ప్రపంచంలోని 500 మంది
ప్రభావవంతమైన ముస్లిం వ్యక్తుల జాబితా 2023 సంవత్సరానికి విడుదల చేయబడింది. ఇందులో, ఇండియన్
ఇస్లామిక్ మరియు జమియత్ ఉలామా-ఇ-హింద్ (JUH) అధ్యక్షుడు మౌలానా మహమూద్ ఎ మదానీ మరియు
ప్రఖ్యాత అరబిక్-ఇంగ్లీష్ అనువాదకురాలు ఐషా బెవ్లీ పర్సన్స్ ఆఫ్ ది ఇయర్- 2023గా ఎంపికయ్యారు.
గత సంవత్సరంలో లేదా వారి
జీవితకాలంలో వారి గణనీయమైన కృషికి పురుషులు మరియు స్త్రీలు పర్సన్స్ ఆఫ్ ది ఇయర్
గుర్తింపు పొందుతారు.
ఈ జాబితాను
ముస్లిములు 500 మరియు ఇస్లామిక్ NGO
'ది రాయల్ ఆల్ అల్-
బైట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇస్లామిక్ థాట్'
(RABIIT) విడుదల చేసింది, దీని ప్రధాన కార్యాలయం జోర్డాన్ రాజధాని అమ్మన్‌లో ఉంది.
మ్యాన్ ఆఫ్ ది
ఇయర్- మౌలానా మహమూద్ ఎ మదానీ:
ఇండియన్ ఇస్లామిక్ మరియు
జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధ్యక్షుడు మౌలానా మహమూద్ మదానీ ఈ జాబితాలో 15వ స్థానంలో
నిలిచారు మరియు మ్యాన్ ఆఫ్ ది ఇయర్ బిరుదును పొందారు.
మౌలానా మహమూద్ మదానీ ఒక
ఇస్లామిక్ పండితుడు, పబ్లిక్ స్పీకర్, సామాజిక
కార్యకర్త మరియు ఇస్లామిక్ మానవతా విలువలు, సహనం మరియు శాంతి యొక్క బోధకుడు.
మదానీ మార్చి 3, 1964న ఉత్తరప్రదేశ్‌లోని
దేవ్‌బంద్‌లో జన్మించారు.మదానీ దారుల్ ఉలూమ్ దేవబంద్ ఇస్లామిక్ మదర్సాలో
చదువుకున్నాడు. 1992లో గ్రాడ్యుయేషన్
పూర్తయ్యాక సామాజిక సేవ, రాజకీయాల బాటలో
నడవడం మొదలుపెట్టారు.
మౌలానా మహమూద్ మదానీ గుజరాత్‌లో 2001 భూకంపం తర్వాత
తన సహాయ కార్యక్రమాలకు గణనీయమైన గుర్తింపు పొందాడు. 2002లో జరిగిన
మతపరమైన హింస తర్వాత, మౌలానా మహమూద్
మదానీ నేతృత్వంలో జమియత్ ఉలేమా-ఎ-హింద్ సహాయక చర్యలను చేపట్టింది. మౌలానా మహమూద్
మదానీ 2001 నుండి 2008 వరకు జమియత్
ఉలేమా-ఎ-హింద్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.
మౌలానా మహమూద్ మదానీ 2006 నుండి 2012 వరకు
ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.
పౌరసత్వ (సవరణ) చట్టం, 2019 (CAA) మరియు నేషనల్
రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC)
వంటి సమస్యలపై
మౌలానా మదానీ తన స్వరాన్ని వినిపించారు.
మౌలానా మదానీ ఎల్లప్పుడూ
భిన్నత్వంలో ఏకత్వానికి మద్దతుదారుగా ఉన్నారు మరియు భారతదేశంలోని విభిన్న
విశ్వాసాల మధ్య సామరస్య సంబంధాలను స్థిరంగా నొక్కిచెప్పారు.
ఉమెన్ ఆఫ్ ది
ఇయర్- ఐషా బెవ్లీ:
ముస్లిం 500 యొక్క 2023 ఎడిషన్‌లో ఐషా
బెవ్లీ ఇస్లామిక్ స్కాలర్‌షిప్‌కు చేసిన కృషికి గాను “ఉమెన్ ఆఫ్ ది ఇయర్”గా
ఎంపికైంది.
1948లో యునైటెడ్ స్టేట్స్‌లో జన్మించిన ఐషా
అబ్దుర్రహ్మాన్ బెవ్లీ, అరబిక్ నుండి
ఇంగ్లీషుకు శాస్త్రీయ ఇస్లామిక్ రచనల అనువాదకులలో ఒకరు.
1968లో ఇస్లాం మతంలోకి మారిన తర్వాత, ఐషా
అబ్దుర్రహ్మాన్ బెవ్లీ భర్త అబ్దల్‌హక్ బెవ్లీ సహకారంతో “ది నోబుల్ ఖురాన్” ని
అనువదించారు.
బెవ్లీ, బెర్క్లీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి
సమీప ప్రాచ్య భాషలలో మాస్టర్స్ డిగ్రీని పొందింది మరియు కైరోలోని అమెరికన్ విశ్వవిద్యాలయంలో
చదువు కొన్నది.
గ్రాడ్యుయేషన్ నుండి, బెవ్లీ ఆంగ్లం
మాట్లాడే ముస్లిం సమాజానికి ఇస్లామిక్ సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి
అవిశ్రాంతంగా కృషి చేశారు.
బెవ్లీ రచనలలో ఎక్కువ
భాగం ఆన్‌లైన్‌లో ఫ్రీ గా దొరుకుతాయి.
బెవ్లీ తన అనువాదం మరియు స్వంత
రచనలలో కవర్ చేసిన విషయాలు నోబుల్ ఖురాన్, ఖురాన్ అనువాదం (తఫ్సీర్), హదీథ్, ఇస్లామిక్ చట్టం, సూఫీయిజం మరియు
ఇస్లామిక్ చరిత్రపై రచనలు ఉన్నాయి.
బెవ్లీ ప్రసిద్ధ
అనువాదాలలో ఇమామ్ మాలిక్ (1982)
రచించిన
అల్-మువత్తా', ఖాదీ' ఇయాద్ (1991) రచించిన అల్-సైఫా' మరియు ఇబ్న్ సాద్
యొక్క తబాకత్ సిరీస్ (1995) ముఖ్యమైనవి. బెవ్లీ తన స్వంత
రచనలను కూడా చేసింది.
No comments:
Post a Comment