17 February 2023

మాలేగావ్‌లోని ఉర్దూ లైబ్రరీ-జ్ఞాన సముద్రం

 



మాలెగావ్‌లోని ఉర్దూ లైబ్రరీకి ఈ సంవత్సరం(2003) తో  100 ఏళ్లు పూర్తయ్యాయి మరియు అనేక మంది పిహెచ్‌డి పరిశోధకులకు వారి పరిశోధనా పనిలో సహాయపడిన లైబ్రరీ,  పరిశోధనా పని కోసం విశ్వవిద్యాలయ అఫ్లియేషణ్ పొందడానికి సిద్ధంగా ఉంది. మాలెగావ్‌లోని ఉర్దూ లైబ్రరీ పుస్తక సేకరణ మరియు మౌలిక సదుపాయాల యొక్క అందమైన కలయిక తో మంచి లైబ్రరీ గా రూపొందినది.

 

అక్టోబరు 1903లో స్థాపించబడిన 100-సంవత్సరాల పురాతన లైబ్రరీ-కమ్-రీసెర్చ్ సెంటర్, మొదటి కుతుబ్ ఖానా, ఉర్దూ లైబ్రరీ. ఇది నాసిక్ జిల్లాలో, మహిళలు మరియు పిల్లల కోసం ప్రత్యేక విభాగాలతో కూడిన అద్భుతమైన రెండంతస్తుల భవనం కలిగి ఉంది. కేవలం 325 పుస్తకాలతో ప్రారంభించబడిన  లైబ్రరీ ఈ రోజు 30,000 కంటే ఎక్కువ పుస్తకాలను కలిగి ఉంది. అరుదుగా లభించే కల్మీ-నుస్ఖే KalmiNuskhe, చేతితో వ్రాసిన పుస్తకాలు మరియు 1901-1950 నాటి మ్యాగజైన్‌లు కలిగి ఉంది.

 

‘‘ప్రస్తుతం ఉన్న అద్భుతమైన నిర్మాణంతో పాటు 100 ఏళ్ల నాటి సందర్శన పుస్తకంలో సందర్శకుల వివరాలు, వారు రాసిన భావాలు, వందేళ్లలో మనం ఏం సాధించామో చెప్పేందుకు సరిపోతాయి.  లైబ్రరీకి ఎల్లప్పుడూ పరిశోధన పనికి పూర్తి మద్దతు మరియు SSC స్థాయి వరకు విద్యార్థులకు ఉచిత సభ్యత్వాన్ని అందించే విధానాన్ని కొనసాగించారు” అని లైబ్రరి చైర్మన్ అన్నారు..

 

ఆదర్శ వాతావరణంలో ఉర్దూ లైబ్రరీ పఠన గది, క్రమపద్ధతిలో అమర్చబడిన అరుదైన పుస్తకాల సేకరణతో కలిపి, లైబ్రరీ కాబోయే పి.హెచ్.డి, హోల్డర్స్ కు స్వర్గధామం. పరిశోధకులు తమ థీసిస్‌ను పూర్తి చేయడంలో లైబ్రరీ నుండి తమకు లభించిన సహాయాన్ని గుర్తించారు.

ఉర్దూ లైబ్రరీలో లభించే అరుదైన పుస్తకాలు ఎక్కడా లేదు. సాహిత్యంపై పరిశోధన మరియు డాక్టరేట్ కోసం, బహుశా మహారాష్ట్రలో ఇదే ఏకైక గ్రంథాలయం.

 

ప్రభుత్వం నుంచి వచ్చిన గ్రాంట్‌  లైబ్రరీని కంప్యూటరీకరించడంలో మరియు బార్-కోడ్ సిస్టమ్ అమలు రోజువారీ లైబ్రరీ దినచర్యను సులభతరం చేయడంలో సహాయపడింది.కంప్యూటరైజేషన్‌తో, లైబ్రరీ పూర్తిస్థాయిలో పనిచేసే మొదటి డిజిటల్ లైబ్రరీగా, మారింది.

 


No comments:

Post a Comment