15 February 2023

పశ్చిమ ఆఫ్రికా: ఇస్లామిక్ చరిత్ర యొక్క రత్నం West Africa: A Gem of Islamic History

 



గ్రేట్ మసీదు ఆఫ్ జెన్నె పశ్చిమ ఆఫ్రికా యొక్క గొప్ప ఇస్లామిక్ వారసత్వానికి కీలక చిహ్నం.

ప్రవక్త ముహమ్మద్ (స)ప్రకారం :"అల్లాహ్‌కు అత్యంత ఇష్టమైన ప్రదేశాలు మసీదులు..." (ముస్లిం)

గ్రేట్ మసీదు ఆఫ్ జెన్నె (మాలి) - UNSECO ప్రపంచ వారసత్వ ప్రదేశం మరియు ప్రపంచంలోనే మట్టితో నిర్మించిన అతిపెద్ద నిర్మాణం. ఆఫ్రికాలోని అత్యంత ప్రసిద్ధ ఇస్లామిక్ నిర్మాణాలలో ఒకటి అయిన  గ్రేట్ మసీదు 14వ శతాబ్దానికి చెందిన ఇస్లామిక్ లైబ్రరీ మరియు హెరిటేజ్ సెంటర్ కలిగి ఉంది.

డిజెన్నే ఉప-సహారా ఆఫ్రికాలో అత్యంత పురాతనమైన నగరం, మాలిలో అత్యంత ముఖ్యమైన చారిత్రక ప్రదేశం మరియు 13వ శతాబ్దానికి చెందిన ఇస్లామిక్ జ్ఞానం యొక్క ముఖ్యమైన కేంద్రం.

12వ నుండి 16వ శతాబ్దాలలో, పశ్చిమ ఆఫ్రికా ముస్లిం ప్రపంచం అంతటా విజ్ఞానం మరియు వాణిజ్యానికి గొప్ప కేంద్రంగా ఉంది. మధ్యయుగ కాలం పశ్చిమ ఆఫ్రికాకు ఒక స్వర్ణయుగం మరియు పశ్చిమ ఆఫ్రికాలోని  టింబక్టు నగరం మరియు సాంకోర్ మదరసా ఆఫ్రికా యొక్క మేధో కేంద్రాలుగా పరిగణించబడ్డాయి.

డిజెన్నే లోని ప్రసిద్ధ విశ్వవిద్యాలయం అల్-అజార్ (ఈజిప్ట్), అల్-ఖౌరావాన్ (ట్యునీషియా), అల్-ఖుర్తుబా విశ్వవిద్యాలయం (స్పెయిన్) మరియు ఖరావియిన్ (మొరాకో) వంటి వాటితో పోల్చబడింది. ముఖ్యమైన ఇస్లామిక్ అభ్యాస కేంద్రాలు కల  పశ్చిమ ఆఫ్రికా ముస్లిం ప్రపంచంలో విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది.

పశ్చిమ ఆఫ్రికా కు చెందిన అత్యంత ప్రసిద్ధ నలుగురు ముస్లింలు: 

1. మాన్సా మూసా(1280 – 1337):

మాన్సా మూసా ని  "ది లయన్ ఆఫ్ మాలి" అని కూడా పిలుస్తారు. మాన్సా మూసా పశ్చిమ ఆఫ్రికా లోని మాలి సామ్రాజ్యం యొక్క చక్రవర్తి. మాన్సా ముసా సామ్రాజ్యం దక్షిణ మౌరిటానియా, మాలి మరియు సమీప పరిసరాలను కలిగి ఉంది. మాన్సా ముసా సామ్రాజ్యం చాలా సంపన్నమైనది మరియు మాన్సా మూసా చరిత్రలో అత్యంత ధనవంతుడిగా పేరు పొందాడు. మాన్సా ముసా సంపద విలువ 400 బిలియన్ డాలర్లు అని అంచనా వేయబడింది! మాన్సా మూసా తన హజ్ యాత్ర మార్గంలో సందర్శించిన ప్రతి దేశానికి బంగారు బహుమతులు ఇచ్చాడు.

మాన్సా మూసా టింబక్టు మరియు గావోలో మసీదులు మరియు మదర్సాల నిర్మాణానికి తోడ్పడ్డాడు  మరియు మాన్సా ముసా హయాంలో సంకోర్ మదర్సా నిర్మించబడింది. సంకోర్ మదర్సా విద్యా కేంద్రం ఆఫ్రికా మరియు మధ్యప్రాచ్యం నుండి టింబక్టుకు ముస్లిం పండితులను ఆకర్షించింది మరియు గణిత శాస్త్రజ్ఞులు, ఖగోళ శాస్త్రవేత్తలు మరియు న్యాయనిపుణులకు నిలయంగా ఉంది.   

2. మహమ్మద్ బగాయోగో(1523 – 1593): 

మహమ్మద్ బగాయోగో ఆఫ్రికా లో ప్రసిద్ద పండితుడు మరియు తత్వవేత్త, మహమ్మద్ బగాయోగో ప్రఖ్యాత పండితుడు అహ్మద్ బాబాకు షేక్ మరియు గురువు. మహమ్మద్ బగాయోగో సిది యాయా మసీదులో ఇమామ్‌గా మరియు టింబక్టు విశ్వవిద్యాలయం లోని సాంకోర్ మదరసా తో పాటు మరో రెండు విశ్వవిద్యాలయాలలో కూడా బోధించాడు. మహ్మద్ బగాయోగో మెడిసిన్, చట్టం, ఖగోళ శాస్త్రం మరియు చరిత్ర వంటి అంశాలపై రచనలు చేసారు మరియు హజ్ సమయంలో కైరో గుండా వెళుతున్నప్పుడు అల్-అజార్ విశ్వవిద్యాలయంలోని ఉలామాలు మహ్మద్ బగాయోగో కు డాక్టరేట్ ప్రధానం చేసారు. మహమ్మద్ బగాయోగో రచనలు  అహ్మద్ బాబా ఇన్స్టిట్యూట్‌లో మరియు కొన్ని అదనపు మాన్యుస్క్రిప్ట్‌లు  ఫ్రెంచ్ మ్యూజియంలలో కలవు. జెన్నెలో జన్మించిన  మహమ్మద్ బగాయోగో, మాలిపై  ఫ్రెంచ్ వలస ఆక్రమణకు వ్యతిరేకంగా ప్రతిఘటనకు ప్రసిద్ధి చెందాడు.  మహ్మద్ బగాయోగో1593లో  టింబక్టులో మరణించాడు,

3. అహ్మద్ బాబా(1556 – 1627):

అహ్మద్ బాబా ప్రసిద్ద ఇస్లామిక్ రచయిత, ఉపాధ్యాయుడు, తత్వవేత్త, చరిత్రకారుడు మరియు న్యాయనిపుణుడు. "ది యూనిక్ పెర్ల్ ఆఫ్ హిస్ టైమ్/           తన కాలం నాటి అరుదైన ఆణిముత్యం " అని పిలవబడే అహ్మద్ బాబా  ఒక ప్రముఖ వ్యక్తి మరియు గొప్ప సాధకుడిగా జీవించాడు. అస్కియా ది గ్రేట్ పాలనలో సంకోర్ మదర్సా ఛాన్సలర్‌గా, అహ్మద్ బాబా అత్యంత ముఖ్యమైన పండితుడు మరియు రచయిత. అహ్మద్ బాబా,  టింబక్టు యొక్క గొప్ప పండితుడు మరియు 16వ శతాబ్దపు గొప్ప పండితులలో ఒకరిగా పరిగణించబడ్డాడు.

అహ్మద్ బాబా, వివిధ అంశాలపై మొత్తం 40 పుస్తకాలు రాశాడు. అహ్మద్ బాబా గౌరవసూచకంగా టింబక్టులోని పరిశోధనా కేంద్రం మరియు లైబ్రరీకి (సుమారు 20,000 మాన్యుస్క్రిప్ట్‌లను కలిగి ఉన్నది) 1973లో  అహ్మద్ బాబా ఇన్స్టిట్యూట్ అని పేరు పెట్టారు.

4. అమడౌ బాంబా1853 – 1927:

అమడౌ బాంబా ఒక ప్రముఖ మత నాయకుడు మరియు టౌబా నగర స్థాపకుడు (1887), గ్రేట్ మసీదు ఆఫ్ టౌబా సబ్-సహారా ఆఫ్రికాలో అతిపెద్ద మసీదు. అమడౌ బాంబా సెనెగల్ చరిత్రలో గొప్ప ఆధ్యాత్మిక నాయకులలో ఒకరు. అమడౌ బాంబా సమకాలీన సెనెగల్ సంస్కృతిని ఎక్కువగా ప్రభావితం చేశాడు. 

మత నాయకుడిగా, కవిగా, ముస్లిం ఆధ్యాత్మికవేత్తగా అమడౌ బాంబా ధ్యానం మరియు ఖురాన్ అధ్యయనం (తఫ్సీర్) పై రాశాడు, అదే సమయంలో ఫ్రెంచ్ వలసవాద ఆక్రమణకు వ్యతిరేకంగా అహింసా శాంతివాద పోరాటానికి అమడౌ బాంబా నాయకత్వం వహించాడు. అల్లాహ్ యొక్క అభ్యాసం మరియు భయభక్తులను ప్రోత్సహిస్తు  గొప్ప జిహాద్ (జిహాద్ అల్-అక్బర్) గురించి అమడౌ బాంబా బోధించాడు. అమాడౌ సాంప్రదాయిక మసాలా కాఫీ మిశ్రమo  కేఫ్ టౌబా Café Touba  కనిపెట్టినందుకు కూడా ప్రసిద్ధి చెందాడు.

.

No comments:

Post a Comment