4 February 2023

జాకబ్ డైమండ్: అలెగ్జాండర్ మాల్కం జాకబ్

 


కోహినూర్ కంటే పెద్దది, కత్తిరించబడని uncut దశలో ఉన్న  జాకబ్ డైమండ్ చౌమొహల్లా ప్యాలెస్‌లో హైదరాబాద్ ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ బూట్లలో ఒకదానిలో మరచిపోయి పడి ఉంది. జాకబ్ డైమండ్,  ఏడవ నిజాం, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ స్వాధీనం లోకి వచ్చిన తరువాత, ఏడవ నిజాం దానిని పేపర్‌వెయిట్‌గా ఉపయోగించాడు మరియు ఆ సమయంలో 1000 కోట్ల రూపాయల విలువైన జాకబ్ డైమండ్ చాలా సంవత్సరాలు ఏడవ నిజాం టేబుల్‌పై పేపర్ వెయిట్ గా పడి ఉంది.

జాకబ్ డైమండ్ దక్షిణాఫ్రికాలో తవ్విన పెద్ద రంగులేని డైమండ్. కటింగ్ మరియు పాలిష్ చేసిన తర్వాత ఇది ప్రపంచంలోని ఐదవ-అతిపెద్ద డైమండ్ గా ర్యాంక్ చేయబడింది. ఇది 58 కోణాలతో కత్తిరించబడింది మరియు బరువు 184.75 క్యారెట్లు. 1995లో దీనిని భారత ప్రభుత్వం 1995లో $3 మిలియన్లకు కొనుగోలు చేసింది మరియు ఇప్పుడు ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఖజానాలలో సురక్షితంగా ఉంచబడింది

అనేక ప్రసిద్ధ వజ్రాల వలె, జాకబ్ డైమండ్ వెనుక కూడా ఒక కథ ఉంది. అలెగ్జాండర్ మాల్కం జాకబ్ అనే మొదటి వ్యక్తిగత యజమాని పేరు జాకబ్ డైమండ్ కి పెట్టారు. అలెగ్జాండర్ మాల్కం జాకబ్ ఆర్ట్ డీలర్. అలెగ్జాండర్ మాల్కం జాకబ్ ఉన్నత స్థానాల్లో సంబంధాలు కలిగి ఉన్నాడు మరియు బ్రిటీష్ వైస్రాయ్‌లు మరియు భారతీయ యువరాజులకు అత్యంత సన్నిహితుడు. అలెగ్జాండర్ మాల్కం జాకబ్ పరిచయస్థులలో 1869 మరియు 1911 మధ్య హైదరాబాద్‌ను పాలించిన ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కూడా ఉన్నారు.

జాకబ్ టర్కీలో జాకోబైట్ క్రైస్తవుడిగా జన్మించాడు మరియు జాకబ్ తండ్రి సబ్బు తయారీదారు. పదేళ్ల వయసులో, జాకబ్‌ను పాషాకు బానిసగా విక్రయించాడు, పాషా, జాకబ్ కు విద్యాబుద్దులు నేర్పించాడు. తరువాత జాకబ్ బొంబాయి (ముంబై)కి మారాడు. అక్కడ జాకబ్ అరబిక్ భాషలో తనకున్న జ్ఞానం ఆధారంగా క్లర్క్‌గా పనిచేశాడు. 1870లలో జాకబ్ సిమ్లా చేరుకుని విలువైన రత్నాల వ్యాపారాన్ని ప్రారంభించాడు. వ్యాపారం యొక్క విజయం పొందిన  జాకబ్, సిమ్లాలో బెల్వెడెరే అని పిలువబడే ఒక విలాసవంతమైన ఇంటిని నిర్మించడాడు.

జాకబ్ గూఢచారి అని కూడా కొన్ని ఆరోపణలుకలవు. జాకబ్ ఎప్పుడూ ఏ ఆరోపణను ఖండించలేదు లేదా ధృవీకరించలేదు. జాకబ్ ను దృష్టిలో పెట్టుకొని రుడ్‌యార్డ్ కిప్లింగ్ తన నవల కిమ్‌లో బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్‌కు చెందిన లుర్గాన్ సాహిబ్ పాత్రను సృష్టించాడని కొందరు పరిశోధకులు పేర్కొన్నారు. అమెరికన్ రచయిత్రి ఎఫ్. మారియన్ క్రాఫోర్డ్ 1882లో మిస్టర్ ఐజాక్స్ అనే నవల జాకబ్ గురించి వ్రాసినట్లు చెబుతారు.

1891లో జాకబ్ ఆమ్‌స్టర్‌డ్యామ్‌లోని డైమండ్ సిండికేట్ నుండి డైమండ్ కొనుగోలు చేశాడు మరియు ఆ డైమండ్ ను విక్రయించి, తనకు వచ్చే లాభంతో సంతోషంగా జీవించాలని నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్ ఆరవ నిజాంతో ఒప్పందం కుదుర్చుకునే ముందు జాకబ్ చాలా మంది కొనుగోలుదారులను సంప్రదించాడు.

నిజాం మొదట్లో డైమండ్ కొనుగోలుకు అడ్వాన్స్ చెల్లించాడు. ఆ తర్వాత జాకబ్ డచ్ కంపెనీకి పూర్తి ధర చెల్లించాడు. కానీ తెలియని కారణాల వల్ల, నిజాం, జాకబ్ అంగీకరించిన ధర చెల్లించడానికి నిరాకరించాడు. దీనికి భిన్నమైన కారణాలను చెబుతారు. కొన్ని నివేదికల ప్రకారం, జాకబ్ రష్యన్ గూఢచారి అయినందున ఒప్పందం నుండి వైదొలగాలని హైదరాబాద్‌లోని బ్రిటిష్ రెసిడెంట్ నుండి ఒత్తిడి వచ్చింది. నిజాం అకస్మాత్తుగా డైమండ్ పట్ల విరక్తిని పెంచుకున్నాడని ఇతర నివేదికలు చెబుతున్నాయి. డైమండ్ తను నమ్మినంత పెద్దది మరియు అందంగా లేదని నిజాం భావించాడు. నిజాం,  జాకబ్‌పై మోసం కేసు పెట్టాడు.

కాబట్టి సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది. న్యాయ పోరాటం యాకోబ్‌కు విపరీతమైన ఒత్తిడిని మరియు ఆర్థిక ఇబ్బందులను కలిగించింది. చివరికి, యాకోబ్‌, జాకబ్ డైమండ్ ధరను తగ్గించవలసి వచ్చింది. అయితే కోర్టులో న్యాయపోరాటంలో నెగ్గిన తర్వాత నిజాం, జాకబ్ డైమండ్ పై ఆసక్తి చూపలేదు. నిజాం రాజభవనంలో, జాకబ్ డైమండ్ కు  మన్హూస్ హీరా అనే మారుపేరు వచ్చింది మరియు నిజాం దానిని తన కున్న  అనేక బూట్లలో ఒకదానిలో ఉంచాడు మరియు దాని గురించి మరచిపోయాడు.

1911లో 6వ నిజాం మరణం తర్వాత, అది బూట్ల  నుండి బయటకు తీయబడి  కుమారుడు మరియు వారసుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌కు అప్పగించబడింది. తరువాతి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్‌ కూడా భారీ మెరిసే డైమండ్ కు  పెద్దగా ఆకర్షితులు కాలేదు మరియు దానిని పేపర్ వెయిట్‌గా తన టేబుల్‌పై ఉంచారు. తరువాత దానిని భారత ప్రభుత్వం కొనుగోలు చేసినది.

10 జనవరి 1921, ది టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క బొంబాయి ఎడిషన్‌లో ఒక సంతాప సంస్మరణ నోటీసు ప్రచురించబడింది. ఒకప్పుడు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద వజ్రాన్ని సొంతం చేసుకున్న వ్యక్తి జాకబ్, డెబ్బై ఒక్క సంవత్సరాల వయస్సులో కాదు నిరూపేదవాడిగా చనిపోయాడు.జాకబ్ ముంబైలో ఒంటరిగా గా మరణించాడు. జాకబ్ మరణించే సమయంలో జాకబ్ కు అండగా నిలిచిన వారెవరూ లేరు.

No comments:

Post a Comment