12 December 2022

ఇస్లాం ఇన్ యూరప్ Islam in Europe

 


ఐరోపాలో క్రైస్తవం తర్వాత ఇస్లాం రెండవ అతిపెద్ద మతం మరియు ఐరోపాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మతం. పశ్చిమ ఐరోపాలో మెజారిటీ ముస్లిం సంఘాలు ఇటీవల ఏర్పడినప్పటికీ తూర్పు ఐరోపా లో బాల్కన్స్, కాకసస్, క్రిమియా మరియు వోల్గా ప్రాంతంలో శతాబ్దాల నుంచి  ముస్లిం సమాజాలు ఉన్నాయి.

"ముస్లిం యూరప్" అనే పదాన్ని బోస్నియా మరియు హెర్జెగోవినా, అల్బేనియా మరియు కొసావో వంటి  ముస్లిం మెజారిటీ దేశాలు, తూర్పు ఐరోపాలో గణనీయమైన ముస్లిం మైనారిటీలు కల బల్గేరియా, మోంటెనెగ్రో, సెర్బియా, ఉత్తర మాసిడోనియా,  మరియు రష్యాలోని కొన్ని రిపబ్లిక్‌లకు  మరియు స్థానిక యూరోపియన్ ముస్లింల పెద్ద జనాభాను కలిగిన దేశాలను ఉద్దేశించి  వాడతారు.

ఇస్లాం, 7వ శతాబ్దంలో పర్షియాపై ముస్లింల విజయం ద్వారా కాకసస్‌లోకి విస్తరించింది మరియు 8వ-10వ శతాబ్దాలలో హిస్పానియాను ఉమయ్యద్ ఆక్రమణ తర్వాత విస్తరణ ద్వారా దక్షిణ ఐరోపాలోకి ప్రవేశించింది. నేటి స్పెయిన్, పోర్చుగల్, సిసిలీ మరియు మాల్టాలలో మధ్య యుగాలలో ముస్లిం రాజ్యాలు  దృఢంగా ఉన్నాయి. క్రమేణా ఈ భూభాగాల్లోని ముస్లిం జనాభా క్రైస్తవులుగా మార్చబడ్డారు లేదా 15వ శతాబ్దం చివరి నాటికి క్రైస్తవ పాలకులచే బహిష్కరించబడ్డారు.

ఒట్టోమన్ సామ్రాజ్యం ఆగ్నేయ ఐరోపాలో మరింత విస్తరించింది మరియు 14వ మరియు 15వ శతాబ్దాలలో సెర్బియా సామ్రాజ్యం, బల్గేరియన్ సామ్రాజ్యం మరియు బైజాంటైన్ సామ్రాజ్యంలోని మిగిలిన అన్ని భూభాగాలపై దాడి చేసి, జయించడం ద్వారా తన రాజకీయ శక్తిని సుస్థిరం చేసుకుంది.1922లో ఒట్టోమన్ సామ్రాజ్యం కూలిపోయే నాటికి  క్రమంగా దాదాపు అన్ని యూరోపియన్ భూభాగాలను  ఒట్టోమన్ సామ్రాజ్యం కోల్పోయింది.

ఇస్లాం, తూర్పు ఐరోపాలో వోల్గా బల్గార్స్, కుమాన్-కిప్‌చాక్స్,గోల్డెన్ హోర్డ్ మరియు వివిధ ఖానేట్స్ లేదా  రష్యన్లు "తాతర్స్" అని పిలిచే వివిధ ప్రాంతాలలో మత మార్పిడి ద్వారా వ్యాపించింది.

ఐరోపాలోని చారిత్రాత్మకంగా ముఖ్యమైన ముస్లిం జనాభాలో గోరానీ, టోర్బేషి, పోమాక్స్, బోస్నియాక్స్, ముస్లిం అల్బేనియన్లు, చామ్ అల్బేనియన్లు, గ్రీక్ ముస్లింలు, వల్లహాడెస్, ముస్లిం రోమానీ ప్రజలు, బాల్కన్ టర్క్స్, టర్కిష్ సైప్రియాట్స్, క్రీటన్ టర్క్స్, యోరూక్స్, వోల్గా టాటర్స్, క్రిమియన్ టాటర్స్, కజాఖ్, గజల్స్, మరియు మెగ్లెనో-రొమేనియన్లు(KazakhsGajals, and Megleno-Romanians). కలరు.

నేడు, ఐరోపాలోని ముస్లిం-మెజారిటీ ప్రాంతాలు బాల్కన్స్ (అల్బేనియా, బోస్నియా మరియు హెర్జెగోవినా, కొసావో), అలాగే ఉత్తర కాకసస్ మరియు ఐడెల్-ఉరల్ ప్రాంతంలోని కొన్ని రష్యన్ రిపబ్లిక్‌లు మరియు   టర్కీ, అజర్‌బైజాన్ మరియు కజకిస్తాన్‌లలో కూడా ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు.

ఇస్లాం ప్రారంభమైన కొద్దికాలానికే ఐరోపాలో ముస్లింల ప్రవేశాలు ప్రారంభమయ్యాయి.

AD 632లో ముహమ్మద్ ప్రవక్త(స) మరణించిన వెంటనే, ముస్లిం ప్రపంచం పశ్చిమ దిశగా విస్తరించింది మరియు ఒక శతాబ్దం కంటే తక్కువ కాలంలోనే ఈ రోజు యూరప్‌గా పరిగణించబడుతున్న దానిలో గణనీయమైన భాగాలను ఆక్రమించింది.

అజ్నాదైన్ (634) మరియు యార్ముక్ (636) వంటి కీలకమైన యుద్ధాలలో ముస్లిం దళాలు బైజాంటైన్‌లపై సులభంగా విజయం సాధించాయి మరియు ఉత్తరం మరియు పడమర వైపు ముందుకు సాగుతూ సిరియా ప్రావిన్స్‌ను చేర్చుకున్నాయి. అదే సమయంలో, ఉత్తర ఆఫ్రికాలో ఇస్లాం స్థాపన తో బాటు, ఐరోపా ఖండంపై ముస్లిం సైన్యాలు దాడి చేసి ముస్లిం రాజ్యాల స్థాపన చేసాయి.

652లో ల్యాండ్ అయిన ఒక చిన్న అరబ్ మరియు బెర్బెర్ దళం బైజాంటైన్ సిసిలీపై దండయాత్ర చేసినది.  ఎనిమిదవ శతాబ్దం నుండి పదిహేనవ వరకు, ముస్లింలు ఐబీరియన్ ద్వీపకల్పం, దక్షిణ ఇటలీ, దక్షిణ ఫ్రాన్స్ మరియు అనేక మధ్యధరా దీవులను పరిపాలించారు. తూర్పున, బలహీనపడిన బైజాంటైన్ సామ్రాజ్యంలోకి ముస్లిం చొరబాట్లు నిరాటంకంగా కొనసాగాయి.

711 నుండి హిస్పానియాను ఉమయ్యద్ ఆక్రమణతో ఖండాంతర ఐరోపా continental Europe లో ఇస్లాం తన ఉనికిని స్థాపించినది. అరబ్బులు ఈ భూమికి అల్-అండలస్ అని పేరు పెట్టారు, ఇది పోర్చుగల్ మరియు స్పెయిన్‌లోని పెద్ద భాగాలను కలిగి ఉంది. 720 మరియు 730లలో ముస్లిం సేనలు పైరినీస్‌కు ఉత్తరాన పోరాడి, ఇప్పుడు ఫ్రాన్స్‌గా ఉన్న ప్రాంతానికి మరియు ఉత్తరానికి టూర్స్‌ వరకు చేరుకున్నాయి. 732లో ఫ్రాంక్‌లు ముస్లిములను  వారి ఐబీరియన్ మరియు ఉత్తర ఆఫ్రికా భూభాగాలకు వరకు తిప్పికొట్టారు.

అల్-అండలస్‌ను జయించిన తర్వాత ముస్లింలు ఐరోపాలో వివిధ ఎమిరేట్‌లను స్థాపించారు. వాటిలో ఒకటి ఎమిరేట్ ఆఫ్ క్రీట్, ఇది 820 నుండి 961వరకు ముస్లిముల ఆధీనం లో ఉంది. మరొకటి ఎమిరేట్ ఆఫ్ సిసిలీ, ఇది 831 నుండి 1091 వరకు ముస్లిముల ఆధీనం లో ఉంది.

827-902 వరకు సాగిన దండయాత్రల తర్వాత అగ్లాబిడ్స్ ఆధ్వర్యంలోని ముస్లిం దళాలు సిసిలీని జయించాయి మరియు 846లో రోమ్‌పై దాడి చేయడం గమనార్హం. సిసిలీ ఎమిరేట్ 965లో స్థాపించబడింది. అరబ్బులు 10236లో నార్మన్‌లచే బహిష్కరించబడే వరకు దక్షిణ ఇటలీని పట్టుకున్నారు. ముస్లిం స్పెయిన్‌లో మిగిలి ఉన్నది గ్రెనడా యొక్క దక్షిణ ప్రావిన్స్.

 

అబ్బాసిడ్‌లచే పదవీచ్యుతుడైన ఉమయ్యద్ ఖలీఫ్ అబ్ద్ అల్-రహ్మాన్I

756లో డమాస్కస్ నుండి పారిపోయి కార్డోబాలో స్వతంత్ర ఎమిరేట్‌ను స్థాపించాడు. ఉమయ్యద్ ఖలీఫ్ అబ్ద్ అల్-రహ్మాన్ రాజవంశం అల్-అండలస్‌ (స్పెయిన్) లో ఇస్లాం ఉనికిని ఏకీకృతం చేసింది. అబ్ద్ అల్-రహమాన్ II (822-852) పాలన సమయానికి కార్డోబా ఐరోపాలోని అతిపెద్ద మరియు అత్యంత ముఖ్యమైన నగరాల్లో ఒకటిగా మారింది. డమాస్కస్ మరియు బాగ్దాద్ ముస్లిం నగరాలకు పోటీగా ఉమయ్యద్ స్పెయిన్ ముస్లిం ప్రపంచానికి కేంద్రంగా మారింది.

"కార్డోబా ఎమిర్లు అండలూసి ఇస్లాం యొక్క విశ్వాసం మరియు శక్తిని ప్రతిబింబించే ప్యాలెస్‌లను నిర్మించారు, తూర్పు నుండి స్పెయిన్‌కు విలాసవంతమైన వస్తువులను తెచ్చారు, ప్రతిష్టాత్మకమైన నీటిపారుదల ప్రాజెక్టులను ప్రారంభించారు మరియు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసారు. ముస్లిం ప్రపంచంలోని మిగిలిన ప్రసిద్ధ పండితులు, కవులు మరియు సంగీతకారులను స్పెయిన్ కి ఆహ్వానించారు. అయితే, ఎమిరేట్ యొక్క అత్యంత ముఖ్యమైన ప్రభావం ముస్లింయేతర స్థానిక జనాభాపై దాని సాంస్కృతిక ప్రభావం. విద్యావంతులు - ముస్లింలు, క్రైస్తవులు మరియు యూదులలపై పడినది. అరబిక్ పుస్తకాల పాఠకుల సంఖ్య వేగంగా పెరిగింది మరియు అరబిక్ కవిత్వం బాగా ప్రాచుర్యం పొందాయి.ఐబీరియన్ ద్వీపకల్పంలోని క్రైస్తవుల అరబికేషన్‌లో సాహిత్య అరబిక్ యొక్క ప్రజాదరణ ఒక అంశం మాత్రమే.

పశ్చిమ ఐరోపాలో లౌకిక ఆలోచన పెరగడంలో అవెర్రోస్ ప్రభావం చూపాడు

అరబిక్-మాట్లాడే క్రైస్తవ పండితులు ప్రభావవంతమైన క్రైస్తవ పూర్వపు గ్రంథాలను భద్రపరిచారు మరియు మధ్యయుగ ఇస్లామిక్ సంస్కృతి కళలు,ఆర్థికశాస్త్రం, సైన్స్ మరియు టెక్నాలజీ వంటి అంశాలను పరిచయం చేశారు.

అరబ్బులు షరియాను విధించారు, అందువలన, లాటిన్- మరియు గ్రీకు-మాట్లాడే క్రైస్తవ సంఘాలు, అలాగే యూదుల సంఘం, ముస్లింల క్రింద ధిమ్మీ (ముస్లిమేతరులు)గా పరిమిత మత స్వేచ్ఛను కలిగి ఉన్నాయి. వారు జిజ్యా చెల్లించవలసి ఉంటుంది.

10వ శతాబ్దం నాటికి అల్-అండలస్ ముస్లిం మెజారిటీని కలిగి ఉంది. స్పెయిన్‌కు ఉత్తరాన ఇప్పటికీ ముస్లింల ఉనికి ఉంది, ప్రత్యేకించి ఫ్రాక్సినెట్‌లో 10వ శతాబ్దం వరకు స్విట్జర్లాండ్‌ వరకు ఉంది

Reconquista అని పిలువబడే క్రైస్తవదళాల  ఎదురుదాడి 8వ శతాబ్దం ప్రారంభంలో ప్రారంభమైంది, ముస్లిం దళాలు తాత్కాలికంగా దక్షిణ ఫ్రాన్స్‌లోకి ప్రవేశించగలిగాయి. నెమ్మదిగా, క్రైస్తవ దళాలు అల్-అండలస్ యొక్క విచ్ఛిన్నమైన తైఫా రాజ్యాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రారంభించాయి.

గ్రెనడా ఎమిరేట్‌లో ముస్లింల పాలన 1238 నుండి1492వరకు  కొనసాగింది. స్పానిష్ ఇంక్విజిషన్ (Spanish Inquisition) తో మోరిస్కోస్ (స్పానిష్‌లో మూరిష్) చివరకు 1609 (కాస్టిల్) మరియు 1614 (స్పెయిన్‌లో మిగిలిన) మధ్య స్పెయిన్ నుండి ముస్లిములు బహిష్కరించబడ్డారు,

ఐరోపాలో ముస్లిం జనాభా చాలా వైవిధ్యమైనది, విభిన్న చరిత్రలు మరియు మూలాలు ఉన్నాయి. నేడు, ఐరోపాలోని ముస్లిం-మెజారిటీ ప్రాంతాలు బోస్నియా మరియు హెర్జెగోవినాఅల్బేనియా , కొసావో , ఉత్తర మాసిడోనియా మరియు మోంటెనెగ్రోలోని కొన్ని ప్రాంతాలు, అలాగే ఉత్తర కాకసస్ మరియు వోల్గా ప్రాంతంలోని కొన్ని రష్యన్ భూభాగాలు. కమ్యూనిటీలు ప్రధానంగా ముస్లిం మతం యొక్క స్థానిక యూరోపియన్లను కలిగి ఉంటాయి, వీరి మత సంప్రదాయం అనేక వందల సంవత్సరాల నాటిది. ఖండాంతర దేశాలైన టర్కీ , అజర్‌బైజాన్ మరియు కజకిస్తాన్ కూడా ముస్లిం-మెజారిటీ కలిగి ఉన్నాయి.

ఇరవయ్యవ శతాబ్దం:

20వ శతాబ్దపు చివరిలో మరియు 21వ శతాబ్దం ప్రారంభంలో, పెద్ద సంఖ్యలో ముస్లింలు పశ్చిమ ఐరోపాకు వలస వచ్చారు. అల్జీరియన్ స్వాతంత్ర్య యుద్ధం సమయంలో ఫ్రాన్స్‌కు ముస్లింల వలసలు పెరిగాయి.1961లో, పశ్చిమ జర్మన్ ప్రభుత్వం మొదటి గాస్టార్‌బీటర్‌లను ఆహ్వానించింది మరియు స్విట్జర్లాండ్‌ కు కొందరు వలస కార్మికులు  టర్కీ వంటి మెజారిటీ-ముస్లిం దేశాల నుండి వచ్చారు.

2010 నాటికి, ప్యూ ఫోరమ్ అంచనా ప్రకారం 44 మిలియన్ల మంది ముస్లింలు యూరోప్‌లో నివసిస్తున్నారు (6%), EUలో 19 మిలియన్ల మంది (3.8%) ఉన్నారు. 2010 ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం ప్రపంచ ముస్లిం జనాభాలో 2.7% మంది ఐరోపాలో నివసిస్తున్నారు.

 జనవరి 2016లో ప్రచురించబడిన ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం, యూరోపియన్ జనాభాలో ముస్లింల సంఖ్య 2010లో 6% నుండి 2030లో 8% కి పెరుగుతుందని అంచనా వేసింది.

2016లో ఐరోపాలో ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాలు

 

దేశం

అంచనా వేయబడిన %

మొత్తం జనాభాలో ముస్లింలు

 

 సైప్రస్

25.4

బల్గేరియా 

11.1

ఫ్రాన్స్

8.8

స్వీడన్

8.1

బెల్జియం

7.6

నెదర్లండ్స్

7.1

ఆస్ట్రియా

6.9

యునైటెడ్ కింగ్డమ్

6.3

జర్మనీ

6.1

స్విట్జర్లాండ్

6.1

నార్వే

5.7

గ్రీస్

5.7

డెన్మార్క్

5.4

ఇటలీ

4.8

స్లోవేనియా

3.8

లక్సెంబర్గ్

3.2

ఫిన్లాండ్

2.7

స్పెయిన్

2.6

క్రొయేషియా

1.6

ఐర్లాండ్

1.4

 

 

No comments:

Post a Comment