.

పురాతన కాలంలో, రాచరిక వ్యవస్థ ప్రతిచోటా ప్రబలంగా ఉంది. ఆ రోజుల్లోని రాజులు తమ సామ్రాజ్యాన్ని ఏకీకృతం చేయడానికి ప్రజల మేధో స్వేచ్ఛపై పూర్తి నియంత్రణను అమలుజేసారు. ఫలితంగా, పాత రోజుల్లో సైన్స్ ఎటువంటి పురోగతిని  సాధించలేకపోయింది.

మతం విషయంలోనూ అదే జరిగింది. రాజు ఆమోదించిన మతం తప్ప పౌరులు మరే ఇతర మతాన్ని అనుసరించడానికి వీలు లేదు. పాలకులు తాము మూఢనమ్మకాలను స్వీకరించడమే కాకుండా, తమ ప్రజలను వాటికి కట్టుబడి ఉండమని బలవంతం చేశారు. ప్రజలకు ఉన్న   స్వేచ్ఛగా ఆలోచించే హక్కు మరియు ఇతర మతాన్ని ఎంచుకునే హక్కును తిరస్కరించారు. ఈ విధానం మతపరమైన హింసకు దారితీసింది. అప్పటి నుంచో ఏదో ఒక రూపంలో మతపరమైన హింస కొనసాగుతోందని చరిత్ర చెబుతోంది.

మరొక ప్రధాన అంశం అజ్ఞానం. పురాతన కాలంలో, మనిషికి ప్రపంచం గురించి మరియు దాని దృగ్విషయాల గురించి చాలా తక్కువగా తెలుసు. రాజకీయ నిరంకుశవాదం శాస్త్రీయ పరిశోధనపై పూర్తి నిషేధాన్ని విధించింది. సహజ దృగ్విషయాలకు సంబంధించిన అన్ని రకాల మూఢనమ్మకాలు వ్యాప్తి పొందాయి. సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు మొదలైనవి అతీంద్రియ శక్తులను కలిగి ఉంటాయని బావించారు. అదేవిధంగా సముద్రం, పర్వతాలు మరియు ఇతర సహజ దృగ్విషయాలు కొన్ని అసాధారణమైన, రహస్యమైన శక్తిని కలిగి ఉన్నాయని మరియు మానవ విధిపై నిర్ణయాత్మక నియంత్రణను కలిగి ఉన్నాయని ప్రజలు  నమ్మారు.

10)చెడు యొక్క సమస్య:

భౌతిక ప్రపంచంలో చట్టం యొక్క వెలుగులో మానవ చరిత్రను అర్థం చేసుకోవాలనుకునే వారు వైఫల్యాన్నిపొందుతారు. భౌతిక ప్రపంచాన్ని పూర్వ-నిర్ధారితవాదం యొక్క చట్రంలో వివరించవచ్చు, అయితే మానవ ప్రపంచంలోని సంఘటనలు అటువంటి చట్టాల పరంగా వ్యాఖ్యానించడానికి అనుకూలంగా లేవు.

మరికొందరు మానవ ప్రపంచంలోని సంఘటనలను స్వేచ్ఛ రూపేణా  అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. కానీ మానవ స్వేచ్ఛ విషయంలో, ఈ ప్రపంచంలో అనుభవించే బాధలకు సరైన అర్థమయ్యే వివరణ లేదు. ఈ రెండు వివరణల వైఫల్యం ఏమిటంటే, వారు మొత్తం భాగాన్ని, ఒక భాగం యొక్క వెలుగులో వివరించడానికి ప్రయత్నించడం వల్ల అది  సాధ్యం కాదు.

నిజమేమిటంటే, మానవ చరిత్రను అర్థం చేసుకోవడానికి సరైన సూత్రం ముందుగా నిర్ణయించినది లేదా స్వేచ్ఛ కాదు. ఇస్లాం ప్రకారం, మానవ చరిత్రను అర్థం చేసుకోవడానికి ఒకే ఒక సరైన సూత్రం ఉంది మరియు అది పరీక్షా సూత్రం. మానవుడు ప్రస్తుత ప్రపంచంలో పరీక్షించబడటం కోసమే ఉంచబడ్డాడు. ఈ పరీక్ష ఫలితంపై మానవాళి యొక్క శాశ్వతమైన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

ప్రపంచంలో ఈ పరీక్షకు అనుకూలమైన పరిస్థితులు తప్పని పరిస్థితి. మనిషి యొక్క విచారణను నిర్వహించే మార్గంలో వచ్చే ఏదైనా అడ్డంకికి హామీగా ముందస్తు నిర్ణయం ఒక మార్గంగా ఉండాలి. మరోవైపు, ప్రతి వ్యక్తి యొక్క ఉద్దేశాలు మరియు చర్యలను సరిగ్గా అంచనా వేయడానికి స్వేచ్ఛ కూడా అవసరం. చెడు పనులలో మునిగిపోయే అవకాశం ఉన్నప్పటికీ, ధర్మబద్ధంగా ప్రవర్తించడానికి తన స్వంత స్వేచ్ఛను ఎంచుకునే షరతుపై మాత్రమే మనిషి చేసే  మంచి పనికి పలితం ఇవ్వబడుతుంది.

ఈ ప్రపంచంలో ప్రతిదీ పూర్తిగా ముందుగా నిర్ణయించబడి ఉంటే, విచారణ అవసరం లేదు. కొంతమంది వ్యక్తులు తమ స్వేచ్ఛను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది మరియు వారు దానిని దుర్వినియోగం చేశారు. ఇది చెడు వల్ల కలిగే మానవ కల్పిత బాధల సమస్యకు దారితీసింది, అయినప్పటికీ ఈ బాధ లేదా చెడు అనేది చాలా విలువైన వస్తువు కోసం చెల్లించాల్సిన చిన్న ధర.

ఇస్లాం ప్రకారం, అన్ని రకాల ప్రలోభాలను ఎదుర్కొన్నప్పటికీ వాటిని అధిగమించడంలో విజయం సాధించే విధంగా ఈ ప్రపంచంలో తన జీవితాన్ని నడిపించే వ్యక్తి అత్యంత విలువైనవాడు. తన స్వేచ్ఛను దుర్వినియోగం చేసే అధికారం ఉన్నప్పటికీ, వ్యక్తి అలా చేయలేడు. సూత్రప్రాయమైన జీవితాన్ని గడపడానికి అవకాశం ఉన్నప్పటికీ, మానవుడు సూత్రప్రాయంగా ఉండటానికి తన స్వంత స్వేచ్ఛను ఎంచుకుంటాడు. అటువంటి వ్యక్తులను గుర్తించడానికి, ప్రపంచంలో స్వేచ్ఛా వాతావరణం నెలకొనడం చాలా అవసరం. మరే ఇతర వ్యవస్థలోనూ ఇది సాధ్యం కాదు

 

No comments:

Post a Comment