దివ్య ఖురాన్‌లో
వివరించబడిన శాస్త్రీయ వాస్తవాలు శాశ్వతమైనవి
మరియు మారనివి.
“(ఓ ప్రవక్తా)చదువు,
సర్వాన్ని సృష్టించిన నీ ప్రభువు పేరుతో, ఆయన పేరుకుపోయిన నెత్తుటి ముద్దతో
మానవుణ్ణి సృజించాడు. నీ ప్రభువు పరమదయాళువు.
ఆయన కలం ద్వారా జ్ఞానం నేర్పాడు, మనిషి ఎరుగని జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు.-ఖురాన్
96:105
దివ్య ఖురాన్, విజ్ఞాన శాస్త్రం
యొక్క గొప్ప నిక్షేపణ. దివ్య ఖురాన్‌లో అనేక వైజ్ఞానిక అంశాలు ఉన్నాయి. దివ్య ఖురాన్‌లోని
శాస్త్రీయ వాస్తవాలు శాశ్వతమైనవి మరియు మారవు.
·
“మీ కొరకు భూమిని
పాన్పు గాను, ఆకాశాన్ని కప్పుగాను సృష్టించినవాడు. పై నుండి వర్షాన్ని కురిపించి
తద్వారా అన్ని రకాల పంటలుపండే ఏర్పాటు చేసి మీకు ఉపాధి కల్పించిన వాడు ఆయనే! ఇది
మీకు తెలిసినప్పుడు ఇతరులను అల్లాహ్ కు సమానులుగా నిలబెట్టకండి.-దివ్య ఖురాన్ 2: 22.
·
“నిశ్చయంగా భూమ్యాకాశాల నిర్మాణం లో, రేయిoబవళ్ళ రాకపోకలలో,
ప్రజలకు ఉపయోగపడే వస్తువులను మోసుకొంటూ సముద్రాలలో నడిచే ఓడలలో, ఆకాశం నుండి
దేవుడు కురిపించే వర్షపు నీటిలో-తద్వారా ఆయన మృతభూమికి జీవం పోసాడు. ఇంకా అందులో
అన్నిరకాల జంతువులను వ్యాపించజేసాడు.-వీచే పవనాల మార్పిడిలో నింగికి-నెలకు నడుమ
దైవాజ్ఞాబద్దమై కర్తవ్యపాలన చేసే మేఘ మాలికల్లో బుద్దిని ఉపయోగించే జనులకు ఎన్నో
సూచనలున్నాయి”. –దివ్య ఖురాన్ 2: 164.
“ఆయనే ఈ భూమిని విశాలంగా పరిచినవాడు.అందులో పర్వతాలను గుంజలవలె పాతిపెట్టినాడు.నదులను ప్రవహిoపజేసినవాడు.ఆయనే అన్ని రకాల పండ్ల జతలను పండించినవాడు. ఆయనే పగలు పై రాత్రిని కప్పేవాడు. ఈ అన్ని విషయాలలోనూ ఆలోచించే వారి కొరకు పెద్ద సూచనలు ఉన్నాయి. దివ్య ఖురాన్.-13:3
·
“ఆయనే మీ కొరకు భూమిని
పాన్పుగా పరిచాడు. దానిపై మీరు నడిచేందుకు మార్గాలను నిర్మించాడు. పై నుండి నీటిని
కురిపించాడు. తరువాత దాని ద్వారా రకరకాల పంటలను పండించాడు. వాటిని తినండి, మీ
పశువులను కూడా మేపండి. నిశ్చయంగా అర్ధం చేసుకోగలవారికి ఇందులో ఎన్నో సూచనలు
ఉన్నాయి."దివ్య ఖురాన్ 20:53-54.
·
“దీని తరువాత ఆయన భూమిని గోళాకారంగా చేసాడు, అందులోనుంచి దాని నీళ్ళను, గ్రాసాన్ని
(మొత్తం వృక్ష జాతిని) బయటకు తీసాడు, పర్వతాలను అందులో పాతాడు- మీకూ, మీ పశువులకూ
జీవనసామగ్రిగా.”-దివ్య ఖురాన్ 79:30-33
పై ఆయతులలో భూమిపై జీవాన్ని నిలబెట్టడంలో నీటి పాత్ర మరియు
ప్రయోజనం చూపబడింది.
“శాస్త్రీయ పరిజ్ఞానం ప్రకారం, సౌర వ్యవస్థలో భూమి నీరు
సమృద్ధిగా ఉన్న గ్రహం. భూమి యొక్క ఈ లక్షణం ప్రత్యేకమైనది మరియు దివ్య ఖురాన్‌లో
సరిగ్గా ఇదే చెప్పబడినది. దివ్య ఖురాన్ భూమి యొక్క సహజ లక్షణాలలో నీటికి మొదటి
స్థానం ఇస్తుంది.
దివ్య ఖురాన్‌లో నీటి చక్రం
విశేషమైన ఖచ్చితత్వంతో వివరించబడింది. మానవుని ఉనికిలో నీటి పాత్రకు సంబంధించిన దివ్య
ఖురాన్‌లోని ఆయతులు చాలా స్పష్టమైన ఆలోచనలను వ్యక్తీకరిస్థాయి. మనందరికీ, ప్రకృతిలో నీటి
చక్రం గురించి తక్కువ లేదా ఎక్కువ మేరకు తెలుసు."
No comments:
Post a Comment