భారతీయ షిప్పింగ్‌లో మొదటి మహిళగా పేరుగాంచింన సుమతి మొరార్జీ, ఓడ యజమానుల సంస్థ “ఇండియన్ నేషనల్ స్టీమ్‌షిప్ ఓనర్స్ అసోసియేషన్” (తరువాత ఇండియన్ నేషనల్ షిప్ ఓనర్స్ అసోసియేషన్ అని పేరు మార్చబడింది) కు కూడా నాయకత్వం వహించిన ప్రపంచంలో మొట్టమొదటి మహిళగా గుర్తింపు పొందింది.అంతకు ముందు ఈ పదవిని కేవలం పురుషులు మాత్రమే నిర్వహించేవారు. సుమతి మొరార్జీ 1970లో లండన్‌లోని వరల్డ్ షిప్పింగ్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైంది.
సుమతి మొరార్జీ, 13 మార్చి 1909న బొంబాయిలోని ఒక సంపన్న
కుటుంబంలో జన్మించింది. సుమతి మొరార్జీ తండ్రి
మధురదాస్ గోకుల్‌దాస్ మరియు తల్లి ప్రేమాబాయి.
మొదట్లో సుమతి ని జమున అని తల్లిత్రండ్రులు ప్రేమగా పిలిచేవారు.
1923లో
14
సంవత్సరాల వయస్సులో సుమతి మొరార్జీ సంస్థ యొక్క మేనేజింగ్ ఏజెన్సీలో చేరింది,
సుమతి 1942
మరియు 1946
మధ్య,
అజ్ఞాతంగా దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొంది. మహాత్మా గాంధీ తో సన్నిహిత
సంబంధాలు కలవు.
సుమతి మొరార్జీ, తను చేసిన పౌర
సేవలకు గాను 1971లో భారతదేశం యొక్క రెండవ అత్యున్నత పౌర
పురస్కారమైన పద్మ విభూషణ్‌ను పొందారు.
సుమతి మొరార్జీ 1979
నుండి 1987
వరకు,
సింధియా
స్టీమ్ కంపెనీకి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. తరువాత 1992
వరకు సంస్థ యొక్క ఎమెరిటస్ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
సుమతి మొరార్జీ వివిధ సామాజిక
కార్యక్రమాలలో కూడా పాల్గొన్నారు. విభజన సమయంలో పాకిస్తాన్ నుండి సింధీలను
తీసుకురావడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. సుమతి మొరార్జీ నరోత్తమ్ మొరార్జీ
ఇనిస్టిట్యూట్ ఆఫ్ షిప్పింగ్ చైర్‌పర్సన్‌గా కూడా ఉన్నారు. సుమతి మొరార్జీ ముంబైలోని జుహులో ఉన్న సుమతి
విద్యా కేంద్ర పాఠశాల స్థాపకురాలు.
సుమతి మొరార్జీ 1998
జూన్
27న
గుండెపోటు కారణంగా మరణించింది.
No comments:
Post a Comment