21 February 2023

బాల్య వివాహాలు- NFHS 2019-21 అధ్యయనం Child Marriages- NFHS 2019-21 Study

 


 

కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహించిన జాతీయ కుటుంబ మరియు ఆరోగ్య సర్వే (NHFS) 2019-21 ప్రకారం  బాల్య వివాహాలకు మతంతో సంబంధం లేదని తేలింది. దేశంలో ముస్లింలు అధికంగా ఉన్న జమ్మూ & కాశ్మీర్ మరియు లక్షద్వీప్‌లలో బాల్య వివాహాలు అత్యల్పంగా ఉన్నాయని అధ్యయనం తెల్పుతుంది

 భారతదేశంలోని NHFS సర్వే మరియు బాల్య వివాహాల ఆధారంగా ఇక్కడ సమగ్ర విశ్లేషణ ఉంది:

న్యూఢిల్లీ-భారతదేశంలో పురుషులకు చట్టబద్ధమైన వివాహ వయస్సు 21 సంవత్సరాలు మరియు స్త్రీలకు 18 సంవత్సరాలు మరియు దానిని ఉల్లంఘించడం శిక్షార్హమైన నేరం.

కానీ బాల్య వివాహాలు భారతదేశం అంతటా బిన్న మతపరమైన వర్గాలలో, ముఖ్యంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని పేద ప్రజలలో ఒక సాధారణ పద్ధతిగా ఉన్నాయి.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం బాల్య వివాహాల సంఖ్య చాలా తక్కువేమీ కాదు. కొన్ని రాష్ట్రాల్లో వార్షిక వివాహాల్లో 40 శాతానికి పైగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి.

బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాంలలో, బాల్య వివాహాల రేటు అత్యధికంగా ఉన్నది  ఎందుకంటే ఈ రాష్ట్రంలోని గణనీయమైన జనాభా పేదరికంలో ఉంది.

జాతీయ ఆరోగ్య మరియు కుటుంబ సర్వే (NHFS) 2019-21 మధ్య బాల్య వివాహాల శాతానికి సంబంధించిన డేటా మరియు భారత ప్రభుత్వ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడింది.

NHFS సర్వే మతం ఆధారంగా గణాంకాలను అందించలేదు.

NHFS అధ్యయనం ప్రకారం, దేశంలోని మొత్తం వివాహాల్లో 23 శాతానికి పైగా వధువులు 18 ఏళ్లలోపు ఉన్నారు.

అంతేకాకుండా, బాల్య వివాహాలు మహిళల్లో మాత్రమే జరగవని అధ్యయనం తెల్పుతుంది. బాల్య వివాహాలు పురుషులలో కూడా ఎక్కువ లేదా తక్కువగా ఉన్నాయి.

సర్వే ప్రకారం, అధ్యయన కాలంలో జాతీయంగా పురుషులలో బాల్య వివాహాల శాతం 17 శాతానికి పైగా ఉంది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న స్త్రీలు మరియు పురుషులలో గణనీయమైన శాతం మంది ప్రస్తుత చట్టం ప్రకారం వివాహానికి కనీస వయస్సును చేరుకోనప్పుడు వివాహం చేసుకున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో 27 శాతం బాల్య  వివాహాలు జరుగుతుండగా, వివాహ వయస్సుపై అవగాహన ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాల్లో కూడా  మహిళల బాల్య వివాహాలు  14.7 శాతం ఉన్నాయి.

NHFS 2019-20 సర్వే ప్రకారం పురుషుల విషయంలో తక్కువ వయస్సు గల వివాహాల underage marriage జాతీయ సగటు 17.7 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 21 శాతం మరియు పట్టణ కేంద్రాలలో 11 శాతానికి పైగా ఉంది.

భారత ప్రభుత్వ గణాంకాలు దేశవ్యాప్తంగా పురుషుల విషయంలో తక్కువ వయస్సు గల వివాహాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చూపుతున్నాయి.

బాల్య వివాహాలకు గల కారణాలను సర్వే వెల్లడించనప్పటికీ, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలు, అబ్బాయిల చిన్న వయస్సులోనే వివాహాలు జరగడానికి ప్రధాన కారణం సామాజిక-ఆర్థిక స్థితిగతులు, వధువులు, వరులు  మరియు వారి తల్లిదండ్రులకు  తగిన విద్య లేకపోవడమేనని ఆరోగ్య అవగాహన కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలు చెబుతున్నారు. పురుషుల విషయంలో సామాజిక, సాంస్కృతిక కారణాలే కారణమని కార్యకర్తలు అంటున్నారు.

అయితే, వివిధ రాష్ట్రాల గణాంకాలు చాలా ఆశ్చర్యకరoగా ఉన్నాయి. ఉదాహరణకు, ముస్లిం మెజారిటీ ప్రాంతాలు - జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లక్షద్వీప్ - దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్త్రీలు మరియు పురుషులలో బాల్య వివాహాల శాతం తక్కువగా ఉంది.

సిక్కు జనాభాలో మెజారిటీ ఉన్న పంజాబ్‌లో కూడా - మహిళలు మరియు పురుషులు ఇద్దరి విషయంలో కూడా తక్కువ వయస్సు గల వివాహాలు underage marriages చాలా తక్కువగా ఉన్నాయి.

 అదేవిధంగా, ఈశాన్య ప్రాంతంలో క్రైస్తవులు మెజారిటీగా ఉన్న నాగాలాండ్ మరియు మిజోరంలు పురుషులు మరియు స్త్రీలలో బాల్య వివాహాల శాతం తక్కువగా ఉన్న రాష్ట్రలలో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్, అండమాన్ & నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, ఒడిశా, ఉత్తర ప్రదేశ్, జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీ, హర్యానా, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాలు మరియు దాద్రా & నగర్ హవేలీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలలో బాల్య వివాహాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.

గుజరాత్‌లో కూడా బాల్య వివాహాల రేటు ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో కూడా మహిళలు మరియు పురుషులలో తక్కువ వయస్సు గల వివాహాల రేటు ఎక్కువగా ఉంది.

ఇస్లాం బాల్య వివాహాలను నిరుత్సాహపరుస్తుంది:

ఇస్లాం బాల్య వివాహాలను నిరుత్సాహపరుస్తుంది. తన పెళ్లికి లేదా 'నికా'కి స్త్రీ సమ్మతిని పొందడం తప్పనిసరి చేయడం ద్వారా, ఇస్లాం బాల్య వివాహాలపై పూర్తి నిషేధాన్ని విధిస్తుంది.

ఇస్లామిక్ చట్టం ప్రకారం, స్త్రీ సమ్మతి తీసుకోకపోతే నిఖా లేదా వివాహం చెల్లదు. మరియు ఈ సమ్మతి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఒత్తిడితో  ఉండకూడదు.

వివాహం గురించి మహిళా తల్లిదండ్రులు లేదా సంరక్షకుల నిర్ణయాల కంటే తన వివాహం గురించి మహిళల నిర్ణయం ప్రబలంగా ఉంటుంది.  

అమ్మాయిల మాదిరిగానే ముస్లిం అబ్బాయి కూడా తన ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకోకూడదు. చెల్లుబాటు అయ్యే 'నికా' కోసం పురుషుని సమ్మతి తప్పనిసరి.

తమ వివాహానికి అబ్బాయిలు మరియు అమ్మాయిల సమ్మతిని తప్పనిసరి చేయడం ద్వారా, ఇస్లాం బాల్య వివాహాలను గట్టిగా అరికట్టింది. వివాహం గురించిన ఈ ఇస్లామిక్ మార్గదర్శకత్వం వివాహానికి సంబంధించిన జాతీయ చట్టాలకు చాలా అనుగుణంగా ఉంది.

అయితే, భారతదేశంలోని ముస్లింలలో బాల్య వివాహాలు లేవని కొట్టిపారేయలేము. ఇప్పటికీ కొంతమంది ముస్లింలలో, ముఖ్యంగా విద్యాపరంగా మరియు సామాజిక-ఆర్థికంగా వెనుకబడిన వారిలో కొనసాగుతున్నాయి. అయితే అది కూడా, ప్రజల సామూహిక జీవితాన్ని మెరుగుపరిచేందుకు ముస్లింలలోనే కాకుండా మిగిలిన జనాభాలో కూడా విద్య మరియు అవగాహన కార్యక్రమాల ద్వారా తొలగించబడాలి.

బాల్య వివాహాలకు వ్యతిరేకంగా రాజారామ్ మోహన్ రాయ్’ చేపట్టిన ఉద్యమ పలితంగా

భారతదేశంలోని బ్రిటీష్ ప్రభుత్వం 1929లో బాల్య వివాహ నిరోధక చట్టాన్ని చట్టబద్ధం చేసింది, అది బాలికలకు 14 సంవత్సరాలు మరియు అబ్బాయిల వివాహ వయస్సును 18 సంవత్సరాలుగా నిర్ణయించింది.

స్వాతంత్ర్యం తరువాత, భారత ప్రభుత్వం 1949లో శారద చట్టాన్ని ఆమోదించింది, ఇది బాలికలకు కనీస వివాహాన్ని 15 సంవత్సరాలు మరియు అబ్బాయిలకు 18 సంవత్సరాలుగా నిర్ణయించింది. ఈ చట్టం 1978లో సవరించబడింది, ఇది బాలికల కనీస వివాహ వయస్సును 18 సంవత్సరాలు మరియు అబ్బాయిలకు 21 సంవత్సరాలకు పెంచింది. దీనిని మళ్లీ 2006లో బాల్య వివాహాల నిషేధ చట్టంగా సవరించారు.

భారత ప్రభుత్వం 2021లో బాల్య వివాహాల నిషేధ (సవరణ) బిల్లును ప్రవేశపెట్టింది, దీనిని లోక్‌సభ ఆమోదించింది. అయితే, రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నందున ఇది ఇంకా చట్టంగా మారలేదు. ఈ బిల్లు మహిళల కనీస వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచింది.

వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో బాల్య వివాహాల శాతాన్ని పట్టిక చూపుతుంది.

Table shows the percentage of child marriage in different states and union territories.

వరుస సంఖ్య S.No

States/రాష్ట్రాలు

మహిళలు Women(%)

పురుషులు Men(%)

1

లక్షద్వీప్ Lakshadweep

1.3

0

2

లడాఖ్Ladakh

2.5

20.2

3

జమ్మూ & కాశ్మీర్ Jammu & Kashmir

4.5

8.5

4

హిమాచాక్ ప్రదేశ్ Himachal Pradesh

5.4

4.6

5

కేరళ Kerala

6.3

1.4

6

నాగాలాండ్ Nagaland

5.6

5

7

మిజోరం Mizoram

8

11

8

ఉత్తరాఖండ్ Uttarakhand

9.8

16.7

9

డిల్లిDelhi (జాతీయ రాజధాని ప్రాంతం National Capital Region)

9.9

12

10

హర్యానా Haryana

12.5

16

11

సిక్కింSikkim

10.8

5.1

12

వెస్ట్ బెంగాల్ West Bengal

41.6

20

13

త్రిపుర Tripura

40

20.4

14

తెలంగాణా Telangana

23.5

16.3

15

తమిళ్ నాడు Tamil Nadu

12.8

4.5

16

ఉత్తర ప్రదేశ్ Uttar Pradesh

15.8

23

17

మద్య ప్రదేశ్ Madhya Pradesh

23.1

30

18

ఒడ్డిస్సాOdisha

20.5

13.3

19

రాజస్తాన్ Rajasthan

25.4

28.2

20

పంజాబ్ Punjab

8.7

11.4

21

అరుణాచల్ ప్రదేశ్ Arunachal Pradesh

18.9

20.8

22

ఝార్ఖండ్ Jharkhand

32.2

22.7

23

కర్ణాటక Karnataka

21.3

6.1

24

గుజరాత్ Gujarat

21.8

27.7

25

గోవా Goa

5.8

8.9

26

దాద్రా& నగర్ హవేలీ Dadra & Nagar Haveli

26.4

12.6

27

బీహార్ Bihar

40.8

30.5

28

అస్సాం Assam

31.8

21.8

29

మహారాష్ట్ర Maharashtra

22

10.5

30

మేఘాలయ Meghalaya

16.9

17.9

31

మణిపూర్ Manipur

16.3

15.3

32

ఆంధ్ర ప్రదేశ్ Andhra Pradesh

29.3

14.5

33

అండమాన్ నికోబార్ Andaman & Nicobar

16.2

7.1

34

చండీఘర్ Chandigarh

9.7

0

35

ఛత్తీస్ ఘర్ Chhattisgarh

12.1

16.2

 

 

 

 

No comments:

Post a Comment