1836లో ఇంగ్లాండ్‌కు చెందిన క్రిస్టియన్ మిషనరీ విలియం సెలెన్సో, న్యూజిలాండ్‌లోని
మారుమూల మావోరీ గ్రామంలో ఒక గంటను కనుగొన్నాడు. గంటను పరిశీలించిన విలియం సెలెన్సో ఆ
గంట మీద ఒక తెలియని భాషలో గుర్తులు మరియు రూన్‌ల శ్రేణిని కనుగొన్నాడు. సెలెన్సో
దానిని స్థానికుల నుంఛి పొంది ఆ గంటను అప్పటి డొమినియన్ మ్యూజియo లేదా నేటి వెల్లింగ్టన్‌లోని
న్యూజిలాండ్ టె పాపా టోంగరేవా మ్యూజియం లో భద్రపరిచాడు.
1870లో, ఎథ్నోగ్రాఫర్ J. T. థాంప్సన్ ఆ గంట
మీది రాతలకు అర్ధం తెలుసుకోవాలనే ఉద్దేశం తో ఫోటోలు తీసి భారతదేశం అంతటా పంపాడు.
రెండు నెలల తర్వాత, థాంప్సన్‌కు సిలోన్/ఆధునిక శ్రీలంక
మరియు పెనాంగ్, మలేషియా జలసంధిలోని ఒక సెటిల్మెంట్ నుండి ప్రత్యుత్తరాలు వచ్చాయి.ఆ
గంట మీద అస్పష్టంగా ఉన్న శాసనాలు పురాతన తమిళ భాషగా గుర్తించబడ్డాయి మరియు "మొహైదీన్ బక్ష్ షిప్ యొక్క గంట" అని
అనువదించబడ్డాయి.గంట యజమాని ఒక తమిళ ముస్లిం, పొట్టిగా ఉంటాడని మరియు భారతదేశం లోని నాగపట్టంలో ఉన్న
ప్రసిద్ధ భారతీయ షిప్పింగ్ కంపెనీకి యజమాని అని అనువదించబడినది.
తరువాత 1940లో జరిగిన పరిశోధనలలో ఆ గంట 400-500 సoమత్సరాల
ప్రాచీనమైనదని మరియు 1400 నుండి 1500 AD మధ్య కాలానికి చెందినది
అని రుజువైనది. ఇంకా ఇంగ్లిష్ కెప్టెన్
థామస్ కుక్ న్యూజిలాండ్ Poverty Bay లో1769లో అడుగు పెట్టడానికి ముందే న్యూజిలాండ్‌కు బయటి ప్రపంచం తో సంబంధాలు ఉన్నాయని సూచిస్తుంది.
1877లో, రాగ్లాన్ మరియు అయోటియా ఓడరేవుల మధ్య ఓడ ప్రమాదం లో ఇసుకలో సగం కూరుకుపోయిన ఒక ఓడ కనుగొనబడింది.
న్యూజిలాండ్ తీరం అత్యంత ప్రమాదకరమైనది మరియు అక్కడ ఓడ ప్రమాదాలు సర్వసాధారణం
కాబట్టి ఇది మొదట ఆధునిక నౌకగా భావించబడింది. కానీ వాస్తవం ఇందుకు బిన్నంగా
ఉంది. ప్రమాదానికి గురి అయిన నౌక ఆగ్నేయాసియాలో టేకు తో నిర్మించబడి చాలా పురాతనమైనదని గమనించబడినది. తమిళ శాసనాలు
ఉన్న ఇత్తడి పలక మరియు మొహాయిద్ బుక్ పేరు ఉన్న చెక్క పలక ఓడ లోపల భాగం లో కనుగొనబడ్డాయి.
వీటి ఆధారం గా చరిత్రకారులు అనేక సిద్ధాంతాలను ముందుకు
తెచ్చారు.
కొందరు ఇది న్యూజిలాండ్‌లో ప్రారంభ తమిళ కాలనీకి
రుజువు అని వాదించారు. ఓడ నిర్మాణం లో తమిళుల కున్న నైపుణ్యం మరియు తమిళ నావికుల నావికా
నైపుణ్యం కారణంగా వారు న్యూజిలాండ్‌కు ప్రయాణించే అవకాశం ఉందని మరికొందరు
అభిప్రాయపడ్డారు.
కాని చారిత్రక రికార్డులను పరిశీలిస్తే భారతీయ నావికులకు తూర్పున అత్యంత సరిహద్దు-ప్రస్తుత
ఇండోనేషియాలోని బాలి పక్కన ఉన్న లాంబాక్ ద్వీపం. అలాగే జాజికాయ, జాపత్రి మరియు
లవంగాలకు ప్రసిద్ది చెందిన వెస్ట్ న్యూ గినియాలోని స్పైస్ దీవులు తమిళులచే
నియంత్రించబడలేదు బదులుగా అవి టెర్నేట్, టిడోర్ మరియు
అంబోయ్నా యొక్క స్థానిక మాగ్నెట్‌ల చేతుల్లోనే ఉన్నాయి. దీనికి తోడు న్యూజిలాండ్‌లో
మరే ఇతర భారతీయ అవశేషాలు కనుగొనబడలేదు.
మరొక సిద్ధాంతం ప్రకారం తమిళ బెల్ వాస్తవానికి
పోర్చుగీస్ ఓడకు చెందినదని మరియు
పోర్చుగీస్ చక్రవర్తి స్పైస్ దీవులను సంరక్షించడానికి పంపిన నౌకాదళంలోని ఒక ఓడ నుండి వచ్చినదని పేర్కొనబడినది. 1490ల నుండి, పోర్చుగీస్ హిందూ
మహాసముద్ర వాణిజ్య నెట్‌వర్క్‌లో ప్రధాన పాత్రదారి అయినది. 1511లో పోర్చుగీస్
వారు మలక్కా స్ట్రెయిట్స్‌లో మరియు భారత ప్రధాన భూభాగంలో గోవా తో సహా అనేక
ప్రదేశాలలో వాణిజ్య కాలనీలు కూడా
స్థాపించారు.
1521లో పోర్చుగీస్ వైస్రాయ్ స్పైస్ దీవుల ఆవల ఉన్న భూములను
అన్వేషించడానికి క్రిస్టోవాస్ డి మెండోంకా కెప్టెన్‌గా మూడు కారవెల్స్‌ను పంపాడు.
మెండోంకా యొక్క కారవెల్ మాత్రమే తిరిగి వచ్చింది, మిగిలిన 2 కారవెల్స్
సముద్రంలో తప్పిపోయాయి మరియు వాటి జాడ లేదు.
1877లో, న్యూజిలాండ్ తీరంలో కనుగొనబడిన ధ్వంసం అయి ముంగిపోయిన ఓడ గోవాలో
నిర్మించబడినట్లు గుర్తించబడింది. గోవాలో తమిళం విస్తృతంగా మాట్లాడబడుతుంది, ఇది గంటపై గల తమిళ
రచనను వివరించింది.
అయితే, ఇవన్నీ చాలా
అసంభవం. పోర్చుగీస్ కారవాల్‌పై గంట ఉన్నట్లు సూచించే ప్రత్యక్ష ఆధారాలు లేవు.
చివరగా, పోర్చుగీస్ వారికి హిందూ మహాసముద్రం లో తెలియని ప్రపంచం
లేదు మరియు మరింత కొత్త ప్రదేశాలను అన్వేషించడానికి వారికి ఎటువంటి ఉద్దేశ్యం లేదు.
మరొక అత్యంత ప్రసిద్ధమైన మరియు వివాదాస్పదమైన సిద్ధాంతాలలో ఒకటి రాబర్ట్ లాంగ్డన్ తన పుస్తకం 'ది లాస్ట్ కారావెల్' లో అందించాడు, దీనిలో రాబర్ట్ లాంగ్డన్ తమిళ్ బెల్‌ను న్యూజిలాండ్‌కు ఈస్ట్ ఇండీస్‌కు చెందిన స్పానిష్ నావికుల బృందం తీసుకువచ్చిందని ప్రకటించాడు, వారు దిక్కుతోచని స్థితిలో ఉండి చివరికి న్యూజిలాండ్ లో స్థిరపడ్డారు. ఇది న్యూజిలాండ్ కు ఇంగ్లాండ్ కు చెందిన థామస్ కుక్ రాకకు వందల సంవత్సరాల ముందు జరిగినది అని అంటాడు.
తమిళ మరియు పోర్చుగీస్ నౌక సిద్దాంతాల వలె, అందుబాటులో ఉన్న
సాక్ష్యాల కొరత కారణంగా లాంగ్డన్ యొక్క వాదన చాలా విమర్శించబడింది. ఫ్రెంచ్
పాలినేషియాకు చెందిన విద్యావేత్త బెంగ్ట్ డేనిల్సన్ దీనిని "మానవశాస్త్ర విజ్ఞాన
కల్పన"గా అభివర్ణించారు. బెంగ్ట్ డేనిల్సన్ ప్రకారం లాంగ్డన్ పసిఫిక్ పై ఇప్పటికే
ఉన్న అన్ని పురావస్తు మరియు చారిత్రక సాహిత్యాన్ని విస్మరించాడు మరియు ఇది లాంగ్‌డన్ ఆలోచనలకు విరుద్ధంగా ఉంది అని అన్నాడు.లాంగ్‌డన్
యొక్క వాదన క్రమపద్ధతిలో నిరాకరించబడింది.
తమిళ్ బెల్/గంట పై గందరగోళం కొనసాగింది.
అనేక సంవత్సరాల తర్వాత, బ్రెట్ హిల్డర్ గంట తమిళ ఓడ నుండి వచ్చిందనే మునుపటి వాదనను మళ్లీ ఉత్తేజపరిచినాడు. అంటార్కిటికా మరియు ఖండాల దక్షిణ ప్రాంతాల మధ్య తూర్పు వైపు సముద్ర ప్రవాహంలో చిక్కుకున్న తమిళ వ్యాపారి నౌక నుండి తమిళ్ బెల్ ఉద్భవించిందని హిల్డర్ భావించాడు.తమిళ బెల్ 1400 మరియు 1500ల మద్య సమయం నాటిది అయినప్పుడు, ఆకాలం లో తమిళ నావికులు విశాలమైన హిందూ మహాసముద్రం యొక్క వాణిజ్య నెట్‌వర్క్‌లలో పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ముస్లిం తమిళులు ప్రత్యేకించి నైపుణ్యం కలిగిన నావికులు, సముద్రం మీదుగా ఆఫ్రికా తూర్పు తీరం వరకు వాణిజ్యం నిర్వహించారు.
1836లో కనుగొనబడినప్పటి నుండి, తమిళ్ బెల్ చుట్టూ ఉన్న చాలా సిద్ధాంతాలు చాలా ఊహాజనితంగా ఉన్నాయి మరియు తీవ్రంగా పరిగణించడానికి తగిన సాక్షాధారాలు లేవు. బ్రెట్ హిల్డర్ వాదం తమిళ్ బెల్ కోసం ఒక రుజువును అందించింది.కాని హిల్డర్ సిద్ధాంతానికి కూడా బలహీనతలు ఉన్నాయి.
1890 నాటికి సముద్రపు ఇసుకలో సగం మునిగిపోయినట్లు చెప్పబడిన నాశనమైన ఓడ రహస్యంగా
అదృశ్యమైంది, మరలా కనిపించలేదు. 1975 నాటికి శిధిలాలను
తిరిగి కనుగొనడానికి చేసిన తదుపరి ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.
దీంతో తమిళ బెల్ యొక్క రహస్యం ఇంకా కొనసాగుతుంది.
No comments:
Post a Comment