25 December 2022

ప్రారంభ ఇస్లామిక్ ప్రపంచంలో సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్ మరియు మేనేజ్‌మెంట్ అభివృద్ధిలో మహిళల పాత్ర.

 

అనేక అధ్యయనాలు ఇస్లాం యొక్క యొక్క వివిధ రంగాలలో, హదీసులు, న్యాయశాస్త్రం (ఫిక్హ్), సాహిత్యం మరియు విద్యలో ముస్లిం మహిళల సహకారం గురించి తెలుపగా కొన్ని మూలాధారాలు సైన్స్, సాంకేతికత మరియు వైద్యం అభివృద్ధిలో మహిళల పాత్రను పేర్కొన్నాయి. జ్ఞానము, సైన్స్‌ను అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్రను కలిగి ఉన్న ప్రసిద్ధ మహిళల గురించి తెలుసు కొందాము.

బాగ్దాద్ నుండి మక్కా వరకు తీర్థయాత్ర మార్గంలో ప్రయాణికుల కోసం బావులు త్రవ్వడం మరియు సేవా స్టేషన్లను నిర్మించిన జుబైదా బింట్ జాఫర్ అల్-మన్సూర్, గణిత శాస్త్రజ్ఞురాలు  మరియు న్యాయస్థానాలలో నిపుణురాలైనా సుతైతా Sutayta, మేనేజ్‌మెంట్ మరియు రాజనీతిజ్ఞతలో రాణించిన ధైఫా ఖాతున్ ఇందుకు కొన్ని కొన్ని ఉదాహరణలు.

ఫాతిమా అల్-ఫెహ్రీ, మొరాకోలోని ఫెజ్‌లో ఖరావియిన్ మసీదును స్థాపించారు, ఇది ప్రపంచంలోనే మొదటి విశ్వవిద్యాలయంగా మారింది. అలెప్పోలో ఆస్ట్రోలేబ్‌లను తయారు చేసిన మహిళా ఇంజనీర్ అల్-ఇజ్లియా.ఇటువంటి మహిళల గురించి  చాలా తక్కువ సమాచారం లబిస్తున్నది.

పురాతన కాలం నుండి, మహిళలు కవిత్వం, సాహిత్యం, వైద్యం, తత్వశాస్త్రం మరియు గణిత రంగాలలో రాణిస్తున్నారు. ఒక ప్రసిద్ధ ఉదాహరణ హైపాటియా (సుమారు 370-415), ఒక తత్వవేత్త, గణిత శాస్త్రజ్ఞురాలు, ఖగోళ శాస్త్రవేత్త మరియు అలెగ్జాండ్రియా-ఈజిప్ట్‌లో నివసించిన ఉపాధ్యాయురాలు.ఈజిప్టుకు చెందిన క్లియోపాత్రా (b. 69 BCE)ను  అరబిక్ మూలాలు బలమైన మరియు సమర్థురాలైన  చక్రవర్తిని గా పేర్కొన్నాయి, క్లియోపాత్రా ఈజిప్టుకు బలమైన రక్షకురాలుగా ఉంది. 

ఇస్లాం యొక్క ప్రారంభ సంవత్సరాల నుండి, మహిళలు ఇస్లామిక్ నాగరికత వికాసంకు గణనీయంగా దోహదపడ్డారు. ఉదాహరణకు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భార్య ఆయిషా బింట్ అబూ బకర్ పరిపాలనలో ప్రత్యేక నైపుణ్యాలను కలిగి ఉన్నారు. ఆయిషా బింట్ అబూ బకర్ హదీసులు, న్యాయశాస్త్రంలో పండితురాలు, విద్యావేత్త మరియు వక్తగా పరిగణించబడినది.  వైద్యం, సాహిత్యం మరియు న్యాయశాస్త్రం వంటి రంగాలలో రాణించిన ముస్లిం స్త్రీలు అనేకులు కలరు. 

ఆధునిక కాలం లో సబిహా గోకెన్ (1913-2001) ప్రపంచంలోనే మొదటి మహిళా పోరాట పైలట్. సబిహా గోకెన్ టర్కిష్ ఏవియేషన్ ఇన్‌స్టిట్యూషన్‌లో చీఫ్ ట్రైనర్‌గా నియమించబడింది.

ప్రారంభ ఇస్లామిక్ సంస్కృతిలో చాలా మంది మహిళలు విద్యారంగం లో గొప్పతనం సాధించినారు. అండాలస్‌లో ప్రిన్స్ అహ్మద్ కుమార్తె అయేషా, ప్రాస rhyme మరియు వక్తృత్వంలో రాణించింది; అయేషా ప్రసంగాలు కార్డోబా యొక్క తత్వవేత్తలలో  ఉత్సాహాన్ని రేకెత్తించాయి; మరియు అయేషా వ్యక్తిగత లైబ్రరీ రాజ్యంలో అత్యుత్తమమైనది మరియు అత్యంత సంపూర్ణమైనది.

వల్లడ (పాశ్చాత్య ప్రపంచం లో  వలద అని పిలుస్తారు), అల్మోహాద్‌ల యువరాణి, వల్లడ ఐబీరియన్ రాజధాని కార్డోబా లో  కవిత్వం మరియు వాక్చాతుర్యంపై జ్ఞానానికి ప్రసిద్ధి చెందింది.

సెవిల్లేకు చెందిన అల్-ఘస్సానియా మరియు సఫియా కవితా మరియు వక్తృత్వo కు ప్రసిద్ది చెందినారు. సఫియా కాలిగ్రఫీలో ప్రస్సిద్ది చెందినది. 

అల్-ఫైసులీ యొక్క ప్రతిభావంతులైన కుమార్తె మిరియం యొక్క సాహిత్య విజయాలు అండలస్ అంతటా ప్రసిద్ధి చెందాయి.

ఉమ్ అల్-సాద్ ముస్లిం సంప్రదాయంతో సుపరిచితురాలు. కార్డోబాకు చెందిన లబానా అత్యంత సంక్లిష్టమైన రేఖాగణిత మరియు బీజగణిత సమస్యలను  పరిష్కరించేది.  లబానా ఖలీఫ్ అల్-హకం II ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసింది.

ఇబ్న్ అల్-నదీమ్ ఇద్దరు మహిళా వ్యాకరణ శాస్త్రజ్ఞురాలను గురించి ప్రస్తావించాడు. వారు అరబిక్ భాష పై పూర్తి స్థాయి జ్ఞానం కలిగి ఉన్నారు.  ఇంకో మహిళా పండితురాలు అరబ్ మాండలికాలలో పూర్తి జ్ఞానం కలిగి ఉన్నారు.

అల్-'ఇజ్లియాహ్ బిన్త్ అల్ఇజ్లీ అల్-అస్తుర్లాబి ఆస్ట్రోలేబ్‌ల” తయారీలో ప్రసిద్ది చెందినారు.

అబ్బాసిద్ ఖలీఫ్ అల్-మన్సూర్ కాలం లో థానా కాలిగ్రఫీ ఒరిజినల్ మ్యానుస్క్రిప్ట్‌లను పోలిఉండేది.

ముహమ్మద్ ప్రవక్త కాలం నాటికే, ముస్లిం మహిళలు నిర్వహణ, విద్య, మతపరమైన న్యాయశాస్త్రం, వైద్యం మరియు ఆరోగ్య రంగాలలో లో చురుకుగా పాల్గొన్నారు. ఇస్లాం రాకతో మహిళలు వైద్యులుగా ప్రాక్టీస్ చేయగలిగారు మరియు ముఖ్యంగా యుద్ధభూమిలో స్త్రీలు మరియు పురుషులు ఇద్దరికీ చికిత్స చేయగలిగారు.

ఇస్లాం యొక్క మొదటి నర్సు బిరుదు రుఫైదా బింట్ సాద్ అల్ అస్లామియాకు ఇవ్వబడింది. ప్రారంభ ఇస్లాంలో నర్సులు మరియు వైద్యం యొక్క అభ్యాసకులుగా నమోదు చేయబద్దారు. ఉహుద్ (625H) యుద్ధం లో నుసైబా బింట్ కాబ్ అల్-మజెనియా,  ఉమ్ సినాన్ అల్-ఇస్లామీ (ఉమ్మ్ ఇమారా అని కూడా పిలుస్తారు) యోధులకు నర్సింగ్ సేవలను అందించినారు. ఉమ్మ్ మాతావే అల్-అస్లామియా, ఉమ్ వరఖా బింట్ హరేత్, బద్ర్ Badr యుద్ధంలో యోధులకు తమ నర్సింగ్ సేవలను అందించినారు.

అల్-షిఫా బిన్త్ అబ్దుల్లా అల్ ఖురాషియా అల్-అదవియా తొలి ముస్లిం చరిత్రలో తెలివైన మహిళల్లో ఒకరు. నిరక్షరాస్యత ఉన్న సమయంలో అల్-షిఫా బిన్త్ అబ్దుల్లా అక్షరాస్యురాలు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ మరియు వైద్యంలో నైపుణ్యం సాధించింది. 5.3 నుసైబా బింట్ హరిత్ అల్-అన్సారీ

నుసైబా బిన్త్ హరిత్ అల్-అన్సారీ, ఉమ్మ్ 'అతియా అని కూడా పిలుస్తారు, యుద్ధభూమిలో ప్రాణనష్టం జరిగినప్పుడు వారికి నీరు, ఆహారం మరియు ప్రథమ చికిత్స అందించారు. అదనంగా, నుసైబా బిన్త్ హరిత్ సున్తీ కూడా చేసింది.

15వ శతాబ్దంలో, టర్కిష్ సర్జన్, సెరెఫెడిన్ సబున్‌కుగ్లు (1385-1468), మహిళా సర్జన్లతో కూడా పనిచేశాడు. అనటోలియాలోని మహిళా శస్త్రవైద్యులు సాధారణంగా స్త్రీ జననేంద్రియాల రోగాలకు చికిత్స చేసేవారు. సెరెఫెడిన్ సబున్‌కుగ్లు సంక్లిష్టమైన శస్త్రచికిత్స రంగంలో పనిచేసిన మహిళా డాక్టర్ల గురించి విస్తరంగా పేర్కొన్నాడు.

గణిత శాస్త్ర రంగంలో, 10వ శతాబ్దానికి చెందిన బాగ్దాద్‌కు చెందిన అమత్-అల్-వాహిద్ సుతైతా అల్-మహమ్లీ మరియు కార్డోబాలోని లోబానా వంటి ఇస్లామిక్ చరిత్రలో ప్రముఖ మహిళా పండితురాళ్లు.

సుతైత అల్-మహమాలి బాగ్దాద్ నుండి చదువుకున్న కుటుంబం నుండి వచ్చారు. సుతైత తండ్రి న్యాయమూర్తి అబూ అబ్దల్లా అల్-హుస్సేన్, కితాబ్ ఫి అల్-ఫిఖ్, సలాత్ అల్-ఇదాయిన్’ వంటి అనేక పుస్తకాలను రచించారు.సుతాయ్తా అరబిక్ సాహిత్యం, హదీసులు మరియు న్యాయశాస్త్రంతో పాటు గణితశాస్త్రం వంటి అనేక రంగాలలో రాణించారు. సుతాయ్తా హిసాబ్ (అరిథ్‌మెటిక్స్) మరియు ఫరాయిద్ (అనువంశిక గణనలు)లో నిపుణురాలు. బీజగణితంలో ఇతర గణిత శాస్త్రజ్ఞులు ఉదహరించిన సమీకరణాలకు సుతైత పరిష్కారాలను కనుగొన్నారు. సుతైత 987CE సంవత్సరంలో మరణించింది

కార్డోబా యొక్క లాబానా కార్డోబాకు చెందిన ఇస్లామిక్ మహిళా గణితవేత్తలలో ఒకరు. లాబానా అత్యంత క్లిష్టమైన జ్యామితీయ మరియు బీజగణిత సమస్యలను పరిష్కరించగలదని చెప్పబడింది.

అల్-ఇజ్లియా, ఆస్ట్రోలేబ్ మేకర్. ఇబ్న్ అల్-నడిమ్ యొక్క ప్రసిద్ధ బయో-బిబ్లియోగ్రాఫికల్ రచన అల్-ఫిహ్రిస్ట్  లో అల్-ఇజ్లియా గురించి ప్రస్తావించాడు.

విభాగం VII.2లో (గణిత శాస్త్రజ్ఞులు, ఇంజనీర్లు, అంకగణిత అభ్యాసకులు, సంగీతకారులు, కాలిక్యులేటర్లు, జ్యోతిష్కులు, పరికరాల తయారీదారులు, యంత్రాలు మరియు ఆటోమాటా) గురించిన సమాచారం, అల్-ఫిహ్రిస్ట్ గ్రంధం లో  ఇబ్న్ అల్-నడిమ్ 16 మంది ఇంజనీర్లు, హస్తకళాకారులు మరియు ఖగోళ కళాకారుల పేర్ల జాబితాను పేర్కొన్నాడు. వారిలో అల్-ఇజ్లియా జాబితాలో ఉన్న ఏకైక మహిళ.

అల్-ఇజ్లియా, వాయిద్య తయారీదారు కుమార్తె అని మరియు అల్-ఇజ్లియా ఖగోళ పరికరాల తయారీదారు. అల్-ఇజ్లియా వాయిద్యం తయారీ లేదా ఇంజినీరింగ్ పనికి సంబంధించి పేర్కొన్న ఏకైక మహిళ .

ఇస్లామిక్ ప్రపంచంలో నాగరికత మరియు విజ్ఞాన శాస్త్రాన్ని ప్రోత్సహించడంలో ముస్లిం మహిళలు ప్రధాన పాత్ర పోషించారు. కొందరు పాఠశాలలు, మసీదులు మరియు ఆసుపత్రులను నిర్మించారు.

జుబైదా బింట్ అబూ జాఫర్ అల్-మన్సూర్  గొప్ప దాతృత్వం మరియు నిష్కపటమైన స్త్రీ. జుబైదా వివిధ నగరాల్లో అనేక భవనాలను అభివృద్ధి చేసింది. జుబైదా బాగ్దాద్ నుండి మక్కా వరకు తీర్థయాత్ర మార్గంలో నీటి బావులతో సేవా స్టేషన్లను నిర్మించే ఒక భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మక్కా శివార్లలో ఉన్న ప్రసిద్ధ జుబైదా నీటి బుగ్గ ఇప్పటికీ ఆమె పేరును కలిగి ఉంది. ఆమె కళలు మరియు కవిత్వానికి పోషకురాలిగా కూడా ఉంది.

ఫాతిమా అల్-ఫెహ్రీ ఫిఖ్ మరియు హదీస్ నేర్చుకుంది. ఫాతిమా 859వ సంవత్సరంలో స్థాపించబడిన ఖరావియిన్ మసీదును నిర్మించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది మరియు బహుశా మొదటి విశ్వవిద్యాలయం. ఇస్లామిక్ అధ్యయనాలు, ఖగోళ శాస్త్రం, భాషలు మరియు శాస్త్రాలను అధ్యయనం చేయడానికి విద్యార్థులు ప్రపంచం నలుమూలల నుండి అక్కడికి వెళ్లారు. ఈ విశ్వవిద్యాలయం ద్వారా ఐరోపాలో అరబిక్ సంఖ్యలు ప్రసిద్ధి చెందాయి మరియు ఉపయోగించబడ్డాయి. విద్య మరియు నాగరికత అభివృద్ధిలో మహిళల పాత్రకు ఇది ఒక ముఖ్యమైన ఉదాహరణ.

అయ్యుబిడ్ పాలకుడి శక్తివంతమైన భార్య ధైఫా ఖాతున్ మంగోలు, సెల్జుక్స్, క్రూసేడర్లు మరియు ఖుర్జ్‌మీన్ నుండి బెదిరింపులను ఎదుర్కొంది. ధైఫా ఒక ప్రసిద్ధ రాణి; ధైఫా ఖాతున్ అన్యాయమైన పన్నులను తొలగించింది. పేదలు మరియు శాస్త్రవేత్తలను ఆదరించింది మరియు వారికి మద్దతుగా అనేక స్వచ్ఛంద సంస్థలను స్థాపించింది. ధైఫా పెద్ద ఎండోమెంట్లను ఏర్పాటు చేసింది.

రోక్సెలానా అని పిలువబడే హుర్రెమ్ సుల్తాన్, సులేమాన్ ది మాగ్నిఫిసెంట్‌కి అత్యంత ప్రియమైన ఉంపుడుగత్తె మరియు భార్య అయింది. రోక్సెలానా/హుర్రెమ్ సుల్తాన్ అనేక సంస్థలను స్థాపించింది. రోక్సెలానా మక్కాలో నాలుగు పాఠశాలలను మరియు జెరూసలేంలో ఒక మసీదును కూడా నిర్మించింది.

ముస్లిం నాగరికతలోఏ స్త్రీ కూడా ఖలీఫా కానప్పటికీ, సుల్తానాలు మరియు మాలికా (రాణులు) అయిన స్త్రీలు కూడా ఉన్నారు. ఈజిప్టులోని ఫాతిమిడ్ యువరాణి సిట్ అల్-ముల్క్ వారిలో ఒకరు.

ఈజిప్టులోని ఫాతిమిడ్ యువరాణి సిట్ అల్-ముల్క్ వారిలో ఒకరు. సిట్ అల్-ముల్క్ కు 'నాయబ్ అస్-సుల్తాన్' (వైస్ సుల్తాన్) అనే బిరుదు ఉంది.

సుల్తానా బిరుదును కలిగి ఉన్న మరొక రాణి షజరత్ అల్-దుర్. షజరత్ అల్-దుర్ అనగా   అరబిక్‌లో 'ముత్యాల తీగ' అని అర్ధం. షాజరత్ అల్-దుర్ 1250లో ఈజిప్ట్ సుల్తానా అయింది.  షాజరత్ అల్-దుర్ తో అయ్యూబిడ్ పాలన ముగింపు మరియు మమ్లుక్ శకం ప్రారంభమైనది.

భారతదేశంలో. ఢిల్లీకి చెందిన రజియా (లేదా రజియా) సుల్తానా ఢిల్లీలో నాలుగు సంవత్సరాలు (1236-1240 CE) అధికారం చేపట్టింది. ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించిన ఏకైక మహిళ ఆమె.

16వ మరియు 17వ శతాబ్దాలలో, ఒట్టోమన్ సామ్రాజ్య ప్రభుత్వంలో అంతఃపురాలు ముఖ్యమైన పాత్రను పోషించాయి.హరేమ్ అనేది మహిళలచే నిర్వహించబడే ఒక పరిపాలనా కేంద్రం

ముస్లిం మహిళలు  ఇతర రంగాలలో కూడా తమ సహకారం అందించారు.రసాయన శాస్త్రంలో, మరియం అల్-జిన్యాని మర్యం బింట్ అబ్దుల్లా అల్-హవారీ ప్రముఖురాలు. మరియమ్‌కు కవిత్వం లో కూడా నైపుణ్యం ఉంది.

ఈవిధంగా ముస్లిం స్త్రీలు ఇస్లామిక్ సంస్కృతి మరియు నాగరికత నిర్మాణంలో పురుషులతో పాటు కవిత్వం, సాహిత్యం కళ, గణితం, ఖగోళ శాస్త్రం, వైద్యం మరియు ఆరోగ్య సంరక్షణ రంగం లో తమ సహకారాన్ని ప్రదర్శించారు.

 

No comments:

Post a Comment