23 December 2022

పస్మందా ముస్లింలు మరియు సమానత్వం కోసం వారి దశాబ్దాల సుదీర్ఘ పోరాటం-ఒక పరిశీలన Pasmanda Muslims and Their Decades-Long Fight for Equality-Review

 

అక్టోబరు 16, 2022న లక్నోలో బీజేపీ పస్మంద సదస్సులో వేదిక.

పస్మందా  ముస్లింలు భారతదేశంలోని మొత్తం భారత దేశ ముస్లిం జనాభాలో 85% కంటే ఎక్కువ మంది ఉన్నారు.

 “ఏక్ హాయ్ సఫ్ మే ఖరే హో గే మహమూద్-ఓ-అయాజ్

నా కోయి బందా రహా నా బందా నవాజ్.

భారతదేశంలోని ఇస్లాం అనుసరించే వారి మధ్య సమానత్వం ఉందని నిరూపించడానికి జాతీయ ఉర్దూ కవి అల్లామా ఇక్బాల్ పై కవితా పంక్తులు వ్రాసాడు.

పై ద్విపదలో ప్రస్తావన, సుల్తాన్ ఘజనీ మహమూద్ మరియు అతని బానిస అయాజ్,  ఇద్దరూ నమాజ్ చేయడానికి కొద్దిసేపు ఆగుతారు.

సుల్తాన్ ఘజనీ మహమూద్  తో పాటు  సుల్తాన్ బానిస అయాజ్‌ కూడా ఒకే వరుసలో నిలబడి ప్రార్థనలు చేసారు. ఈ క్షణం యజమాని మరియు  బానిస మధ్య ఉన్న అన్ని తేడాలను తుడిచిపెట్టింది.

భారతదేశంలోకి ప్రవేశించి, భారత దేశాన్ని తన నివాసంగా చేసుకున్న ఏ సమాజమూ కఠినమైన కుల వ్యవస్థను తాకకుండా ఉండలేదు. ఇస్లాం మరియు క్రైస్తవ మతం దానికి మినహాయింపు కాదు. అరేబియా, టర్కీ, పర్షియా, మధ్య ఆసియా మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ముస్లింలు తమను తాము స్వచ్ఛంగా భావించారు మరియు అందువల్ల స్థానికంగా మారిన వారి కంటే ఉన్నతంగా భావించారు.

ఇస్లాం మతం మారినవారిలో కూడా ఒక సోపానక్రమం ఉంది. అధిక కుల హిందువుల నుండి మతం మారిన వారిని వలసదారులు అంగీకరించారు. హిందూ శ్రామికవర్గం నుంచి మతమార్పిడిలు జరిగిన వారు,  వారి కంటే తక్కువగా పరిగణించబడ్డాయి. మునుపటిలాగే హిందూ దళితుల నుంచి  మతం మారినవారు "అంటరానివారు"గానే మిగిలిపోయారు.

1950లో హిందూ దళితులకు మాత్రమే రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు మరియు బౌద్ధ దళితులనుంచి మతం మారిన వారికి మాత్రం  రిజర్వేషన్లు ఇవ్వలేదు..

·       అయితే 1956లో, దళిత సిక్కులు, హిందువుల మాదిరిగానే రిజర్వేషన్లు పొందారు.

·       1990లో దళిత బౌద్ధులకు కూడా రిజర్వేషన్లు కల్పించారు.

·       కాని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ఉన్నప్పటికీ ముస్లిం మరియు క్రైస్తవ దళితులకు రిజర్వేషన్లు ఇవ్వ లేదు.

శ్రీ అన్వర్ అలీ ఉర్దూలో వ్రాసిన “మసావత్ కి జంగ్” అనే తన పుస్తకంలో మరియు వెనుకబడిన ముస్లింలను ఉద్ధరించడానికి స్థాపించిన “ఆల్ ఇండియా ముస్లిం పస్మoద మహజ్” అనే సంస్థ ఈ అంశాన్ని లేవనెత్తినింది.

పస్మంద అంటే పెర్షియన్ భాషలో " వదిలి వేయబడిన/ left behind " అని అర్థం. దీనిని ముస్లిం సంఘాలు తమను తాము చారిత్రాత్మకంగా మరియు సామాజికంగా అగ్రకులాలచే అణచివేయబడిన వర్గాలుగా నిర్వచించుకోవడానికి ఉపయోగించుకుంటాయి.

2004లో, మహారాష్ట్రలోని ముస్లిం ఖాటిక్ సమాజ్ మరియు కేరళలోని కొన్ని దళిత క్రైస్తవ సంస్థలు మతమార్పిడి తర్వాత దళితుల స్థితిగతులపై సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్‌ను దాఖలు చేశాయి.

రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టుకు ప్రతిస్పందిస్తూ, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్UPA ప్రభుత్వం మతపరమైన మరియు భాషాపరమైన మైనారిటీల కోసం జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్‌ను ఏర్పాటు చేసింది, ఇది మతపరమైన మత వివక్షను restriction రద్దు చేయాలని సూచించింది.

షెడ్యూల్డ్ కులాల జాతీయ కమీషన్ మరియు జాతీయ మైనారిటీ కమిషన్ కూడా మత వివక్షను నిర్మూలించాలని సిఫార్సు చేశాయి. అయితే, యుపిఎ ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయనందున ఈ సిఫార్సులు ప్రయోజనం పొందలేదు.

2014లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముస్లింలు, క్రైస్తవులను దళితులుగా చేర్చడానికి తాము అనుకూలం కాదని పార్లమెంటులో చెప్పింది. అలాంటి చర్య దేశం యొక్క జనాభా demography ను మారుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.

ఇదే రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టుకు ప్రతిస్పందిస్తూ, బిజెపి ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్‌లో జస్టిస్ కె.జి. బాలకృష్ణన్ కమిషన్ ఏర్పాటు చేసింది.

ఇప్పుడు, ప్రధాని నరేంద్ర మోడీ పార్టీ కార్యకర్తలకు 'స్నేహ్' మరియు 'సమ్మన్' యాత్రలు చేపట్టడం ద్వారా పస్మందా ముస్లిం సమాజానికి చేరువ కావాలని చెప్పారు.

BJP నినాదం 'స్నేహ్' మరియు 'సమ్మాన్' కార్యాచరణ దాలుస్తుందని తద్వారా ముస్లింలలోని పస్మoదా వర్గాలు లాభపడతాయని మరియు సామాజికంగా, రాజకీయంగా ఆర్ధికంగా మరింత అభివృద్ధి చెందుతాయని మరియు రిజర్వేషన్ సౌకర్యాలను పొందటం ద్వారా పురోభివృద్ది చెందుతారని  ఆశించుదాము.

-పర్వీన్ తల్హా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ మరియు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ అధికారి.

-12/DEC/2022 ది వైర్ సౌజన్యం తో 

No comments:

Post a Comment