27 December 2022

జియావుద్దీన్ బరానీ(1285–1358 CE)

 



 

జియావుద్దీన్ బరానీ (1285–1358 CE) ముహమ్మద్ బిన్ తుగ్లక్ మరియు ఫిరూజ్ షా కాలం లో ఢిల్లీ సుల్తానేట్ యొక్క ముస్లిం రాజకీయ ఆలోచనాపరుడు. “తారీఖ్-ఇ-ఫిరోజ్ షాహీ” ను రచించడంతో  బరానీ బాగా ప్రసిద్ది చెందాడు. తారీఖ్-ఇ-ఫిరోజ్ షాహీ” గియాత్ అల్-దిన్ తుగ్లక్ పాలన కాలం మరియు  ఫిరోజ్ షా తుగ్లక్ పాలన యొక్క మొదటి ఆరు సంవత్సరాలు వివరిస్తుంది. బరానీ  మరొక రచన “ఫత్వా-ఇ-జహందారీ” భారత ఉపఖండంలోని ముస్లిం వర్గాల మధ్య శ్రేణి hierarchy ని ప్రోత్సహిస్తుంది.

 

బరానీ 1285లో బరాన్‌కు చెందిన ఒక కులీన ముస్లిం కుటుంబంలో జన్మించాడు. బరానీ తండ్రి, మామయ్య మరియు తాత అందరూ ఢిల్లీ సుల్తాన్ క్రింద ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలలో పనిచేశారు. బరానీ మేనమామ ఖాజీ అలా-ఉల్-ముల్క్, అలా-ఉద్-దిన్ ఖాల్జీ పాలనలో ఢిల్లీకి కొత్వాల్ (పోలీస్ చీఫ్)గా ఉన్నారు. బరానీ ఎప్పుడూ పదవిని నిర్వహించలేదు, కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్‌కు పదిహేడేళ్లపాటు నాదిమ్ (సహచరుడు)గా ఉన్నాడు. ఈ కాలంలో బరానీ, అమీర్ ఖుస్రోతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. తుగ్లక్ పదవీచ్యుతుడైన తరువాత, బరానీ ప్రవాసం లో ఉన్నప్పుడు ప్రభుత్వం, మతం మరియు చరిత్ర పై రెండు ఆర్టికల్స్ రాశాడు, అవి కొత్త సుల్తాన్ ఫిరూజ్ షా తుగ్లక్‌కు నచ్చుతాయని  ఆశించాడు. కాని బరానీ తన కృషికి ప్రతిఫలం పొందలేదు మరియు 1357లో పేదవాడిగా మరణించాడు.

 

బరానీ ఉత్తర భారతదేశంలోని బరన్ (ప్రస్తుతం బులంద్‌షహర్)కి చెందినవాడు, బరానీ సమాధి ఢిల్లీలోని నిజాముద్దీన్ ఔలియా దర్గా ప్రాంగణంలో, అమీర్ ఖుస్రూ సమాధికి సమీపంలో ఉంది.

 

బరానీ రచనలు:

ఫత్వా-ఇ-జహందారీ Fatwa-i-Jahandari:

ఫత్వా-ఇ-జహందారీ అనేది ఒక ముస్లిం పాలకుడు మతపరమైన యోగ్యత మరియు తన పౌరుల కృతజ్ఞతను సంపాదించడానికి అనుసరించాల్సిన రాజకీయ ఆదర్శాలను కలిగి ఉన్న రచన.ఇది ముస్లిం రాజులకు నాసిహత్ (సలహా) అని చెప్పబడింది.

 

 బరానీ “ఫత్వా-ఇ-జహందారీ” ముస్లిం అష్రఫ్ ఉన్నత కులాలు మరియు తక్కువ కులాలు లేదా మతం మార్చబడిన ముస్లింల మద్య విభజనను మన్నిస్తుంది అష్రఫ్ ముస్లిముల ఆదిఖ్యతను సమర్దిస్తుంది

 “ఫత్వా-ఇ-జహందారీ” మతం మరియు ప్రభుత్వం వాటి మద్య సంబంధం అలాగే రాజకీయ తత్వశాస్త్రం యొక్క అంశాలను పరిశీలిస్తుంది. బరానీ దృష్టిలో మతం మరియు తాత్కాలిక ప్రభుత్వం కవలలు; అంటే, మతానికి అధిపతి మరియు ప్రభుత్వ అధిపతి కవల సోదరులు.

ఢిల్లీ సుల్తానేట్ రాజులు హిందువులను గౌరవించారని మరియు వారికి అనుకూలంగా ఉన్నారని మరియు వారికి ధిమ్మీలు (రక్షిత వ్యక్తులు) హోదాను కల్పించారని బరానీ పేర్కొన్నారు. ముస్లిం రాజులు హిందువులను గవర్నర్ పదవులతో సహా ఉన్నత పదవుల్లో నియమించారు. ముస్లిం రాజులు తమ రాజధాని ఢిల్లీలోని  హిందువుల శ్రేయస్సు పట్ల సంతోషించారు.  పేద ముస్లింల పరిస్థతి పట్ల విచారించాడు.

 

తారిఖ్-ఇ-ఫిరూజ్ షాహి:

తారీఖ్-ఇ-ఫిరోజ్ షాహీ (ఫిరూజ్ షా చరిత్ర) (1357) అనేది ఢిల్లీ సుల్తానేట్ చరిత్ర మరియు  ఫిరూజ్ షా తుగ్లక్ చరిత్ర వివరణ. బరానీ నియమాలను అనుసరించిన సుల్తానులు తమ ప్రయత్నాలలో విజయం సాధించారని, అలా చేయని వారు లేదా పాపం చేసిన వారు నశించినారని పేర్కొంది.

బరాని తన సమాచార మూలాలను చాలాసార్లు ప్రస్తావించినప్పటికీ, బరాని తన సమకాలీన రచనలను సంప్రదించలేదు. చిత్తోర్, రణతంబోర్ మరియు మాల్వాలో అలా-ఉద్-దిన్ ఖాల్జీ యొక్క యుద్ధాలు మరియు మాలిక్ కాఫుర్ యొక్క దక్కన్ విజయాలను  వర్ణించినాడు. యొక్క స్కెచ్ వర్ణనకు దారితీసింది. తరువాతి మధ్యయుగ చరిత్రకారులు-నిజాం-ఉద్-దిన్ అహ్మద్, బదావోని Badaoni, ఫెరిష్టా మరియు హాజీ-ఉద్-దబీర్ గత కాలపు డిల్లి సుల్తానుల చరిత్రకు సంబంధించి, వారు తారీఖ్-ఇ-ఫిరూజ్ షాహీపై ఆధారపడి ఉన్నారు. అబ్దుల్ హక్ దెహ్ల్వీ తన అఖ్బర్-ఉల్-అఖ్యార్‌లో నిజాం-ఉద్-దిన్ ఔలియా మరియు ఇతర సూఫీ సాధువుల జీవిత చరిత్ర స్కెచ్‌లకొరకు బరానిపై  ఆధారపడి ఉన్నాడు.

జవాబిత్;

బరానీ చట్టాన్ని షరియత్ మరియు జవాబిత్ అని రెండు రకాలుగా వర్గీకరించాడు. జవాబిత్ అనేది షరియత్ నెరవేర్చలేని కొత్త అవసరాలను తీర్చడానికి మారిన పరిస్థితులలో కులీనుల/ప్రభువులతో సంప్రదించి చక్రవర్తి రూపొందించిన రాజ్య చట్టాలు.

జవాబిత్, షరియత్ స్ఫూర్తితో ఉండాలని మరియు మార్గదర్శకాలుగా దాని సూత్రీకరణకు నాలుగు షరతులను వివరించాడు. అవి-

జవాబిత్ షరియత్‌ను తిరస్కరించకూడదు.

ఇది సుల్తాన్ పట్ల ప్రభువులు మరియు సామాన్య ప్రజలలో విధేయత మరియు ఆశను పెంచాలి

దీని మూలాలు మరియు ప్రేరణ షరియత్ మరియు పవిత్రమైన ఖలీఫాలు అయి ఉండాలి.

ఒకవేళ అది షరియత్‌ను అత్యవసర పరిస్థితుల్లో తిరస్కరించవలసి వస్తే, ఆ తిరస్కరణకు బదులుగా అది దానము మరియు నష్టపరిహారాన్ని అనుసరించాలి.

బరాని-ఇతర రచనలు:

సాల్వత్-ఇ-కబీర్ (గొప్ప ప్రార్థన)

సనా-ఇ-ముహమ్మది (ప్రవక్త మొహమ్మద్ యొక్క ప్రశంసలు)

హస్రత్నమ (విచారాల పుస్తకం)

తారిఖ్-ఇ-బర్మాకి

ఇనాయత్ నమా-ఇ-ఇలాహి (దేవుని బహుమతుల పుస్తకం)

మాసిర్ సాదత్ (సయ్యద్‌ల మంచి పనులు)

లుబ్బతుల్ తారీఖ్.

*ఫతావా-ఇ-దిండారి

No comments:

Post a Comment