22 February 2023

అహోం యువరాణి రమణి గభారు/పోరీ బీబీ Ahom Princess Ramani Gabharu/Pori Bibi

 

ఢాకాలోని 17వ శతాబ్దపు అసంపూర్తి మొఘల్ భవనం లాల్‌బాగ్ కోట


ఢాకాలోని పోరి బీబీ సమాధి-1974లో పురావస్తు శాఖ ఈ స్మారక చిహ్నాన్ని స్వాధీనం చేసుకుంది.

17వ శతాబ్దపు మొఘల్ భవనం లాల్‌బాగ్ కోట లోని బీబీ పరి సమాధి బంగ్లాదేశ్‌లో ఒక ప్రత్యేకమైన నిర్మాణంగా పరిగణించబడుతుంది. ఢాకాలోని పోరీ బీబీ సమాధి, అహోం యువరాణి రమణి గభారుది అని కొందరు చరిత్రకారులు చెబుతుంటే, మరికొందరు అది మొఘల్ సైన్యాధిపతి షైస్తా ఖాన్ కుమార్తె అని చెప్పారు.

 లాల్‌బాగ్ కోట 17వ శతాబ్దపు అసంపూర్తిగా ఉన్న మొఘల్ భవనం, ఔరంగజేబు పాలనలో బెంగాల్ గవర్నర్ షైస్తా ఖాన్ నిర్మించారు. సగం-నిర్మిత లాల్‌బాగ్ కోట విశాలమైన, అందంగా అలంకరించబడిన ఉద్యానవనం కలిగి ఉంది.

ఈ కోట ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో స్వదేశీ మరియు విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తుంది, దాని ప్రాకారాలలో ఉన్న సమాధిని పోరీ బిబీర్ కోబోర్ అని పిలుస్తారు.

బంగ్లాదేశ్‌లో చాలామంది పోరీ బీబీని ఔరంగజేబ్ కుమారుడు ముహమ్మద్ ఆజం షాతో వివాహం చేసుకున్న షైస్తా ఖాన్ యొక్క ప్రియమైన పెద్ద కుమార్తెగా భావిస్తారు. 1684లో పోరీ బీబీ మరణంతో, షైస్తా ఖాన్ కోటను మరింతగా  నిర్మించాలనే ఆలోచనను విరమించుకుని, పోరీ బీబీని దాని ప్రాకారాల్లోనే సమాధి చేసాడు.

 అహోం యువరాణిగా రమణి గభారు/ పోరీ బీబీ గురించి అనేకమంది చరిత్రకారులు వ్రాసినారు, మొఘల్ జనరల్ మీర్ జుమ్లా యుద్ధ దోపిడీలో భాగంగా గౌహతి నుండి రమణి గభారు/ పోరీ బీబీని తీసుకువచ్చారు.

అస్సాం చరిత్రలో అహోం రాజు జయధాజ్ సింఘా (1648-1663) యొక్క ఏకైక కుమార్తె రమణి గభారుగా ప్రసిద్ధి చెందింది మరియు ఆరేళ్ల వయసులో (కొందరు ఆమెకు 11 ఏళ్లు అని చెబుతారు) - మీర్ జుమ్లా సైన్యానికి కప్పంగా ఇవ్వబడింది. అహోంలు మరియు మొఘలుల మధ్య శాంతి ఒప్పందం 1663లో సంతకం చేయబడింది.

మీర్ జుమ్లా ఢాకాకు వెళ్లే మార్గంలో అనారోగ్యంతో మరణించగా (మీర్ జుమ్లా సమాధి బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న మేఘాలయలోని గారో హిల్స్‌లో ఉంది), యువరాణి మొఘల్ బెంగాల్ రాజధాని ఢాకాకు చేరుకున్నప్పుడు షైస్తా ఖాన్ సంరక్షణలో ఉంచబడిందని నమ్ముతారు.

ఔరంగజేబు ఆదేశాల మేరకు, రమణి ఇస్లాం మతంలోకి మార్చబడి, రహమత్ బాను అనే కొత్త పేరు పెట్టబడి, 1667లో ఔరంగజేబు కుమారుడు ముహమ్మద్ ఆజం షా  మొదటి భార్యగా - 1,80,000 రూపాయల కట్నంతో వివాహం జరిపించబడిందని అంటారు.

బంగ్లాదేశ్‌కు చెందిన సుప్రసిద్ధ చరిత్రకారుడు సయ్యద్ ముహమ్మద్ తైఫూర్ ప్రకారం, పోరీ బీబీ మరెవరో కాదు, రమణి గభారు. "చక్రవర్తి ఔరంగజేబు రమణి ను ఇస్లాం మతంలోకి మార్చాడు మరియు 1677లో ఒక లక్షా ఎనభై వేల రూపాయల కట్నంపై యువరాజు ఆజంకు వివాహం చేశాడు. యువరాణి ఏదో ప్రసవ వ్యాధితో బాధపడుతూ ఢాకాలో నివసించింది. రమణి అసాధారణమైన అందం కలది  మరియు యువరాజుకు చాలా ఇష్టమైనది కాబట్టి, ఆమెను బిబి పరి (లేదా అద్భుత) అని పిలుస్తారని చరిత్రకారుడు సయ్యద్ ముహమ్మద్ తైఫూర్ రాశాడు.

అహోం క్రానికల్స్ ఆదారంగా  మరొక బెంగాలీ చరిత్రకారిణి బేగం లుత్‌ఫున్నెసా హబీబుల్లా ఈ వాదనను సమర్ధించినది.

బంగ్లాదేశ్ ప్రభుత్వం యొక్క కత్రా వక్ఫ్ కార్యాలయంలో భద్రపరిచిన  షైస్తా ఖాన్ యొక్క “అచియత్నామా”  రహ్మత్ బానును, ఇరాన్ దుఖ్త్ లేదా బీబీ పారీగా గుర్తిస్తుందని కూడా కొందరు అంటున్నారు.

మరొక పురావస్తు శాస్త్రవేత్త అహ్మద్ హసన్ డానీ ఒక విరుద్ధమైన సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు. షైస్తా ఖాన్ ఐదుగురు కుమార్తెలలో ఇద్దరు ఢాకాలో ఉన్నారు - ఇరాన్ దుఖ్త్ మరియు తురాన్ దుఖ్త్. షైస్తా ఖాన్ యొక్క పెద్ద కుమార్తె ఇరాన్ దుఖ్త్‌ను బీబీ ప్యారీగా అహ్మద్ హసన్ డానీ గుర్తించాడు మరియు బీబీ ప్యారీ యువరాజు ముహమ్మద్ ఆజం షాను వివాహం చేసుకున్నట్లు చెప్పాడు.

బంగ్లాదేశ్ ఆర్థికవేత్త మరియు రచయిత డాక్టర్. అబ్దున్ నూర్ 600 సంవత్సరాల పాటు అస్సాంను పాలించిన అహోం రాజ్య  యువరాణి రమణి గభారు లేదా పోరీ బీబీ లేదా ఇరాన్ దుఖ్త్‌  కోసం తన అన్వేషణను కొనసాగిస్తున్నారు.

2007లో, 83 ఏళ్ల డా. నూర్, యువరాణి రమణి గభారు లేదా పోరీ బీబీ లేదా ఇరాన్ దుఖ్త్‌  గురించి మరియు  మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మూడో కుమారుడు అజం షాను వివాహం చేసుకున్న తర్వాత రమణి గభారు లేదా పోరీ బీబీ లేదా ఇరాన్ దుఖ్త్‌  ఢాకాకు ప్రయాణాన్ని వర్ణించారు.

డాక్టర్ నూర్, ప్రకారం  యువరాణి అహోం రాజు జయధాజ్ సింఘా (1648-1663) ఏకైక కుమార్తె రమణి గభారు.  కింగ్ జయధాజ్ సింఘాకు కొడుకు లేనందున తన కుమార్తె రమణి గభారుకి పట్టాభిషేకం నిర్వహించాలనుకున్నాడు. రమణి గభారును తన వారసురాలిగా అభిషేకించాలనుకున్నాడు.

1659లో బెంగాల్ గవర్నర్‌గా నియమితులైన మీర్ జుమ్లా, 1662లో మొఘల్ సైన్యానికి నాయకత్వం వహిస్తూ అస్సాంపై దండెత్తాడు. ఆ సమయంలో రమణి గభారుకు దాదాపు 9 సంవత్సరాల వయస్సు ఉంది మరియు యుద్ధం లో మీర్ జుమ్లా సైన్యానికి విమోచన క్రయధనంగా ఇవ్వబడింది.

రమణి గభారును ముందుగా ఢాకాకు తీసుకెళ్లి ఢిల్లీకి తీసుకెళ్లారు. రమణి గభారు ఢిల్లీలో 10 సంవత్సరాలు గడిపింది మరియు చివరకు ఔరంగజేబు మూడవ కుమారుడు ముహమ్మద్ ఆజం షాను వివాహం చేసుకుంది. రమణి ఇస్లాం మతంలోకి మారి రహమత్ బానుగా పేరు తెచ్చుకున్నారు.

రహమత్ బాను తన భర్త ముహమ్మద్ ఆజం షా 1678లో సుబాదర్ అయినప్పుడు ఢాకాకు వెళ్లింది. 

సుబాదర్‌గా బాధ్యతలు స్వీకరించిన 15 నెలల తర్వాత ఆజం షా ఢాకాను విడిచిపెట్టాడు. రమణి గాభరుని అక్కడే వదిలేసి ఢిల్లీ వెళ్ళాడు.

 రమణి గభారుకి ఔరంగజేబు కొడుకు ఆజం షా నుండి ఒక కొడుకు పుట్టాడని మరియు రమణి  తన కొడుకు ఏదో ఒకరోజు అహోం రాజ్యాన్ని పరిపాలిస్తాడనే ఆశతో కొడుకు కు అహోం పేరు పెట్టింది. అని డాక్టర్ నూర్ చెప్పారు.

బంగ్లాదేశ్‌లో ప్రజలు పోరీ బీబీని షైస్తా ఖాన్ యొక్క ప్రియమైన పెద్ద కుమార్తెగా భావిస్తారు.

డా. నూర్ తన నవల బిషోలిటో సమయ్‌లో బెంగాల్ (ఇప్పుడు బంగ్లాదేశ్) మరియు అస్సాం మధ్య స్నేహానికి అందమైన చిహ్నంగా రహ్మత్ బాను లేదా రమణి గభారును చిత్రీకరించడానికి ప్రయత్నించారు.

బంగ్లాదేశ్‌లో పోరీ బీబీ/రమణి గభారు పేరు అనేక జానపద గాధలలో సజీవంగా ఉంచబడింది.

 

 

 

 

 


No comments:

Post a Comment