ప్రస్తుత అంచనాల ప్రకారం, ఓషియానియాలో
మొత్తం 620,156 మంది ముస్లింలు
ఉన్నారు: ఆస్ట్రేలియాలో 476,600,
న్యూజిలాండ్‌లో 48,151, ఫిజీలో 52,520, న్యూ
కాలెడోనియాలో 6,352, పాపువా న్యూ
గినియాలో 2,200, సోలమన్ ఇస్లాండ్‌లో
360, వాను లో 221 మరియు టోంగా లో
110 మంది కలరు.
పసిఫిక్ మ్యాగజైన్‌లో 2007లో 'గ్రీన్ మూన్
రైజింగ్' అనే శీర్షికతో
వచ్చిన కథనం ప్రకారం, వనాటు, ఫిజీ, సోలమన్ దీవులు, పాపువా న్యూ
గినియా మరియు న్యూ కాలెడోనియా ప్రజలలో ఇస్లాం అవలoబించే వారి సంఖ్య గణనీయంగా
పెరిగింది. మెలనేషియాలో వేలాది మంది స్థానికులు ఇస్లాంలోకి మారారు.పలావులో దాదాపు 400 మంది ముస్లింలు
కూడా ఉన్నారు.
చరిత్ర
ఇండోనేషియాలోని ముస్లింలతో
సంబంధాల కారణంగా 16వ శతాబ్దంలో
ఇస్లాం ఓషియానియాలోని కొన్ని ప్రాంతాల్లో ఉంది. న్యూ గినియా లో ఇస్లాం ఉనికి 17వ శతాబ్దం ప్రారంభంలో ఆరంభమైనది.
వెస్ట్రన్ న్యూ గినియా వంటి
ప్రాంతాలలో మొలుక్కన్ ప్రభావం ద్వారా ఇస్లాం 17వ శతాబ్దంలో చేరుకొని అక్కడ ముస్లిం జనాభా స్థాపించబడినది. ముస్లిం వ్యాపారులు పశ్చిమ పాపువాన్ Papuans లతో కనీసం 15వ శతాబ్దం నుండి
వ్యాపారాన్ని నిర్వహించారు.
ఓషియానియాలోని ఇతర
ప్రాంతాలలో 19వ శతాబ్దం వరకు
ఇస్లాం ఉనికిలో లేదు. ఉదాహరణకు, 1879లో ఫిజీ మరియు లియోనిడాస్‌లోLeonidasలో ఒప్పంద
కార్మికుల రూపం లో మొదటి ముస్లింలు వచ్చారు. ముస్లింలు లియోనిడాస్‌లో 22% మంది ఉన్నారు. కోకోస్ (కీలింగ్)
దీవులలో 75 % ముస్లింలు కలరు..
No comments:
Post a Comment