ముస్లిం మహిళలు తరచుగా అణచివేతకు గురైన వ్యక్తులుగా
భావించబడతారు. వారిని రాజకీయాలు
మరియు సమాజం విస్మరించేలా చేసింది. 'అణచివేయబడిన
మరియు దోపిడీకి గురైన ముస్లిం మహిళ'
యొక్క ప్రస్తుత వక్రీకరించిన చిత్రంకు మీడియా తప్పుడు చిత్రణ,
రాజకీయాల్లో మహిళల పాత్రపై పరిమిత వేదాంత అవగాహన మరియు చారిత్రక జ్ఞానం లేకపోవడం
వంటి కారణాలు కలవు. సుమారు పది శతాబ్దాల ఇస్లామిక్ చరిత్రను పరిశీలిస్తే రాజకీయాలలో
ముస్లిం స్త్రీల పాత్ర ప్రకాశవంతంగా మరియు వైవిధ్యభరితంగా ఉన్నది.
ఫాతిమా మెర్నిస్సీ వంటి ఇస్లామిక్ ఫెమినిస్ట్ పండితులు
పాశ్చాత్య దేశాల స్త్రీవాద కపట కథనాన్ని ఇస్లామిక్ గ్రంధాల వెలుగులో తిరస్కరించారు. ముస్లిం మహిళలు స్త్రీవాదానికి ప్రత్యామ్నాయ
విధానాన్ని అవలంబించడం ద్వారా మహిళలకు సంబంధించి సానుకూల సామాజిక మార్పును
తీసుకురావడానికి ఇస్లామిక్ గ్రంథాలు మరియు ప్రవక్త ముహమ్మద్ స్థాపించిన సమాజం
యొక్క ఉదాహరణపై ఆధారపడ్డారు.
ఇస్లాం ప్రారంభ కాలం లో మహిళలు తమ కుటుంబాలను విడిచిపెట్టి ప్రవక్త(స)
కు సహచరులుగా నిలిచారు. అటువంటి స్త్రీలలో,
ప్రవక్త కుమార్తె జెనాబ్,
ఉమ్మ్ సులైమ్ మరియు ఉమ్ కుల్తుమ్ ఉక్బా బిన్ అబీ ముయిత్‌లు
ఉన్నారు. అంతేకాకుండా, ప్రవక్త ముహమ్మద్(స)
కూడా మహిళలు స్వచ్ఛందంగా యుద్ధాలలో పాల్గొనడానికి మరియు రవాణా, వైద్య సహాయాన్ని అందించడానికి అనుమతించారు. ప్రవక్త
ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లంతో పాటు ఉహుద్ యుద్ధంలో ప్రవక్త(స) రక్షించడానికి
పోరాడిన నుసైబా బిన్త్ కబ్, ప్రవక్త ﷺ అత్త, ట్రెంచ్ యుద్ధంలో శత్రువులను చంపి మహిళలను రక్షించిన సఫియా మరియు ఆయేషా ర.అ వంటి ప్రముఖ
మహిళలు దీనికి ఉదాహరణలు. ఆదర్శవంతమైన
ఇస్లామిక్ సమాజంలో మహిళలు యుద్ధాలలో చురుకుగా పాల్గొనడాన్ని హైలైట్ చేయడానికి ఒంటె
యుద్ధం Battle of Camel ఉత్తమమైనది.
ఇస్లామిక్ రాచరికాల స్థాపన తర్వాత కులీన మహిళల రాజకీయ
భాగస్వామ్యం మరింత ప్రబలంగా మారింది. క్వీన్ ఖైజురాన్, వాస్తవానికి బానిస అయిన, బానిసల కుమారులు సింహాసనానికి వారసులుగా వచ్చే
ఆచారాన్ని ప్రవేశపెట్టడానికి బాధ్యత వహించారు. ఖైజురాన్ రాణి కుమారులు ఇద్దరూ పాలకులు అయ్యారు మరియు ఖైజురాన్
రాణి తన జీవితాంతం రాజకీయ వ్యవహారాలను
ప్రభావితం చేస్తూనే ఉంది.
శక్తివంతమైన ఇస్లామిక్ మహిళలు తమ స్థానాన్ని మరియు సంపదను
ప్రజా పనుల కోసం ఉపయోగించారు. హరున్ రషీద్ భార్య జుబైదా నీటి కొరతను తీర్చడానికి
మక్కా మరియు మదీనాలోని ఎడారి భూములలో ప్రజల కోసం బావులు, ఆక్విడెక్ట్‌లు మరియు నీటి రిజర్వాయర్‌లను
నిర్మించారు. మొఘల్ యుగం లో అక్బర్ చక్రవర్తి పెంపుడు తల్లి మహమ్ అంగా, ఖైరుల్ మనజిల్ మసీదు
యొక్క భవనాన్ని నిర్మించినది తరువాత అది మదర్సాగా పనిచేసింది. జహంగీర్ భార్య
నూర్జహాన్ యాత్రికుల సత్రాలు లేదా సెరైలు నిర్మించినది. నూర్జహాన్ ఆగ్రాలోని నూర్
అఫ్షాన్ మరియు మోతీ బాగ్ మరియు లాహోర్‌లోని షా దారా వంటి తోటలను నిర్మించినది. నూర్జహాన్
వారసులు దీనిని అనుసరించారు, షాజహాన్
చక్రవర్తి కుమార్తె జహనారా బేగం, పాద్షా బేగం
(ప్రథమ మహిళ)గా పేరుపొంది షాజహానాబాద్‌లో యాత్రికుల సత్రాలు మరియు కాలువను ప్రారంభించింది.
దివ్య ఖురాన్ లోని సూరా
నమల్‌లో సోలమన్ ప్రవక్త యొక్క సమకాలీనురాలైన షెబా రాణి యెమెన్‌ను పరిపాలించింది.
షిఫా బింట్ అబ్దుల్లాను, ఖలీఫా ఉమర్
మార్కెట్‌లో అధికారిణిగా (హిస్బా) నియమించినారు.
ముస్లిం మహిళలు రాజ్యాలకు సమర్థవంతమైన పాలకులుగా పనిచేయడం
ద్వారా తమ సమర్ధతను నిరూపించుకున్నారు. 34 మంది మహిళా
పాలకులను ముస్లిం చరిత్ర నమోదు చేసింది. మొదట్లో బానిసగా ఉన్న సిత్తుల్ ముల్క్ తన
భర్త మరణం తర్వాత అధికారంలోకి వచ్చి ఈజిప్టులో రెండు శతాబ్దాల పాటు పాలించిన బానిస
లేదా మమ్లుక్ రాజవంశాన్ని స్థాపించడంలో కీలక పాత్ర పోషించింది.
ఇక భారత దేశ విషయానికి వస్తే, రజియా సుల్తానా తన సోదరుడి
తర్వాత 1236-40 మద్య డిల్లీ సింహాసనమును అధిష్టించి మూడు సంవత్సరాలు ఢిల్లీ సుల్తానేట్ యొక్క
సమర్థవంతమైన మరియు ఏకైక మహిళా పాలకురాలిగా నిరూపించబడింది.
భోపాల్‌కు చెందిన నలుగురు ప్రసిద్ధ బేగంలు ఒక శతాబ్దానికి
పైగా (1819-1926) పాలించారు. సాంచిలోని
బౌద్ధ స్థూపాలను సంరక్షించడంలో భోపాల్ బేగంలు సుల్తాన్ జహాన్ బేగం మరియు షాజహాన్
బేగంల సహకారం ప్రముఖమైనది. భోపాల్‌కు చెందిన నలుగురు ప్రసిద్ధ బేగంల పాలన బాలికల
విద్యను ప్రోత్సహించినది. భోపాల్‌లో బాలికలకు
ప్రాథమిక విద్యా విద్య మరియు సాంకేతిక శిక్షణ అందించడానికి సికందర్ బేగం
విక్టోరియా పాఠశాలను స్థాపించారు. సుల్తాన్ షాజహాన్ బేగం మహిళల కోసం ప్రత్యేకంగా
సుల్తానియా జెనానా ఆసుపత్రిని నిర్మించారు,
ఇది మహిళా వైద్యులు మరియు నర్సులచే నిర్వహించబడుతుంది మరియు మహిళలు వైద్య
విద్యను పొందేలా ప్రోత్సహించింది.
ఆగ్నేయ ఆసియాలో నలుగురు
అచే క్వీన్స్ 1641 నుండి 1699 వరకు పరిపాలించారు. అచే రాణులు, తమ పాలనకు నూరుద్దీన్ ఇబ్న్ అలీ అర్-రానిరి
మరియు అబ్దుర్రౌఫ్ అల్-సింగిలీ వంటి విద్వాంసులతో సహా ఒరాంగ్‌కాయ (ప్రభువులు) ఆమోదం
పొందారు. అచే రాణుల పాలనలో అచే ఒక స్వతంత్ర రాజ్యంగా వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి
చెందడాన్ని విస్మరించలేము.
క్వీన్ సఫియ్యత్ అల్ దీన్ (1641–75)
ఆధ్వర్యంలో “మిరాత్ అల్ తుల్లాబ్ ఫి తషిల్ మరీఫత్ అహ్కామ్
అల్స్యారియా లి అల్-మాలిక్ అల్-వహాబ్,
మిరాత్ అల్-తుల్లాబ్,
హిదాయత్ అలీమాన్ బి ఫద్లీల్ మన్నన్” వంటి పుస్తకాలు ప్రచురింపబడి
గొప్ప మలయ్ ఇస్లామిక్ స్కాలర్‌షిప్ ఉద్భవించింది.
19వ శతాబ్దపు ఆరంభంలో అరేబియా యువరాణి ఘలియా అల్ బక్మియా, ఒట్టోమన్ పాలనను ధిక్కరిస్తూ తన విరోధులను
ధైర్యంగా ఓడించడాన్ని కూడా ఆధునిక ప్రపంచం చూసింది. నేడు టర్కీ, ఇండోనేషియా వంటి దేశాల సైన్యంలో మహిళల ప్రాతినిధ్యం పరిమితం
అయినప్పటికీ వారు దేశ సేవ చేస్తున్నారు. ఫ్రెంచ్ వలస శక్తులకు వ్యతిరేకంగా జరిగిన
విప్లవంలో అల్జీరియన్ మహిళల సైనిక పాత్ర ఆధునిక ప్రపంచంలో అత్యంత ప్రముఖమైనది.
20వ శతాబ్దంలో, ముస్లిం మహిళలు
రాజకీయాల్లో నిమగ్నమయ్యారు మరియు దేశ నిర్మాణంలో పాల్గొన్నారు. లీలా ఖాలీద్ ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా మిలిటెంట్ పాలస్తీనా
విముక్తి ఉద్యమం యొక్క పోస్టర్ గర్ల్‌గా మారారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల హక్కులను మరియు ప్రజాస్వామ్యాన్ని
డిమాండ్ చేయడంలో మీనా కేశ్వర్ కమల్ చేసిన ప్రయత్నాలను ఆఫ్ఘనిస్తాన్ గుర్తుచేసుకుంది.
అమీనా వాడూద్, కల్సూమ్ బషీర్, ఫర్హత్ హష్మీ, తవకోల్ కర్మన్ వంటి ముస్లిం స్త్రీవాదులు దివ్య ఖురాన్ వెలుగులో మహిళా సాధికారత కార్యక్రమాలను నిర్వహిoచారు. భారతదేశంలో ముస్లిం మహిళ మసీదు ప్రాజెక్ట్ అమలు చేయబడింది.
మహిళా పోరాటాలు సమాజంలో మహిళల పాత్రను మరింతగా పెంచాయి, దీనికి ఇటీవల ఇరాన్‌లో మహిళలు నాయకత్వం వహించిన ఆందోళనలు మరియు భారతదేశంలోని షాహీన్‌బాగ్ ఉద్యమం సాక్ష్యంగా ఉన్నాయి. ఈ ఉద్యమాలు మతానికి అతీతంగా ముస్లిం మహిళల ఉత్సాహం మరియు జ్ఞానోదయాన్ని రుజువు చేస్తాయి.
ముస్లిం
స్త్రీలు ఒక సమిష్టి సమూహంగా ఎదుగడాన్ని 21వ శతాబ్దము ప్రత్యేకంగా చూస్తోంది. అంతేకాకుండా, ముస్లిం మహిళల్లో రాజకీయ
క్రియాశీలతను తప్పుగా భావించడాన్ని వ్యతిరేకిస్తుంది. సమాజం యొక్క చారిత్రక
వారసత్వం యొక్క సూక్ష్మ అధ్యయనం స్పష్టంగా ముస్లిం మహిళలు ఎల్లప్పుడూ రాజకీయాలు
మరియు సమాజంలో చురుకుగా పాల్గొంటున్నారని చూపిస్తుంది.
No comments:
Post a Comment