క్రిప్టాలజీ, కోడ్‌లను తయారు
చేయడం మరియు విచ్ఛిన్నం చేసే కళ మరియు శాస్త్రం, 4000 సంవత్సరాల కంటే పాత చరిత్రను కలిగి ఉంది. 9వ శతాబ్దం CEలో అరబ్ క్రిప్టాలజిస్టులచే, క్రిప్టోలజీ యొక్క మొదటి ప్రస్తావన ప్రారంభమైంది.
అరబ్ క్రిప్టాలజిస్టులు వారు కొత్త కోడ్‌లను
రూపొందించారు మరియు కోడ్‌లను విచ్ఛిన్నం చేసే పద్ధతులను అనగా క్రిప్టానాలసిస్ ను క్రమపద్ధతిలో వివరించారు.
క్రిప్టాలజీకి సంబంధించిన ప్రముఖ చరిత్రకారుడు
డేవిడ్ కాన్ తన 1967 పుస్తకం, "ది కోడ్ బ్రేకర్స్ - ది స్టోరీ ఆఫ్ సీక్రెట్ రైటింగ్"లో
"క్రిప్టాలజీ అరబ్బుల మధ్య పుట్టింది" అని రాశాడు.
ప్రారంభ ఇస్లామిక్ కాలాలలో క్రిప్టాలజీపై
ముస్లిం పండితుల రచనలు చేసారు
1412 CEలో వ్రాసిన అల్-కల్కషాండి ఎన్సైక్లోపీడియాలోని “సుబ్ అల్-అ’షా ఫి సినాత్
అల్-ఇన్షా’ Subh Al-A’sha fi Sina’at
Al-Insha’ (ది డాన్ ఆఫ్ ది బ్లైండ్ ఇన్ ది రైటింగ్ ఇండస్ట్రీ)” అనే శీర్షిక ఆధారంగా కాన్
యొక్క ప్రకటన రూపొందించబడింది.
అలీ ఇబ్న్ అడ్-దురైహిమ్ 1350 CEలో "ముఫ్తా అల్-కునుజ్ ఫి ఇదా అల్-మర్ముజ్" “Muftah Al-Kunuz fi Idhah Al-Marmuz” (The
Treasures Key in Deciphering Cryptograms). (క్రిప్టోగ్రామ్‌లను అర్థంచేసుకోవడంలో
ట్రెజర్స్ కీ) అనే మాన్యుస్క్రిప్ట్
రాసినాడు.
1979లో డమాస్కస్‌లోని
అరబ్ అకాడమీకి చెందిన శాస్త్రజ్ఞులు ఇబ్న్ అడ్-దురైహిమ్ పుస్తకం కోసం
శోధించారు.వారు ఇబ్న్ అద్-దురైహిమ్ పుస్తకాన్ని కనుగొనడమే కాకుండా, 9-15వ శతాబ్దాల మధ్య కాలంలో వ్రాసిన క్రిప్టాలజీపై 15 కంటే ఎక్కువ అరబిక్ మాన్యుస్క్రిప్ట్‌లను కూడా కనుగొన్నారు. ఈ రాతప్రతులు
చాలా వరకు టర్కీలోని ఇస్తాంబుల్‌లోని సులేమానియే ఒట్టోమన్ ఆర్కైవ్‌లో
కనుగొనబడ్డాయి.
ఇస్తాంబుల్‌లోని సులేమానియే ఒట్టోమన్ ఆర్కైవ్‌లో
లబించిన మాన్యుస్క్రిప్ట్‌లను అరబ్ అకాడమీ శాస్త్రజ్ఞులు సవరించి విశ్లేషించారు
మరియు 1987లో అరబిక్‌లో ప్రచురించారు. ఆ తర్వాత అరబిక్
మాన్యుస్క్రిప్ట్‌లు ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి మరియు 9సంపుటాలుగా ప్రచురించబడ్డాయి.
ఆ
మాన్యుస్క్రిప్ట్‌లలో “రిసాలా ఫి ఇస్తిఖ్‌రాజ్ అల్ ముఅమ్మా (క్రిప్టోగ్రాఫిక్
సందేశాలను డీక్రిప్టింగ్ చేయడంపై ట్రీటైజ్ Risalah fi Istikhraj al
Mu’amma (Treatise
on Decrypting Cryptographic Messages)” పేరుతో యాకుబ్ ఇబ్న్ ఇషాక్ అల్-కిండి ca 850 CE రచించిన పురాతన క్రిప్టోలాజిక్ టెక్స్ట్ ఉంది.
అరబ్ పండితులకు వారి భాషపై ఉన్న ఆసక్తి, భాషాశాస్త్రం, కాంబినేటరిక్స్ మరియు అరబిక్ వర్ణమాల మరియు
పదాల గణాంకాలు వంటి క్రిప్టోలజీలో సహాయపడే అంశాలను అధ్యయనం చేయడానికి దారితీసిందని
అల్-కిండి యొక్క ట్రీటైజ్ క్రిప్టోలాజిక్ టెక్స్ట్ చూపిస్తుంది.
ఆల్-కిండి రచించిన పురాతన క్రిప్టోలాజిక్
టెక్స్ట్ దాదాపు 1200 సంవత్సరాల క్రితం ప్రత్యామ్నాయ కోడ్‌లను
విచ్ఛిన్నం చేయడానికి అక్షరాల ఫ్రీక్వెన్సీ విశ్లేషణను ఎలా ఉపయోగించాలో చూపించింది
అరబ్ భాషావేత్త అల్-ఫరాహిది, (718 – 786 CE), తన అరబిక్ నిఘంటువు “అల్-అయిన్ Al-Ayn” లో అచ్చులతో మరియు అచ్చులు లేకుండా సాధ్యమయ్యే అన్ని అరబిక్ పదాలను జాబితా
చేయడానికి ప్రస్తారణలు మరియు కలయికల సూత్రాలను ఉపయోగించారు.
ఇబ్న్ అడ్లాన్, (మరణo 1268 AD) మరియు ఇబ్న్ అల డురహింIbn ad-Durayhim, (1359 AD మరణo) క్రిప్టోలాజికల్ సిస్టమ్‌లను రూపొందించినారు.
అహ్మద్ ఇబ్న్ వహ్షియా (914 CE) వ్రాసిన మాన్యుస్క్రిప్ట్ “షాక్ అల్ ముస్తహం ఫి మరీఫత్ రూముజ్ అల్-అక్లామ్ “Shawq al Mustaham fi Ma’rifat Rumuz al-Aqlam” (Seekers Joy in
Learning about Other Languages written Symbols ఇతర భాషల గురించి నేర్చుకోవడంలో ఆనందం)” దాదాపు 93 వర్ణమాలలు మరియు చిహ్నాలను గుర్తించింది.
ఇబ్న్ వాషియ్యాIbn Wahshiyyah హైరోగ్లిఫిక్ వర్ణమాలలో సగం డీకోడ్ చేసి, చిహ్నాలను
గుర్తించాడు.
ఆర్కియాలజీ, ప్రొఫెసర్ ఒకాషా
ఎల్ డాలీ, దాదాపు 1,000 సంవత్సరాల ముందు తొమ్మిదవ శతాబ్దం CEలో అరబ్ పండితులు
చిత్రలిపిని సరిగ్గా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.
అరబ్ పండితులు శతాబ్దాలుగా వృద్ధి చెందిన
క్రిప్టాలజీ యొక్క "స్కూల్" రూపొందించారు. పండితులు ఒకరి నుండి ఒకరు
నేర్చుకుని, వారి స్వంత మూల రచనలను జోడించి, రచనలను ఇతరులకు పంపారు.
కనుగొనబడిన మాన్యుస్క్రిప్ట్‌లు
"క్రిప్టాలజీ అరబ్బుల మధ్య పుట్టింది" అని కాన్ యొక్క ప్రకటనను రుజువు
చేసాయి.
No comments:
Post a Comment