అబ్దుల్ ఖాదిర్
బదయుని1540-1615 మధ్యయుగ భారతదేశ చరిత్రకారుడు, అనువాదకుడు, ఇస్లామిక్ పండితుడు, భాషావేత్త మరియు
మొఘల్ ఆస్థానం లో పనిచేసాడు. బదయుని హిందూ ఇతిహాసాలు రామాయణం మరియు మహాభారతం
(రజమ్నామా) అనువదించాడు.
ముంతఖబ్-ఉత్-తవారిఖ్ అని కూడా పిలువబడే
తారిఖ్-ఇ-బదయుని బదయుని యొక్క ప్రముఖ సాహిత్య రచన.
బదయుని, ములుక్ షా
కుమారుడు. బదయుని సంభాల్ మరియు ఆగ్రాలో చదువుకొన్నాడు. బసవర్‌లో నివసించాడు. తొమ్మిదేళ్లపాటు
యువరాజు హుసేన్ ఖాన్ సేవలో ప్రవేశించడానికి పాటియాలాకు వెళ్లడానికి ముందు బదయుని
1562లో బదౌన్ అనే పట్టణానికి మారాడు. బదయుని తరువాతి అధ్యయనం ముస్లిం ఆధ్యాత్మికవేత్తలచే
నిర్వహించబడింది. మొఘల్ చక్రవర్తి, అక్బర్, బదయునిని 1574లో రాజ న్యాయస్థానoలో మతపరమైన
కార్యాలయంలో నియమించాడు, అక్కడ బదయుని తన
జీవితంలో ఎక్కువ భాగం గడిపాడు.
బదయుని ప్రధాన రచనలు:
బదయుని
ముంతఖబ్-ఉత్-తవారిఖ్Muntakhab-ut-Tawarikh (క్రానికల్స్
ఎంపిక
Selection of Chronicles) లేదా తారిఖ్-ఇ-బదాయుని (బదయుని చరిత్ర)ని
1595 లో పూర్తి చేశాడు. మూడు సంపుటాలుగా ఉన్న తారిఖ్-ఇ-బదాయుని భారతదేశ ముస్లింల
సాధారణ చరిత్రను వివరిస్తుంది.
తారిఖ్-ఇ-బదాయుని మొదటి
సంపుటంలో బాబర్ మరియు హుమాయున్‌ల వృత్తాంతం ఉంది.
తారిఖ్-ఇ-బదాయుని రెండవ
సంపుటం ప్రత్యేకంగా 1595 వరకు అక్బర్ పాలనకు సంబంధించినది. ఈ సంపుటం అక్బర్ యొక్క
పరిపాలనాపరమైన చర్యలు, ప్రత్యేకించి, అక్బర్ మతపరమైన
అభిప్రాయాలు మరియు ప్రవర్తన గురించి స్పష్టమైన మరియు విమర్శనాత్మకమైన వివరణ
ఇస్తుంది. ఈ సంపుటం అక్బర్ మరణించే వరకు
దాచి ఉంచబడింది మరియు జహంగీర్ కాలం లో ప్రచురించబడింది
మూడవ సంపుటం ముస్లిం మత
ప్రముఖులు, పండితులు, వైద్యులు మరియు
కవుల జీవితాలను మరియు రచనలను వివరిస్తుంది. తారిఖ్-ఇ-బదాయుని మతం మరియు అక్బర్ మత విధానం పై
సమకాలీన దృక్పథాన్ని అందిస్తుంది.
తారిఖ్-ఇ-బదాయుని యొక్క
మొదటి ముద్రిత సంచిక 1865లో కలకత్తాలోని కాలేజ్ ప్రెస్ ద్వారా ప్రచురించబడింది
మరియు తరువాత తారిఖ్-ఇ-బదాయుని ను ఆంగ్లంలోకి మూడు భాగాలుగా అనువదింఛబడి 1884
మరియు 1925 మధ్య ఆసియాటిక్ సొసైటీ, కలకత్తా ద్వారా ప్రచురించబడింది.
లెగసె:
ఇర్ఫాన్ ఖాన్ దూరదర్శన్
యొక్క చారిత్రక నాటకం భారత్ ఏక్ ఖోజ్ (1988–1989)లో బదయుని పాత్ర పోషించాడు.
Masha Allah, nice post. We are also talking about Online Quran Courses
ReplyDelete