కర్ణాటకలోని బెల్గాం పురాతన
కోటలో ఉన్న హజ్రత్ సయ్యదినా షేక్ బద్రుద్దీన్ షా ఆరిఫ్ చిస్తీ దర్గా దక్కన్ లోని పురాతన
దర్గాలలో ఒకటి మరియు అది ఎనిమిది శతాబ్దాల
పురాతనమైనదని నమ్ముతారు.
సూఫీ సాధువులలో ఒకరైన షేక్ బద్రుద్దీన్
శాంతి మరియు సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేస్తూ దక్షిణ భారతదేశం అంతటా
పర్యటించారు. బెల్గాంలోని షేక్ బద్రుద్దీన్ సమాధి ఇప్పటికీ బెల్గాం నగరంలో
సామరస్యానికి గొప్ప చిహ్నం గా విరాజిల్లుతుంది,
“హజ్రత్ సయ్యదినా షేక్ బద్రుద్దీన్ షా ఆరిఫ్
చిస్తీ 800 సంవత్సరాల
క్రితం డెక్కన్‌కు వచ్చారు. శాంతి మరియు ప్రేమ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి షేక్
బద్రుద్దీన్ షా ఆరిఫ్ చిస్తీ దక్షిణ భారతదేశం అంతటా విస్తృతంగా పర్యటించాడు. దక్కన్
ప్రాంతంలో స్థిరపడిన మొదటి సూఫీ సెయింట్లలో షేక్ బద్రుద్దీన్ షా ఆరిఫ్ చిస్తీ ఒకరు. చారిత్రాత్మకమైన బెల్గాం కోటలో ఉన్న షేక్
బద్రుద్దీన్ చిస్తీ సమాధిని వివిధ రాజవంశాలకు చెందిన పాలకులు వారి విశ్వాసంతో
సంబంధం లేకుండా గౌరవించేవారు.
ఢిల్లీకి చెందిన షేక్
బద్రుద్దీన్ 12వ శతాబ్దానికి
చెందిన ఢిల్లీలో ఉన్న సాధువు మరియు పండితుడు అయిన హజ్రత్ షేక్ కుతుబుద్దీన్
భక్తియార్ కాకి శిష్యుడు. షేక్ బద్రుద్దీన్ తన ఆధ్యాత్మిక గురువు షేక్
కుతుబుద్దీన్ భక్తియార్ కాకి సలహా మేరకు దక్కన్ లోని బెల్గాంకు వలస వెళ్లాడు. దక్షిణాన
షేక్ బద్రుద్దీన్ సూఫీ సన్యాసి ఖ్వాజా ముయినుద్దీన్ చిష్తీ యొక్క చిష్తీ క్రమాన్ని
ప్రవేశపెట్టారు.
రాజులు, మంత్రులు మరియు
అన్ని మతాల సైనిక కమాండర్లచే పూజించబడిన షేక్ బద్రుద్దీన్ దర్గా తన దాదాపు 800 సంవత్సరాల
చరిత్రలో అనేక రాజవంశాలతో సన్నిహిత సంబంధాలను కలిగి ఉన్నది..
మరాఠా, మొఘల్ మరియు
ఆదిల్ షాహీ వారసత్వం యొక్క కొన్ని విలువైన పురాతన వస్తువులను షేక్ బద్రుద్దీన్ దర్గా
కలిగి ఉంది.
హజ్రత్ సయ్యదినా షేక్ బద్రుద్దీన్ షా ఆరిఫ్
చిస్తీ దర్గా ప్రాచీన చరిత్రను ప్రతిబింబించే అనేక పురాతన ఆర్కైవల్ రికార్డులను
కలిగి ఉంది. మరియు వాటిలో ముఖ్యమైనది పవిత్ర ఖురాన్ యొక్క 16వ శతాబ్దపు కాపీ.
ఇది ఆరవ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ అలంగీర్ చేత లిఖితపూర్వకంగా స్వయం గా రాయబడి దర్గా
కు బహుమతిగా ఇవ్వబడింది.
" వాస్తవానికి అజ్మీర్‌లోని ఖ్వాజా ముయినుద్దీన్
చిస్తీ దర్గాకు చక్రవర్తి ఔరంగజేబ్ దివ్య ఖురాన్ లిఖిత కాపీని బహుమతిగా ఇచ్చాడు, కానీ అది షేక్
బద్రుద్దీన్ షా దర్గా కు ఎలా మరియు ఎప్పుడు చేరిందో ఖచ్చితంగా తెలియదు. ఈ ఆశీర్వాద
కాపీని కలిగి ఉండటం అదృష్టంగా భావిస్తున్నాము మరియు దానిని భావితరాల కోసం
భద్రపరచడానికి కృషి చేస్తున్నాము, ”అని దర్గా కేర్‌టేకర్ ఘవ్వాస్ అన్నారు.
స్థానిక చరిత్ర ప్రకారం, షేక్ బద్రుద్దీన్
దక్షిణ భారతదేశం అంతటా పర్యటించిన తర్వాత బెల్గాం చేరుకుని, కొత్తగా
నిర్మించిన కోట ప్రాంగణంలో స్థిరపడ్డాడు. ఈ కోట వాస్తవానికి 1204 ADలో రట్టా
రాజవంశానికి చెందిన రాజా జయ రాయచే నిర్మించబడింది మరియు షేక్ బద్రుద్దీన్ 1251 ADలో మరణించే వరకు
ఇక్కడ నివసించాడు.
షేక్ బద్రుద్దీన్ సమాధిని
16వ శతాబ్దం
ప్రారంభంలో ఆదిల్ షాహీ జనరల్ మరియు అప్పటి బెల్గాం గవర్నర్ అసద్ ఖాన్ లారీ
నిర్మించారు. ఈ నిర్మాణం ఇటివల కొంత పునరుద్ధరణతో భద్రపరచబడింది. దర్గా లోపలి భాగం
గోడలు, గోపురం మరియు
పైకప్పులను అలంకరించిన ఇరానియన్ గాజు పనితో ఫేస్‌లిఫ్ట్ చేయబడింది.
బెల్గాంలో షేక్
బద్రుద్దీన్ దర్గా దాని సుదీర్ఘ చరిత్రలో, వారి విశ్వాసంతో సంబంధం లేకుండా పాలకుల నుండి
ప్రోత్సాహాన్ని పొందింది. షేక్ బద్రుద్దీన్‌ను గౌరవించే మరాఠా పాలకులు జారీ చేసిన
అనేక ఫర్మాన్‌లు మరియు సనద్‌లను దర్గా కేర్‌టేకర్ కలిగి ఉన్నారు.
"షేక్ బద్రుద్దీన్‌ను దర్గా ఎల్లప్పుడూ శాంతి
మరియు సామరస్యానికి నిలయంగా ఉంది మరియు అందరికీ ప్రేమ అనే నినాదంతో
కొనసాగుతున్నాము" అని దర్గా కేర్‌టేకర్ ఘవ్వాస్ తెలిపారు.
No comments:
Post a Comment