10 February 2023

ఫతేపురి మసీదు

 


సిపాయిల తిరుబాటు తరువాత  బ్రిటిష్ వారు 1858 వేసవిలో  ఢిల్లీని జయించినప్పుడు ఫతేపురి మసీదును స్వాధీనం చేసుకున్నారు. తర్వాత బ్రిటిష్ వారు దానిని వేలం వేశారు.ఢిల్లీలోని ప్రముఖ సేత్ లాలా చన్నా మాల్, మసీదును రూ. 19,000కు  కొన్నారు మరియు లాలా చన్నా మాల్,   ఫతేపురి మసీదు పవిత్రతను నిలుపుకునేలా చూసారు.

1876లో, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశానికి పర్యటనకు వచ్చినప్పుడు మరియు బ్రిటీష్ వారు ముస్లింలను బ్రిటిష్ సామ్రాజ్యానికి మిత్రులుగా  చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పుడు, ఫతేపురి మసీదు ముస్లిం సమాజానికి తిరిగి బహుమతిగా ఇవ్వబడింది.

ఢిల్లీ రాజు షాజహాన్ భార్య ఫతేపురి బేగం చేత  ఫతేపురి మసీదు 1650 CE లో నిర్మించబడింది. ఫతేపురి మసీదు ఢిల్లీ పట్టణంలోని పురాతన మసీదులలో ఒకటి. ఢిల్లీ పట్టణం యొక్క ప్రధాన వీధి చివరలో, ఒక చివర ఎర్రకోట మరియు మరొక వైపు ఫతేపురి మసీదు కలవు. షాజహాన్ భార్యని 'ఫతేపురి' అని పిలుస్తారు, ఎందుకంటే ఆమె ఫతేపూర్ సిక్రీకి చెందినది. షాజహాన్ కు ఫతేపురి బేగం ఐదవ భార్య. షాజహాన్ యొక్క పది మంది భార్యలలో 'ఫతేపురి బేగం ' ఒకరు. రాజ్యం యొక్క ఆదాయాలను పాడుచేసిన అభియోగం పై   షాజహాన్ చిన్న కొడుకు షాజహాన్ ను జైలుకు పంపాడు.

No comments:

Post a Comment