ఇబ్న్ అల్-నఫిస్ (1213 లో జన్మించాడు) శ్వాస-ప్రసరణ
వ్యవస్థను బాగా అర్థం చేసుకొన్న మొట్టమొదటి పండితుడిగా మెడిసిన్ (ఔషధం) యొక్క
చరిత్రలో ఖ్యాతి గాంచాడు. హృదయం రెండు
భాగాలుగా విభజించబడింది అన్నాడు మరియు
గాలెన్ ప్రతిపాదించినట్లు గుండె యొక్క
రెండు భాగాలను కలిపే రంధ్రాలు
(pores) లేవని ఇబ్న్ అల్-నఫిస్ అర్థం
చేసుకున్నారు. ఆల్-నఫిస్ ప్రకారం రక్తం గుండె యొక్క ఒక వైపు నుంచి రెండో వైపుకు ఊపిరితిత్తుల గుండా వెళుతుంది..
పల్మనరీ వ్యవస్థ యొక్క స్వభావాన్ని అర్ధం చేసుకొన్న మొదటి
పండితుడు ఇబ్న్ నఫీస్. ఊపిరితిత్తులలోని
రక్తం గాలి తో కలసి ఉండును అని ఇబ్న్ నఫీస్ అన్నాడు. రక్తo గుండె యొక్క
ఎడమ కుహరంలో "ఆత్మ" తో కలసి ఉంటుందని ప్రతిపాదించాడు.
ఇబ్న్ నఫీస్ ఇతర పరిశీలనల ప్రకారం హృదయం యొక్క కుడి జఠరిక, దాని చుట్టూ ఉన్న కేశనాళికల యొక్క వెబ్
ద్వారా గుండె పోషించబడును. పుపుస ధమని మరియు సిర సూక్ష్మదర్శిని రంధ్రాలచే ముడిపడి
ఉన్నాయని ప్రతిపాదించి, ప్రసరణంలో కేప్పిల్లరి పాత్ర యొక్క అంశంపై ఇబ్న్ నఫీస్ స్పర్శించాడు; నాలుగు శతాబ్దాల తరువాత ఈ సిద్ధాంతం
తిరిగి కనుగొనబడటం మరియు కేశనాళికల యొక్క ఆలోచన మిగిలిన శరీర భాగాలకు
విస్తరించబడింది.
నాడి(పల్స్) గురించి ఇస్లామిక్ మెడిసిన్ మరియు
వారి కంటే ముందు ఈజిప్షియన్లకు బాగా తెలిసు కానీ అల్-నఫిస్ పల్స్ వెనుక ఉన్న
యంత్రాంగాలను mechanisms అర్థం చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి. గాలెన్
ధమనులు సహజంగా కొట్టుకొంటాయని మరియు ధమని మొత్తం ఒకేసారి సంకోచించుతుందని
అంటాడు కాని శరీరంలోనికి రక్తాన్ని నెట్టే గుండె యొక్క చర్య ద్వారా పల్సేషన్ (pulsation) ఏర్పడుతుందని అల్ నఫీస్ విశ్వసించాడు. గుండె యొక్క చర్య వెనుక
ధమనుల యొక్క విచ్ఛేదం వెనుకబడి ఉంటుందని
మరియు అది మొత్తం గా ఒకేసారి సంభవించదు అని అతను సరిగ్గా గుర్తించాడు.
అయితే, ఈ రక్తం యొక్క కదలిక, ఆత్మను చెదరగొట్టడానికి మార్గమని అల్ నఫీస్ నమ్మాడు, ఇది చాలా కాలం పాటు అక్కడ నివసిస్తున్నట్లయితే
గుండె మండుతుంది. ధమనులలో ఆత్మ విశ్రాంతి తీసుకోవాలంటే సర్క్యులేషన్ అవసరం. అల్ నఫీస్ గుండె మరియు పల్మోనరీ సర్క్యులేషన్ సిద్ధాంతాలు
ఈ అదృశ్య ఆత్మ మీద ఆధారపడినవి. అల్ నఫీస్ ప్రతిపాదనలు శరీరం ఎలా పనిచేస్తుందో అర్థం
చేసుకోవడానికి ఒక ప్రధాన రహదారి గా ఉన్నాయి అనుటలో ఎటువంటి సందేహం లేదు. అల్ నఫీస్ జ్ఞానం పశ్చిమ చరిత్ర లోకి బాగా
ప్రసరించలేదు.
అల్ నఫీస్ ఇతర పరిశీలనలలో కొన్ని శరీర విభాగాల విచ్చేదం పై ఆధారపడ్డాయి, వీటిలో అల్ నఫీస్ అతను గొప్ప
ప్రతిపాదకుడు మరియు అల్ నఫీస్ మెదడు, పిత్తాశయం, ఎముక నిర్మాణం మరియు నాడీ వ్యవస్థ
గురించి శరీర ధర్మశాస్త్రం లో ఉన్న అనేక
దురభిప్రాయాలను సరిచేశాడు. అల్ నఫీస్ రచనల లో చాలా తక్కువ భాగం లాటిన్లోకి అనువదించ బడినవి మరియు పాశ్చాత్య శాస్త్రవేత్తలు అల్ నఫీస్ రచనలను
సరిగా వినియోగించుకోలేదు. లియోనార్డో డా విన్సీ, గాలెన్ మరియు అవిసెన్నాపై ఆధారపడి
చేసిన తప్పులను అల్ నఫీస్ అప్పటికే పరిష్కరించాడు
ఇస్లామిక్
వైద్యానికి అల్ నఫీస్ చేసిన గొప్ప కృషి అల్ నఫీస్ ఫార్మాకోలోజికల్ (pharmacological) రచనలు. ఇవి ప్రపంచ వ్యాప్తంగా
ఉన్న నివారణలను
remedies సూచించినవి. అల్ నఫీస్ గణితశాస్త్రం
మరియు మోతాదుల ఆలోచనలను
idea of dosages చికిత్సల
నిర్వహణకు కూడా పరిచయం చేసినాడు.
No comments:
Post a Comment