ఇబ్న్ జుబైర్ లేదా ఇబ్న్ జుబైర్, ఇబ్న్ జోబైర్ మరియు ఇబ్న్
జుబేర్ అని పిలువబడే ఇబ్న్ జుబైర్ యొక్క పూర్తి పేరు అబు అల్-హసాయిన్ ముహమ్మద్ ఇబ్న్ అహ్మద్ ఇబ్న్
జుబైర్ అల్-కినానీ. ఇబ్న్ జుబైర్ యొక్క జననం 1145 లో స్పెయిన్ లోని ఎమిరేట్
ఆఫ్ బాలన్సియా ఇప్పుడు
ప్రావిన్స్ ఆఫ్ వాలెన్సియా లో జరిగింది మరియు ఈజిప్ట్ లోని అలెగ్జాండ్రియా లో 1217న మరణించారు.
ఇబ్న్ జుబైర్ అల్-అండలస్ నుండి వచ్చిన అరబ్ బౌగోళిక శాస్త్రవేత్త, యాత్రికుడు మరియు కవి. ఇబ్న్ జుబైర్ ట్రావెల్ క్రానికల్ రిహ్లాహ్ Riḥlah 1183 నుండి 1185 వరకు
మక్కాకు
చేసిన తీర్థయాత్రను వివరిస్తుంది. ఇబ్న్ జుబైర్ యొక్క ట్రావెల్ క్రానికల్ రిహ్లాహ్ Riḥlah మక్కా తీర్థయాత్ర కు
సంబందించిన విశేషాలు తెలియ జేస్తుంది.
ఇబ్న్ జుబైర్ 1145 ADలో స్పెయిన్‌లోని వాలెన్సియాలో
కినానా తెగకు చెందిన అరబ్ కుటుంబంలో జన్మించాడు. ఇబ్న్ జుబైర్ తండ్రి సివిల్
సర్వెంట్‌గా పనిచేశాడు. ఇబ్న్ జుబైర్ గ్రెనడా అల్మోహద్ గవర్నర్‌కు కార్యదర్శి
అయ్యాడు. కానీ
మక్కా యాత్ర కోసం ఆ పదవిని విడిచిపెట్టాడు. ఇబ్న్
జుబేర్ 1183లో ఒక వైద్యునితో కలిసి గ్రెనడా నుండి బయలుదేరాడు.
ఇబ్న్ జుబైర్ మక్కా యాత్ర
1183లో
ప్రారంభించబడింది మరియు 1185లో ఇబ్న్ జుబైర్
గ్రెనడాకు తిరిగి రావడంతో ముగిసింది. ఇబ్న్ జుబైర్ తన ప్రయాణం గురించి ఒక సజీవ
కథనాన్ని రిహ్లాహ్ Riḥlah రాశాడు. ఇబ్న్
జుబైర్ పుస్తకం తరువాతి కాలం లో ఇంగ్లీష్The Travels of Ibn Jubayr మరియు ఫ్రెంచ్ Voyages లోకి
అనువదింపబడినది.
ఇబ్న్ జుబైర్ గ్రెనడాను విడిచిపెట్టి, జిబ్రాల్టర్ జలసంధిని దాటి
జెనోయిస్ ఓడలో ఎక్కి అలెగ్జాండ్రియాకు బయలుదేరాడు. దారిలో బలేరిక్ దీవులను దాటి
సార్డినియా పశ్చిమ తీరానికి తరువాత సిసిలీ మరియు క్రీట్‌లను దాటి దక్షిణం వైపు
తిరిగి ఉత్తర ఆఫ్రికా తీరానికి చేరుకున్నాడు. ఆతరువాత అలెగ్జాండ్రియా
చేరుకున్నాడు.
అలెగ్జాండ్రియాలో యాత్రికుల నుండి జకాత్ వసూలు మరియు అలెగ్జాండ్రియా
యొక్క లైట్‌హౌస్‌ను సందర్శించాడు, దాని పరిమాణం మరియు వైభవాన్ని చూసి
ఆశ్చర్యపోయాడు. అలెగ్జాండ్రియాలో 8,000 నుండి 12,000 మసీదులు ఉన్నాయని ఇబ్న్ జుబైర్ పేర్కొన్నారు. ఎనిమిది రోజుల బస
తర్వాత, ఇబ్న్
జుబైర్ కైరోకు
బయలుదేరాడు.
కైరో (ఈజిప్టు)
లో సున్నీ పాలకుడు సలాదిన్ పాలన గురించి ప్రశంసలతో నిండిన వర్ణనలు, కైరో నగరంలో ఇస్లాం చరిత్రలో అనేక ముఖ్యమైన వ్యక్తుల సమాధులను కలిగి
ఉన్న అల్-ఖరాఫాలోని స్మశానవాటికను
ఇబ్న్ జుబైర్ సందర్శించాడు. ఇబ్న్ జుబైర్ సలాదిన్ పరిపాలన
లో కైరో కోటను నగరాన్ని బలోపేతం
చేసే లక్ష్యంతో విస్తరించబడుతుoదని పేర్కొన్నాడు. సలాదిన్ అతను
నిర్మించిన నైలు నదిపై వంతెన, విశాలమైన ఉచిత ఆసుపత్రిని పిరమిడ్లను
చూశాడు మరియు నైలు వరద
ఎత్తును కొలవడానికి ఉపయోగించే పరికరాన్ని కూడా చూశాడు.
నైలు నుండి ఎగువ
ఈజిప్టుకు ఇబ్న్ జుబైర్ పర్యటనలో జబల్ అల్-నార్ [మౌంటైన్ ఆఫ్ ఫైర్] అని పిలవబడే ద్వీపం, పలెర్మో నగరం కూడా ఇబ్న్ జుబైర్ దర్శించాడు మరియు ఎర్ర
సముద్రం మీదుగా జిద్దా, మక్కా మరియు
మదీనా వరకు మరియు ఇరాక్, సిరియా మరియు
సిసిలీ మార్గంలో గ్రేనడాకు తిరిగి రావడం మొదలగు విశేషాలు వివరించబడినవి.
ఇబ్న్ జుబేర్ మరో రెండు
సందర్భాలలో (1189–1191 మరియు 1217) తూర్పుకు
ప్రయాణించాడు.మూడవయాత్ర 1217లో ప్రారంభించబడింది, ఈజిప్టు అలెగ్జాండ్రియాలో
లో ఇబ్న్ జుబైర్ మరణంతో ముగిసింది.
అవలోకనం:
ఇబ్న్ జుబైర్ తన
ప్రయాణాలలో సందర్శించిన ప్రదేశాల గురించి అత్యంత వివరణాత్మక మరియు గ్రాఫిక్
వివరణను అందించాడు. రిహ్లాహ్ Riḥlah భౌగోళిక
వివరాలతో పాటు సాంస్కృతిక,
మత మరియు రాజకీయ
విషయాల పరిశీలనను కలిగి ఉంటుంది. ఇబ్న్ జుబైర్ రచన రిహ్లా లేదా సృజనాత్మక ట్రావెలాగ్
వ్యక్తిగత కథనం, ప్రయాణించిన
ప్రాంతాల వర్ణన మరియు వ్యక్తిగత కథల మిశ్రమం.
ఇబ్న్ జుబైర్ యొక్క
ట్రావెల్ క్రానికల్ తరువాతి రచయితలకు ఒక నమూనాగా పనిచేసింది. 1355 ADలో ఇబ్న్ బటుతా
యొక్క ఇబ్న్ జుజయ్, 170 సంవత్సరాల
క్రితం ఇబ్న్ జుబైర్ వ్రాసిన భాగాలను కాపీ చేసాడు, ఇది డమాస్కస్, మక్కా, మదీనా మరియు మధ్యప్రాచ్యంలోని ఇతర ప్రాంతాలను
వివరించింది. ఇబ్న్ జుబైర్ నుండి కాపీ చేయబడిన భాగాలు అల్-షరీషి, అల్-అబ్దారీ
మరియు అల్-మక్రిజీల రచనలలో కూడా కనిపిస్తాయి.
లైడెన్ యూనివర్శిటీ
లైబ్రరీ సేకరణలో ఇబ్న్ జుబైర్ యొక్క మాన్యుస్క్రిప్ట్ కాపీ భద్రపరచబడింది. 210-పేజీల
మాన్యుస్క్రిప్ట్ 875 AH
(1470 AD)లో మక్కాలో తయారు చేయబడింది పూర్తి అరబిక్ గ్రంథాన్ని 1852లో ప్రాచ్య
శాస్త్రవేత్త విలియం రైట్ మొదటిసారిగా ప్రచురించారు. ఇటాలియన్‌లోకి అనువాదం 1906లో
ప్రచురించబడింది. ఆంగ్లంలోకి మరియు
ఫ్రెంచ్‌లోకి అనువాదం 1949 మరియు 1956 మధ్య మూడు
సంపుటాలుగా వెలువడింది.
No comments:
Post a Comment