23 February 2023

ఉర్దూబేగిస్: మొఘల్ సామ్రాజ్యం యొక్క మరచిపోయిన మహిళా యోధులు Urdubegis: The Forgotten Female Fighters of the Mughal Empire

 

 

1526లో మొదటి మొఘల్ చక్రవర్తి బాబర్, ఇబ్రహీం లోడిని ఓడించినప్పుడు భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం ఏర్పడింది. బాబర్‌ తనతో పాటు తన అంతఃపురం రక్షణకు కాశ్మీరీ, టర్క్, హబ్షి మరియు టార్టర్ తెగలకు చెందిన సాయుధ శిక్షణ పొందిన మహిళలతో కూడిన ఉర్దూబేగీలను సృష్టించాడు.

అంతఃపురం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆనంద ఉద్యానవనం గురించి ఆలోచనలు వస్తాయి, కానీ అది సత్యానికి దూరంగా ఉంటుంది. అక్కడ నివసించే చాలా మంది స్త్రీలు మహిళా ఉద్యోగులు మరియు చక్రవర్తి బంధువులు. చక్రవర్తి యొక్క లైంగిక ఆనందం కోసం కేవలం ఐదు శాతం మహిళలు మాత్రమే పనిచేశారు; వారు అతని రాణులు మరియు ఉంపుడుగత్తెలు. అంతఃపుర నివాసులు చక్రవర్తి మినహా పురుషులందరి ముందు పర్దాను పాటించేవారు.

చాలా మంది మహిళలు అంతఃపురంలో నివసించారు, దీనిని జానానా లేదా జెనానా అని కూడా పిలుస్తారు. జానానాలోని ప్రతి ఒక్కరికి ఒక నిర్దిష్ట విధి ఉంది. ఉర్దూబేగీలు భద్రతకు బాధ్యత వహిస్తారు.

మొఘల్ చక్రవర్తుల అంతఃపురం లో నపుంసకులు కాకుండా, అంగాలు (పెంపుడు తల్లి), దరోగులు (మేట్రాన్లు), మహల్దార్లు (సూపరింటెండెంట్లు), మరియు ఉర్దూబేగీలు (సాయుధ మహిళా కాపలాదారులు) వంటి మహిళా అధికారులు ఉన్నారు. ఈ మహిళలు వివాహితులు మరియు తమ విధుల సమయంలో అంతఃపురంలో పనిచేసేవారు. డ్యూటీ  లేకుంటే, వారు అంతఃపురానికి దూరంగా తమ స్వంత ఇళ్లలో నివసించారు.

మొఘల్ చక్రవర్తి శక్తిని నిలబెట్టడానికి మూడు విషయాలు సహాయపడ్డాయి: అతని సైన్యం, అతని ఖజానా మరియు అతని మహిళలు. మొదటి రెండు రాజుతో నేరుగా సంబంధం కలిగి లేవు, కానీ అంతఃపురం, మరోవైపు, అతనికి దగ్గరగా ఉంది. రాజు అక్కడ చాలా సమయం గడిపెవాడు  కాబట్టి విశ్వసనీయ మరియు సమర్థులైన కాపలాదారుల అవసరం ఉంది. అంతఃపురంలో నపుంసకులు మరియు స్త్రీలు మాత్రమే అనుమతించబడతారు కాబట్టి, వారిలో కొందరిని ఎంపిక చేసి సరైన యోధులుగా తీర్చిదిద్దారు. మగ కాపలాదారుల అవసరం లేకుండా స్త్రీలను రక్షించగల సామర్థ్యం వారికి ఉంది.

ఉర్దూబేగీలు -మొఘల్ అంతఃపురంలోని మహిళా యోధులు:

ఉర్దూబేగీలు అని పిలువబడే  శిక్షణ పొందిన మహిళా యోధులు, మొఘల్ చక్రవర్తి పట్ల అత్యంత విధేయత కలిగి మొఘల్ చక్రవర్తి యొక్క అంతఃపురము సంరక్షించడమే గాక  మొఘల్ చక్రవర్తి శత్రువులకు సింహస్వప్నం గా ఉండేవారు.

ఉర్దూబేగీలు పర్దాను పాటించని తెగలకు చెందినవారై ఉండాలి. ఉర్దూబేగీలు సాధారణంగా హబ్షి, టార్టర్, టర్క్ మరియు కాశ్మీరీ తెగల మహిళలు అయి ఉండేవారు.

చక్రవర్తి బాబర్ మరియు హుమాయూన్ కాలంలో ఉర్దూబేగీల గురించి ప్రస్తావించబడింది. అందువల్ల అంతకు ముందు ఉర్దూబేగీల ప్రస్తావన లేకపోవడంతో మొఘలుల రాకతో ఉర్దూబేగీలు  ఆవిర్భవించారని చెప్పవచ్చు. వేర్వేరు పేర్లతో మహిళా గార్డులు ఉండవచ్చు, కానీ ఉర్దూబేగీల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించబడలేదు.

ఉర్దూబేగీలు   విల్లు మరియు బాణాలు మరియు ఈటెలు ఉపయోగించడంలో శిక్షణ పొందారు. ఉర్దూబేగీలకు  ఆయుధాలతో పాటు పొట్టి బాకులు, కత్తులు వాడటం నేర్పించారు. ఉర్దూబేగీలకు  పోరాట కళను బోధించారు. ఉర్దూబేగీలు నమ్మదగినవారుగా ఉండాలి, ఎందుకంటే ఉర్దూబేగీలు రాణి మరియు అంతఃపురానికి మాత్రమే కాకుండా రాజుకు కూడా కాపలాగా ఉంటారు. మొఘల్ చక్రవర్తి అంతఃపురంలో ఎక్కువ సమయం గడిపేవాడు అందుకే చక్రవర్తిని  రక్షించే  మహిళా కాపలాదారులు కావలిసి వచ్చింది.

"మొఘల్ కోర్టులోని ఉర్దూబేగీలు యుద్ధంలో చాలా నైపుణ్యం కలిగి ఉన్నారు, వారసత్వ యుద్ధం సమయంలో, ఔరంగజేబ్. షాజహాన్‌ను సందర్శించడానికి నిరాకరించాడు, ఎందుకంటే మహిళా సాయుధ గార్డులు/ ఉర్దూబేగీలు తనను చంపేస్తాడని భయపడ్డాడు" అని కిషోరీ శరణ్ లాల్ తన పుస్తకం ది మొఘల్ హరేమ్‌లో రాశారు. ఉర్దూబేగీలు  క్రూరత్వం మరియు బలం కు మారు పేరు..

ఉర్దూబేగిస్ యొక్క పరిణామం:

మొఘల్ కాలం లో చక్రవర్తి వెళ్లిన ప్రతిచోటా జానానా స్త్రీలు చక్రవర్తి వెంట వచ్చేవారు. 1527లో, బాబర్ భారతదేశాన్ని జయించి, మొఘల్ సామ్రాజ్యానికి పునాదులు వేసాడు.  బాబర్ మరియు హుమాయున్ ఇద్దరూ తమ శిబిరాల నుండి పాలించారు. బాబర్ మరియు హుమాయున్ ప్రయాణిస్తున్నప్పుడు, వారి భార్యలు మరియు ఇతర మహిళా సహచరులు వారితో పాటు వచ్చారు మరియు వారిని రక్షించడానికి అంతఃపురానికి మహిళా గార్డులు/ ఉర్దూబేగిస్ కేటాయించబడ్డారు.

ప్రయాణాలు లేదా యుద్ధ యాత్రలలో చక్రవర్తి హరామ్‌తో కలిసి ఉన్నప్పుడు మహిళా గార్డులు/ ఉర్దూబేగిస్ చాలా ముఖ్యమైన విధులను నిర్వహించేవారు. మహిళల గుడారాల వెలుపల ఉర్దూబేగిస్ తమ ఉనికి చూపుతూ నియంత్రణను కలిగి ఉండేవారు. మహిళా గార్డులు/ ఉర్దూబేగిస్ ప్రతి ఇరవై నాలుగు గంటలకు మారి తమ విధులు నిర్వహించే వారు..

మొఘల్ సామ్రాజ్యానికి మూడవ చక్రవర్తి అయిన అక్బర్ 1556లో అధికారంలోకి వచ్చాడు. అక్బర్ చక్రవర్తి  యొక్క 49 ఏళ్ల పాలనలో, మొఘల్ సామ్రాజ్యంలో   గ్రాండ్ ప్యాలెస్‌లు నిర్మించబడ్డాయి మరియు సాధారణంగా అంతఃపురం చక్రవర్తి నివాసానికి  దగ్గరగా ఉంటుంది. చక్రవర్తిని రక్షించే మగ గార్డులు అంతఃపురంలోకి ప్రవేశించలేరు, కాబట్టి మహిళా గార్డులు/ ఉర్దూబేగీలు మరింత ముఖ్యమైన పాత్రను పోషించేవారు.

అయితే ఉర్దూబేగీలందరూ నిజానికి యోధులు కాదు. కొందరు కాలక్రమేణా ఆ ర్యాంకుల్లోకి వచ్చారు. ఉదాహరణకు హుమాయూన్ చక్రవర్తికి నర్స్/దాయి  గా పనిచేసిన స్త్రీ ఆ తరువాత 1556లో హుమాయూన్ మరణించినప్పుడు, అక్బర్ చక్రవర్తి పాలనలో ఉర్దూబేగీల చీఫ్‌గా పదోన్నతి పొందింది.

బీబీ ఫాతిమా - తెలిసిన ఏకైక ఉర్దూబేగీలు:

దురదృష్టవశాత్తు, అంతఃపురాన్ని రక్షించిన అనేక మంది మహిళల గురించి చాలా తక్కువ సమాచారం ఉంది. వ్రాతపూర్వక రికార్డులలో ఉర్దూబేగీస్ చీఫ్ బీబీ ఫాతిమా పేరు మాత్రమే కనిపిస్తుంది. మొఘల్ రాణి గుల్బాదన్ బేగం రాసిన హుమాయున్-నామాలో బీబీ ఫాతిమా పేరు ప్రస్తావించబడింది.

వాస్తవానికి బీబీ ఫాతిమా చక్రవర్తి హుమాయున్‌కు దాయి/నర్సు లేదా అంకాగా పనిచేసింది. హుమాయున్ తీవ్ర అనారోగ్యం పాలైనప్పుడు బీబీ ఫాతిమా, బాబర్ యొక్క సంరక్షణను తీసుకుంది మరియు బాబర్ ను ఆరోగ్యవంతంగా చూసుకుంది.  1556లో బాబర్ మరణించే వరకు బాబర్ సంరక్షణను కొనసాగించింది. అక్బర్ చక్రవర్తి,  బీబీ ఫాతిమా సేవ, తన తండ్రి బాబర్  పట్ల ఆమెకున్న విధేయత మరియు అంకితభావానికి ప్రతిఫలo గా  బీబీ ఫాతిమా ను ఉర్దూబేగీల అధిపతిగా నియమించాడు.

ఉర్దూబేగీలు- వ్యవస్థ - క్షిణత?

18వ శతాబ్దంలో బ్రిటీష్ వారి రాకతో, మొఘల్ సామ్రాజ్యం క్షీణించింది. అయినప్పటికీ, 1858 వరకు చివరి మొఘల్ రాజు తన సింహాసనం నుండి తొలగించబడ్డాడు మరియు బ్రిటిష్ పాలన ప్రారంభం అయినది. బహదర్ షా జాఫర్ తన కిరీటం కోల్పోయినప్పుడు, మొఘల్ అంతఃపురం రద్దు అయినది దీనితో ఉర్దూబేగీల అవసరం లేక పోయింది. రాజు మరియు అంతఃపురాన్ని రక్షించడం అనే  వారి ప్రధాన పని ముగిసింది.

మొఘల్ రాజకీయ క్షీణత తో మహిళా గార్డులు/ ఉర్దూబేగీలు  అంతరించిపోయారు.

 

No comments:

Post a Comment