16 December 2022

స్కాండినేవియాలో ఇస్లాం Islam in Scandinavia

 




స్కాండినేవియన్ దేశాలు అయిన   డెన్మార్క్, స్వీడన్, నార్వేలలో ముస్లిం సమాజం కలదు. ఐస్‌లాండ్ లేదా ఫిన్‌లాండ్‌లో చెప్పుకోదగిన  సంఖ్యలో ముస్లిం సమాజం లేదు. ఈ వ్యాసం స్కాండినేవియన్ దేశాలైన డెన్మార్క్, నార్వే మరియు స్వీడన్‌ మొదలగు  మూడు దేశాల్లోని ముస్లింల చరిత్రను క్లుప్తంగా పరిచయం చేస్తుంది. ప్రధానంగా 1950ల నుండి డెన్మార్క్, నార్వే మరియు స్వీడన్ మొదలగు  స్కాండినేవియన్ దేశాలలో ఇస్లాం మరియు ముస్లింలకు సంబంధించిన సమాచారం అందిస్తుంది.

డెన్మార్క్, నార్వే మరియు స్వీడన్ లో ఇస్లాం రెండవ అతిపెద్ద మతం. డెన్మార్క్, నార్వే మరియు స్వీడన్ మొదలగు స్కాండినేవియన్ దేశాలతో ఇస్లాంకు సుదీర్ఘ చరిత్ర ఉంది. మధ్య యుగాల నుండి స్కాండినేవియా మరియు ముస్లిం ప్రపంచం మధ్య పరిచయాలకు ఆధారాలు ఉన్నాయి.

800AD నుండి స్కాండినేవియన్లు ముస్లిం మెజారిటీ దేశాలతో సాంస్కృతిక మార్పిడిని కలిగి ఉన్నారు. రస్-స్కాండినేవియన్ వైకింగ్స్, ముస్లిం యాత్రికులు మరియు ముస్లిం సంస్కృతులతో సంబంధాలు కలిగి ఉన్నారు. స్కాండినేవియన్ రస్ ఇస్లాం ధర్మం లోకి మారినట్లు మరియు వైకింగ్ యుగం  (700ల చివరి నుండి 1100ల వరకు) లో స్కాండినేవియాను సందర్శించిన ముస్లిం యాత్రికుల చరిత్రలు కూడా ఉన్నాయి. స్కాండినేవియాలో ముస్లింల ఉనికి 1950ల నుండి వలసదారులు వచ్చినప్పుడు ప్రారంభమైనది. స్కాండినేవియా ప్రాంతంలో ముస్లింలు మొదట 1800 లలో స్థిరపడ్డారు మరియు రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. ముస్లిం వలసదారులు ముస్లిం సంఘాలను  మరియు మసీదులను స్థాపించారు

స్వీడన్లో  ఇస్లాం Muslims in Sweden:

పరిమాణంలో స్కాండినేవియన్ దేశాలలో స్వీడన్ అతిపెద్దది. 10 మిలియన్ల పౌరులతో, స్వీడన్ అతిపెద్ద ముస్లిం జనాభాను కూడా కలిగి ఉంది.స్వీడన్‌లోని ముస్లిం సమాజం అనేక దేశాలకు చెందినది, 2017 ప్యూ రీసెర్చ్ రిపోర్టు ప్రకారం స్వీడన్ ముస్లిం జనాభా 810,000 మంది, స్వీడన్ మొత్తం జనాభా 10 మిలియన్లలో 8.1%.

50% మంది స్వీడిష్ ముస్లింలు స్టాక్‌హోమ్, గోథెన్‌బర్గ్ మరియు మాల్మో అనే మూడు అతిపెద్ద నగరాల్లో మరియు చుట్టుపక్కల నివసిస్తున్నారు. ఎక్కువ మంది ముస్లిములు స్టాక్‌హోమ్‌లోని రింకేబీ, టెన్స్టా, హస్బీ మరియు స్కార్‌హోల్‌మెన్ వంటి శివారు ప్రాంతాల్లో నివసిస్తున్నారు; గోథెన్‌బర్గ్‌లోని బిస్కోప్స్‌గార్డెన్, హమ్మార్కుల్లెన్ మరియు హ్జాల్బోమరియు మాల్మోలోని  రోసెన్‌గార్డ్ లో ముస్లిములు నివశిస్తున్నారు.

స్వీడన్‌లో మొట్టమొదటి ముస్లింలు రష్యా, ఎస్టోనియా మరియు ఫిన్‌లాండ్ నుండి వచ్చిన వలసదారుల యొక్క చిన్న సమూహం వారు  ప్రధానంగా రష్యాలోని తాతర్ మూలాలకు  చెందినవారు.

1944 నుండి మరియు తరువాతి సంవత్సరాలలో, తాతర్ మరియు టర్కిష్ మూలానికి చెందిన ఎక్కువ మంది ముస్లింలు స్వీడన్‌లో ఆశ్రయం పొందారు మరియు 1949లో, వారు స్వీడన్‌లో టర్క్-ఇస్లాం అసోసియేషన్ ఫర్ రిలిజియన్ అండ్ కల్చర్ అనే మొదటి ముస్లిం సంఘాన్ని స్థాపించారు.

1950వ దశకంలో, స్వీడన్ అహ్మదీయ సమాజం యొక్క మొదటి మిషనరీ కెమల్ యూసుఫ్‌ డెన్మార్క్ మరియు నార్వేలో 1950లు మరియు 1960లలో చిన్న అహ్మదీయ సంఘాలను కూడా ఏర్పాటు చేశాడు

1950లు మరియు 1960లలో, స్వీడిష్ ఆర్థిక వ్యవస్థ మరియు పరిశ్రమ అభివృద్ధి చెందాయి మరియు అనేక దక్షిణ ఐరోపా దేశాల నుండి, అలాగే టర్కీ, బాల్కన్ దేశాల  నుండి వలస వచ్చిన వారి సంఖ్య పెరిగింది.

1980ల నుండి, స్వీడన్‌కు శరణార్థి వలసదారులు, ప్రధానంగా ఇరాన్ మరియు ఇరాక్, సోమాలియా, పశ్చిమ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మరియు సిరియా నుండి వచ్చారు. 

సమకాలీన స్వీడన్ పశ్చిమ ఐరోపాలో అత్యంత భిన్నమైన ముస్లిం జనాభాను కలిగి ఉంది, ఇది 40 కంటే ఎక్కువ విభిన్న దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది.

1975 తర్వాత స్వీడన్ విద్య, మీడియా మరియు ఎన్నికల విషయం లో బహుళ సాంస్కృతిక విధానాన్ని అవలంబించింది. విదేశీయులు స్థానిక ఎన్నికలలో ఓటు వేయడానికి మరియు కార్యాలయాలలో పని చేయడానికి  అనుమతించబడతారు. వలసదారులకు మరియు వారి పిల్లలకు స్వీడిష్ భాష నేర్పడం జరుగుతుంది ప్రభుత్వ నిధులు వలస సంఘాలకు ఇవ్వబడుతాయి. ప్రెస్ మరియు మైనారిటీ భాషల్లో ప్రసారాలు మైనారీటిలకు అందుబాటులో ఉన్నాయి.

స్వీడన్ యొక్క ఉదారవాద వలస విధానం ఫలితంగా, స్వీడన్‌ మాజీ యుగోస్లేవియా మరియు సోమాలియా ముస్లిం శరణార్థులను స్వికరించినది. 2010లలో లెవాంట్‌లో జరిగిన యుద్ధంలో యూరోపియన్ యూనియన్ దేశాలలోవలే  ఇరాక్ మరియు సిరియా నుండి అత్యధిక సంఖ్యలో శరణార్థులను స్వీడన్ అంగీకరించింది, అయితే మిగిలిన ఐరోపా మాదిరిగానే 2015లో శరణార్థులపై మరింత కఠినమైన నిబంధనలను విధించింది

లూథరన్ చర్చ్ ఆఫ్ స్వీడన్ రాజ్య అధికార చర్చి అయినప్పటికీ, 1951 నుండి మత స్వేచ్ఛ స్వీడిష్ చట్టాలలో భాగం మరియు స్వీడన్ వివిధ మత సమ్మేళనాలకు మద్దతు ఇస్తుంది. అనేక ముస్లిం సమాఖ్యలు స్థాపించబడ్డాయి. విదేశీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోకి చేర్చడానికి స్వీడిష్ పాఠశాల వ్యవస్థ ఒక ఉదాహరణ, స్వీడిష్ భాషలో బోధన క్రమంగా పెరుగుతుంది మరియు విదేశీ పిల్లల అవసరాలను తీర్చడానికి జాతి మైనారిటీ ఉపాధ్యాయులనునియమించడం జరుగు తుంది,.

స్వీడన్ యొక్క మొట్టమొదటి జాతీయ ముస్లిం సమాఖ్య, యునైటెడ్ ఇస్లామిక్ అసోసియేషన్స్ ఇన్ స్వీడన్ (FIFS) 1973లో స్థాపించబడింది. FIFSలో చీలిక కారణంగా, 1982లో స్వీడన్ యునైటెడ్ ముస్లిం కాంగ్రెగేషన్స్ (SMF) పేరుతో రెండవ జాతీయ సమాఖ్య ఏర్పడింది మరియు రెండు సంవత్సరాలు తరువాత ఒక కొత్త సమూహం FIFS నుండి విడిపోయి ఇస్లామిక్ సెంటర్ యూనియన్ (ICUS)ను ఏర్పాటు చేసింది.ప్రస్తుతం ముగ్గురూ కలిసి ఇస్లామిక్ కోఆపరేషన్ కౌన్సిల్ (ISఐఎస్) పేరుతో పనిచేస్తున్నారు.

1986లో, FIFS మరియు SMF ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫౌండేషన్‌ను సృష్టించాయి, రెండు సంవత్సరాల తరువాత ఇది ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ అసోసియేషన్ (IIF)గా పేరు మార్చబడింది, ఇది సమాచార ప్రచురణలు, ఉపన్యాసాలు మరియు ఇలాంటి వాటి ద్వారా స్వీడిష్ ముస్లింలు మరియు ముస్లిమేతరులకు తెలియజేయాలనే లక్ష్యంతో ఉంది.

FIFS మరియు SMF కూడా 1990లో సృష్టించబడిన స్వీడిష్ ముస్లిం కౌన్సిల్ (SMR)తో  సహకరిస్తాయి.  1990లో యువత సంస్థ స్వీడిష్ యంగ్ ముస్లింస్ (SUM) స్థాపించబడింది. ఈ సంస్థలన్నీ సున్నీ ముస్లింలచే నిర్వహంచ బడుతున్నాయి.  

స్వీడన్ 1992లో స్థాపించబడిన ఇస్లామిక్ షియా అసోసియేషన్స్ ఇన్ స్వీడన్ (ISS) మరియు బోస్నియా-హెర్సెగోవినా ఇస్లామిక్ వంటి మతపరమైన మరియు జాతిపరమైన సంస్థ నేషనల్ కౌన్సిల్, 1995లో సృష్టించబడింది

సోమాలి లేదా ఆఫ్ఘన్ ముస్లిం సంస్థలు పెద్ద అనుచరులతో మరికోన్ని అనధికారిక సమూహాలు కూడా ఉన్నాయి.

 స్వీడన్‌లోని సలాఫీ కమ్యూనిటీలు అన్ని ప్రధాన నగరాల్లో ఉపన్యాసాలు మరియు బోధల ద్వారా చురుకైన మిషనరీ పని (దావా) నిర్వహిస్తాయి మరియు చాలా పెద్ద బహుళజాతి సూఫీ తారిఖాలు కలవు.

అనేక ఉదారవాద మరియు ఆచరణాత్మక ముస్లిం ఇస్లాం యొక్క వారి వివరణలు మరియు అభ్యాసాలను స్వీడిష్ సందర్భానికి అనుగుణంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి.

స్వీడిష్ ముస్లింలు శాంతి మరియు న్యాయం, మానవ హక్కులు మరియు ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడం,స్వీడిష్-ముస్లిం గుర్తింపును బలోపేతం చేయడం మరియు స్వీడన్‌లో నివసిస్తున్న ప్రోగ్రెసివ్ ముస్లిమర్ అవ్ స్వేరిజ్/క్వీర్ ముస్లింలు వంటి ఆన్‌లైన్ కమ్యూనిటీలు కృషి చేస్తున్నాయి.


స్వీడన్‌లోన్ని కొన్ని ఇస్లామిక్ ప్రార్థనా స్థలాలు:

·        మెట్రోపాలిటన్ స్టాక్‌హోమ్ ఏరియా:  నాలుగు  సున్నీ మసీదులు, ఒక సలాఫి మరియు  ఒక షియా మసీదు కలదు.

·        సెంట్రల్ స్వీడన్: ప్రస్తుతం ఒక సలాఫీ మరియు రెండు సున్నీమసీదులు కలవు.

·        మెట్రోపాలిటన్ గోథెన్‌బర్గ్: ఒక సలాఫీ,రెండు సున్నీ, రెండు జనరల్, ఒకటి ఆహ్మదియా మసీదులు కలవు.

·        దక్షిణ స్వీడన్లో: మూడు మస్జిద్ లు కలవు. మహమూద్ మసీదు మాల్మో 2016, మాల్మో మసీదు మాల్మో 1984, మాల్మో టర్కిష్ ముస్లిం సమాజ మస్జిద్1972.

·        స్వీడన్‌లో మొట్టమొదటి మసీదు 1976లో ప్రారంభించబడింది మరియు గోథెన్‌బర్గ్‌లోని అహ్మదీయ సమాజం దీనిని స్థాపించారు.

 

నార్వే Norway:

నార్వే, 5 మిలియన్ల జనాభాను కలిగి ఉంది. నార్వేలో క్రైస్తవం తర్వాత ఇస్లాం రెండవ అతిపెద్ద మతం. 2021 నాటికి, నార్వేలో నివసిస్తున్న ముస్లింల సంఖ్య 169,605 (5,415,166 జనాభాలో 3.1%).నార్వేలోని ముస్లింలలో ఎక్కువ మంది సున్నీలు, గణనీయమైన షియా మైనారిటీ ఉన్నారు. దేశంలోని 55 శాతం ముస్లింలు ఓస్లో మరియు అకర్షుస్ కౌంటీలలో నివసిస్తున్నారు.

నార్వే జనాభా ప్రధానంగా ప్రొటెస్టంట్ క్రైస్తవులు. 1960లలో ప్రధానంగా ముస్లిం కార్మిక వలసదారులు ఎక్కువ సంఖ్యలో నార్వేకు వచ్చారు.

1950ల మధ్యకాలంలో స్కాండినేవియాలో అహ్మదీయా మిషనరీ యూసుఫ్ కమల్ ద్వారా నార్వేకు వచ్చిన అహ్మదీయ సమాజం నార్వే లో ముస్లిం మొదటి సమాజం.

టర్కిష్ అనటోలియా, ఉత్తర మొరాకో, ఇరాన్. ఇతర దేశాలు ముఖ్యంగా  పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ నుండి కార్మికులు నార్వేలో వలస కార్మికులుగా వచ్చారు. క్రమంగా నార్వే లో సోమాలియా, ఇరాక్ శరణార్థుల సంఖ్య పెరగడం జరిగింది.

పాకిస్తాన్ ముస్లింలు నార్వేలో ప్రధాన ముస్లిం సమూహంగా ఉన్నారు. నార్వేలోని పాకిస్తానీ-ముస్లింలలో సూఫీ-ఆధారిత బరేల్విస్ మరియు దేవబందిలు. నార్వేలో అత్యంత చురుకైన తబ్లిఘి సమూహం కూడా ఉంది

నార్వే, 5 మిలియన్ల జనాభాను కలిగి ఉంది. నార్వేలో క్రైస్తవం తర్వాత ఇస్లాం రెండవ అతిపెద్ద మతం. నార్వేలోని ముస్లింలలో ఎక్కువ మంది సున్నీలు, గణనీయమైన షియా మైనారిటీ ఉన్నారు. దేశంలోని 55 శాతం ముస్లింలు ఓస్లో మరియు అకర్షుస్ కౌంటీలలో నివసిస్తున్నారు.

2021 నాటికి, నార్వేలో నివసిస్తున్న ముస్లింల సంఖ్య 169,605 (5,415,166 జనాభాలో 3.1%).ముస్లిం జనాభాలో అత్యధికులు రాజధాని ఓస్లో నగరం యొక్క తూర్పు భాగంలో నివసిస్తున్నారు. నార్వేలోని రెండవ అతిపెద్ద పట్టణమైన బెర్గెన్‌లో ముస్లిం జనాభా కొంత పరిమాణంలో ఉంది.

నార్వే లో ముస్లిములకు నార్వే రాజ్యాంగం మతపరమైన స్వేచ్ఛకు హామీ ఇస్తుంది, అనేక ముస్లిం సంస్థలు స్థాపించబడ్డాయి, వాటిలో అతిపెద్దది జమాత్ అహ్ల్-ఎ-సున్నా. ఇది ఓస్లోలో ఉంది

1990 వరకు, నార్వేలో మసీదులు మరియు జాతీయ, భాషాపరమైన మరియు సిద్ధాంతపరమైన సంస్థలను స్థాపించడం జరిగింది. 1990వ దశకంలో అనేక కొత్త సంస్థలు స్థాపించబడ్డాయి. ది ముస్లిం డిఫెన్స్ కమిటీ-1989లో స్థాపించబడింది. అదే సంవత్సరం ఇస్లామిక్ ఇన్ఫర్మేషన్ అసోసియేషన్ (DIIF) మరియు 1991లో ఇస్లామిక్ ఉమెన్స్ స్థాపించబడింది. విద్య మరియు పాఠశాల విద్యపై దృష్టి పెట్టి గ్రూప్ ఆఫ్ నార్వే మరియు ఉర్టెహాగెన్ ఫౌండేషన్ స్థాపించబడినవి. చర్చ్ ఆఫ్ నార్వే చొరవతో, ఇస్లామిక్ కౌన్సిల్ ఆఫ్ నార్వే (IRN) 1993లో స్థాపించబడింది.

2006లో, ఇస్లామిక్ కౌన్సిల్ ఆఫ్ నార్వే దేశవ్యాప్తంగా 25 ముస్లిం సంస్థలను సమీకరించింది. వీటితో పాటు, 1990లలో రెండు స్వతంత్ర విద్యార్థి మరియు యువజన సంస్థలు స్థాపించబడ్డాయి. 1995 మరియు 1996లో ముస్లిం స్టూడెంట్ ఆర్గనైజేషన్ (MSS) మరియు ముస్లిం యూత్ ఆఫ్ నార్వే (NMU) స్థాపించబడ్డాయి. ఇస్లామిక్ కౌన్సిల్ ప్రస్తుతం 82,999 వ్యక్తిగత సభ్యులను కలిగి ఉన్న 42 సభ్యుల సంఘాలను నిర్వహిస్తోంది. కౌన్సిల్ యొక్క ప్రధాన లక్ష్యం నార్వేలో ఇస్లామిక్ బోధనకు అనుగుణంగా జీవించడానికి ముస్లింలకు సహాయం చేయడం మరియు నార్వేజియన్-ముస్లిం గుర్తింపును నిర్మించడంలో సహకరించడం.

అనేక నార్వేజియన్ ముస్లిం సంఘాలు ప్రభుత్వ నిధులు లేకుండా పనిచేస్తున్నాయి. ఓస్లోలో ఒక మసీదు ప్రణాళిక చేయబడింది. అక్కడ మహిళలు ఇమామ్‌లుగా వ్యవహరిస్తారు.

 

డెన్మార్క్Denmark:

 

డెన్మార్క్ లో 5 మిలియన్ల మంది నివాసితులు కలరు, డెన్మార్క్  లో ప్రధానంగా ప్రొటెస్టంట్ క్రైస్తవుల తరువాత  ఇస్లాం రెండవ అతిపెద్ద మతం. 2020.జనవరి  లో  డెన్మార్క్ లో 256,000 లేదా మొత్తం జనాభ లో 4.4% ముస్లిం జనాభ కలదు..

 వైకింగ్ యుగం నుంఛి  అరబ్ ముస్లిం యాత్రికుల ద్వారా డెన్మార్క్ కు  ఇస్లాం తో పరిచయం ఉంది. మధ్య యుగాల నుండి ముస్లిం ప్రపంచం మరియు డెన్మార్క్ మధ్య సంబంధాల జాడలు ఉన్నాయి

1880 నుండి డెన్మార్క్ జనాభా గణనలో ఎనిమిది మంది డేన్‌లు ముస్లింలుగా నమోదు చేసుకున్నారు. 1950లలో డెన్మార్క్ లో అహ్మదీయా మిషన్‌ కలదు.

డెన్మార్క్ కొంత కాలం వరకు దాదాపుగా అనియంత్రిత కార్మిక వలస విధానాన్ని కలిగి ఉంది. 1968 మరియు 1990 మధ్యకాలంలో ముస్లిం వలసదారుల సంఖ్య 2,000 నుండి సుమారు 60,000కి పెరిగింది. ముస్లిం వలసదారులు  టర్కీ, ఉత్తర ఆఫ్రికా మరియు పాకిస్తాన్ నుండి వచ్చారు మరియు 1980 తర్వాత ఇరాక్, ఇరాన్ మరియు లెబనాన్ నుండి వచ్చారు.

డెన్మార్క్ లో అతిపెద్ద ముస్లిం జాతి సమూహం టర్క్స్, తరువాత ఇరాకీలు, లెబనీస్, పాకిస్తానీలు, సోమాలిస్ మరియు ఆఫ్ఘనిస్.  1980లు మరియు 1990లలో పెరుగుతున్న శరణార్థుల వలసలకు ప్రతిస్పందనగా, డెన్మార్క్ పశ్చిమ ఐరోపాలోని అన్ని దేశాలలో అత్యంత కఠినమైన ఇమ్మిగ్రేషన్    మరియు శరణార్థ నిబంధనలను అవలంబించింది 2010 తరువాత, డెన్మార్క్ మరింత కఠినమైన ఇమ్మిగ్రేషన్    మరియు శరణార్థ నిబంధనలను ఆమోదించింది.

1849 నుండి డానిష్ రాజ్యాంగంలో మత స్వేచ్ఛ పొందుపరచబడింది. డెన్మార్క్ ప్రజలు క్రైస్తవ మతం తో పాటు ఇతర మత సంప్రదాయాలను ఆచరించడానికి రాజ్యాంగ హక్కులను కలిగి ఉన్నాయి. అయితే, డెన్మార్క్ లో ఇప్పటికీ అధికారిక రాజ్య చర్చి గా ఎవాంజెలికల్ లూథరన్ చర్చి ఉంది. చర్చి కి రాచరికం కట్టుబడి ఉండాలి. ఇతర క్రైస్తవ సంఘాలు మరియు యూదులకు కూడా గుర్తింపు పొందిన విశ్వాస సంఘాలుగా రాజ్యాంగ హోదా ఉంది, కానీ ఇస్లాం కు కాదు.

డెన్మార్క్ ప్రభుత్వ పాఠశాలల్లో క్రైస్తవ మతం తో పాటు  ఇస్లాం మరియు ఇతర ప్రపంచ మతాల గురించి భోదించ బడుతుంది. డెన్మార్క్ మతపరమైన పాఠశాలల స్థాపనను అనుమతిస్తుంది, దేశంలో అనేక ముస్లిం పాఠశాలలు ఉన్నాయి.

డెన్మార్క్ లో ముస్లిం శ్మశాన వాటికలకు తగిన స్థలం అందుబాటులోకి వచ్చింది, మసీదులు లేదా పాఠశాలల వంటి వివిధ రకాల ఇస్లామిక్ సంస్థల స్థాపన నిబంధలకు లోబడి ఉండాలి.

డెన్మార్క్‌ 1969లో ఇస్మాయిలీ ఫౌండేషన్‌ను స్థాపించిన పాకిస్థాన్‌కు చెందిన షియాలు స్థాపించినారు.

 1981లో, ఇత్నా అషారియా (పన్నెండు మంది) సంఘం ఇస్లామిక్ సెంటర్ జఫారియాను స్థాపించింది. లెబనాన్‌లో అంతర్యుద్ధం మరియు ఇరాన్-ఇరాక్ యుద్ధం తరువాత, పెద్ద సంఖ్యలో షియా ముస్లింలు డెన్మార్క్‌కు వచ్చారు. నేడు డెన్మార్క్‌లో అనేక షియా మసీదులు లేదా ప్రార్థనా గృహాలు స్థాపించబడ్డాయి మరియు 2015లో, కోపెన్‌హాగన్‌లో ఇమామ్ అలీ మసీదు ప్రారంభించబడింది. ఈ రోజు వరకు, ఇది ఐరోపాలో అతిపెద్ద షియా మసీదు, ప్రార్థన సమయంలో 1,500 మంది వ్యక్తులకు స్థలం ఉంది.

డానిష్ టర్కిష్ ఇస్లామిక్ ఫెడరేషన్ (డయానెట్‌) తో 1985లో స్థాపించబడింది. ఆ తర్వాత అనేక ఇతర టర్కిష్ సమ్మేళనాలు కలిసి యూనియన్ ఆఫ్ ముస్లిం ఇమ్మిగ్రెంట్ అసోసియేషన్స్ (DMGT)గా ఏర్పడ్డాయి.

1987లో ఇదారా మిన్హాజ్-ఉల్-ఖురాన్ పేరుతో పాకిస్తానీ సమాజం కూడా ఏర్పడింది.

1996లో డెన్మార్క్‌లోని ఇస్లామిక్ రిలిజియస్ కమ్యూనిటీ అనే పాలస్తీనా సంస్థ ఏర్పడింది.

డెన్మార్క్‌లో అనేక సూఫీ ఆర్డర్‌లు, అలాగే ముస్లిం యువజన సంస్థలు చురుకుగా ఉన్నాయి.

2006లో, యునైటెడ్ కౌన్సిల్ ఆఫ్ ముస్లిమ్స్ 35,000 మంది ముస్లిములతో ఏర్పడినది.

డానిష్ ముస్లిం యూనియన్, 2008లో స్థాపించబడింది

మక్కాలో ఉన్న ముస్లిం వరల్డ్ లీగ్ (రాబిటా)లో భాగమైన ది ఇస్లామిక్ అసోసియేషన్ (డెట్ ఇస్లామిక్ ఫోర్బండ్ ఐ డాన్మార్క్), అలాగే అనేక యువజన సంస్థలు మరియు ఇతర అంతర్జాతీయ సంఘాలు కూడా స్థాపించబడ్డాయి.

ఇస్లాం లోని ప్రజాస్వామ్య మరియు బహుళత్వం భావన అవగాహన కోసం పని చేసే లక్ష్యంతో క్రిటికల్ ముస్లింలు వంటి   సూఫీ సంస్కరణ ఉద్యమం మరియు అనేక ఇతర అనుబంధం లేని సమూహాలు ఉన్నాయి.

డెన్మార్క్ లో ముస్లిం సమాజం కోపెన్‌హాగన్ మరియు చుట్టుపక్కల కేంద్రీకృతమై ఉంది. అయితే ఇతర పెద్ద నగరాల్లో కూడా ముస్లిం సమాజాలు  సమ్మేళనాలు కనిపిస్తాయి.

కోపెన్‌హాగన్‌లోని మిరియం మసీదు 2016లో ప్రారంభించబడింది మరియు ఒక మహిళా ఇమామ్‌ను కలిగి ఉంది మరియు ఇస్లాంలో మహిళల సమానత్వం కోసం పని చేయడం వారి ఉద్దేశ్యం.

సలాఫీలు డానిష్ నగరాల్లో తమ ప్రభావాన్ని పెంచుకున్నారు మరియు హింసకు వ్యతిరేకంగా ఉన్నారు మరియు బలమైన ధర్మబద్ధమైన ఇస్లాంను సమర్థించారు. ఇంకా, డెన్మార్క్ లో హిజ్బ్ అల్-తహ్రీర్ అనే సంస్థ కూడా కలదు.

హలాల్ మాంసం యొక్క అతిపెద్ద యూరోపియన్ ఉత్పత్తిదారులలో డెన్మార్క్ ఒకటి. 1970ల నుండి కోపెన్‌హాగన్‌లోని ముస్లిం వరల్డ్ లీగ్ ప్రతినిధి మాంసం, ముఖ్యంగా డెన్మార్క్ ఉత్పత్తి చేసే   పౌల్ట్రీ యొక్క హలాల్ స్థితికి హామీ ఇచ్చే అధికారంగా పనిచేస్తున్నారు. ఉత్పత్తిలో ఎక్కువ భాగం ముస్లిం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు వెళుతుంది మరియు యూరోపియన్ సూపర్ మార్కెట్‌లలో కూడా అందుబాటులో ఉంది.

 

 


No comments:

Post a Comment