సమాన (పాటియాలా) పంజాబ్:
మహ్మద్ ప్రవక్త(స) యొక్క ఎనిమిదవ వారసుడు ఇమామ్ అలీ రజా కుమారుడు ఇమామ్ సయ్యద్
మాష్-హద్ అలీకి చెందినదిగా చెప్పబడే ఒక సమాధి యొక్క సమాన (పాటియాలా) పంజాబ్ లో కనుగొనబడిన
తరువాత సమానా పట్టణం షియా ముస్లింలకు ప్రధాన తీర్థయాత్ర కేంద్రంగా మారింది. సమనా, పంజాబ్ రాష్టం లోని పాటియాలా నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ముస్లిం చరిత్ర పండితుల ప్రకారం, దక్షిణాసియాలో ఏ ఇమామ్‌కు
చెందిన మజార్ లేనందున ఇమామ్ సయ్యద్ మాష్-హద్ అలీ మజార్ కనుగొనుట ముఖ్యమైనది.
దాదాపు 1200 సంవత్సరాల
క్రితం ఇమామ్ సయ్యద్ మాష్-హద్ అలీ ఇక్కడ ఖననం చేయబడినారని మరియు సమనా పట్టణానికి మాష్-హద్ అలీ తల్లి పేరు
కూడా ఉందని పండితులు అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన వాస్తవాలు పాత మతపరమైన
పుస్తకాలతో ధృవీకరించబడ్డాయి. కొన్ని చారిత్రక మూలాల ప్రకారం, ఇమామ్ అలీ
రజా కు ఇద్దరు కుమారులు అలీ (తొమ్మిదవ ఇమామ్) మరియు మూసా తో బాటు యాహ్యా అనే మూడవ
కుమారుడు కూడా ఉన్నాడు.
లాహోర్ హైకోర్టు న్యాయమూర్తి షబ్బర్ రిజ్వీ సందర్శించిన సమయంలో, సామాన సమాధి
యాదృచ్ఛికంగా కనుగొనబడింది. మజార్ కనుగొనబడినప్పటి నుండి, లక్నో నుండి
వచ్చిన మతాధికారులు మరియు ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయానికి చెందిన దౌత్యవేత్తలతో
సహా అనేక మంది ముఖ్యమైన షియా ప్రముఖులు మజార్‌ను సందర్శించారు. వారు ఇప్పుడు దాని
పునరుద్ధరణ కోసం ప్రణాళికలపై పని చేస్తున్నారు.
మౌలానా కల్బే జవ్వాద్ ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు, ఈ ప్రదేశంలో
సయ్యద్‌లు నివసిస్తున్నారని, అయితే దేశ విభజన తర్వాత ముస్లిం నివాసితులు పాకిస్తాన్‌కు వలసవెళ్లడంతో అది
నాశనమైందని చెప్పారు. కొందరు అక్కడ గురుద్వారాను నిర్మించడానికి ప్రయత్నించారని, అయితే తాము ఏదైనా
నిర్మాణాన్ని నిర్మించినప్పుడల్లా అది శిథిలమైందని సిక్కు నిహాంగ్‌లు చెప్పారు.
అక్బర్ చక్రవర్తి కాలం నుంచి ఈ సమాధి ఉందని మౌలానా జవ్వాద్ తెలిపారు. సమాధి
చరిత్రను తెలుసుకోవడానికి తాను ఇరాన్‌కు వెళతానని, దక్షిణాసియాలో ప్రవక్త
వారసులెవరూ ఖననం చేసినట్లు రుజువు లేనందున ఇది ఉపఖండంలో ముస్లింల గొప్ప మతస్థలం
అవుతుందని ఆయన అన్నారు.
సంత్ కిర్పాల్జీ ప్రకారం "సమానత్" కులానికి చెందిన పర్షియన్లు
శతాబ్దాల క్రితం ఇక్కడకు వచ్చి నివసించారు. వారు బట్టల వ్యాపారులు.
సంత్ కిర్పాల్జీ మరియు ఈ ప్రాంతంలోని ఇతరుల అభిప్రాయం ప్రకారం, ముఖ్యమైన
సమాధి "చౌదా పీర్" కి చెందినది, చౌదా పీర్ ఈ ప్రాంతంలో అత్యంత
ముఖ్యమైన సెయింట్‌గా పరిగణించబడ్డాడు. ప్రక్కనే ఉన్న సమాధి, చౌదా పీర్ సోదరుడు
లేదా భార్యకు చెందినది. కుడివైపున ఉన్న మూడవ సమాధి చౌదా పీర్ మామకు చెందినది, దానిని గ్రామస్థులు "ఇమామ్ సాహెబ్" లేదా "బడా
పీర్" (పెద్ద సెయింట్) అని సంబోధిస్తారు.
సమానా పట్టణం వెలుపల నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద కాంపౌండ్‌లో ఈ సమాధి
ఉంది. ఇది ఆకట్టుకునే మొఘల్ స్టైల్ గేట్‌ను కలిగి ఉంది. సమాధికి
ఎదురుగా ఉన్న గోడలో నాటిన పెర్షియన్ శంకుస్థాపన రాయి పై ఇలా ఉంది: “ఇది హజ్రత్ అలీ మూసా
రజా కుమారుడు హజ్రత్ ఇమామ్ మాష్-హద్ అలీ సమాధి. దీనిని అక్బర్ చక్రవర్తి పాలన లో 4వ సంవత్సరo, హిజ్రీ 967 రంజాన్ మాసంలో బక్ష్
అల్లా ఖాన్ కుమారుడు అజ్రుద్దీన్ ఖాన్ మొఘల్ నిర్మించాడు.
నాటి పంజాబ్ ముఖ్యమంత్రి, ఈ స్థలంలో
తక్షణమే పనులు ప్రారంభించాలని, తద్వారా దీనిని పవిత్ర స్థలంగా ప్రకటించాలని సంబంధిత
అధికారులను ఆదేశించారు.
మూలం: http://www.milligazette.com జూన్ 16-30, 2005
No comments:
Post a Comment