30 December 2022

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో దారుల్ ఉలూమ్, దేవబంద్ పాత్ర Role of Darul Uloom, Deoband in India’s Freedom Struggle

 

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో దారుల్ ఉలూమ్, దేవబంద్ పాత్ర

Role of Darul Uloom, Deoband in India’s Freedom Struggle

ముహమ్మద్ అజ్గర్ అలీ.

 

1857లో భారతదేశ చివరి మొఘల్ చక్రవర్తి అబూ జాఫర్ సిరాజుద్దీన్ ముహమ్మద్ బహదూర్ షా జఫర్ (1775-1862)ని ఆంగ్లేయులు రంగూన్ జైలులో బంధించినప్పుడు, ఢిల్లీలోని ఎర్రకోటలో భారత జెండాకు బదులుగా, యూనియన్ జాక్ ఎగురవేయడం జరిగింది మరియు విక్టోరియా రాణి భారత దేశానికి సామ్రాజ్ని/చక్రవర్తిణి  గా ప్రకటించబడినది.

భారతదేశం లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడటానికి చాలా మంది దేశ దేశభక్తులు ఐక్యంగా రంగంలోకి దిగారు. వారిలో మౌలానా ముహమ్మద్ ఖాస్మీ నానౌతవి (1832-1879) కూడా ఒకరు.

1857లో ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జిహాద్ కోసం ఒక ఫత్వా జారీ చేయబడింది.ఫత్వాలో నాటి 34 మంది ప్రముఖ ఉలమాల సంతకం ఉంది. వారిలో ఒకరు మౌలానా నానౌతవి. 1857లో షామ్లీ జిహాద్‌లో మౌలానా నానౌతవి కూడా వ్యక్తిగతంగా పాల్గొన్నారు. షామ్లీ యుద్ధంలో నానౌతవి మరియు అతని సహచరులు బ్రిటిష్ దళాల చేతిలో ఓడిపోయారు.

మౌలానా నానౌతవి దూరదృష్టి గల పండితుడు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని ఆక్రమించడమే కాకుండా భారతీయ సంస్కృతిపై దాడి చేస్తారని, భారతీయుల విశ్వాసం కూడా ప్రమాదంలో పడుతుందని మౌలానా నానౌతవి గ్రహించారు. అందువల్ల, మౌలానా నానౌతవి ఒక వైపు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు, మరోవైపు ఇతర మతాధికారులతో చర్చలు ప్రారంభించారు. కానీ మౌలానా నానౌతవి తన ప్రయత్నం లో విజయం సాధించలేదు.

ఈ పరిస్థితిలో, బ్రిటిష్ పాలన నుండి భారతదేశాన్ని విడిపించాలనే ఉద్దేశ్యంతో, కొంతమంది స్నేహితుల సహకారంతో, మౌలానా నానౌతవి 21 మే, 1866న భారత ఉపఖండంలోని ప్రసిద్ధ విద్యా కేంద్రం, దారుల్ ఉలూమ్, దేవబంద్ మదర్సాను  దేవబంద్‌లోని చత్తా మసీదులో దానిమ్మ చెట్టు క్రింద   స్థాపించారు. దాని ప్రధాన ఉద్దేశం బ్రిటిష్ ఇండియాలో దేశాన్ని మరియు ఇస్లాం మతాన్ని సంరక్షించడానికి మదర్సా లో  శిక్షణ పొందిన యొక్క విద్యార్ధులు తమను తాము త్యాగం చేస్తారు. నానౌతవి ఉద్దేశం నెరవేరింది మరియు దారుల్ ఉలూమ్ విద్యార్ధులు పెద్ద సంఖ్యలో భారతీయ స్వేచ్ఛ మరియు ఇస్లాం కొరకు తమను తాము త్యాగం చేసారు.

ఉపాధ్యాయుడు మరియు దారుల్ ఉలూమ్ సెమినరీలో మొదటి గ్రాడ్యుయేట్ అయిన షేఖుల్ హింద్ మహమూద్ హసన్ దేవబంది (1851-1920) ఇలా అన్నారు: నా గురువు (మౌలానా ముహమ్మద్ ఖాసిం నానౌతవి) ఈ సెమినరీని 1857లో బ్రిటీష్ వారి ఓటమికి పరిహారంగా 1866లో స్థాపించారు. నేను కూడా అదే మిషన్‌ను ఎంచుకున్నాను”.

 “1926లో కోల్‌కతాలో జరిగిన జమియత్ ఉలమా-ఎ-హింద్ సమావేశంలో, పాల్గొన్నవారిలో దారుల్ ఉలూమ్, డియోబంద్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు మరియు వారు బ్రిటిష్ పాలన నుండి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం పిలుపునిచ్చిన బృందానికి వారు మద్దతు ఇచ్చారు.

లాహోర్‌లో జరిగిన సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్ర్యమే లక్ష్యంగా ప్రకటించింది. 1969లో దారుల్ ఉలూమ్‌ను సందర్శించిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఫ్రాంటియర్ గాంధీ, ఖాన్ అబ్దు గఫార్ ఖాన్ (1890-1988), 1969లో తన భారతదేశ పర్యటన సందర్భంగా మాట్లాడుతూ నేను దారుల్ ఉలూమ్‌తో సంబంధాన్ని కలిగి ఉన్నాను. ఆ సమయంలో షేకుల్ హింద్ మౌలానా మహమూద్ హసన్ జీవించి ఉన్నారు. ఇక్కడ కూర్చొని, స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రణాళికలు వేసుకున్నాము, మనం ఈ దేశం నుండి ఆంగ్లేయులను ఎలా తరిమికొట్టాలి మరియు భారతదేశాన్ని బ్రిటిష్ రాజ్ బానిసత్వం నుండి ఎలా విముక్తి చేయాలి. దారుల్ ఉలూమ్ దేవబంద్ భారత దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో కృషి చేసింది. షేఖుల్ హింద్ భారత స్వాతంత్ర్య ఉద్యమానికి చిహ్నంగా మారినారు. షేఖుల్ హింద్, దారుల్ ఉలూమ్ లో ఉపాధ్యాయుడు అయినప్పటికీ, భారతదేశం లోపల మరియు వెలుపల బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ విప్లవాన్ని ప్రారంభించడానికి చాలా కృషి చేశాడు” అని అన్నారు.

షేకుల్ హింద్ మౌలానా మహమూద్ హసన్ భారత దేశాన్ని బ్రిటిష్ రాజ్ నుంచి విముక్తి చేయాలనే లక్ష్యం కోసం భారతదేశం మరియు విదేశాల నుండి వాలంటీర్లకు మరియు సెమినరీలోని తన విద్యార్థులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత జాతీయ ఉద్యమంలో చేరిన వారిలో అత్యంత ప్రముఖులు అయిన షేకుల్ హింద్ మౌలానా మహమూద్ హసన్ విద్యార్థులు: మౌలానా ఉబైదుల్లా సింధీ (1872-1944), మౌలానా హుసేన్ అహ్మద్ మదానీ (1879-1957), మౌలానా ముహమ్మద్ మియాన్ మన్సూర్ అన్సారీ మొదలైన వారు కలరు.. షైఖుల్ హింద్ మౌలానా మహమూద్ హసన్,  మౌలానా సింధీని కాబూల్‌కు మరియు మియాన్ మన్సూర్ అన్సారీని నార్త్-వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ప్రజాదరణను సమీకరించడానికి మరియు వాలంటీర్లను నియమించడానికి పంపారు మరియు షేకుల్ హింద్ స్వయంగా  మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానీతో కలిసి టర్కీ మద్దతును పొందేందుకు హిజాజ్ (KSA)కి వెళ్లారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జిహాద్ ప్రకటనపై టర్కీ  గవర్నర్ గాలిబ్ పాషా సంతకం పొంది, తిరుగుబాటును ప్రారంభించడానికి షేకుల్ హింద్ మౌలానా మహమూద్ హసన్ బాగ్దాద్ మరియు బలూచిస్తాన్ మీదుగా భారతదేశానికి తిరిగి రావాలని అనుకున్నారు. షేఖుల్ హింద్ మౌలానా మహమూద్ హసన్, తిరిగి రావాలని అనుకున్నప్పుడు, సిల్క్  లెటర్ మూవ్‌మెంట్ పంజాబ్ CIDచే స్వాధీనం చేసుకుంది.

సిల్క్  లెటర్ ఉద్యమం కారణంగా షేఖుల్ హింద్ మౌలానా మహమూద్ హసన్,  హిజాజ్‌లో అరెస్టయ్యాడు. షేఖుల్ హింద్ మౌలానా మహమూద్ హసన్,  మాల్టాలో ఖైదు చేయబడ్డాడు, అక్కడ షేఖుల్ హింద్ మౌలానా మహమూద్ హసన్ మూడు సంవత్సరాలకు పైగా కనికరం లేకుండా హింసించబడ్డాడు.

ఇక్కడ సిల్కెన్ లెటర్ ఉద్యమం అంటే ఏమిటో ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా షేఖుల్ హింద్ మౌలానా మహమూద్ హసన్ సాయుధ విప్లవాన్ని కోరుకున్నారు. కాబట్టి, షేఖుల్ హింద్ మౌలానా మహమూద్ హసన్  కు ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రి అవసరం. షేఖుల్ హింద్ మౌలానా మహమూద్ హసన్ మరియు అతని సహచరులు, బ్రిటిష్ వ్యతిరేక దేశాల నుండి మద్దతు కోసం ఆఫ్ఘనిస్తాన్, టర్కీ మరియు రష్యా వంటి వివిధ దేశాలకు వెళ్లారు. వివిధ దేశాలను సందర్శించిన సమయంలో, షేఖుల్ హింద్ మౌలానా మహమూద్ హసన్ మరియు అతని సహచరుల మధ్య సైన్యంలో వాలంటీర్లను రిక్రూట్ చేయడానికి మరియు జాతీయ ప్రభుత్వాన్ని స్థాపించడానికి ప్రణాళిక యొక్క రూపురేఖలతో కూడిన లేఖ పట్టు గుడ్డపై వ్రాయబడింది. అందుకే ఈ ఉద్యమాన్ని సిల్క్  లెటర్ మూవ్‌మెంట్/తహ్రీకే రేష్మీ రుమాల్ (ఉర్దూలో)/సిల్క్ లెటర్ కుట్ర (బ్రిటీష్ ప్రభుత్వం ప్రకారం) అని పిలిచేవారు. విడుదలైన తర్వాత మౌలానా మహమూద్ హసన్ భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు, భారతదేశం యొక్క ప్రముఖ నాయకుడు “షేఖుల్ హింద్” అనే బిరుదును ప్రదానం చేశారు.

భారతదేశం యొక్క ప్రముఖ నాయకుడు షేఖుల్ హింద్ మౌలానా మహమూద్ హసన్ భారతీయ ముస్లింలందరూ భారత జాతీయ కాంగ్రెస్‌ ప్రముఖ నాయకుడు  మహాత్మా గాంధీ (1869-1948) ప్రారభించిన సహాయ నిరాకరణ మరియు సామూహిక శాసనోల్లంఘన ఉద్యమం లో పాల్గొనాలని మరియు భారత జాతీయ కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడం మరియు దాని కార్యక్రమాలలో పాల్గొనడం విధిగా చేస్తూ ఫత్వా జారీ చేశాడు.

షేఖుల్ హింద్ మౌలానా మహమూద్ హసన్ భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం అమరవీరుడు కావాలని కోరుకుంటూ నవంబర్ 30, 1920 న మరణించాడు.

షేఖుల్ హింద్ మౌలానా మహమూద్ హసన్ ఇక లేరు, కానీ అతని చాలా మంది విద్యార్థులు భారతదేశ స్వాతంత్ర్యం కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు.

దారుల్ ఉలూమ్‌లో 1891లో గ్రాడ్యుయేట్ అయిన మౌలానా ఉబైదుల్లా సింధీ (1872-1944) భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అత్యంత చురుకైన మరియు ప్రముఖ సభ్యుడు. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ విప్లవం కోసం బ్రిటిష్ వ్యతిరేక శక్తుల మద్దతు పొందడానికి మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో షేకుల్ హింద్ ఆజ్ఞను అనుసరించి భారతదేశాన్ని విడిచిపెట్టిన దారుల్ ఉలూమ్ నాయకులలో ఉబైదుల్లా సింధీ కూడా ఉన్నాడు.

ఆఫ్ఘన్ అమీర్ హబీబుల్లా ఖాన్‌ను సమీకరించడానికి మౌలానా సింధీ కాబూల్ చేరుకున్నారు.కొంతకాలం తర్వాత, ఉబైదుల్లా సింధీ, జర్మన్ మద్దతుతో భారతదేశంలో విప్లవం కోసం రాజ మహేంద్ర ప్రతాప్ యొక్క ప్రణాళికలకు తన మద్దతును అందించాడు. ఉబైదుల్లా సింధీ డిసెంబర్ 1, 1915న కాబూల్‌లో ఏర్పడిన తాత్కాలిక భారత ప్రభుత్వంలో మంత్రిగా నామినేట్ చేయబడ్డాడు. ఇది స్వతంత్ర భారతదేశానికి బాధ్యత వహించాల్సిన ప్రవాస విప్లవాత్మక ప్రభుత్వంగా ప్రకటించబడింది. కానీ దురదృష్టవశాత్తు, 1919లో, ఆఫ్ఘనిస్తాన్‌పై బ్రిటిష్ రాజ్ దౌత్యపరమైన ఒత్తిడితో తాత్కాలిక భారత ప్రభుత్వం రద్దు చేయబడింది.

మౌలానా సింధీ దాదాపు 7 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నాడు.

మౌలానా సింధీ సోవియట్ రష్యాను సందర్శించి, ఆపై టర్కీకి చేరుకున్నాడు, అక్కడ మౌలానా సింధీ ఇస్తాంబుల్ నుండి భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం చార్టర్‌ను జారీ చేశాడు.

మౌలానా సింధీ టర్కీ నుండి హిజాజ్ కోసం బయలుదేరాడు మరియు 1929 వరకు అక్కడే ఉన్నాడు. మౌలానా సింధీ భారతదేశ స్వాతంత్ర్యం కొరకు ఒక దేశం నుండి దేశానికి ప్రయాణించాడు. మౌలానా సింధీ 1944 ఆగస్టు 22న పాకిస్తాన్‌లోని దీన్‌పూర్‌లో మరణించాడు.

షిఖుల్ ఇస్లాం మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానీ (1879-1957) కూడా షేఖుల్-హింద్ విద్యార్థులలో ఒకరు మరియు దారుల్ ఉలూమ్, దేవ్‌బంద్‌లో గ్రాడ్యుయేట్ మరియు తరువాత హదీత్ ప్రొఫెసర్.

మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానీ దోషిగా నిర్ధారించబడనప్పటికీ, షేఖుల్ హింద్‌ ని  జాగ్రత్తగా చూసుకోవడానికి స్వచ్ఛందంగా మాల్టాకు వెళ్లాడు. షేఖుల్ హింద్ విడుదలయ్యే వరకు మూడు సంవత్సరాలు మాల్టాలో ఉన్నాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానీ స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్నాడు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటీష్ అధికారులు అతనిని అనేకసార్లు జైలుపాలు జేసారు. కరాచీలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో బ్రిటీష్ సైన్యంలో  మరియు పోలీసుగా పనిచేయడం హరామ్ అని ఫత్వా జారీ చేయడానికి సాహసించిన వ్యక్తి. ఈ ఫత్వా తర్వాత, మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానీకి రెండు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేంత వరకు మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానీ స్వాతంత్య్ర పోరాట ఉద్యమం నుంచి వైదొలగలేదు.

భారత స్వాతంత్ర్య సమయంలో మదానీ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు. అహ్మద్ మదానీ,  మౌలానా అబుల్ కలాం ఆజాద్ (1888-1958) మరియు మహాత్మా  గాంధీతో కలిసి భారతదేశంలోని వివిధ ప్రావిన్సులను పర్యటించి ప్రజలకు భద్రతను కల్పించడానికి మరియు భారతదేశం నుండి పాకిస్తాన్‌కు వలస వెళ్లకుండా వారిని ఆపడానికి ప్రయత్నించాడు. అహ్మద్ మదానీ ఎప్పుడూ విభజనకు అనుకూలంగా లేరు.  

స్వాతంత్ర్యం తరువాత, మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానీ మంత్రివర్గంలో పనిచేయడానికి నిరాకరించాడు మరియు బోధన మరియు సామాజిక కార్యక్రమాల కోసం దారుల్ ఉలూమ్ మరియు జమియత్ ఉలమా-ఎ-హింద్ కార్యక్రమాల కోసం తనను తాను పరిమితం చేసుకున్నారు.

మదానీ మరియు సింధీ వలె, భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొన్న వందలాది మంది దారుల్ ఉలూమ్ పట్టభద్రులు ఉన్నారు. ఆ దేశభక్తుల రచనలను ప్రస్తావించాలంటే చాలా సంపుటాలు కావాలి.

భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో దారుల్ ఉలూమ్ పోషించిన పాత్రను మరియు చేసిన కృషిని ఆధునిక భారతదేశ చరిత్రకారులు పూర్తిగా విస్మరించడం విచారకరం.

 

No comments:

Post a Comment