18 December 2022

అల్-ఘజ్జాలి (1058-1111 AD)Al-Ghazzali (1058-1111 AD)

 

అబూ హామిద్ మొహమ్మద్ ఇబ్న్ మొహమ్మద్ అల్-ఘజాలీ  (1058-1111) పర్షియా లోని ఖోరాసాన్లో జన్మించాడు. అల్-గాజెల్ గా కూడా ప్రసిద్ధి చెందినాడు.   పర్షియన్   ముస్లిం పండితుడు, ధార్మిక తత్వవేత్త. ఘజాలీ సూఫీసున్నీ ముస్లిం (షాఫయీ), అష్-హరీ. అల్-ఘజాలి ఇస్లామిక్ స్వర్ణ యుగమునకు చెందిన వాడు.

అబూ హమీద్ అల్-ఘజాలి ఇస్లామిక్ ఆలోచనావాది మరియు ఇస్లాం  యొక్క అతి ముఖ్యమైన పండితులలో ఒకరు. అల్-ఘజాలి ఒక తత్వవేత్తన్యాయశాస్త్ర  పండితుడు మరియు వేదాంతవేత్త మరియు ఇబ్న్ అరబీ వలే  రహస్య ఆధ్యాత్మిక ఆలోచనాపరుడు (mystical thinker). అనేకమంది ముస్లింలకు అల్-ఘజజాలి ముజాద్దాద్ (Mujaddid) అనగా  ఇస్లాం యొక్క పునరుత్థానం కోసం కృషి చేసిన వాడు.  తత్త్వవేత్తలు మరియు వేదాంతులు మధ్య హేతువాదులు  మరియు సాంప్రదాయవాదులు  మరియు మిస్టకల్ మరియు సాంప్రదాయికల మధ్య సమన్వయము  చేయడానికి ప్రయత్నించాడు.

 అల్-ఘజాలి యొక్క ఇహ్య ఉలూం అల్-దిన్”, (ది రివైవల్ ఆఫ్ రిలీజియస్ సైన్సెస్ The Revival of Religious Sciences)విబిన్న వాదాల మద్య సమన్వయము కుదిర్చే బంగారు మధ్యే మార్గం. షరియా మరియు తరిఖా (law and mysticism) ను సమన్వయపరచడం లో అల్-ఘజాలి ని భారత దేశ షేక్ రబ్బానీ(ఇస్లామిక్ తత్వవేత్త) తో పోల్చవచ్చు. “ఇహ్యా ఉలూం అల్-దిన్” అల్-ఘజాలి ముఖ్యమైన రచన  మరియు అన్ని ఇస్లామిక్ పండితుల ద్వారా చదవబడాలి.  

విద్యావంతులైన ముస్లింలు అందరూ అల్-గజ్జాలి యొక్క “కితాబ్ అల్-మున్కిద్ మిన్ అల్ దలాల్ (al-Munqidh min al-Dalal)” ను చదవవలసి ఉంటుంది. ఇందులో అల్-ఘజాలి పండిత  మరియు ఆధ్యాత్మిక సందేహాలు మరియు సత్యం  కోసం అల్-ఘజాలి  అన్వేషణ గ్రహించ వచ్చు.


అల్-ఘజాలి ప్రకారం ప్రభుత్వాధినేతకు కావలసిన లక్షణాలు

అల్-ఘజాలి "నసీహత్ అల్-ములూక్" లేదా "రాజులకు హితబోధలు" సెల్జూఘ్ ఖలీఫా కొరకు వ్రాశాడు. అల్-ఘజాలి ప్రకారం  రాజు  తన రాజ్యపరిపాలన కొరకు కనీసం దశ హితబోధనలు కలిగి ఉండాలని  సూచించాడు.

1.  తన భుజస్కంధాలపై ఉంచబడిన బాధ్యతల ప్రాముఖ్యాన్ని, అపాయాన్ని, రాజు గ్రహించవలెను. అధికారం ఒక వరం, ఈ అధికారాన్ని ధర్మబధ్ధంగా చెలాయిస్తే ఇటు రాజుకూ అటు ప్రజలకూ అనంత సుఖఃసంతోషాలు కలుగును, లేనిచో ఇటు రాజు  అటు ప్రజలు  దుఖానికి లోనౌతారు.

2. రాజు ఎల్లప్పుడూ ధార్మిక పండితులకు సంప్రదించడానికి తహతహలాడాలి, వీరి సలహాలు తీసుకొని రాజ్యాన్ని సుబిక్షంగా పాలించాలి.

3. పర స్త్రీవ్యామోహాన్ని తానూ త్యజించాలి తన అధికారవర్గం త్యజించాలి. అన్యాయాన్ని తానూ తన అధికారగణం సహించకూడదు. రాజు తన స్వంత జీవనచర్యల న్యాయాన్యాయాలను విచారించాలి, అలాగే తన అధికారగణ జీవనచర్యల న్యాయాన్యాయాలను విచారించాలి, అన్యాయాలుంటే శిక్షించాలి.

4. రాజు నిగర్విగాను, కోపతాపాలకు దూరంగానూ, పగ ద్వేషాలకు అతీతంగానూ ఉండాలి. కోపము జ్ఞానుల శత్రువుగా గుర్తించాలి. తనపాలనలో శాంతి, క్షమా, దయా కారుణ్యాలపట్ల తనూ తలొగ్గాలి ఇతరులనూ తలొగ్గేలా చేయాలి. క్షమాగుణాలను అలవర్చుకొనేలాచేయాలి.

5. ప్రతి విషయ సన్నివేశంలో రాజు తనకు తాను ప్రజగా భావించి ప్రజలకు అధికారులుగా భావించి కార్యక్రమాలు చేయాలి. తనకొరకు ఏమికోరుకుంటాడో ఇతరులకూ అవే అందజేయాలి. ఇలా చేస్తేనే తన అధికారాలను సద్వినియోగం చేస్తున్నట్లు.

6. రాజు న్యాయస్థానంలో ఫిర్యాదు దారుల ఫిర్యాదులను స్వయంగా పరిశీలించవలెను. ఫిర్యాది యొక్క సాధక బాధకాలను తెలుసుకోవడం రాజు యొక్క విద్యుక్తధర్మం. అన్యాయానికి తావు లేకుండా చూడవలసిన బాధ్యతకూడా రాజుదే.

7. రాజు అలంకారాలకు మోజులకు వ్యామోహాలకు బానిస కారాదు. అసలు వీటి జోలికే పోరాదు. హుందాగావుంటూ రాజ్యానికి మకుటంలా ఉండాలి గాని, అహంకారానికి పోయి రాజ్యానికి చేటు  తేకూడదు.

8. రాజు మృదువుగా మెలగడం అలవర్చుకోవాలి, క్రూరంగాను, అసభ్యంగాను, హింసించువాడు గాను ఉండకూడదు.

9. రాజును ప్రజలందరూ మెచ్చుకొనేలా రాజు మసలుకోవాలి. ప్రజలను గదమాయించి తనను పొగిడేలా చేసుకొనే రాజు అత్యల్పుడు. ప్రజలలో తనపట్లగల భావాలను ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ తన తప్పులున్నయెడల వాటిని తెలుసుకొని దిద్దుకుంటూ ప్రజలనోటిలో నాలుకలా మెలగాలి.

10.              అల్లాహ్ ను సంతుష్టుడిని చేసేందుకు ప్రతికార్యం సలపాలి. ప్రజల దగ్గర మెప్పు కోసం అల్లాహ్ ను వ్యతిరేకిగా చేసుకోరాదు. ఒకరిని అసంతుష్టుడిని చేసి అల్లాహ్ ను సంతుష్టుడిని చేయడం ఉత్తమం. ఒకరిని సంతుష్టుడిని చేసి అల్లాహ్ ను అసంతుష్టుడు చేయడం జరగరాదు.

తత్వవేత్తల యొక్క విరుద్ధమైన భావనలు అల్-ఘజాలి ప్రధాన రచన ఇస్లామిక్ జ్ఞానమీమాంస లో ముఖ్యమైనది. సంశయవాదంతో అల్-ఘజాలి అన్ని సంఘటనలకు కారణం   భౌతిక సంయోగాల మేళవింపు  కాదని దేవుని అభీష్టం(will of god)అని అభిప్రాయ పడినాడు. తరువాతి శతాబ్దంలో ఎవర్రోస్ అల్-ఘజాలి యొక్క విరుద్దానికి విరుద్దం ప్రకటించినాడు.

అల్-ఘజాలి రచనల ద్వారా ప్రభావితమైనవారు ఆట్రెకోర్ట్ నికోలస్థామస్ అక్వినాస్అబ్దుల్ ఖాదిర్ బేదిల్రీనే డెస్కార్టిస్మైమూనిడ్స్,రేమాండ్ మార్టిన్, ఫక్రుద్దీన్ రాజీ, షా వలిఉల్లా మొదలగు తత్వవేత్తలు ప్రభావితమైనారు. అల్-ఘజాలి 1111 ADలో మరణించినాడు.

 

 

 

No comments:

Post a Comment