4 February 2023

దేవుడు మరియు పరలోక జీవితం God and the Life Hereafter

 

దేవుడు మరియు పరలోక జీవితం

God and the Life Hereafter

 

సృష్టి దాని సృష్టికర్తకు నిదర్శనం:

విశ్వం చాలా అర్థవంతమైన దృగ్విషయం. విశ్వం సృష్టించబడకుండానే ఉనికిలోకి వచ్చిందని ఎవరు  ఊహించలేము. ఎంపిక అనేది దేవునితో ఉన్న విశ్వం లేదా దేవుడు లేని విశ్వం మధ్య కాదు. నిజమైన ఎంపిక దేవునితో ఉన్న విశ్వం లేదా విశ్వం అనేది ఏది లేదు అనే భావనలో ఉంది. దేవుడు లేడని చెబితే, విశ్వం కూడా ఉనికిలో లేదని చెప్పవలసి వస్తుంది. కానీ విశ్వం యొక్క ఉనికి తిరస్కరించ లేని వాస్తవం. కాబట్టి దేవుని ఉనికిని కూడా కాదనలేము.

అర్థవంతమైన విశ్వం:

విశ్వం యొక్క సృష్టికర్త మనస్సు  ఒక గణిత మనస్సు అని తత్వవేత్త  సర్ జేమ్స్ జీన్స్ అన్నాడు. విశ్వం యొక్క అర్ధవంతం, దాని సృష్టికర్తకు లోతైన ఉద్దేశ్యాన్ని కలిగి ఉందని అని చెప్పాలి. సృష్టికర్త అసంపూర్ణమైన ప్రపంచాన్ని సృష్టించలేడు. అయితే అర్థవంతంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత స్థితిలో ఉన్న మన ప్రపంచం అసంపూర్ణంగా ఉంది. దాని సంపూర్ణత కోసం మరొక ప్రపంచం యొక్క ఉనికి అవసరం. అటువంటి ప్రపంచాన్నే ప్రవక్తలందరూ పరలోకం అని పిలిచారు.

పరలోక ప్రపంచం పూర్తిగా శాస్త్రీయ వాస్తవం. వాస్తవానికి, సైన్స్ రంగంలో అన్ని ఇతర విషయాలు నిరూపించబడినట్లుగానే, పరలోకం యొక్క ఉనికిని కూడా శాస్త్రీయ ప్రమాణాల ద్వారా విద్యాపరంగా నిరూపించవచ్చు.

శాస్త్రీయ రుజువు:

మొదటిగా  మనం శాస్త్రీయ రుజువును నిర్వచించాలి. ఆధునిక విజ్ఞాన శాస్త్రం ప్రకారం, శాస్త్రీయ రుజువు అంటే సంపూర్ణ నిశ్చయత ఉండవచ్చు అని కాదు, కాదనలేని నిశ్చయత విశ్వవ్యాప్తంగా సాధ్యం కాదు. ఆధునిక శాస్త్రీయ వాదన ప్రకారం, ఏదైనా శాస్త్రీయంగా నిరూపించబడిందని మనం చెప్పినప్పుడు, దాని సంభావ్యత మాత్రమే స్థాపించబడిందని అని అర్థం. ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో, వాస్తవాలుగా నిరూపించబడిన భావనలు సాధారణంగా ఆమోదించబడినవి మరియు  వాటి సంభావ్యత స్థాపించబడినవి అని గమనించడం వలన వాటిని  గురించిన  ఖచ్చితమైన జ్ఞానం సంపాదించబడింది. ఉదాహరణ: పరమాణువు యొక్క నిర్మాణాన్ని అంగీకరించడం.

మనం విశ్వాసంతో, ఇదే శాస్త్రీయ పద్ధతిని ప్రపంచాన్ని విశ్వసించటానికి అన్వయించవచ్చు. శాస్త్రీయ విషయాలలో శాస్త్రీయ దృక్కోణం చెల్లుబాటు అయ్యే పద్ధతిని ప్రపంచానికి వర్తింపజేస్తాము. శాస్త్రీయ పద్ధతిలో మూడు దశలు ఉన్నాయి-పరికల్పన, పరిశీలన మరియు ధృవీకరణ.మనం ఈ మూడు పాయింట్ల ఫార్ములాను ప్రపంచానికి వర్తింపజేస్తే, దాని సంభావ్యత గురించి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు మరియు నిశ్చయత అనేది సంభావ్యతకు మరొక పేరు మాత్రమే.

భగవంతుని జీవులన్నింటిలో, భిన్నమైన మనిషి, నిశ్చయత అవసరం ఉన్నవాడు. 'రేపు' అనే భావన మనిషిలో నిక్షిప్తమై ఉంది. తన ముందున్న విషయం మనిషికి తెలియాలి. ఏ ఇతర సృష్టించబడిన జీవి,అది సజీవమైన లేదా నిర్జీవమైనా, అటువంటి భావనను కలిగి ఉండదు. మనిషిని తప్ప అన్ని జీవుల గమ్యం కేవలం నేటిదేనని, మనిషి గమ్యం మాత్రం  రేపుకి సంబంధించినదని స్పష్టమైంది.

మనిషి తన కోరికలు తీర్చుకోగలడు:

ప్రతి వ్యక్తికి తనలో లోతైన కోరికలు ఉంటాయి. మనిషి సంతృప్తిని కోరుకునే జంతువుఅని చెప్పడం సరైనదే. కానీ మానవ కోరికలు చాలా అరుదుగా నెరవేరుతాయని అనుభవం చూపిస్తుంది. ప్రతి వ్యక్తి, తన కోరికలచే ప్రభావితమై,  తనకు తానుగా ఒక ఆదర్శవంతమైన ప్రపంచాన్ని నిర్మించుకోవాలని కోరుకుంటాడు, అయితే, వ్యక్తి తన కలల 'రేపు'ని సాధించకుండానే ప్రపంచాన్ని విడిచిపెడతాడు.

ఒక ఆశా కిరణం:

ప్రసిద్ధ అమెరికన్ మిషనరీ, బిల్లీ గ్రాహం కు ఒక అమెరికన్ బిలియనీర్ నుండి ఒక అత్యవసర సందేశం వచ్చింది. బిలియనీర్ క్షణం ఆలస్యం చేయకుండా బిల్లీ గ్రాహం ను కలవాలని కోరుకున్నాడు. ఈ సందేశాన్ని స్వీకరించిన తర్వాత, బిల్లీ గ్రాహం తన ఇతర అపాయింట్‌మెంట్‌లను రద్దు చేసి వెంటనే బయలుదేరాడు. బిలియనీర్ యొక్క రాజభవనానికి చేరుకున్నప్పుడు, బిల్లీ గ్రాహం, వెంటనే ఒక ప్రైవేట్ గదికి తీసుకెళ్లబడ్డాడు. అక్కడ బిల్లీ గ్రాహం మరియు  బిలియనీర్ ఒకరికొకరు ఎదురుగా కుర్చీలపై కూర్చున్నారు. అప్పుడు, బిలియనీర్ గంభీరంగా, బిల్లీ గ్రాహమ్‌తో ఇలా అన్నాడు, “ చూడండి! నేను వృద్ధుడిని మరియు నా జీవితానికి అర్థమే లేకుండా పోయింది. నేను అజ్ఞాతంలోకి వెళ్లబోతున్నాను... యువకుడా, మీరు నాకు ఆశ యొక్క కిరణాన్ని ఇవ్వగలరా? ”

ఈ ప్రశ్న ఎదుర్కొనే వ్యక్తి ఒక్క అమెరికన్ బిలియనీర్ మాత్రమే కాదు. ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి వ్యక్తి, పురుషుడు లేదా స్త్రీ, ఒక సమయంలో లేదా మరొక సమయంలో ఈ ప్రశ్నను ఎదుర్కొంటారు. కానీ మనకు సరైన సమాధానాన్ని ఇచ్చేది పరలోక ప్రపంచం యొక్క భావన మాత్రమే. మరణానంతర ప్రపంచాన్ని మనం విశ్వసించకపోతే, ఈ సార్వత్రిక ప్రశ్నకు ఎప్పటికీ సమాధానం దొరకదు.

 

వైరుధ్య భావన అంతం The End of Contradiction:

మానవ స్థితిని జాగ్రత్తగా అధ్యయనం చేస్తే, పురుషులు మరియు మహిళలు అందరూ పుట్టినప్పటి నుండి వారి జీవితాల్లో రెండు విరుద్ధమైన ఇతివృత్తాలను కలిగి ఉంటారు.  ఒకవైపు, వారు కోరుకునే అన్ని ఆనందాలతో తమ ఆదర్శాలకు అనుగుణంగా మరియు భవిష్యత్తులో తమ జీవితాలను నడిపించగల 'రేపు’ అనే ఒక అందమైన కలల ప్రపంచాన్ని  తమ కోసం స్థాపించాలనే అపరిమితమైన కోరిక తో మునిగిపోతారు. కానీ, మరోవైపు, వారు వైరుధ్యాన్ని ఎదుర్కొంటున్నారు. అన్ని భౌతిక వస్తువులతో సుఖాలలో  మునిగిపోయినప్పటికీ వారు తమ చిత్రమైన ప్రపంచాన్ని నిర్మించడంలో విఫలమవుతారు. విసుగు, నష్టం, అనారోగ్యం, ప్రమాదం, వృద్ధాప్యం యొక్క బలహీనతలు మరియు చివరకు 100 సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో మరణం. ఇది   ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి వ్యక్తి యొక్క కథ. అందరు  పురుషులు మరియు మహిళల మనస్సులో అంతర్లీనంగా ఆదర్శ భావన ఉంది. కానీ అందరూ తమ అందమైన కోరికల నెరవేర్పుకు ముందే చనిపోతారు.

జంటల సూత్రం ప్రకారం విశ్వం లో ప్రతిదీ జంటగా వస్తుంది; ఒక అణువులో ప్రతికూల మరియు సానుకూల కణాలు, జంతువులు మరియు మానవులలో మరియు మొక్కలలో కూడా మగ మరియు ఆడ. ఇవి  వాటి  జతతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే ప్రతిదీ సంపూర్ణమవుతుంది.

 భవిష్యత్తులో మనం ఏమి ఆశించవచ్చో దానికి సమాధానం ఈ సార్వత్రిక సూత్రం యొక్క అన్వయింపులో ఉంది. దానికి అనుగుణంగా ప్రపంచమంతా జతప్రపంచం. అంటే, ఈ ప్రపంచంతో పాటు మరొక ప్రపంచం ఉంది మరియు ఆ ప్రపంచాన్ని చేరడం ద్వారా, మన ప్రస్తుత ప్రపంచం పూర్తి అవుతుంది.

ప్రారంభ అంతం The Completion of the Beginning:

పై పరిశీలనల వెలుగులో చూస్తే, పరలోకం యొక్క భావన సరైనదని చాలా స్పష్టంగా తెలుస్తుంది. పరలోక ప్రపంచం "జత" ప్రపంచం, దానిలో చేరడం ద్వారా ప్రస్తుత ప్రపంచం తనను తాను పూర్తి చేస్తుంది. దానిలో చేరకుండా, మన ప్రస్తుత ప్రపంచం అసంపూర్ణంగా ఉంటుంది.ఒక జతలో ఒకటిగా మన ప్రపంచం ఉనికి చాలా అర్ధవంతమైనది. ఈ ఇతర ప్రపంచాన్ని అంగీకరించిన తర్వాత మానవ ఉనికి పూర్తి అవుతుంది. ప్రతిదీ అర్థవంతంగా మారుతుంది. ప్రతిదీ స్థానంలో వస్తుంది

సరైన ఫ్రేమ్‌వర్క్:

ఈ భావన మనకు జీవితంలో మరియు విశ్వంలోని ప్రతిదీ సంతృప్తికరంగా వివరించగల ఫ్రేమ్‌వర్క్‌  ను అందిస్తుంది. స్వర్గం, నరకం అంటే ఏమిటో కూడా స్పష్టం చేస్తోంది. నిష్కపటమైన మరియు సత్యాన్ని ప్రేమించే వ్యక్తులకు స్వర్గం ఒక విశ్రాంతి స్థలం అయితే నరకం అనేది అవమానకరమైన మరియు అబద్ధాల కోసం ఒక స్థలం.

ప్రస్తుత ప్రపంచం,  మానవాళికి ఒక పరీక్షా స్థలంగా పనిచేయడానికి సృష్టికర్త ద్వారా రూపొందించబడింది, అయితే తరువాతి ప్రపంచం, ప్రస్తుత ప్రపంచంలో మన చర్యలకు (లేదా శిక్షలకు) ప్రతిఫలాన్ని పొందే ప్రదేశంగా సృష్టించబడింది.

మనిషి నిత్య జీవిగా సృష్టించబడ్డాడు. ప్రతి పురుషుడు మరియు స్త్రీకి శాశ్వతమైన వ్యక్తిత్వం ఇవ్వబడింది. కానీ మనస్సు శాశ్వతమైనప్పటికీ, శరీరం క్షణికమైనది. మానవ శరీరధర్మ శాస్త్రం యొక్క అధ్యయనం మానవ శరీరం తమను తాము మార్చుకునే జీవ కణాలతో కూడి ఉందని చూపిస్తుంది. ఈ విధంగా శరీరం క్రమమైన వ్యవధిలో పునరుద్ధరించబడుతుంది మరియు పునరుత్పత్తి చేయబడుతుంది. శరీరం చివరికి చనిపోతుంది మరియు పునరుత్థానం చేయబడుతుంది, కానీ ఆధ్యాత్మిక వ్యక్తిత్వం లేదా ఆత్మ జీవిస్తుంది.

మానవ వ్యక్తిత్వం, శాశ్వతమైనది మరియు  మానవ శరీరం నుండి స్వతంత్రంగా ఉనికిని కలిగి ఉంటుంది. మానవ జీవితం మంచుకొండ లాంటిది. దానిలో చాలా చిన్న భాగం కనిపిస్తుంది, మిగిలిన భాగం నీటిలోనే ఉంటుంది. సారూప్యత కోసం మానవ జీవితకాలం రెండు భాగాలుగా విభజించబడింది: మొదటిది, అనంతమైన భాగం ఈ ప్రపంచంలో దాని గమనాన్ని నడుపుతుంది, అయితే చాలా భాగం పరలోకంలో విప్పారురుతుంది.

ప్రస్తుత ప్రపంచంలోని ప్రతిదీ మనిషికి పరీక్షా పత్రంగా పనిచేస్తుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు: ప్రస్తుత ప్రపంచం అన్ని రకాల చెడు  మరియు శత్రుత్వంతో నిండి ఉంది. అనుభవాలను పొందడం ద్వారా, ప్రతికూల పరిస్థితులలో కూడా సానుకూల భావాలతో తన జీవితాన్ని మనిషి నడిపించగలనని నిరూపించగలడు.

సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నవారు మాత్రమే స్వర్గం యొక్క ఆదర్శ ప్రపంచంలోకి ప్రవేశం పొందుతారు. దీనికి విరుద్ధంగా, ప్రతిచర్యకు చెడు అనుభవాలకు ప్రతికూలంగా స్పందించేవారు స్వర్గంలో ప్రవేశానికి అనర్హులుగా పరిగణించబడతారు మరియు ఎప్పటికీ తప్పించుకోలేని నరకంలోకి విసిరివేయబడతారు.

ఆధునిక కాలంలో, సేంద్రీయ పరిణామం యొక్క భావనను శాస్త్రీయ వాస్తవంగా అంగీకరించడానికి  ఏకైక కారణం ఏమిటంటే, శాస్త్రవేత్తలు జీవ వాస్తవాల గురించి అర్థమయ్యే వివరణను కనుగొన్నారు. ఈ విధంగా పరిణామం యొక్క భావన అనేది సాధారణంగా విశ్వసించబడిన సిద్ధాంతం కంటే ఆచరణీయమైన సిద్ధాంతం.

సంతృప్తికరమైన వివరణ:

పరలోక ప్రపంచం పై  విశ్వాసం అన్ని వాస్తవాల యొక్క సంతృప్తికరమైన వివరణను ఇస్తుంది. పరలోక ప్రపంచాన్ని అంగీకరించడానికి నిరాకరించడం వల్ల ప్రస్తుత ప్రపంచం అసంపూర్ణంగా కనిపిస్తుంది.  పరలోక ప్రపంచ అంగీకారం దాని పరిపూర్ణతను నిర్ధారిస్తుంది. మంచి మరియు సత్యాన్ని ప్రేమించే వ్యక్తులు నిజాయితీగా, సూటిగా  జీవించినందుకు పరలోక ప్రపంచ ప్రతిఫలం పొందకుండా ఈప్రపంచాన్ని విడిచిపెట్టడం జరగదు.  

మనమందరం ఆదర్శ ప్రపంచాన్ని కనుగొనకుండా ఈ లోకాన్ని విడిచిపెడతాము. దీనికి పరిష్కారం పరలోకం యొక్క అంగీకారం. మనిషి తన కోరికలకు సంబంధించి  ఈ ప్రపంచంలో పొందలేకపోయిన వస్తువులను  మరణానంతర ప్రపంచంలో పొందుతాడు అనే నమ్మకంతో ఈ ప్రపంచంలో జీవించవచ్చు.

ఈ ప్రపంచంలో ఏదీ వృధాగా సృష్టించబడలేదు. సూర్యుడు మరియు చంద్రుని నుండి అతి చిన్న కీటకాల వరకు- అన్నీ ఏదో ఒక ప్రయోజనం కోసం సృష్టించబడ్డాయి. స్త్రీ పురుషులందరూ అందమైన కోరికలతో జన్మించారు. ఈ ప్రపంచంలోని ప్రతిదీ నిర్దిష్ట ఉద్దేశ్యంతో సృష్టించబడినప్పుడు, మానవ కోరికలు చివరికి ఫలించడం కూడా తార్కికంగా అనిపిస్తుంది. ప్రతిదీ ఏదో ఒక ఉద్దేశ్యంతో సృష్టించబడిన విశ్వంలో, మానవ కోరికలు ఫలించలేదని ఎప్పుడూ చెప్పలేము.

ఈ సృష్టి లో వ్యక్తుల ఉనికికి ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంది. అయితే, ప్రస్తుత పరిమిత ప్రపంచంలో ఈ ప్రయోజనం నెరవేరదు. కోరికలు, అపరిమితమైనవి కావున అపరిమిత ప్రపంచంలో మాత్రమే కోరికలు నెరవేరుతాయి. అక్కడ మంచి వ్యక్తులు శాశ్వతమైన స్వర్గంలో ఉంటారు మరియు అన్ని రకాల ఆనందం మరియు సుఖాలు పొందుతారు. మరోవైపు, చెడ్డ వ్యక్తులు నరకానికి పంపబడతారు, అక్కడ వారు తమ చెడ్డ పనుల పలితాలను శాశ్వతంగా భరించవలసి ఉంటుంది.

స్వర్గం యొక్క వాస్తవికత:

స్వర్గం అంటే ఏమిటి? మానవుని తపనకు స్వర్గం అంతిమ సమాధానం. మనిషి ప్రపంచంలో ఒక ప్రత్యేకతను కలిగి,  తనను తాను కనుగొంటాడు. ఈ విశ్వంలోని ప్రతి భాగం సంపూర్ణంగా ఉంటుంది. మనిషి తనలో తాను పూర్తికాని ఏకైక జీవి. విశ్వం నిశ్చయతతో  ఉంటుంది.కానీ మానవ ప్రపంచం అనిశ్చితితో ఉంది. భయం అనేది విశ్వంలో ఎక్కడా కనిపించదు. కానీ మనిషి నిరంతరం భయంతో బాధపడుతుంటాడు. విశ్వం, తాను కోరుకున్నదంతా పొందుతూ, సమతౌల్య స్థితిలో ఉండగా, మానవులు, ఈ ప్రపంచంలో తాము కోరుకున్నది పొందలేదని బాధాకరమైన ఆలోచనతో బాధపడుతూ అసమతుల్యత స్థితిలో ఉన్నారు. విశ్వం చెడు-రహితంగా ఉంటుంది. కాని  మానవులు నిరంతరం చెడు సమస్యతో బాధపడుతున్నారు.

ఈ సమస్యలన్నింటికీ స్వర్గమే సమాధానం. స్వర్గం యొక్క భావన మానవుడు కూడా మిగిలిన విశ్వం కనుగొన్న ప్రతిదాన్ని కనుగొంటాడని చూపిస్తుంది. తేడా ఏమిటంటే విశ్వం ఈ రోజు కోరుకున్నది పొందుతోంది, అయితే మనిషి రేపు తాను కోరుకున్నది పొందుతాడు. మిగిలిన విశ్వానికి భవిష్యత్తు అనే భావన లేదు. ఈ భావనను కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే మనిషి.

ప్రకృతిలో భాగం:

దేవుడు మరియు పరలోకం కనిపించని ప్రపంచానికి సంబంధించినవి. కానీ నిజం ఏమిటంటే అవి మానవ జీవితంలో ముఖ్యమైన భాగం. భగవంతుడు మరియు పరలోకం మనిషికి  సహజసిద్ధంగా తెలిసిన సత్యాలు.

సత్యం ఏమిటంటే భగవంతుని సాక్షాత్కారానికి రెండు స్థాయిలు ఉన్నాయి- హేతుబద్ధమైనవి మరియు సహజమైనవి. భగవంతుని ఉనికిని మరియు పరలోకాన్ని హేతుబద్ధంగా విశ్వసించడం అనేది దేవుని సాక్షాత్కారస్థాయికి సంబంధించిన ఏకైక ప్రారంభ దశ, అయితే భగవంతుని మరియు పరలోకాన్ని సహజ స్థాయిలో విశ్వసించడం దాని అంతిమ దశ.

భగవంతుడు మరియు పరలోకం అనే అంశంపై హేతుబద్ధమైన వాదనలను ఉపయోగించడం యొక్క ఉద్దేశ్యం మనిషి నుండి సందేహాల ముసుగును తొలగించడం మాత్రమే. మనిషి దేవుడు మరియు పరలోకం యొక్క వాస్తవికతను కనీసం సంభావ్య సత్యంగానైనా అంగీకరించే స్థాయికి తీసుకురావాలి.

భగవంతుడు మరియు పరలోకం యొక్క ప్రశ్నపై వాదన మరియు తర్కాన్ని ఉపయోగించడం అనేది దేవుడు మరియు పరలోకం యొక్క ఉనికిని ఒక భావజాలంగా అంగీకరించడానికి మనిషికి సహాయపడుతుంది. మనిషి ఈ స్థితికి చేరుకున్నప్పుడు, మనిషి స్వభావం అలాంటి అంగీకారానికి స్వీకరిస్తుంది. మనిషి దానిని సహజ సత్యంగా గుర్తించి స్వీకరిస్తాడు.

ప్రతి మనిషికి భగవంతుని మరియు పరలోకాన్ని గ్రహించాలనే దృష్టి ఉంటుంది, కానీ ఈ విషయాలు అవరోదం ద్వారా మరుగున పడిపోతాయి. తార్కిక వాదన ఈ అవరోధం లేదా మానసిక అవరోధం ను విచ్ఛిన్నం చేసి ప్రకృతి నుండి కృత్రిమ తెరను తొలగించడం చేస్తుంది. అప్పుడు భగవంతుని మరియు పరలోకాన్ని "చూడటానికి" ఏదీ అడ్డు రాదు. ఇప్పుడు మానవుడు దేవుని అదృశ్య ఉనికి గురించి పూర్తిగా ఒప్పించబడతాడు.

మూలం:మౌలానా మౌలానా వాహిద్దీద్దీన్ ఖాన్

తెలుగు సేత: ముహమ్మద్ అజ్గర్ అలీ.

 

 

No comments:

Post a Comment