భారతదేశంలో ఇస్లాం :
భారతదేశంలో హిందూమతం తరువాత రెండవ స్థానంలో గలదు. 2011 గణాంకాల ప్రకారం, భారత దేశం లో ముస్లిములు 17.22కోట్లు లేకా 14.2% గలరు. ప్రస్తుతం భారత్ లో ముస్లింలు ఇండోనేషియా, పాకిస్తాన్ ల తరువాత మూడవ స్థానంలో ఉన్నారు.
చరిత్ర:
ఇస్లాం తొలుత అరబ్బు వర్తకుల ద్వారా భారతదేశంలో ప్రవేశించింది. పిదప ఎనిమదవ
శతాబ్దపు తొలి పాదము నుండి భారతదేశముపై జరిగిన దండయాత్రల వల్ల (అరబ్బులు, తుర్కులు, పర్షియన్లు, అఫ్ఘాన్లు, మంగోలులు వగైరా) విస్తరించబడినది,
భారతదేశంలో మొదటి మస్జిద్ (మసీదు) సా.శ. 612లో చేరామన్ పెరుమాళ్ కాలంలో కేరళ లోని కొడుంగళూర్లో మాలిక్ బిన్ దీనార్ చే నిర్మింపబడింది.
మాలిక్ బిన్ దీనార్, ఒక సహాబీ.
మలబార్ లోని మాప్పిళాలు, భారదేశంలో ఇస్లాం స్వీకరించిన మొదటి సమూహం. వీరి సంబంధ బాంధవ్యాలు, వర్తకపరంగా అరబ్బులతోనూ, ఇతరులతోనూ ఉండేది.
మాలిక్ బిన్ దీనార్ ఆధ్వర్యంలో మతప్రచారాలు జరిగిన ఫలితంగా ఇక్కడ ఇస్లాం వ్యాప్తి
జరిగింది. ఇచ్చటి అనేక సమూహాలు ఇస్లాంను స్వీకరించాయి. ఈ ప్రాంతాలలో నేటికినీ అరబ్బు
జాతులను చూడవచ్చు.
చరిత్రకారుడు ఈలియట్, డౌసన్ తమ పుస్తకం
"హిస్టరీ ఆఫ్ ఇండియా యాజ్ టోల్డ్ బై ఇట్స్ ఓన్ హిస్టారియన్స్" ప్రకారం, ముస్లిం యాత్రికులకు చెందిన నౌక, సా.శ. 630లో వీక్షించబడింది.
హెచ్.జీ.రాలిన్‌సన్, ఇతని పుస్తకం: "ఏన్షియంట్ అండ్ మెడీవల్ హిస్టరీ
ఆఫ్ ఇండియా" ప్రకారం, ముస్లింలు 7వ శతాబ్దంలో
భారత్ తీరంలో స్థిరనివాసాలు యేర్పరచుకున్నారు. అరబ్ వర్తకుల ద్వారా ఇస్లాం అనేక చోట్ల వ్యాపించింది, వీరెక్కడ వర్తకాలు చేశారో అచ్చట ఇస్లాంను వ్యాపింపజేశారు.
8వ శతాబ్దంలో, సింధ్ రాష్ట్రం (నేటి పాకిస్తాన్)
లో సింధ్ రాజు దాహిర్, సిరియాకు చెందిన అరబ్బు వర్తకులను బందీలు
చేసుకున్నప్పుడు, వారిని విడిపించుటకు, అప్పటి ఖలీఫా, ఒక సైన్యాన్ని ముహమ్మద్ బిన్ ఖాసిం ఆధ్వర్యంలో పంపాడు. ఆ విధంగా సింధ్ రాష్ట్రం ఉమయ్యద్ ఖలీఫాల వశమైనది.
10వ శతాబ్దంలో మహమూద్ గజనీ, తన గజ్నవీడు సామ్రాజ్యం లోకి అప్పటి పంజాబ్ ప్రాంతంపై దండెత్తి, కలుపుకున్నాడు.
12వ శతాబ్దంలో ముహమ్మద్ ఘోరీ భారత్ పై దండయాత్ర సల్పి, భారత్ లో తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఢిల్లీ సుల్తానుల పరిపాలన ఆవిధంగా
ఆరంభమైనది. ఈ సామ్రాజ్యపు మొదటి సుల్తాన్ బానిస వంశపు సుల్తాను కుతుబుద్దీన్ ఐబక్.
మధ్యయుగం నాటి ప్రస్తుత
పాకిస్తాన్ లోని చాలా ప్రాంతాలు, భారత్ లోని అనేక
ప్రాంతాలలో, టర్కో-ముస్లిం దండయాత్రల మూలాన ముస్లింలు భారతదేశానికి
వచ్చారు, ఇక్కడే స్థిరనివాసమేర్పరచుకున్నారు. వీరి రాకతో, మతపరమైన విషయాలు, కళలు, తత్వము, సంస్కృతి, సామాజిక-రాజకీయ విషయాలలో ఇస్లాం తన ప్రభావాన్ని
కలుగజేసింది.
నవీన యుగంలో దక్షిణాసియా లోని ముస్లింలు, ఈ ప్రాంత చరిత్రలో తమ వంతు పాత్రను పోషించగలిగారు.
మాజీ రాష్ట్రపతి ఐన ఏ.పి.జె. అబ్దుల్ కలామ్, ఇంతకు పూర్వం గల ఇద్దరు
ముస్లిం రాష్ట్రపతులు,, అసంఖ్యాక రాజకీయవేత్తలు, రాజకీయనాయకులూ, ఆటగాళ్ళూ, సినిమా ప్రముఖులూ, భారతదేశంలోని ప్రజలతో, సంస్కృతిలో మమేకమై, భారతదేశ ప్రాశస్తాన్ని
నలువైపులా చాటారు.
కేరళ , తమిళనాడులో ఇస్లాం:
మాలిక్ బిన్ దీనార్ మరియు 20 మంది ముహమ్మద్ ప్రవక్త అనుయాయులు, మొదట కేరళలోని, కొడుంగళూర్ వచ్చారు. వీరు భారతదేశంలో ప్రవేశించినపుడు, ఈ రాష్ట్రాలలో ఇస్లాం మతానికి మంచి స్పందన లభించింది. తదనంతరం, ఇతర రాష్ట్రాలలో కూడా మంచి స్పందన లభించింది. ఇస్లామీయ తత్వం, ఏకేశ్వరోపాసక నియమం, సర్వమానవ సోదరభావన, సమానత్వాల ప్రవచనాలు, శాస్త్రాలతో కూడిన ఖురాన్, సాదా సీదా జీవన సరళి, మున్నగు విషయాలు ప్రజలపై ప్రభావం చూపాయి. మాలిక్ బిన్ దీనార్ మొదటి మస్జిద్ ను నిర్మించాడు, ఈ మస్జిద్, హిందూ దేవాలయ శైలి (కేరళ శైలి) లో నిర్మింపబడింది. భారతదేశంలోనే కాక భారత ద్వీపకల్పంలోనే ఇది ప్రథమ మస్జిద్ కూడానూ. ఇది. 629 లో నిర్మింపబడినదని భావిస్తున్నారు. మరి ఒక ముఖ్యమైన ప్రాముఖ్యతను ఈ మస్జిద్ సంతరించుకొంది. అది యేమనగా, సౌదీ అరేబియా లోని మదీనా తరువాత ఈ మస్జిద్ 'శుక్రవారపు ప్రార్థనలు' జరుపుకున్న ప్రపంచంలోనే రెండవ మస్జిద్.
చోళ సామ్రాజ్య పతనం తరువాత, క్రొత్తగా యేర్పడిన విజయనగర సామ్రాజ్యానికి చెందిన వర్తకులు, ఉస్మానియా సామ్రాజ్యానికి చెందిన సెల్జుక్ తురుష్కులను, 1279లో వ్యాపార వ్యవహార నిమిత్తం ఆహ్వానించారు. తరువాత తురుష్క వర్తకులు, పెద్ద యెత్తున, తరంగంబాడి (నాగపట్టణం), కరైకల్, ముత్తుపేట్, కూతనల్లూర్, పొడక్కుడిలో వాణిజ్యకేంద్రాలు ధార్మిక కేంద్రాలూ, నెలకొల్పారు. టర్కిష్-అనటోలియా, టర్కిష్-సఫవీదుల శిలాఫలకాలు, తంజావూరు, తిరువరూర్, అనేక గ్రామాలలో కానవస్తాయి.
1300 లో అరబ్బులు, నాగూరు, కిలక్కరై, అడిరాంపట్టణం, కాయల్పట్నం, ఎర్వాడి, శ్రీలంక లలో షాఫయీలు, (వీరు ఈ ప్రాంతాలలో
మరక్కర్ లుగా గుర్తింపు కలిగినవారు) స్థిరనివాసాలేర్పరచుకున్నారు. ఈ మరక్కర్
మిషనరీలు, ఇస్లామీయ బోధనలు వ్యాప్తిచేస్తూ, మలయా, ఇండోనేషియా ప్రాంతాలలో ఇస్లాంను వ్యాపింపజేశారు
సూఫీ తత్వం , ఇస్లాం వ్యాప్తి:
భారతదేశంలో ఇస్లాం వ్యాపించడానికి ముఖ్యకారకుల్లో సూఫీ
తత్వజ్ఞులు విశేషమైనవారు. వీరు భారతదేశంలో ఇస్లాం
వేళ్ళూనుకొనుటకo లో తమ పాత్రను అమోఘంగా
సఫలీకృతులైనారు.
ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి, నిజాముద్దీన్ ఔలియా, షాహ్ జలాల్, అమీర్
ఖుస్రో, ఖ్వాజా బందా నవాజ్, ఖాదిర్ ఔలియా మున్నగువారు ఈ కోవకు
చెందినవారు. ఈ సూఫీ తత్వము, భారతదేశంలోని అన్నివర్గాలనూ ఇస్లాంలోకి ఆహ్వానించడానికి
చక్కని కారకమైనది. హిందూ తత్వజ్ఞానమూ, ఇస్లాం సూఫీ తత్వమూ, బొమ్మా-బొరుసుల్లా, ఒకే నాణేనికి రెండువైపుల్లా ప్రజలకు కానవచ్చాయి.
ఇస్లాంలోని ఏకేశ్వరోపాసన, సమాన సౌభ్రాతృత్వాలూ, సాదాసీదా జీవనం, ఈ సూఫీ తత్వానికి తోడై, ప్రజలు తండోపతండాలుగా ఇస్లాంలో ప్రవేశించుటకు మార్గం
సుగమం చేసింది.
భారతదేశంలో సూఫీలు, ఎక్కడనూ సంఘర్షణపడ్డారని, లేదా సంఘర్షణాత్మక ధోరణి అవలంబించారని, లేదా హింసామార్గాలను
అవలంబించారని, చరిత్రలో కానరాదు. వీరు శాంతియుతంగా ప్రజలతో మెలగారు.
భారతదేశంలోని అంటరానితనం, అస్పృశ్యత, కులవిధానాలు, వర్ణవిభేదాలు కూడా, ఇస్లాం వ్యాప్తికి పరోక్షంగా తోడ్పడ్డాయి. అహ్మద్ సర్హిందీ, నఖ్ష్‌బందీ సూఫీలు శాంతియుతంగా
ఎందరో హిందువులను ఇస్లాంవైపు ఆకర్షితులయేటట్లు చేయగలిగారు.
భారత స్వతంత్ర సంగ్రామంలో ముస్లింల పాత్ర:
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా భారత స్వతంత్ర సంగ్రామంలోని ముస్లిం ఉద్యమకారులలో
ముఖ్యంగా కవులు, రచయితలు కానవస్తారు. వీరిలో ప్రముఖులు మౌలానా అబుల్ కలాం ఆజాద్, హకీం అజ్మల్ ఖాన్, రఫీ అహ్మద్ కిద్వాయి మొదలగువారు. షాజహాన్ పూర్కు చెందిన ముహమ్మద్ అష్ఫాకుల్లా ఖాన్, బ్రిటిష్ వారి ఖజానాను కొల్లగొట్టి వాటిని, స్వతంత్ర సంగ్రామంలోని
ఉద్యమకారులకు పంచిపెట్టాడు. సరిహద్దు గాంధీగా ప్రసిద్ధిపొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, భారత స్వతంత్రంకోసం
పోరాడి తన 95 సంవత్సరాల జీవితంలోని 45 సంవత్సరాలు జైలులో గడిపిన దేశభక్తుడు. భోపాల్కు చెందిన బర్కతుల్లా గద్దర్ పార్టీ స్థాపకుల్లో ఒకడు. సయ్యద్ రహ్మత్ షా గద్దర్ పార్టీకి చెందిన అండర్-గ్రౌండ్ ఉద్యమకారుడు, ఫ్రాన్స్‌లో తనకార్యకలాపాలు కొనసాగించాడు. ఫైజాబాదుకు చెందిన అలీ అహ్మద్ సిద్దీఖీ, మలయా, బర్మా లలో ఉంటూ సిపాయిల తిరుగుబాటు కొరకు సయ్యద్ ముజ్తబా హుసేన్తో పథకం వేసి పట్టుబడి 1917 లో ఉరి తీయబడ్డాడు. కేరళకు చెందిన వక్కోమ్ అబ్దుల్ ఖాదర్ క్విట్
ఇండియా ఉద్యమంలో పాల్గొని బ్రిటిష్ వారిచే ఉరితీయబడ్డాడు.
బాంబేకి చెందిన ఉమర్ సుభానీ ఒక పారిశ్రామికవేత్త, కోటీశ్వరుడు, కాంగ్రెస్ పార్టీకి కావలసిన మొత్తం డబ్బును మహాత్మా
గాంధీకి సమకూర్చేవాడు, తుదకు భారతస్వాతంత్ర్యం కొరకు తన ప్రాణాలనే
అర్పించాడు. ముస్లిం స్త్రీలలో హజరత్ మహల్, అస్గరీ బేగం, బీ అమ్మా మున్నగువారు
బ్రిటిషువారికి వ్యతిరేకంగా స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు.
బ్రిటిషువారికి వ్యతిరేకంగా, హైదర్ అలీ కుమారుడైన టిప్పూ
సుల్తాన్ తన బలాలన్నీ ఉపయోగించి నిరోధించడానికి ఉపయోగించాడు.
ఐరోపాకు తెలియని యుద్ధరంగ రాకెట్లు తగ్రఖ్‌లు ఉపయోగించాడు. ఆఖరుకు 1799 లో టిప్పూ సుల్తాన్, శ్రీరంగపట్టణంలో ఓడిపోయాడు.
బెంగాల్ నవాబు అయిన సిరాజుద్దౌలా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దురుద్దేశాలను గ్రహించి, వారి కార్యకలాపాలకు
వ్యతిరేకంగా సన్నాహాలు ప్రారంభించాడు. 1757లో ప్లాసీ
యుద్ధంలో బ్రిటిష్ వారితో ఓడిపోయాడు. మొదటి భారత స్వతంత్ర
సంగ్రామం లేదా సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగినపుడు, ముస్లింలలోని అగ్రకులాలను తమ టార్గెట్ గా బ్రిటిష్
వారు ఎంచుకున్నారు. కారణం వీరి ఆధ్వర్యంలోనే సిపాయిల తిరుగుబాటు ఊపందుకుంది.
ఢిల్లీ, పరిసరప్రాంతాలలో వీరే, బ్రిటిషువారికి కొరకరాని
కొయ్యలయ్యారు. ఢిల్లీ లోని ఎర్రకోట గుమ్మానికి వేలాదిమంది ముస్లింలను ఉరితీసారు. అందుకే దీని ద్వారాన్ని ఖూనీ దర్వాజాగా ప్రజలు పిలుస్తారు. ప్రఖ్యాత ఉర్దూ కవి మిర్జా
గాలిబ్ (1797-1869) తన లేఖారచనలైన 'గాలిబ్ లేఖలు' లో దీనిగురించి వర్ణించాడు. ఈ రచనలను రాల్ఫ్ రస్సెల్, ఖుర్షీదుల్ ఇస్లాంలు క్రోడీకరించి తర్జుమాలు చేశారు, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ
ప్రెస్ దీనిని ప్రచురించింది.
మొఘల్ సామ్రాజ్య పతనం తరువాత, భారతదేశంలో ముస్లింలు క్రొత్త సవాళ్ళను ఎదుర్కోవలసివచ్చింది - వాటిలో
ముఖ్యమైనవి, సభ్యత, ఇష్టాయిష్టాలను
కాపాడుకోవడం, కొత్తప్రభుత్వాలతోనూ, శాస్త్రవిజ్ఞానాలలో
ముందంజలోఉన్న బ్రిటిషు వారి తో మమేకం కావడం ఇష్టంలేకపోయిననూ రాజీపడడం.
ఈ కాలంలో ఫిరంగీ మహల్, మొదట్లో బారాబంకీ లోని సెహాలీలో తరువాత 1690 నుండి లక్నో కేంద్రం చేసుకుని, ఓ విద్యాకేంద్రంగా ముస్లింలకు విద్యాపరంగా సహాయపడి, మార్గదర్శకత్వం చేసింది. ఉత్తరప్రదేశ్కు చెందిన దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ ఇస్లామీయ, ముస్లింల మనోభావాలకనుగుణంగా 'భారత స్వతంత్ర సంగ్రామం' లో ప్రభావితం కలుగజేసే పాత్రను పోషించింది.
బ్రిటిష్ కాలంలో భారత స్వాతంత్ర్యం కొరకు పోరాడిన కొందరు ప్రముఖులు :
మౌలానా అబుల్ కలాం ఆజాద్, హకీం అజ్మల్ ఖాన్, హస్రత్ మోహానీ, డా. సయ్యద్ మహమూద్, ప్రొఫెసర్ మౌల్వీ బర్కతుల్లా, డా. జాకిర్
హుసేన్, సైఫుద్దీన్ కిచ్ల్యూ, అల్లామా షిబ్లీ నౌమానీ, వక్కోం అబ్దుల్ ఖాదర్, డా. మంజూర్ అబ్దుల్ వహాబ్, బహాదుర్ షా
జఫర్, హకీం నుస్రత్ హుసేన్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సమద్ అచక్‌జాయి, కోలోనెల్ షాహ్ నవాజ్, డా. యం.ఏ. అన్సారీ, రఫీ అహ్మద్ కిద్వాయీ, ఫకృద్దీన్ అలీ అహ్మద్, అన్సర్ హర్వానీ, తాక్ షేర్వానీ, నవాబ్ వికారుల్ ముల్క్, నవాబ్ మొహ్సినుల్ ముల్క్, ముస్తఫా హుసేన్, వీ.యం. ఉబైదుల్లా, ఎస్.ఆర్. రహీం, బద్రుద్దీన్ తయ్యబ్ జీ, మౌల్వీ అబ్దుల్ హమీద్.
1930 లలో ముహమ్మద్ అలీ జిన్నా భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడిగా స్వాతంత్ర్య సంగ్రామంలో
పాల్గొన్నాడు. డా.సర్ ముహమ్మద్ ఇక్బాల్, ఉర్దూ కవి, తత్వవేత్త, హిందూ-ముస్లిం సఖ్యత కొరకు బలీయంగా పాటుపడినవారిలో
ఒకడు.
మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్, మౌలానా షౌకత్ అలీ ఇరువురూ సోదరులు, వీరిని 'అలీ సోదరులు' అనికూడా అభివర్ణిస్తారు
(ఖిలాఫత్
ఉద్యమం ఫేమ్), మహాత్మా
గాంధీతో కలసి భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు.
మౌలానా అబ్దుల్ బారీ ఫిరంగీ మహల్ కు
చెందినవాడు. ఇతను గాంధీతో కలసి పోరాడాడు. ముహమ్మద్ ఇక్బాల్ మరణించిన తరువాతి
కాలంలో, ముహమ్మద్ అలీ జిన్నా, నవాబ్ జాదా లియాఖత్ అలీ ఖాన్, హుసేన్ షహీద్ సుహర్ వర్దీ, ఇతరులు కొందరు
పాకిస్తాన్ వాదాన్ని లేపి, దేశ విభజనకు కారకులయ్యారు. భారతదేశం లోని కొన్ని
శక్తులు వీరికి తోడ్పడ్డాయి, బ్రిటిషు వారు ద్విజాతి
సిద్ధాంతాన్ని ప్రోత్సహించి, పోతూ పోతూ దేశాన్ని
ముక్కలు చేసి మరీ వెళ్ళారు.
చట్టం , రాజకీయాలు:
భారతదేశంలో ముస్లింలు ముస్లిం పర్సనల్ లా అప్లికేషన్ ఆక్టు 1937, (షరియా చట్టాలు) ద్వారా తమ వైయుక్తిక జీవితాలు
గడుపుతారు. ఈ చట్టం ముస్లింల వ్యక్తిగత విషయాలైన నికాహ్, మహర్, తలాక్ (విడాకులు), నాన్-నుఫ్ఖా (విడాకులు తరువాత జీవనభృతి), బహుమానాలు, వక్ఫ్, వీలునామా, వారసత్వాలు, అన్నీ ముస్లిం పర్సనల్ లా ప్రకారం అమలుపరచ బడుతాయి. భారతదేశంలోని
న్యాయస్థానాలన్నీ ఈ షరియా నియమాలను ముస్లింలందరికీ వర్తింపజేస్తాయి. ఈ ముస్లిం
పర్సనల్ లాను సమీక్షించేందుకు, పరిరక్షించేందుకు, ప్రాతినిధ్యం వహించేందుకు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా
బోర్డు స్థాపించబడింది.
నవీన భారత్ లో ముస్లింలు:
భారతదేశంలోని మొత్తం జనాభాలో ముస్లింలు 14.2% గలరు. ఇతర మైనారిటీలలాగా, వీరుకూడా, భారత అభ్యున్నతికి తమ శాయశక్తులా పాటుపడుతున్నారు. కాని వీరి, సరాసరి ఆదాయం, ఇతర మతస్తుల కంటే చాలా తక్కువస్థాయిలో ఉంది. దీనికి గల కారణాలు, స్త్రీలలో నిరక్ష్యరాస్యత, సాధారణ నిరక్ష్యరాస్యత, అధిక సంతానం, నిరుద్యోగం, పేదరికం, భూములు లేకపోవడం, శాస్త్ర సాంకేతిక రంగాలలో విద్య, పరిజ్ఞానాలు లేకపోవడం, విద్యా విజ్ఞానాల పట్ల నిర్లక్ష్యవైఖరులూ మొదలగునవి.
సచార్ కమిటీ నివేదికల ప్రకారం, 4% భారతీయ ముస్లింలు, తమ పిల్లలను మదరసా లకు పంపిస్తున్నారు, ఇచ్చట ప్రధాన మాధ్యమం ఉర్దూ. మిగతా 96% మంది తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తున్నారు.
ప్రసిద్ధి చెందిన భారతీయ ముస్లింలు ఖ్వాజా అబ్దుల్ హమీద్, ఇతను 1935 లో 'సిప్లా' అనే భారతీయ
ఫార్మాసూటికల్ కంపెనీని స్థాపించాడు. మహాత్మాగాంధీ ఈ కంపెనీని సందర్శించినపుడు, 'భారతీయ కంపెనీని చూసి గర్వపడుతున్నాను' అని అన్నాడు. ఈ కంపెనీ
నేటికి 150 దేశాలకు ఫార్మాసూటికల్స్ ను ఎగుమతిచేస్తూ, యావత్-భారతానికీ సేవలందిస్తోంది.
స్వతంత్ర భారతావనిలోముగ్గురు ముస్లింలు రాష్ట్రపతి పదవులను అలంకరించారు. వీరు, డా. జాకిర్
హుసేన్, ఫకృద్దీన్ అలీ అహ్మద్, ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ లు.
సలీం అలీ (విహంగాల అధ్యయన శాస్త్రవేత్త) నవంబరు 12 1896 - జూలై 27 1987) భారతదేశానికి చెందిన, పక్షుల అధ్యయన శాస్త్రవేత్త, ప్రకృతి పరిశోధకుడు. ఇతనిని "బర్డ్-మ్యాన్ ఆఫ్ ఇండియా" అని
పిలుస్తారు. భారతదేశంలో పక్షుల గూర్చి సర్వేలను చేపట్టాడు. ఇతర వన్యమృగాల
గురించియూ సర్వేలు చేశాడు.
అజీమ్
ప్రేమ్‌జీ 'విప్రో' సంస్థ అధినేత. విప్రో, ఒక ప్రముఖ సాఫ్ట్ వేర్ ఔట్ సోర్సింగ్ కంపెనీ. సిప్లాకు చెందిన అబ్దుల్ హమీద్, విప్రోకు చెందిన అజీం ప్రేంజీ లను భారతప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాలతో 2005లో సత్కరించింది.
డా.సాబూ అలియార్, జనాభా గణికుడు, వైద్య పరిశోధకుడు.
కెనడానందు తన పరిశోధనలు చేపట్టాడు.
పత్రికారంగంలో ఎందరో ప్రముఖులు తమ వనరులను భారతదేశమును పటిష్ఠ స్థితిలో ఉంచుటకు
నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఉదాహరణకు, అజీజ్ బర్నీ (సహారా
ఉర్దూ), ఎం.జే. అక్బర్, జాహెద్ అలీ ఖాన్
(సియాసత్ ఉర్దూ) హైదరాబాదు, జోయ్ అన్సారీ, ఫరీద్ జకరియా, ఇర్ఫాన్ హుసేన్, హసన్ కమాల్, సాదియా దేహ్లవీ, సయ్యద్ అక్బర్, రఫీక్ జకరియా, సయీద్ నక్వీ, షరీఫ్ అమీరుద్దీన్ ఇస్‌హాకీ, సబా నక్వీ, అస్లం ఫర్షోరీ, ఆబిద్ అలీ ఖాన్, మహమూద్ హుసేన్ జిగర్, ఖాలిద్ అన్సారీ (మిడ్-డే, ముంబై) పుత్తూర్ ముహమ్మద్, బుర్హానుద్దీన్ ఒవైసీ, ఎం.ఎ.బాసిత్.
సచార్ కమిటీ
సచార్
కమిటీ నివేదిక (ఇది ప్రభుత్వ నివేదిక)ల ప్రకారం, ముస్లింలు అనేక రంగాలలో ఉదాహరణకు ప్రభుత్వ, సామాజిక రంగాలలో తక్కువ ప్రాతినిధ్యం
వహిస్తున్నారు.
భారత దేశం లోని అన్ని ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో ముస్లింలు కేవలం 4.9% మాత్రమే ఉన్నారు. సచార్
కమిటి నివేదిక ప్రకారం వీరి స్థితి SCల కన్నా దారుణం గా ఉంది.
ముస్లింలు, వ్యవసాయ, సేవా, సహజ వనరుల అభివృద్ధి రంగాలలో రావాలి. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలోనూ రావాలి. సచార్ కమిటీ నివేదికల ప్రకారం, భారతదేశంలో 14.2% వున్న ముస్లింలకు, వ్యవసాయ భూమి కేవలం 1%
ఉంది. అనగా వీరు వ్యవసాయ రంగంలో లేరు, వీరు ప్రభుత్వాలనుండి
భూములు పొంది వ్యవసాయ రంగంలో ముందుకు రావాలి. ముస్లింలు పట్టణ, నగర ప్రాంతాలలో ఎక్కువగా నివసిస్తున్నారు. 'స్లమ్' యేరియాలలో నివాసాలెక్కువ. పల్లెలలో నివాసాలు తక్కువ, దీనికి కారణాలు వెతకాలి.
రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫార్సులు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ముస్లింలకు 10 శాతం, ఇతర మైనార్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రంగనాథ్ మిశ్రా కమిషన్
సిఫార్సు చేసింది. అలాగే అన్ని మతాల్లోని దళితులకు ఎస్సీ హోదా కల్పించాలని, ముస్లింలు, క్రైస్తవులు, జైన్లు, పార్సీలను ఎస్సీ పరిధి నుంచి మినహాయిస్తూ 1950లో వెలువరించిన ఆదేశాలను రద్దు
చేయాలని పేర్కొంది. ఎస్సీ హోదాను హిందువులకు మాత్రమే పరిమితం చేస్తూ అప్పట్లో ఆ
ఉత్తర్వులిచ్చారు. అనంతరం బౌద్ధులు, సిక్కులకు కూడా అవకాశం
కల్పించారు.
ముస్లింల విద్యాలయాలు
భారతదేశంలో అనేక ముస్లిం విద్యాసంస్థలున్నాయి:
Ø అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (స్థాపకుడు : సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్)
Ø దారుస్సలాం ఎడ్యుకేషన్ ట్రస్ట్ (ఇందులో, డక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, డక్కన్ స్కూల్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్‌మెంట్, డక్కన్ కాలేజ్ ఆఫ్
మెడికల్ సైన్సెస్, మొదలగు విద్యాసంస్థలు గలవు.)
Ø అల్-బర్కాత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్,
Ø మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ సొసైటీ
ఔరంగాబాదు,
Ø డా.రఫీక్ జకరియా క్యాంపస్, ఔరంగాబాదు.
Ø అల్-అమీన్ ఎడ్యుకేషన్ సొసైటీ, బెంగళూరు ,
Ø క్రిసెంట్ ఇంజనీరింగ్ కాలేజ్, అల్-కబీర్ ఎడ్యుకేషనల్
సొసైటీ.
సాంప్రదాయక ఇస్లామీయ విశ్వవిద్యాలయాలు ::
జనాభా గణాంకాలు:
భారతదేశంలో ఇస్లాం అతిపెద్ద మైనారిటీ మతం, ముస్లింలు 2011 జనగణనాల ప్రకారం 14.2% లేదా 17.2కోట్లమంది జనాభా కలరు. కానీ కొందరు ప్రకారం భారతదేశంలో
ముస్లింలు 20% గలరు"
2011 గణాంకాల ప్రకారం భారత దేశం లోని వివిధ రాష్ట్రాలలో ముస్లిం జనాభా మరియు
వారి శాతం:
రాష్ట్రం State |
మొత్తం
జనాభా Total
Population |
ముస్లిం
జనాభా Muslim
Population |
మొత్తం
జనాభా లో శాతం % of
Total |
Significance |
64,473 |
62,268 |
96.58 % |
Majority |
|
12,541,302 |
8,567,485 |
68.31 % |
Majority |
|
31,205,576 |
10,679,345 |
34.22 % |
Significant |
|
91,276,115 |
24,654,825 |
27.01 % |
Significant |
|
33,406,061 |
8,873,472 |
26.56 % |
Significant |
|
199,812,341 |
38,483,967 |
19.26 % |
Significant |
|
104,099,452 |
17,557,809 |
16.87 % |
Significant |
|
32,988,134 |
4,793,994 |
14.53 % |
Minority |
|
10,086,292 |
1,406,825 |
13.95 % |
Minority |
|
61,095,297 |
7,893,065 |
12.92 % |
Minority |
|
16,787,941 |
2,158,684 |
12.86 % |
Minority |
|
112,374,333 |
12,971,152 |
11.54 % |
Minority |
|
60,439,692 |
5,846,761 |
9.67 % |
Minority |
|
84,580,777 |
8,082,412 |
9.56 % |
Minority |
|
68,548,437 |
6,215,377 |
9.07 % |
Minority |
|
3,673,917 |
316,042 |
8.60 % |
Minority |
|
380,581 |
32,413 |
8.52 % |
Minority |
|
2,855,794 |
239,836 |
8.40 % |
Minority |
|
1,458,545 |
121,564 |
8.33 % |
Minority |
|
243,247 |
19,277 |
7.92 % |
Minority |
|
25,351,462 |
1,781,342 |
7.03 % |
Minority |
|
72,626,809 |
4,774,695 |
6.57 % |
Minority |
|
1,247,953 |
75,556 |
6.05 % |
Minority |
|
72,147,030 |
4,229,479 |
5.86 % |
Minority |
|
1,055,450 |
51,447 |
4.87 % |
Negligible |
|
2,966,889 |
130,399 |
4.40 % |
Negligible |
|
343,709 |
12,922 |
3.76 % |
Negligible |
|
1,978,502 |
48,963 |
2.47 % |
Negligible |
|
6,864,602 |
149,881 |
2.18 % |
Negligible |
|
41,974,218 |
911,670 |
2.17 % |
Negligible |
|
25,545,198 |
514,998 |
2.02 % |
Negligible |
|
1,383,727 |
27,045 |
1.95 % |
Negligible |
|
27,743,338 |
535,489 |
1.93 % |
Negligible |
|
610,577 |
9,867 |
1.62 % |
Negligible |
|
1,097,206 |
14,832 |
1.35 % |
Negligible |
భారతదేశంలోని అత్యధిక ముస్లింలు, దర్గాహ్ లను, సూఫీ సంత్ లను, దుఆల కొరకు సందర్శిస్తారు.
భారతదేశంలోని ముస్లింల సముదాయం, అధికంగా, సున్నీ బరేల్వీ సూఫీ సాంప్రదాయాలను అనుకరిస్తారు. ఈ సూఫీ తరీఖా, షరియా సూత్రాలకు కొంత విరుద్ధంగా కనిపించినా తత్వజ్ఞానం మారిఫత్, అవలంబీకరణ్ తరీఖత్, సత్యం హకీకత్ ల చుట్టూనే వుంటుంది. సూఫీలు ఏకేశ్వరోపాసనేగాక, ఈశ్వరప్రేమను పొందే ప్రేమమార్గాన్నీ బోధిస్తారు. భారతదేశంలో ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి, హజరత్ నిజాముద్దీన్ ఔలియాలు ప్రముఖ ఔలియాలు. భారత దేశం లో సూఫీ నాలుగు తరీఖాల వారు ఉన్నారు. ఆ తరీఖాలు, ఖాదరియా, చిష్తియా, నఖ్ష్‌బందియా, సహర్‌వర్ధియా. ఈ తరీఖాల పరంపరలు కొనసాగుతూ ప్రజలకు ధార్మిక బోధనలు గావిస్తూ, ఇస్లామీయ తత్వం అనే మార్గంపై నడిపిస్తూనే ఉన్నాయి.
జామా మస్జిద్ (ఢిల్లీ) దీనికే "మస్జిద్-ఎ-జహాఁ నుమా" అనే పేరూ ఉంది.
భారతీయ నిర్మాణ శైలులు, ఇస్లామీయ శైలుల ప్రవేశంతో, ఓ కొత్తరూపాన్ని సంతరించుకున్నాయి. 12వ శతాబ్దం నుండి ఈ ఇస్లామీయ శైలులు, భారతశైలులతో కలసి, ఇండో-ఇస్లామీయ శైలులనే కొత్త శైలితో అందరినీ
అలరించాయి.
ఇస్లామీయ నిర్మాణాలలో 'ఆర్క్' ల ఉపయోగాలెక్కువ.
ఇస్లాంలో జంతుజీవజాలబొమ్మలు, మానవుల బొమ్మలు, శిల్పాలు, నిషేధం. అందుకొరకే, పూల తీగలు, సన్నని పూల, తీగల, సన్నని చెట్ల రూపాలు
అధికంగా కానవస్తాయి. ఇరాన్ డిజైనుల శైలి పియత్రా దురా శైలి ఎక్కువగా
కనబడుతుంది. అరబ్బులు, తురుష్కులు, మస్జిద్‌లు, మీనార్లను ఎక్కువగా నిర్మించారు. వీరి నిర్మాణాలలో మస్జిద్‌లు, మీనార్లు కోటలు, నగరాలు, సమాధులు (హుమాయూన్
సమాధి, అక్బర్ సమాధి, ముంతాజ్ మహల్ సమాధి (తాజ్ మహల్), ఔరంగజేబు తన భార్య గుర్తుగా బీబీ కా మక్బరా, ఔరంగాబాదులో నిర్మించాడు.) కానవస్తాయి.
మస్జిద్‌లు : మస్జిద్ ల నిర్మాణాలలో, స్తంభాలతో గూడిన వరండా, ఆవరణం, మింబర్, మిహ్రాబ్, గుంబద్, మీనార్లు కానవస్తాయి. ఇవియేగాక వజూ కొరకు వజూఖానాలు, నీటికొలనులు 'హౌజ్' లూ కానవస్తాయి.
సమాధులు : ఔరంగజేబు సమాధి చాలా సీదాసాదాగా వుంటే, షాజహాన్ భార్య ముంతాజ్ మహల్ సమాధి తాజ్ మహల్ హంగామాతో కూడి వుంటుంది. ఇలాంటి నిర్మాణాలకు ఇస్లామీయ శైలి అనే కంటే, ముస్లింల సమాధుల శైలి అంటే బాగుంటుంది, (ఇస్లాం ధర్మాను సారం
సమాధులపై నిర్మాణాలు నిర్మించరాదు). హుమాయూన్
సమాధి, అక్బర్ సమాధి, జహాంగీర్ సమాధి, ఇలా చక్రవర్తులందరి సమాధులూ కానవస్తాయి. ఈ సమాధుల నిర్మాణశైలి, హుజ్రాహ్, జరీహ్, మక్బరా, ఖబ్ర్, గుంబద్, రౌజా లతో కూడివుంటుంది.
ఇస్లామీయ నిర్మాణ శైలులను మూడు వర్గాలుగా విభజించవచ్చును : 1. ఢిల్లీ శైలి (1191 నుండి 1557 వరకు); 2. రాష్ట్రాల శైలి, ఉదాహరణకు జౌన్ పూర్, దక్కన్;, 3. మొఘల్ శైలి (1526 నుండి 1707 వరకు)
చేరామన్ పెరుమాళ్ జుమా మస్జిద్ మలబార్ తీరంలో ఉంది. భారత్ లో ప్రప్రథమ మస్జిద్.
No comments:
Post a Comment