11 February 2023

ఇస్లాం స్త్రీ తన భాగస్వామిని ఎంచుకునే హక్కును ఇచ్చింది Islam gives right to woman to choose her partner

 

కొన్ని ధార్మిక సమాజాలలో అమ్మాయి వివాహం చేసుకునే హక్కు విస్మరించబడుతుంది. ఈ సమాజాలలో తల్లిదండ్రులు తమ ఆడపిల్లల అనుమతి పొందకుండా తాము ఎంపిక చేసిన వారితో వారి వివాహం ఏర్పాటు చేస్తారు.  అయితే ఇస్లాం,  వివాహంపై స్త్రీ అభిప్రాయం అoగీకరిస్తుందని మీకు తెలుసా!

ఇస్లాంలో వివాహం చట్టబద్ధం కావాలంటే స్త్రీ సమ్మతి అవసరం.తల్లిదండ్రులు తమ కుమార్తె అనుమతి లేకుండా కుమార్తె  వివాహం చేయలేరు. తల్లిదండ్రులు తమ కుమార్తె,  వివాహానికి సమ్మతి కలిగి ఉన్నదో, లేదో తెలుసుకోవాలి.

హజ్రత్ అలీ, ప్రవక్త(స) కుమార్తె ఫాతిమాను వివాహం చేసుకోవాలని ప్రవక్త(స)కు తన వివాహ ప్రతిపాదనను పంపారు. ప్రవక్త(స) ఇలా అన్నారు: "ఇన్ షా అల్లాహ్" (దేవుడు కోరుకుంటే). ప్రవక్త ముహమ్మద్(స) తన కుమార్తె ఫాతిమా(ర)ను సంప్రదించి, ప్రతిపాదనను చర్చించి, ఫాతిమా(ర) అనుమతి కోరారు. ఫాతిమా(ర) ప్రతిపాదనను అంగీకరించిన తరువాత, ప్రవక్త(స) హజ్రత్  అలీ ప్రతిపాదనను అంగీకరించారు. వివాహం గురించి కుమార్తె అభిప్రాయాన్ని పొందడం ఎంత ముఖ్యమో ఇది చూపిస్తుంది.

ప్రవక్త (స) "ఒక స్త్రీ (ఆమె కన్య, విడాకులు తీసుకున్న లేదా వితంతువు అయినా) ఆమె అనుమతి పొందే వరకు ఎవరినీ వివాహం చేసుకోకూడదు" అని చెప్పారు. బలవంతపు వివాహాలను ఇస్లాం ప్రోత్సహించదని ఇది తెలియజేస్తోంది. హదీసుల నుండి, ఇస్లాం బలవంతపు వివాహాలను అనుమతించదని స్పష్టమవుతుంది.

దివ్య ఖురాన్ కూడా మహిళల బలవంతపు వివాహాన్ని నిషేధిస్తుంది. ముస్లింలలో బలవంతపు వివాహాన్ని నిషేధించే దివ్య ఖురాన్‌లోని వాక్యం ఇది.“విశ్వసించిన ప్రజలారా! బలవంతంగా స్త్రీలకు వారసులు కావడం మీకు ధర్మ సమ్మతం కాదు” 4:19

మరొక అపోహ ఏమిటంటే, స్త్రీలు వివాహం కోసం పురుషుడిని అడగలేరు. చాలా మంది ముస్లింలు దీనిని సాంస్కృతికంగా అసభ్యకరమైన చర్యగా భావిస్తారు. కానీ అది సత్యానికి పూర్తిగా విరుద్ధం. ఇస్లాం లో ఒక మహిళ నుండి వివాహ ప్రతిపాదనను అసభ్యకరమైన చర్యగా పరిగణించడం జరగదు.

ప్రవక్త (స) జీవితం నుండి ఒక ఉదాహరణను పరిశీద్దాము. ఖదీజా బిన్త్ ఖువైలిద్(ర) ప్రవక్త(స) యొక్క వ్యాపార యజమాని. ఖదీజా(ర)ముహమ్మద్ ప్రవక్త యొక్క నిజాయితీకి ముగ్ధురాలైంది మరియు ప్రవక్త(స)ను వివాహం చేసుకోవడానికి ప్రతిపాదన పంపినది. ప్రవక్త (స) ఈ ప్రతిపాదనను అంగీకరించారు మరియు వారు వివాహం చేసుకున్నారు.ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది?

ఇస్లాంలో మీరు స్త్రీ అయితే మరియు ఎవరినైనా వివాహం చేసుకోవాలనుకుంటే, మీరు ప్రతిపాదనను పంపవచ్చు. ముస్లిం మహిళను ఆమె అనుమతి లేకుండా వివాహం చేసుకోవడం ఇస్లామిక్ సంప్రదాయానికి పూర్తిగా విరుద్ధo.

మీరు స్త్రీ అయినా లేదా పురుషుడైనా, ఇస్లాం మీకు వివాహానికి అంగీకరించే హక్కును ఇస్తుంది. ఇస్లాంలో తల్లిదండ్రులు,  తమ పిల్లలకు  బలవంతంగా పెళ్లి చేయలేరు. కాబట్టి మీరు ఇష్టపడే వ్యక్తిని వివాహం చేసుకోవచ్చు.

ఇస్లాం స్త్రీలకు ఎవరినైనా పెళ్లి చేసుకునే హక్కు కల్పిస్తే, కొందరు తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెలకు  ఈ హక్కును పొందేందుకు ఎందుకు అనుమతించడం లేదు? దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి వారి ఆలోచనా విధానం ఒక కారణం కావచ్చు.

కొందరు తల్లిదండ్రులకు ఇస్లాం గురించి అంతగా అవగాహన లేదు మరియు ఇస్లాం మహిళలకు ఇచ్చే హక్కుల గురించి తెలియదు. దీనికి  ఉత్తమ పరిష్కార మార్గం దివ్య ఖురాన్ అధ్యయనం. 

No comments:

Post a Comment