19 December 2022

ఇబ్న్ అల్-బైతర్ (1197 - 1248) Ibn Al-Baitar (1197 – 1248)

 

అరబ్ శాస్త్రవేత్తవృక్షశాస్త్రజ్ఞుడు మరియు వైద్యుడు. మధ్య యుగంలో ఇస్లామిక్ వైద్యులు చేసిన ఆవిష్కరణలను క్రమపద్ధతిలో నమోదు చేశాడు.

అహ్మద్ ఇబ్న్ ఆల్-బైతర్ 1197 సంవత్సరం లో అండలూసియన్ నగరమైన మలగాలో జన్మించాడు. అబుల్ అబ్బాస్ అహ్మద్ యొక్క మార్గదర్శకత్వంలో ఆల్-బైతర్ సెవిల్లెలో వైద్య విధ్యను  అబ్యాసించాడు మరియు  వృక్షశాస్త్రంలో గొప్ప ఆసక్తిని కలిగి ఉన్నాడు. వృక్షశాస్త్రజ్ఞుడు అయిన  తన ఉపాధ్యాయుని నుండి ఆల్-బైతర్ వృక్షశాస్త్రం ను  నేర్చుకున్నాడు.

ఆల్-బైతర్ మొదట అండలూసియా మరియు దాని చుట్టూ పక్కల ప్రాంతాలనుండి మొక్కలు సేకరించినాడు. 1219 లో ఆల్-బైతర్ స్పెయిన్ కు వివిధ  మొక్కల -సేకరణ యాత్రపై వెళ్ళినాడు. ప్రయాణం లో భాగంగా ఆఫ్రికా ఉత్తర తీరoఆసియా మైనర్లోని కొన్ని భాగాల్లో ప్రయాణిoచాడు.

క్రీ.శ 1224 సంవత్సరం లో  ఆల్-బైతర్ ఈజిప్టు పరిపాలకుడైన మాలిక్ ఆల్-కమీల్ ఆస్థానం  లో ముఖ్య ఔషద మొక్కల అధికారిగా నియమితుడైనాడు. అల్-కమిల్ తన రాజ్యాన్ని డమాస్కస్ వరకు  విస్తరించాడుఇబ్నె అల్-బైతర్  ఈజిప్ట్ పాలకుని తో  పాటు సిరియాపాలస్తీనామరియు ఇరాక్లోని కొన్నిప్రాంతాలలో   మొక్కలు సేకరించే అవకాశాన్ని పొందాడు. .

మాలిక్ అల్ కామిల్ పాలన ఈజిప్టు మరియు సిరియాలో చాలా కాలం పాటు శాంతియుత వాతావరణాన్ని తీసుకువచ్చింది. పాఠశాలలు, కళాశాలలు  అభివృద్ధి చెందాయి మరియు పరిశోధన మరియు అభ్యాసానికి వాతావరణం చాలా ఉపయోగకరంగా ఉండేది. పండితులు ప్రజలు మరియు రాజుచే తగు గుర్తింపు పొందారు. మాలిక్ అల్-కామిల్ స్వయంగా విద్యాసంబంద  ప్రసంగాలలో పాల్గొని విజ్ఞాన ప్రచారoలో  చురుకుగా పాల్గొన్నాడు. ఇబ్న్ ఆల్-బైతర్ డమాస్కస్ లో చాలా మంచి వాతావరణంలో నివసించాడు మరియు క్రీస్తు 1248 లో చనిపోయే వరకూ మొక్కలు మరియు ఔషధాలపై తన పరిశోధన చేశాడు.

ఇబ్న్ అల్-బైతర్ మధ్య యుగాల గొప్ప ఔషధ, వృక్షశాస్త్రజ్ఞుడు మరియు వైద్యుడు. ప్రయోగాలలో మొదట శాస్త్రీయ పద్ధతిని ప్రవేశపెట్టిన  ఘనత పొందాడు. ఇబ్న్ అల్-బైతర్  యొక్క ప్రధాన గ్రంధం కితాబ్ అల్-జామి ఫి అల్ అల్-అదియా అల్-ముఫ్ఫ్రాడా, (బుక్ ఆఫ్ సింపుల్ డ్రగ్స్ అండ్ ఫుడ్ Kitab al-Jami fi al-Adwiya al- Mufrada,Book of Simple Drugs and Food))” ఔషధ మొక్కలతో వ్యవహరించే వృక్షశాస్త్రంలోని గొప్ప గ్రంథాలలో ఒకటి. కితాబ్ అల్-జామి ఫి అల్ అల్-అదియా అల్-ముఫ్ఫ్రాడా” 18 వ శతాబ్దం వరకు వృక్షశాస్త్రజ్ఞులలో ఉన్నత ఖ్యాతి ని పొందినది.  కితాబ్ అల్-జామి ఫి అల్ అల్-అదియా అల్-ముఫ్ఫ్రాడా” గ్రంధం లో దాదాపు 1,400 విభిన్న వస్తువులుఎక్కువగా ఔషధ మొక్కలు మరియు కూరగాయల వర్ణన ఉంది అందులో  ముందు కనుగొనని దాదాపు 300 మొక్కలు కొత్తవి ఉన్నవి. ఈ పుస్తకo దాదాపు 150 రచయితల కృషిని వివరిస్తుంది  అందులో  ఎక్కువగా అరబ్బులుకొoదరు గ్రీకు శాస్త్రవేత్తల కృషిని  సూచిస్తుంది.

ఇబ్న్ ఆల్-బైతర్ యొక్క రెండవ ప్రధాన గ్రంధం “కితాబ్ అల్-ముని  ఫి అల్ల్ అదవియా అల్-ముఫ్ఫ్రాడా Kitab al-Mlughni fi al-Adwiya al-Mufrada (Comprehensive Book of Drug and Nutrition)   (డ్రగ్ అండ్ న్యూట్రిషన్ సమగ్ర పుస్తకము) వైద్యశాస్త్రము యొక్క ఎన్సైక్లోపెడియా”.

.గ్రీస్, స్పెయిన్నార్త్ ఆఫ్రికా మరియు టర్కీల నుండి ఆల్-బైతర్ ఔషధ మొక్కలు మరియు సంబంధిత సాహిత్యాలను విమర్శనాత్మకంగా అధ్యయనం చేసాడుదాని ఫలితంగా ఆల్-బైతర్ 150 కంటే ఎక్కువ మాన్యుస్క్రిప్ట్స్ తయారుచేశాడు. ఆల్-బైతర్ మొక్కలుఖనిజాలు మరియు జంతువుల వెయ్యి అంశాల కంటే ఎక్కువ లక్షణాలను పేర్కొన్నాడు. మందులు వారి చికిత్సా విలువకు అనుగుణంగా ఇవ్వబడ్డాయి. వేర్వేరు అధ్యాయాలు శరీరం యొక్క వేర్వేరు భాగాల యొక్క వ్యాధులకు ప్రాముఖ్యతను కలిగి ఉన్న మొక్కల పేర్ల తో ఉన్నాయి. 

శస్త్రచికిత్స సమస్యలపై ఆల్-బైతర్ తరచుగా అండాలుసియన్ సర్జన్ అయిన అబుల్ ఖాసిమ్ జహ్రావిని ఉదహరించారు. అరబిక్ తో  పాటుఆల్-బైతర్ మొక్కల గ్రీక్లాటిన్స్పానిష్ మరియు బెర్బెర్(berber) పేర్లను ఇచ్చాడు. ఇది యూరోపియన్లు మరియు ఇతర పాఠకులకు ప్రయోజనం అయినది.

హిందీబా ఒక మూలిక మరియు దాని ఔషధ లక్షణాలు అరబ్లకు తెలుసు.  ఇబ్న్ అల్-బైతర్ దానిని క్యాన్సర్ మరియు కణితుల చికిత్స కోసం ఉపయోగించిన  మొట్టమొదటి వైద్యుడు.

 ఇబ్న్ ఆల్-బైతర్ ఔషధంగా లేదా ఆహారంగా ఉపయోగపడే  మొక్కలను  ఎంచుకోవడం లో చాలా జాగ్రత్త తీసుకొన్నాడు. ఆల్-బైతర్ రాత్రి-పగలు  మందుల వేసుకొనే సమయం సూచించాడు.

 ఆల్-బైతర్ పరిశీలనలుఅనుమితులు మరియు తగ్గింపులలో (observations, inferences and deductions) పూర్తి విశ్వాసం కలిగి ఉన్నాడు మరియు మొదటిసారి దేనిని పరిశీలించకుండా వ్రాయలేదు. ఆల్-బైతర్ వైద్యపరంగా లేదా ఆహారంగా తగిన ఉపయోగించదగిన వస్తువులను పేర్కొన్నాడు. ఆల్-బైతర్ స్థానిక నిపుణుల నుండి సంబంధిత సమాచారాన్ని సేకరించాడు. 

 ఇంట్రడక్షన్ టు ది హిస్టరీ ఆఫ్ సైన్స్రచయిత సార్టన్ ప్రకారంఇబ్న్ ఆల్-బైతర్ మధ్య యుగాల గొప్ప ఔషధ మొక్కల శాస్త్రజ్ఞుడు. 17 వ శతాబ్దం వరకు ఎవరూ ఆల్-బైతర్ ని నాణ్యతలో  మించి లేరు.
 "ముస్లిం థాట్దాని పుట్టుక మరియు విజయాలు Muslim Thought, its Origin and Achievements " రచయిత ప్రొఫెసర్ M.M. షరిఫ్  ప్రకారం ఇబ్న్ అల్-బైటర్ పుస్తకము ఐరోపాలో శతాబ్దాలుగా ప్రామాణిక మెటీరియ మెడికాగా ఉండేది.  15 వ శతాబ్దంలో మరియు దాని తర్వాత లాటిన్ లో  దీని అనువాదం పలుసార్లు ముద్రించబడింది. దాని లాటిన్ వెర్షన్ యొక్క కొన్ని భాగాలు 1758 CE చివరిలో ప్రచురించబడ్డాయి. ఇబ్న్ అల్-బైటర్ ఆధునిక యుగానికి ఫార్మసీని అనుగుణ్యంగా రూపొందించి వందల కొద్ది నూతన ఔషధాలను వైద్య విజ్ఞాన శాస్త్రo లో  ప్రవేశపెట్టి ఘనత పొందాడు.

 

No comments:

Post a Comment