17 February 2023

ప్రజాస్వామ్య అభివృద్ధిలో భారతీయ ముస్లింల పాత్ర Indian Muslims played a role in development of democracy

 



ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో, ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేయడం లో  భారతీయ ముస్లింలు ఎల్లప్పుడూ సంపూర్ణ  నిబద్ధత ప్రదర్శించారు.

భారతదేశంలో ప్రజాస్వామ్య స్థాపన కోసం జరిగిన పోరాటాల్లో ముస్లింలు ఎల్లప్పుడూ అగ్రగామిగా నిలిచారు. 1935లో బేగం జహనారా షానవాజ్‌ నేతృత్వంలో జరిగిన రాజకీయ పోరాటం తర్వాత భారతీయ మహిళలకు సమానమైన ఓటు హక్కు లభించిందనే విషయాన్ని మనం మరచిపోకూడదు. 1930ల ప్రారంభంలో భారతీయులకు స్వయంప్రతిపత్తిపై చర్చలు జరిగిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాలకు (RTC) హాజరైన ఏకైక మహిళా ప్రతినిధి బేగం జహనారా షానవాజ్‌. మూడు రౌండ్ టేబుల్ సమావేశాలలో  (RTC), చట్టసభలకు ప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు మహిళలకు కూడా సమాన హక్కులు కల్పించాలని బేగం జహనారా షానవాజ్‌ ప్రతిపాదించారు.

 రౌండ్ టేబుల్ సమావేశాలు   (RTC) ముగిసిన తర్వాత బేగం జహనారా షానవాజ్‌ ఇంగ్లాండ్‌లోనే ఉండి, ఇంగ్లండ్‌లోని ముఖ్యమైన రాజకీయ నాయకులను కలవడం ద్వారా భారతీయ మహిళల హక్కులకు అనుకూలంగా ప్రజల అభిప్రాయాన్ని సృష్టించింది. ఎట్టకేలకు భారత ప్రభుత్వ చట్టం, 1935 రూపొందించబడినప్పుడు, భారతీయ మహిళలకు ఓటు హక్కు కల్పించబడింది. 

బేగం జహనారా షానవాజ్‌ సాధించినది ఒక ముఖ్యమైన విజయం అయితే అది భారతదేశం కోరుకున్న దానికి దూరంగా ఉంది. భారతీయులు కోరుకొన్నది సార్వత్రిక అడల్ట్ ఫ్రాంచైజీ(సార్వత్రిక వయోజన ఓటు హక్కు). కాని నిర్దిష్ట స్థాయి ఆర్థిక ఆస్తులు లేదా విద్యార్హత ఉన్న వ్యక్తులు మాత్రమే ఓటు వేయడానికి అనుమతించబడ్డారు. అంతేగాక, ముస్లింలు మరియు సిక్కులకు  ప్రత్యేక ఓటర్లు వ్యవస్థ(separate electorete system) ఏర్పాటు చేయబడినవి.

K. A అబ్దుల్ హమీద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, జాకీర్ హుస్సేన్ వంటి ముస్లిం నాయకులు ప్రత్యేక ఓటర్లు వ్యవస్థ ఏర్పాటుకు ముస్లింలీగ్ కారణం అన్నారు. 1946లో ముస్లిం లీగ్ మెజారిటీ ముస్లిం సీట్లను సంపన్నులు మాత్రమే ఓటు వేయగల వ్యవస్థలో గెలుపొందింది, అయితే వెనుకబడిన ముస్లింలలో ఎక్కువమంది ఓటు వేయలేరు.

1940లో, విప్లవకారుడు మరియు ఇస్లామిక్ పండితుడు మౌలానా ఉబైదుల్లా సింధీ భారతదేశ భవిష్యత్తు కోసం ఒక ప్రణాళికను రూపొందించాడు. ప్రత్యేక నియోజక వర్గాలను, ఉన్నత వర్గాలు మాత్రమే ఓటు వేసే విధానాన్ని వ్యతిరేకించాలని మౌలానా ఉబైదుల్లా సింధీ తన అనుచరులను కోరారు. సింధీ ఇలా వ్రాశాడు, “మా పార్టీ స్పష్టంగా ముస్లిం మెజారిటీ ప్రావిన్స్ (సింధ్)లో పని చేస్తుంది, అయితే అది ఉమ్మడి ఓటర్ల సూత్రాలపై పనిచేస్తుంది. సెపరేట్ ఎలక్టరేట్ విధానాన్ని (separate electrote system) వ్యతిరేకిస్తున్నది.

రాజ్యాంగ పరిషత్ చర్చల సందర్భంగా, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాద కర్త మౌలానా హస్రత్ మోహానీ, ప్రత్యేక ఓటర్ల ఆధారంగా ఎన్నికైన రాజ్యాంగ సభ, స్వేచ్ఛా భారత రాజ్యాంగాన్ని రూపొందించరాదని డిమాండ్ చేశారు. మైనారిటీలకు సీట్లను రిజర్వ్ చేయాలనే ప్రతిపాదనను రాజ్యాంగ అసెంబ్లీ ముందు ఉంచినప్పుడు, మోహని ఆ ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకించారు.

 1951లో, భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత ఇస్లామిక్ పండితులలో ఒకటైన మౌలానా హుస్సేన్ అహ్మద్ మద్నీ మాట్లాడుతూ, మతంతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తి హక్కులు సమానం కాబట్టి ప్రతి ముస్లిం ఈ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలి అన్నారు. ఇస్లామిక్ పండితులు లౌకిక మరియు ప్రజాస్వామ్య భారతదేశం వైపు పనిచేసే విధంగా ముస్లింలకు బోధించగలరని మరియు మార్గనిర్దేశం చేయగలరని మదని నమ్మారు.

 ప్రముఖ భారతీయ ముస్లింలు - మహిళలు, ఉలేమాలు మరియు సోషలిస్టులు భారతదేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మార్చడానికి తమ వంతు ప్రయత్నాలను చేశారు.

No comments:

Post a Comment