అల్-మఖ్దిసీ, పూర్తిపేరు ముహమ్మద్ ఇబ్న్ అహ్మద్ అల్-మక్దిసీ లేదా అల్-ముకద్దాసీ. అల్-మఖ్దిసీ 946 లో జెరూసలేం, ఫాతిమిడ్ కాలిఫేట్ లో
జన్మించాడు. అల్-మక్దిసి ఒక మధ్యయుగ అరబ్ భౌగోళిక
శాస్త్రవేత్త.
అల్-మక్దిసి ప్రముఖ రచన:“అహ్సన్ అట్-తఖాసిమ్ ఫి మారిఫత్ అల్-అఖలీమ్”Aḥsan al-taqāsīm fī maʿrifat al-aqālīm (The Best Divisions in the Knowledge of the Regions), మరియు సిరియా వివరణ (పాలస్తీనాతో సహా) పుస్తక రచయిత. అల్-మక్దిసి పాలస్తీనియన్‌గా గుర్తింపు పొందిన తొలి చారిత్రక వ్యక్తులలో ఒకడు. అల్-మక్దిసి గురించి తక్కువ జీవితచరిత్ర సమాచారం అందుబాటులో ఉంది.
అల్-మక్దిసి జెరూసలేం
(అరబిక్‌లో బైత్ అల్-మక్దిస్) నుండి తన పేరును పొందాడు. అల్-మక్దిసి జెరూసలేం గురించి
తన రచనలలో సుదీర్ఘంగా వివరించాడు.
అల్-మక్దిసి జెరూసలేంలోని
ఒక మధ్యతరగతి కుటుంబo లో జన్మించాడు. అల్-మక్దిసి తాత, మరియు తండ్రి ఆర్కిటెక్ట్. అల్-మక్దిసి
బాగా చదువుకున్నవాడు. అరబిక్ వ్యాకరణం మరియు సాహిత్యంలో బలమైన జ్ఞానాన్ని పొందాడు.
ఇస్లామిక్ న్యాయశాస్త్రం, చరిత్ర, ఫిలాలజీ మరియు హదీథ్‌లలో ఆసక్తి కలవాడు
అల్-మక్దిసి 967లో తన మొదటి హజ్ (మక్కా తీర్థయాత్ర) చేసాడు. ఈ
కాలంలో, అల్-మక్దిసి భౌగోళిక అధ్యయనo పట్ల ఆసక్తి
పెంచుకొన్నాడు. అవసరమైన
సమాచారాన్ని పొందేందుకు, అల్-మక్దిసి
ఇస్లామిక్ ప్రపంచం అంతటా వరుస ప్రయాణాలను చేపట్టాడు. అల్-అండలస్ (ఐబీరియన్
ద్వీపకల్పం), సింధ్ మరియు సిస్తాన్ మినహా అన్ని ఇస్లామిక్ భూములను
సందర్శించాడు.
అల్-మక్దిసి 965 మరియు 974 మధ్య అలెప్పో, 978లో మక్కాకు రెండవ తీర్థయాత్ర, 984లో ఖురాసన్‌ను సందర్శించడం చేసాడు. 985లో షిరాజ్‌లో తన సేకరించిన
మెటీరియల్‌ని కంపోజ్ చేయాలని నిర్ణయించుకొన్నాడు. అల్-మక్దిసి తన గ్రంధానికి “అహ్సన్ అల్-తకాసిమ్ ఫి మర్ఫత్ అల్-అఖలీమ్” అని పేరు పెట్టారు.
అల్-మక్దిసి ప్రకారం
పదవ శతాబ్దంలో ఇస్లాం యొక్క ప్రాంతాలు
అల్-మక్దిసి తన పూర్వీకులు
అయిన అల్-జాహిజ్ మరియు ఇబ్న్ అల్-ఫాకిహ్ ద్వారా
ప్రభావితమైనప్పటికీ, అల్-మక్దిసి నిజమైన
భౌగోళిక శాస్త్రవేత్తగా పిలవబడతారు. ఇదే
విషయాన్నీ అల్-మక్దిసి స్వయంగా అహ్సాన్ అల్-తకాసిమ్ ముందుమాటలో
పేర్కొన్నాడు.అల్-మక్దిసి అబూ జైద్ అల్-బల్ఖి ఇస్లామిక్ భూగోళశాస్త్ర పాఠశాల లేదా
సంప్రదాయం కు చెందినవాడు.
అల్-బాల్కీ పాఠశాల
ఇస్లామిక్ ప్రపంచంతో వ్యవహరించింది, అల్-మక్దిసి కూడా
తన అధ్యయనాలను అల్-బాల్కీ పాఠశాల కు అంకితం చేశాడు. అల్-మక్దిసి ఈ ప్రపంచాన్ని
అల్-మమ్లాకా లేదా అల్-ఇస్లాం (ఇస్లామిక్ ప్రపంచం )గా సూచిస్తారు, ఇది ఇస్లాం యొక్క అన్ని భూభాగాలు కలసి ఒకే ప్రాంతంగా గా ఏర్పడిన ఒక ప్రత్యేక భావన.
అల్-మక్దిసి అల్-మమ్లాకా
లేదా అల్-ఇస్లాం ప్రాంతాన్ని రెండు భాగాలుగా విభజించాడు: మమ్లకత్ అల్-ʿఅరబ్ (అరబ్బుల ప్రాంతం ) మరియు మమ్లాకత్ అల్-ʿఅజం (అరబ్యేతరుల ప్రాంతం)
మమ్లకత్ అల్-ʿఅరబ్ (అరబ్బుల ప్రాంతం ) తూర్పు నుండి పడమర
వరకు, ఇరాక్, అకుర్ (ఎగువ
మెసొపొటేమియా), అరేబియా, సిరియా, ఈజిప్ట్ మరియు మఘ్రెబ్‌లోని ఆరు ప్రావిన్సులను
కలిగి ఉంది.
మమ్లాకత్ అల్-ʿఅజం (అరబ్యేతరుల ప్రాంతం) మష్రిక్ యొక్క
ఎనిమిది ప్రావిన్సులు, (సిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఖురాసన్ మరియు ట్రాన్సోక్సియానా) సింధ్, కిర్మాన్, ఫార్స్, ఖుజిస్తాన్, జిబాల్, దైలామ్ మరియు రిహాబ్ (అర్మేనియా, అధర్‌బైజన్ మరియు అరన్)కలిగి ఉంది.
పాలస్తీనా వివరణ:
అల్-మఖ్దిసి సందర్శించిన
అన్ని ప్రదేశాలు మరియు ప్రాంతాల గురించి అహ్సన్ అల్-తఖాసిమ్ లో క్రమబద్ధమైన వివరణ అందించాడు. అల్-మఖ్దిసి
పాలస్తీనాపై ప్రత్యేక దృష్టితో బిలాద్ అల్-షామ్ (ది లెవాంట్)కి తన పుస్తకంలోని ఒక
భాగాన్ని అంకితం చేశాడు. అల్-మక్దిసి ఈ
ప్రాంతం యొక్క జనాభా, జీవన విధానం, ఆర్థిక వ్యవస్థ మరియు వాతావరణంపై వివరణాత్మక
అంతర్దృష్టులను అందించారు. అల్-మఖ్దిసి జెరూసలేంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడు, దాని లేఅవుట్, గోడలు, వీధులు, మార్కెట్‌లు, పబ్లిక్ నిర్మాణాలు మరియు ల్యాండ్‌మార్క్‌లు, ప్రత్యేకించి హరామ్ యాష్-షరీఫ్ (టెంపుల్ మౌంట్)
మరియు తరువాతి డోమ్ ఆఫ్ ది రాక్ మరియు జామీ అల్-అక్సా గరించి వివరణ ఇచ్చాడు. అల్-మఖ్దిసి జెరూసలేం నగరం యొక్క ప్రజలు ప్రత్యేకించి
ముస్లింల జనాభా మరియు ఆచారాలను వివరించాడు.
అల్-మక్దిసి వరుసగా
పాలస్తీనా మరియు జోర్డాన్ జిల్లాల రాజధానులైన రమ్లా మరియు టిబెరియాస్ గురించి
విస్తృతమైన అవలోకనాలను కూడా అందించాడు. అల్-మక్దిసి ఎకర్, బీసన్, బేట్ జిబ్రిన్, సిజేరియా, అమ్మన్ మరియు ఐలా గురించి వివరించాడు.
పాలస్తీనా జనసాంద్రత మరియు సంపన్నమైనదిగా అల్-మక్దిసి పేర్కొన్నాడు.
పాలస్తీనా గురించి మరియు
ముఖ్యంగా స్వస్థలమైన జెరూసలేం గురించి అల్-మక్దిసి వివరణ ఉత్తమైనడిగా చరిత్రకారుడు
గై లే స్ట్రేంజ్ వ్యాఖ్యలు చేసాడు
తూర్పు అరేబియా వివరణ :
తాటి చెట్లలో హఫీత్ {తువ్వం} పుష్కలంగా
ఉంటుంది; ఇది హజర్ {అల్-హసా} దిశలో ఉంది, మరియు మసీదు
మార్కెట్‌లలో ఉంది ... దిబ్బా మరియు జుల్ఫర్, హజర్ దిశలో రెండూ
సముద్రానికి దగ్గరగా ఉన్నాయి ... తువ్వమ్‌లో ఖురేషుల ఒక శాఖ ఆధిపత్యం
చెలాయించింది. — అల్-ముకద్దాసి, 985.
అల్-మక్దిసి తూర్పు
అరేబియాలోని ప్రాంతాలను పేర్కొన్నాడు, ఇవి ఇప్పుడు సౌదీ
అరేబియా, యుఎఇ మరియు ఒమన్‌లలో కొన్ని భాగాలుగా
ఏర్పడ్డాయి. సౌదీ అరేబియా యొక్క తూర్పు భాగంలో అల్-హసా ఒక ముఖ్యమైన ఒయాసిస్
ప్రాంతం, అయితే తువ్వాం అనేది UAE మరియు ఒమన్‌ల మధ్య విడిపోయిన మరొక ఒయాసిస్
ప్రాంతం. ఒమానీ-UAE సరిహద్దులోని
వివిధ వైపులా ఉన్న అల్ ఐన్ మరియు అల్-బురైమి యొక్క ఆధునిక స్థావరాలను కలిగి ఉంది. దిబ్బ
అనేది UAE మరియు ఒమన్‌ల మధ్య విభజించబడిన మరొక ప్రాంతం, ఇది ముసందమ్ ద్వీపకల్పాన్ని తాకింది, ఇది పాక్షికంగా రస్ అల్ ఖైమా యొక్క ఎమిరేట్ చే పాలించబడుతుంది, ఇక్కడ జుల్ఫర్
యొక్క పురాతన స్థావరం ఉంది.
No comments:
Post a Comment