26 February 2023

బనారస్‌కు చెందిన ఇర్షాద్ అలీ తన చేతితో రాసిన శ్రీమద్ భగవద్గీత ను పార్లమెంటులో ప్రదర్శించాలని కోరుతున్నారు

 





బెనారస్‌కు చెందిన 53 ఏళ్ల వ్యాపారవేత్త హాజీ ఇర్షాద్ అలీ బనార్సీ, తెల్లటి కాటన్ గుడ్డ పెద్ద షీట్‌లపై గంగా మట్టి మరియు నీటిని ఉపయోగించి శ్రీమద్ భగవద్గీతను కాలిగ్రఫీలో రాశారు మరియు దీనిని పార్లమెంటులో ప్రదర్శించాలని కోరుకుంటున్నాడు.

ఇర్షాద్ అలీ, ఇంతకుముందు ఇదే విధంగా తెల్లటి కాటన్ గుడ్డ పై దివ్య ఖురాన్‌ను కాలిగ్రఫీలో రాశారు.  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ మరియు UP ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సహా ప్రముఖులకు తన కళాఖండాలను బహుమతిగా ఇర్షాద్ అలీ ఇవ్వాలనుకుంటున్నారు.

హాజీ ఇర్షాద్ అలీ బనార్స్ నగరంలోని భిలోపూర్ ప్రాంతంలో నివసిస్తున్న  చీరల వ్యాపారి. ఇర్షాద్ అలీ ఇంతకుముందు హనుమాన్ చాలీసాను రెండు మీటర్ల గుడ్డపై గంగానది మట్టితో వ్రాసాడు. ఇర్షాద్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి హనుమాన్ చాలీసాను బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాడు.

ఇర్షాద్ అలీ దాదాపు నాలుగు రోజుల్లో హనుమాన్ చాలీసాను పూర్తి చేశాడు. ఇర్షాద్ హనుమాన్ చాలీసా రాయడానికి ముందు చదివి అర్థం చేసుకున్నాడు.వరదల సమయంలో గంగా మట్టిని సేకరిం చామన్నారు. దీనిని ఫిల్టర్ చేసి ఎండబెట్టారు. తరువాత ఇర్షాద్ గంగాజల్ మరియు చేతితో తయారు చేసిన జిగురును కలిపి హనుమాన్ చాలీసాను వ్రాసాడు.

ఇర్షాద్ హనుమాన్ చాలీసా మాత్రమే కాకుండా హనుమంతుడిని మరియు భగవద్గీతను స్తుతించే ‘హనుమాన్ సహస్త్రాణం’ నుండి శ్లోకాలను కూడా వ్రాసాడు.

శ్రీమద్ భగవత్ గీత, హనుమాన్ సహస్త్రనామం మరియు హనుమాన్ చాలీసా మొత్తం 30 మీటర్ల వస్త్రంపై వ్రాయబడింది.

ఇర్షాద్ తన భగవద్గీత యొక్క మాన్యుస్క్రిప్ట్‌ను కాశీ విశ్వనాథ్ ధామ్ మరియు దేశం యొక్క కొత్త పార్లమెంటు భవనంలో ప్రదర్శించాలని కోరుకుంటున్నాడు.

ఇర్షాద్ ఈ ప్రాజెక్టును కొనసాగించేందుకు తన పిల్లలు ప్రోత్సహించారని తెలిపారు.

హాజీ ఇర్షాద్ అలీ పవిత్ర ఖురాన్, హనుమాన్ చాలీసా మరియు ఇతర మతపరమైన పుస్తకాలను కాటన్ క్లాత్‌పై అదే శైలిలో రాశారు. శ్రీమద్ భగవద్గీతను వ్రాయడానికి ముందు ఇర్షాద్ గ్రంథాన్ని అర్థం చేసుకోవడానికి సంస్కృతం నేర్చుకున్నాడు.

ఇర్షాద్, కాటన్ గుడ్డ ముక్కలపై విష్ణు శాస్త్రం Vishnu Shastranam, హనుమాన్ చాలీసా మరియు జాతీయ గీతాన్ని కూడా రాశాడు.

"నాకు 14 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఖననం చేయడానికి ముందు కప్పటానికి అర మీటరు గుడ్డపై షహదాతిన్/సాక్ష్యాలు రాయడం ప్రారంభించాను" అని ఇర్షాద్ చెప్పారు. షహదాతిన్ అంటే విశ్వాసం యొక్క ప్రకటన – ఒకే దేవుడు ఉన్నాడని మరియు ముహమ్మద్ అతని దూత అని ప్రకటించడం. "

 క్రమంగా హాజీ ఇర్షాద్ అలీకి రాయడం పట్ల మక్కువ పెరిగింది మరియు ఇర్షాద్ పవిత్ర ఖురాన్‌ను గుడ్డ ముక్కలపై వ్రాయాలని నిర్ణయించుకున్నాడు. పవిత్ర ఖురాన్‌ ను  గంగా మట్టి, జంజామ్ బావి నీరు, కుంకుమపువ్వు మరియు గమ్‌ తో తయారు చేసిన పవిత్రమైన సిరాతో రాసాడు.  ఇర్షాద్ అలీకి పవిత్రమైన సిరా తో రాయడానికి దాదాపు ఆరు సంవత్సరాలు పట్టింది. ఇర్షాద్ తను రాసిన దివ్య ఖురాన్‌ను బనారసీ సిల్క్ బ్రోకేడ్‌తో ఫ్రేమ్ చేసాడు.

ఇర్షాద్ కుటుంబం మొత్తం ఈ పనిలో-భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సహా కుటుంబ సభ్యులందరూ అండగా ఉంటారు. సిరా సిద్ధం చేస్తున్నప్పుడు ఇర్షాద్ భార్య మరియు కుమార్తెలు గుడ్డ షీట్లను సిద్ధం చేస్తారు

ఇర్షాద్ మతపరమైన పుస్తకాలను వస్త్రంపై వ్రాసి రికార్డు సృష్టించడమే కాకుండా భారతదేశం యొక్క వైవిధ్య నాగరికతకు చిహ్నంగా కూడా మారాడు.

 

No comments:

Post a Comment