10 - అహ్మద్ ఇబ్న్ ఫడ్లాన్ Ahmad ibn Fadlan (10 వ శతాబ్దం)
స్కాండినేవియాకు చేసిన ప్రయాణాలకు గాను ఇబ్న్ ఫడ్లాన్ ప్రసిద్ధి చెందాడు. అతను వైకింగ్ సంస్కృతిని వివరంగా వర్ణించినాడు. ఇబ్న్ ఫడ్లాన్ ప్రకారం వైకింగ్స్ అందమైన శరీరాలను కలిగి ఉన్నారు కాని వారిలో వ్యక్తిగత పరిశుభ్రత లేదని వర్ణించాడు; వైకింగ్ రాజు యొక్క సాంప్రదాయ ఖననం గురించి ఫడ్లాన్ వర్ణన అత్యంత ప్రసిద్ధ చెందినది. ఫడ్లాన్ ఇరాకీ. బాగ్దాద్ నుండి బయలుదేరాడు మరియు కాస్పియన్ సముద్రం దాటిన తరువాత వోల్గా నది లోయకు చేరుకున్నాడు, అక్కడ వోల్గా బల్గార్లను కలుసుకోన్నాడు. ఫడ్లాన్ ఉత్తర ఐరోపా అంతటా విస్తృతంగా పర్యటించాడు.ఫడ్లాన్ రష్యా పర్యటించిన మొదటి ముస్లిం యాత్రికుడు.
ముహమ్మద్ ఇబ్న్ హక్కల్ టర్కీలో జన్మించాడు మరియు రచయిత మరియు భూగోళ శాస్త్రవేత్త. హక్కల్ తన జీవితంలో చివరి ముప్పై సంవత్సరాలు ప్రపంచ పర్యటనలో గడిపాడు. హక్కల్ తన యాత్ర వివరాలు తన అత్యంత ప్రసిద్ధ రచన "ది ఫేస్ ఆఫ్ ది ఎర్త్" (సూరత్ అల్-అర్ద్) లో వివరించాడు. తన ప్రయాణాల సమయంలో, ఇబ్న్ హక్కల్ ఆసియా మరియు ఆఫ్రికా యొక్క మారుమూల ప్రాంతాలకు చేరుకున్నాడు. జనావాసాలు లేవని ఒకప్పుడు పురాతన గ్రీకులు పేర్కొన్న ప్రాంతాలలో ప్రజలు నివసించారని హక్కల్ పేర్కొన్నాడు.
హక్కల్ ప్రయాణ లాగ్‌లు తరువాతి ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి మరియు ముస్లిం ఆధీనంలో ఉన్న స్పెయిన్, ఇటలీ మరియు ఫ్రాన్స లోని ముస్లిం జనాభా ఉన్న ప్రాంతాల వర్ణనలను చేసాడు. (ఫ్రాక్సినెట్, (Fraxinet), ప్రోవెన్స్లో, దీనికి ఉత్తమ ఉదాహరణ). హక్కల్ బైజాంటైన్ సామ్రాజ్యం, తూర్పు ఐరోపా మరియు ఇప్పుడు పాకిస్తాన్ ఉన్న ప్రాంతాల గుండా ప్రయాణించాడు.
ఇబ్న్ జుబైర్ స్పెయిన్లోని వాలెన్సియా (Valencia) లో జన్మించాడు. హక్కల్ బాగా చదువుకున్నాడు మరియు న్యాయ మరియు ఖుర్ఆన్ అధ్యయన రంగాలలో నిపుణుడు. హక్కల్ తన స్వగ్రామానికి గవర్నర్ తరువాత హక్కల్ గ్రెనడా పాలకునికి కార్యదర్శి అయ్యాడు. ఒక ప్రత్యేక సంఘటన ఇబ్న్ జుబైర్ ప్రయాణానికి కారణం అయ్యింది. ఇబ్న్ జుబైర్ ప్రకారం, గ్రెనడా నాయకుడు జుబైర్ ను (మరణ ముప్పుతో) ఏడు గ్లాసుల వైన్ తాగమని బలవంతం చేశాడు. పాలకుడు తరువాత పశ్చాత్తాపం చెందినప్పటికీ, ఇబ్న్ జుబైర్ తన " చర్య" తో సిగ్గు పడినాడు. చేసిన తప్పుకు శిక్షగా ఇబ్న్ జుబైర్ హజ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
7 - ఇబ్న్ నుసైర్ మరియు తారిక్ ఇబ్న్ జియాద్ (8 వ శతాబ్దం)
ఎనిమిదవ శతాబ్దం మొదటి భాగంలో ఉమయ్యద్ కాలిఫేట్ కింద స్పెయిన్‌ను స్వాధీనం చేసుకున్న ఘనత మూసా ఇబ్న్ నుసైర్ మరియు తారిక్ ఇబ్న్ జియాద్‌కు దక్కింది. ఇబ్న్ జియాద్ బెర్బెర్ ముస్లిం జనరల్, జియాద్ స్పెయిన్ ఆక్రమణను ప్రారంభించాడు,
ఇబ్న్ నుసైర్ ఉత్తర ఆఫ్రికాలోని ఖలీఫ్‌కు గవర్నర్‌గా పనిచేశాడు మరియు స్పెయిన్ ఆక్రమణ లో ఇబ్న్ జియాద్‌ను అనుసరించాడు. ఇబ్న్ నుసైర్ మరియు తారిక్ ఇబ్న్ జియాద్ ఇద్దరు వేర్వేరు నౌకాదళాలకు నాయకత్వం వహించారు మరియు చివరికి టోలెడో చేరుకున్నారు. తరువాత వారు డమాస్కస్కు తిరిగి వచ్చారు, అక్కడ వారిని హీరోలుగా స్వాగతించారు.
6 - ముహమ్మద్ అల్-ముకాద్దసి (మ .945-1000)
ముమ్మద్ అల్-ముకాద్దసి పదవ శతాబ్దంలో అత్యంత ప్రసిద్ధ పాలస్తీనా ముస్లిం యాత్రికుడు. అతను తన ఇరవై సంవత్సరాల వయస్సులో హజ్ యాత్ర చేసినప్పుడు ముకాద్దసి మేధో జీవితం ప్రారంభమైంది. మక్కా పర్యటన తరువాత, అల్-ముకాదాసి తన జీవితాన్ని భౌగోళిక అధ్యయనం కోసం అంకితం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇరవై ఏళ్ళకు పైగా, ముకాద్దసి ప్రపంచంలోని దాదాపు ప్రతి ముస్లిం దేశానికి వెళ్ళాడు.
ముకాద్దసి జర్నల్స్ తరువాత “అహ్సాన్ అట్-తకాసిమ్ ఫి మా`రిఫత్ ఇల్-అకలీమ్” (Ahsan at-Taqasim fi Ma`rifat il-Aqalim (The Best Divisions for Knowledge of the Regions ప్రాంతాల జ్ఞానం కోసం ఉత్తమ విభాగాలు) గా ప్రచురించబడ్డాయి మరియు అది ముకాద్దసి అత్యంత ప్రసిద్ధ రచన. అందులో జెరూసలేం యొక్క వర్ణన కలదు. ఈ రచన సాహిత్యం మరియు భౌగోళిక అధ్యయనం రెండింటి యొక్క ఇతిహాసంగా పరిగణించబడుతుంది మరియు దీనిని నేటికీ విస్తృతంగా చదువుతారు.
5 - అహ్మద్ ఇబ్న్
మజీద్ Ahmad
ibn Majid (1421- 1500)
అహ్మద్ ఇబ్న్ మజీద్ ఒక ప్రసిద్ధ నావిగేటర్ మరియు అరబిక్ కవి, మజీద్ దక్షిణాఫ్రికా కేప్ ఆఫ్ గుడ్ హోప్ చుట్టూ తిరిగే వెళ్ళే పనిలో వాస్కో డా గామాకు సహాయం చేసినందుకు చాలా ప్రసిద్ది చెందాడు. మజీద్ చాలా ప్రసిద్ధుడు,మజీద్ మొదటి అరబ్ సీమాన్ అని పిలువబడ్డాడు.
మజీద్ ప్రసిద్ధ రచన “కితాబ్ అల్-ఫవాయిద్ ఫి ఉసుల్ 'ఇల్మ్ అల్-బహర్ వా-ఎల్-కవైద్“Kitab al-Fawa’id fi Usul ‘Ilm al-Bahr wa ’l-Qawa’id” (Book of Useful Information on the Principles and Rules of Navigation),” (నావిగేషన్ సూత్రాలు మరియు నియమాలపై ఉపయోగకరమైన సమాచారం యొక్క పుస్తకం), ఇది చరిత్ర మరియు నావిగేషన్ యొక్క ప్రాథమిక సూత్రాల గురించి వివరిస్తుంది. పోర్చుగీస్ అన్వేషకుడైన వాస్కో డా గామా, ఆ సమయంలో ఇతర యూరోపియన్ నావికులకు తెలియని ప్రపంచ పటాన్ని అందించడం ప్రపంచ చరిత్రకు మజీద్ ప్రధాన సహకారం అని చెప్పవచ్చు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా డా గామా భారతదేశానికి విజయవంతంగా చేరడంలో ఈ మ్యాప్ కీలకం అయినది.
4- ముహమ్మద్ అల్-ఇద్రిసి Muhammad al-Idrisi (1100-1165)
ముహమ్మద్ అల్ ఇద్రిసి ఒక ప్రసిద్ధ భూగోళ శాస్త్రవేత్త మరియు యాత్రికుడు, ఇద్రిసి మొరాకో ఇడ్రిసిడ్ పాలకుల వారసుడు, మరియు ముహమ్మద్ ప్రవక్త యొక్క వారసుడు గా భావించబడతాడు. ఇద్రిసి వాస్కో డా గామా, క్రిస్టోఫర్ కొలంబస్ మరియు ఇబ్న్ బటుటాకు ప్రేరణ. తన ప్రారంభ జీవితంలో, అల్-ఇద్రిసి యూరప్ మరియు ఉత్తర ఆఫ్రికా అంతటా పర్యటించారు.
ఇద్రిసి యుక్తవయస్సు లో ఆఫ్రికా, హిందూ మహాసముద్రం మరియు దూర ప్రాచ్యం గురించి వ్యాపారులు మరియు ఇతర ప్రయాణికుల నుండి సమాచారాన్ని సంకలనం చేశాడు. ఇద్రిసి తన “టబులా రోజెరియానా”ను పూర్తి చేయడానికి ఈ సమాచారాన్ని ఉపయోగించాడు. ఇది ఆ సమయంలో అత్యంత ఖచ్చితమైన పటంగా పరిగణించబడుతుంది. అలాగే ఇద్రిసి వ్రాతపూర్వక వచనం “నుజతుల్ ముష్తాక్“Nuzhatul Mushtaq,”” ప్రసిద్ది కెక్కినవి. అల్-ఇద్రిసిని మధ్య యుగాలలో గొప్ప కార్టోగ్రాఫర్‌గా చాలా మంది భావిస్తారు.
3 - అబూ అల్-హసన్ అల్-మసూది Abu al-Hasan al-Mas’udi ( 896-956)
అల్-మసూది ఒక ప్రసిద్ధ అరబ్ చరిత్రకారుడు మరియు
భౌగోళిక శాస్త్రవేత్త, మాసుది తన
ప్రపంచ చరిత్ర ది మెడోస్ ఆఫ్ గోల్డ్ మరియు మైన్స్ ఆఫ్ జెమ్స్ The Meadows
of Gold and Mines of Gems లో చరిత్ర
మరియు శాస్త్రీయ భౌగోళికాలను మిళితం చేసినందుకు "ది హెరోడోటస్ ఆఫ్ ది
అరబ్స్" గా పిలువబడ్డాడు. బాగ్దాద్‌లో జన్మించిన అల్-మసూది తన జీవితంలో
ఎక్కువ భాగం ప్రయాణించి, తన రచనలను
సంకలనం చేశాడు.
2 - జెంగ్ హి Zheng He (1371-1433)
జెంగ్ హి బహుశా ప్రపంచ చరిత్రలో చాలా ముఖ్యమైన నావిగేటర్లలో ఒకడు, మరియు చైనీస్ చరిత్రలో అత్యంత ప్రసిద్ధ సాహసికులలో ఒకడు. యునాన్ ప్రావిన్స్‌లోని ఒక పేద హుయి (చైనీస్ ముస్లిం) కుటుంబానికి మా హిగా జన్మించిన జెంగ్ హి డ్యూక్ యాన్ చక్రవర్తి సింహాసనాన్ని విజయవంతంగా స్వాధీనం చేసుకోవడంలో కీలక సహాయకుడిగా పనిచేసిన తరువాత “జెంగ్” అనే ఇంటిపేరును పొందాడు. ప్రపంచవ్యాప్తంగా చైనా శక్తిని చాటడానికి రూపొందించిన వరుస నావికా యాత్రలకు కమాండర్‌గా ఆయన ఎంపికయ్యారు.
ప్రపంచంలోని అతిపెద్ద మూడు వందల నౌకల్లో దాదాపు ముప్పై వేల మంది పురుషులను జెంగ్ నాయకత్వం వహించాడు. జెంగ్ హి ఏడు యాత్రలలో, ఇరవై ఏడు సంవత్సరాలు గడిపినాడు. జెంగ్ ఆగ్నేయాసియా, జెంగ్ హి నావికా దళాన్ని చూసి విదేశి రాజులు జెంగ్ హి కి కానుకలు పంపేవారు. జెంగ్ హి భారతదేశం మరియు మధ్యప్రాచ్యాన్ని సందర్శించాడు. జెంగ్ హి 1433 లో భారతదేశం సమీపంలో ఒక సముద్రయానంలో మరణిస్తాడు. చైనాలో అతనికి సమాధి ఉన్నప్పటికీ, అది ఖాళీగా ఉంది; చాలా గొప్ప అడ్మిరల్స్ వలె, జెంగ్ హి ని సముద్రంలో ఖననం చేశారు.
1 - ఇబ్న్ బటుతా Ibn Battuta (1304-1368)
జెంగ్ హి ఒక మొరాకో బెర్బెర్ ముస్లిం మరియు పండితుడు, ఇబ్న్ బటుతా ప్రసిద్ధ ప్రయాణికులలో ఒకడు. బటుతా ఇరవై ఒక్క సంవత్సరాల వయస్సులో హజ్ చేయటానికి మక్కాకు బయలుదేరాడు. ఆపై బటుతా ఇరవై సంవత్సరాలుగాని మొరాకోకు తిరిగి రాడు. తన ప్రయాణం లో ఇబ్న్ బటుటా 44దేశాలను సుమారు 75,000 మైళ్ళ దూరం ప్రయాణించాడు - ఈ దూరం సమకాలీన యాత్రికుడు మార్కో పోలో ప్రయాణం ను అధిగమించింది మరియు ప్రపంచాన్ని మూడు సార్లు చుట్టి రావటానికి సమానం.
బటుతా ప్రసిద్ద గ్రంధం "అల్ రిహ్లా" (అరబిక్
భాషలో "జర్నీ") బటుతా అతను సందర్శించిన ప్రపంచంలోని అనేక ప్రాంతాల యొక్క
వివరణాత్మక వివరణను కలిగి ఉంది, ఇస్లామిక్
ప్రపంచం, ఐరోపా, భారతదేశం మరియు మధ్య మరియు దూర
తూర్పు ఆసియా లో బటుతా అతను పర్యటించినాడు. తరువాత ఇబ్న్ బటుటా మొరాకోలో గవర్నర్ అయ్యాడు, అక్కడ బటుతా అతను చివరికి 1368 లేదా
1369 లో మరణించాడు. బటుతా గ్రంధం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు మరియు
ముస్లిమేతరులలో ప్రసిద్ది కెక్కినది.
No comments:
Post a Comment