5 February 2023

ఇస్లాంలో జ్ఞానం అంటే శక్తి In Islam, knowledge is power

 



ఇస్లాం జ్ఞానం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. ఇస్లాం ధర్మం అభ్యాసం మరియు జ్ఞానం యొక్క ధర్మం గా పరిగణించబడుతుంది. ఇస్లాం ప్రకారం మనిషి తన దైవికకార్యం ను తెలుసుకోవడం మరియు నెరవేర్చడం కోసం సృష్టించబడ్డాడు. తెలుసుకోవడం అంటే విజయం సాధించడం; తెలియకపోవడం అంటే వైఫల్యం చెందడం. జ్ఞానం మంచితనానికి మూలం, అజ్ఞానం చెడు మరియు పాపాలకు మూలం.

 

ఇస్లాంలో జ్ఞానం,  కాంతి/వెలుగు  మరియు మార్గదర్శకత్వం కు పర్యాయపదంగా ఉంటుంది. విద్యా వ్యవస్థ ప్రజలకు కాంతి మరియు మార్గదర్శకత్వం అందించాలని భావిస్తున్నారు. చదువుకున్న వ్యక్తులు జ్ఞానోదయం మరియు మార్గనిర్దేశం చేయాలి. వారు ఆచరణాత్మకంగా ఉండాలి మరియు అదే సమయంలో అన్ని రకాల జీవిత సవాళ్లను ఎదుర్కోవడానికి తగినట్లుగా ఉండాలి.

 

విద్య అనేది ఒక వ్యక్తిని వృత్తిపరమైన జీవితానికి సిద్ధం చేయడం మరియు ఆసక్తి ఉన్న రంగానికి సంబంధించిన కొన్ని ఆచరణాత్మక నైపుణ్యాలను అందించడం కాదు. విద్య అనేది ఒక వ్యక్తిని మొత్తం జీవితానికి సిద్ధం చేయడం. వ్యక్తి  ఎంచుకున్న సబ్జెక్టు లో స్పెషలైజేషన్‌లో మాత్రమే కాకుండా మొత్తం జీవితంలో కూడా విజయం సాధించేలా చేస్తుంది. వ్యక్తి సమర్థుడు మాత్రమే కాదు, మంచి మరియు బాధ్యతాయుతమైన, వృత్తిపరమైనవాడు కూడా. అంతేకాకుండా, వ్యక్తి మంచి మరియు బాధ్యతాయుతమైన మానవుడిగా మెలగాలి. మంచితనం అన్ని ఇతర జీవిత అంశాలు మరియు కార్యకలాపాలలో ఉండాలి.

 

నిజమైన విద్యావంతుడు అంతిమ సాఫల్యం పొందే ఒక సంకేతంగా జ్ఞానాన్ని పొందుతాడు. జ్ఞానాన్ని అరబిక్‌లో "'ilm ఇల్మ్" అని పిలుస్తారు, ఇది "'ఆలం" అనే మూల పదం నుండి వచ్చింది, దీని అర్థం సంకేతం, సూచన లేదా గుర్తు.

 

మీరు ఏదైనా నేర్చుకుని దానిని ఉపయోగించకపోతే అది వృధా అవుతుంది.  దానిని కాపాడుకోండి మరియు జీవితంలో అమలు చేయండి. జ్ఞానంతో ఇతరులకు ప్రయోజనం చేకూర్చడం వల్ల అద్భుతమైన పలితాలు వస్తాయి. జ్ఞానం అనేది మరొక వ్యక్తికి మరియు ఒకరి నుండి మరొకరికి సులభంగా బదిలీ చేయబడుతుంది.

 

ఒక వ్యక్తి యొక్క జీవితం చదవడం, నేర్చుకోవడం మరియు తెలుసుకోవడం అనే భావనలతో మరియు స్ఫూర్తితో ప్రారంభం కావాలి మరియు వికసిoచబడాలి.

 

జ్ఞానం కోసం కృషి చేయడం ముస్లింలందరి విధి. ఇస్లాం నేర్చుకోవడం, ప్రశ్నలు అడగడం మరియు జ్ఞానాన్ని సంపాదించడం ద్వారా తనను తాను మెరుగుపరుచుకునే ఆలోచనను ప్రోత్సహిస్తుంది. ముహమ్మద్ ప్రవక్త(స) ఇలా అన్నారు: "జ్ఞానాన్ని సంపాదించడం  ప్రతి ముస్లింపై తప్పనిసరి". "మీరు పుట్టుక నుండి మరణించే వరకు జ్ఞానాన్ని పొందాలి" అని కూడా ప్రవక్త(స)పేర్కొన్నట్లు నివేదించబడింది.

 

ఇస్లాం అనేది "జ్ఞానం" యొక్క మార్గం. ఏ ఇతర మతం లేదా భావజాలం 'ఇల్మ్' యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పలేదు. దివ్య ఖురాన్‌లో, 'ఆలిమ్' అనే పదం 140 చోట్ల, అల్-'ఇల్మ్ అనే పదం 27 చోట్ల ఉంది. మొత్తంగా, 'ఇల్మ్ లేదా దాని ఉత్పన్నాలు derivatives మరియు అనుబంధ పదాలు ఉపయోగించబడిన మొత్తం ఆయతుల సంఖ్య 704.

 

దివ్య ఖురాన్ ప్రకారం, ఆదంకు మొదటి బోధన ఆదం ను సృష్టిoచిన  తర్వాత వెంటనే ప్రారంభమైంది మరియు ఆదంకు 'అన్ని పేర్లను' నేర్పించారు. కాబట్టి మనం నేర్చుకోవడం మరియు జ్ఞానాన్ని వెతకడం విషయానికి వస్తే మనం ఎప్పుడూ దేనిని వదిలిపెట్టకూడదు.

No comments:

Post a Comment