3 August 2022

ఉర్దూ మరియు భారతదేశం ఆఫ్ఘన్ మరియు ఇరానియన్ సంస్కర్తలను ఎలా ప్రభావితం చేశాయి How Urdu and India Influenced Afghan and Iranian Reformers

 

చాహర్ బాగ్ పాఠశాలను షా స్కూల్ అని కూడా పిలుస్తారు, ఇది ఇరాన్‌లోని ఇస్ఫాహాన్‌లో 17-18వ శతాబ్దపు సాంస్కృతిక సముదాయం.

ఫారసీ,    ఉర్దూను బాగా ప్రభావితం చేస్తుందని సాధారణoగా భావించబడుతుంది, కానీ పొరుగు దేశాలపై భారతదేశపు  ఉర్దూ మాట్లాడేవారి ప్రభావం ఉన్నది  అనేది వాస్తవం.

దక్షిణాసియా భాషలు మరియు సంస్కృతులపై ఫారసీ/పర్షియన్ యొక్క చారిత్రక ప్రభావం అందరికీ తెలిసిందే. శతాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఫారసీ/పెర్షియన్ భాషా పదాలు  నేటి ఉత్తర భారతదేశం, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్‌లో రోజువారీ జీవితంలో భాగమైనవి.: అస్మాన్ (ఆకాశం), సబ్జీ (కూరగాయలు), గర్మ్ (వేడి), రoగ్ (రంగు), దిల్ (గుండె), ఇంకా అనేక వేల పదాలు. 

ఫారసీ/పర్షియన్ నుండి ఉర్దూ ముఖ్యంగా దాని  లిపి, దాని పదజాలం మరియు గజల్ కవిత్వం వంటి అత్యంత ప్రసిద్ధి చెందిన చాలా సాహిత్య రూపాలు వరకు,  ప్రభావితమైంది. ఈ ప్రభావాలు భాషాపరమైన లేదా సాహిత్యపరమైనవి మాత్రమే కాదు; పర్షియన్ భాష రాజ్యానిర్వహణ (statecraft), మతపరమైన ఆచార వ్యవహారాలు మరియు ఆలోచనలకు, అలాగే ఆర్కిటెక్చర్ మరియు బాల్కన్‌ల నుండి బుఖారా నుండి బెంగాల్ వరకు విస్తరించి ఉన్న భాగస్వామ్య పర్షియన్ సంస్కృతి యొక్క అనేక ఇతర అంశాలకు కూడా ఒక వాహనం అయింది..

పర్షియన్ గురించిన ఈ కథనం సుప్రసిద్ధమైనది మరియు కొన్ని సాధారణ ఊహలపై ఆధారపడి ఉంటుంది.ఒకటి, పర్షియన్,  ఉర్దూను బాగా ప్రభావితం చేసింది, కానీ ఉర్దూ, పర్షియన్‌పై అసలు ప్రభావం చూపలేదు - కనీసం భారతదేశం వెలుపల కాదు. మరొక ఊహ ఏమిటంటే, పర్షియన్ బాష  ఉపఖండంలో 19వ శతాబ్దంలో బహుశా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా 1857 తిరుగుబాటు విఫలమైన తర్వాత - అంతకు ముందు కాకపోయినా,  దాని ఔచిత్యాన్ని కోల్పోయింది.

ఈ రోజు, పెర్షియన్/ఫారసీ బాష  ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ దేశాలకు చెందినదని చాలా మంది నమ్ముతారు

ఇవి ఏవీ పూర్తిగా ఖచ్చితమైనవి కావు. 20వ శతాబ్దపు ప్రథమార్ధంలో, ఆఫ్ఘన్లు మరియు ఇరానియన్లు భారతదేశం నుండి ఉర్దూ మాట్లాడేవారి వైపు చూశారు - ముఖ్యంగా పెర్షియన్ సాహిత్యాన్ని బోధించే అంశంపై - వారు తమ దేశాలను ఆధునీకరించడానికి ప్రయత్నించారు.

 

ఆఫ్ఘనిస్తాన్‌పై భారత ప్రభావం Indian influence on Afghanistan: 

పెర్షియన్ సాహిత్యం ఇరానియన్ మరియు ఆఫ్ఘన్ జాతీయవాదుల గుండె వద్ద ఉంది. సాహిత్యం దేశం యొక్క ఆత్మగా ఊహించబడింది, అందువలన ఆధునిక విద్యా వ్యవస్థలలో సాహిత్య చరిత్రకు ముఖ్యమైన పాత్ర ఉంది, ఇది పౌరులకు జాతీయ భావాన్ని కలిగించడానికి ప్రయత్నించింది.

పెర్షియన్ కవిత్వం యొక్క సహస్రాబ్ది చరిత్రను ఎలా నిర్వహించాలి, విశ్లేషించాలి మరియు బోధించాలి? ఆధునికీకరణకు విద్యను కీలకంగా భావించే సంస్కర్తలకు ఇది ప్రత్యేకంగా విసుగు పుట్టించే ప్రశ్న.

సరిహద్దు వెంబడి, బ్రిటీష్ ఇండియాలో, ముస్లింలు విద్యా సంస్కరణలను  ప్రారంభించారు, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి ముందున్న ముహమ్మదన్ ఆంగ్లో-ఓరియంటల్ (MAO) కళాశాల వంటి ఆధునిక విద్యా సంస్థలను స్థాపించడం మరియు కొత్త పాఠ్యపుస్తకాలను అభివృద్ధి చేయడం జరిగింది..

ఈ సంస్థలలోని  అనేక పాఠ్యాంశాల్లో పెర్షియన్ సాహిత్యం ఒక ముఖ్యమైన భాగం, మరియు MAO కళాశాలలో పర్షియన్ మరియు అరబిక్ బోధించే భారతీయ ముస్లిం పండితుడు షిబ్లీ నోమాని (1857-1914), ఇండో-ముస్లిం విద్యా సంస్కరణలో కీలక వ్యక్తి. MAO కళాశాల స్థాపకుడు సయ్యద్ అహ్మద్ ఖాన్ భారతదేశంలో బాగా ప్రసిద్ధి చెందినప్పటికీ, పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్‌లలో షిబ్లీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ఇస్లామిక్ పండితుడు, సంస్కర్త మరియు విద్యావేత్త అయిన షిబ్లీ వలసవాద ఆధునికత యొక్క సవాళ్లను పరిష్కరించడానికి భారతదేశంలో ముస్లిం విద్యను అభివృద్ధి చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. MAO కళాశాలతో పాటు, అతను లక్నోలోని నద్వతుల్ ఉలమా సెమినరీ మరియు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పనిచేశాడు, జీవిత చరమాంకంలో తన స్వస్థలమైన అజంగఢ్‌లో దారుల్ ముసన్నెఫిన్ అకాడమీని స్థాపించాడు.

షిబ్లీ యొక్క ప్రధాన రచనలలో ఒకటి షిర్ అల్-అజం (పర్షియన్ల కవిత్వం), పర్షియన్ కవిత్వం యొక్క ఉర్దూ అధ్యయనం, 1908 మరియు 1918 మధ్య ఐదు సంపుటాలుగా ప్రచురించబడింది. ఇది విస్తృతమైన పరిధిని కలిగి 1500 పేజీలలో మరీ ముఖ్యంగా, ఒక వినూత్న పద్దతి లో అనేక శతాబ్దాల కవిత్వాన్ని కవర్ చేసింది. షిబ్లీ ఇస్లామిక్ సంప్రదాయం మరియు ఐరోపా చరిత్ర చరిత్రలో అత్యుత్తమమైన వాటిని సంశ్లేషణ చేసాడు, తన పర్షియన్ల కవిత్వాన్ని అఫ్ఘాన్ మరియు ఇరానియన్ సంస్కర్తల లక్ష్యాలకు ప్రత్యేకంగా సరిపోయేలా చేశాడు



Credit : www.brecorder.com

ముఖ్యంగా ఆఫ్ఘన్‌లు భారతదేశంలోని ఈ విద్యాపరమైన పరిణామాలపై చాలా శ్రద్ధ చూపారు. 20వ శతాబ్దపు తొలి దశాబ్దాలలో, హబీబుల్లా ఖాన్ మరియు ముహమ్మద్ నాదిర్ షా వంటి రాజులు మరియు కవి మరియు విదేశాంగ మంత్రి మహమూద్ తార్జీ వంటి రాజకీయ ప్రముఖులతో సహా అనేక మంది ప్రముఖ ఆఫ్ఘన్‌లు ఉర్దూలో మాట్లాడేవారు. ఆఫ్ఘన్ మేధావులు మరియు రాజకీయ నాయకులు భారతదేశంలో నివసించడం ద్వారా లేదా దేశంతో ఆర్థిక మరియు విద్యా మార్పిడి ద్వారా ఉర్దూను ఎక్కువగా నేర్చుకున్నారు.

సంస్కరణాభిలాషి మరియు 1901-1919 వరకు ఆఫ్ఘనిస్తాన్ ఎమిర్ అయిన హబీబుల్లా ఖాన్ కాబూల్‌లో హబీబియా కళాశాలను ప్రారంభించాడు: ఇది దేశంలోని మొట్టమొదటి ఆధునిక విద్యా సంస్థ. అతను 1907లో సందర్శించిన భారతదేశంలోని MAO కళాశాల తర్వాత ఇది స్థాపించబడింది. హబీబియా MAO కళాశాల వలె అదే పాఠ్యాంశాలను అనుసరించినది  మరియు ఉర్దూను రెండవ భాషగా అందించినది..

ఒకానొక సమయంలో హబీబియా ఫ్యాకల్టీలో సగం మంది భారతదేశానికి చెందినవారు, వీరిలో పాఠశాల ప్రిన్సిపాల్ లాహోర్‌కు చెందిన అబ్దుల్ ఘనీ ఖాన్ ఉన్నారు. ఎమిర్ హబీబుల్లా ఖాన్ మరియు యువరాజు ఇనాయతుల్లా ఖాన్ సిరాజ్‌లకు బోధించిన ఆఫ్ఘన్ కవి ఖారీ అబ్దుల్లా ఖాన్‌కు ఉర్దూ బాగా తెలుసు మరియు హబీబియా వద్ద కూడా బోధించాడు.

1921లో, ఆఫ్ఘన్ విద్యా మంత్రిత్వ శాఖ స్థాపించబడింది, పాఠ్యాంశాల్లో పర్షియన్ అక్షరాస్యత ప్రధానమైనది. ఖారీ అబ్దుల్లాకు షిబ్లీ “పొయెట్రీ ఆఫ్ ది పర్షియన్స్” గురించి బాగా తెలుసు, అతను మంత్రిత్వ శాఖ కోసం సంకలనం చేసిన రెండవ-తరగతి పర్షియన్ సాహిత్యం పాఠ్యపుస్తకానికి మూలాలలో ఒకటిగా దానిపై ఆధారపడ్డాడు.

మన్సూర్ అన్సారీ మరియు బుర్హానుద్దీన్ ఖాన్ కుష్కాకి (ఇస్లామిక్ చట్టంలో శిక్షణ పొందిన మతాధికారులు), ఫైజ్ ముహమ్మద్ ఖాన్ (ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి), సర్వర్ గుయా ఇటిమాది (విద్యా మంత్రిత్వ శాఖ సలహాదారు), తో సహా ఇతర ప్రముఖ ఆఫ్ఘన్ అనువాదకుల శ్రేణిచే షిబ్లీ యొక్క “పోయెట్రీ ఆఫ్ ది పర్షియన్స్” యొక్క   పూర్తి అనువాదాన్ని కూడా మంత్రిత్వ శాఖ చేయించినది..

పైన వివరించిన  వారి అనువాదం 1925 మరియు 1927 మధ్య కాబూల్ మరియు లాహోర్‌లలో అనేక సంపుటాలలో ప్రచురించబడింది. ఈ అనువాదంలో పర్షియన్ మరియు ఉర్దూల మధ్య సరిహద్దులను కలిగి ఉంది, ఉర్దూ రెట్రోఫ్లెక్స్ అక్షరాలను కూడా ఉపయోగించారు - ఇవి సాధారణంగా పర్షియన్‌లో కనిపించవు.

షిబ్లీ కొన్నిసార్లు మీర్ అనిస్, మీర్జా దబీర్, మీర్ తకీ మీర్ మరియు ఇతర ఉర్దూ కవులను  కవితల గురించి అంశాలను వివరించడానికి ఉల్లేఖించారు మరియు ఈ ఉర్దూ ద్విపదలు couplets పర్షియన్ అనువాదంలో, పెర్షియన్ వివరణలతో ఉల్లేఖించబడ్డాయి.

షిబ్లీ యొక్క “పోయెట్రీ ఆఫ్ ది పర్షియన్స్” ఆఫ్ఘనిస్తాన్‌లో అనువదించబడిన ఏకైక ఉర్దూ భాషా రచన మాత్రమే కాదు, దానితో బాటు ఖరీ అబ్దుల్లా ముహమ్మద్ హుస్సేన్ ఆజాద్ యొక్క “సుఖందన్-ఐ ఫార్స్ (పర్షియా కవులపై ) ఉర్దూ నుండి పర్షియన్లోకి అనువదించారు.

షిబ్లీకి సమకాలీనుడైన ఆజాద్ పర్షియన్ మరియు ఉర్దూ భాషల్లో పండితుడు; పర్షియన్ సాహిత్యం మరియు భాషాశాస్త్రంపై ఆజాద్ ఉపన్యాసాలను “సుఖందన్-ఐ ఫార్స్”  గా  సంకలనం చేశారు. ఈ అనువాదం మొదట కాబూల్ పత్రికలో కథనాల పరంపరగా కనిపించింది మరియు తరువాత 1930లలో పుస్తక రూపంలో ప్రచురించబడింది.

30వ దశకంలో ముహమ్మద్ నాదిర్ షా (r. 1929-1933) పాలనలో అదనపు ఆఫ్ఘన్-భారత సంబంధాలను చూశారు, ముహమ్మద్ నాదిర్ షా ఉత్తర భారతదేశంలోని డెహ్రాడూన్‌లో పుట్టి చదువుకున్నాడు మరియు ఉర్దూ అనర్గళంగా మాట్లాడుతాడు. ముహమ్మద్ నాదిర్ షా, ప్రఖ్యాత ఉర్దూ కవి ముహమ్మద్ ఇక్బాల్‌తో పాటు సయ్యద్ అహ్మద్ ఖాన్ మనవడు రాస్ మసూద్‌తో కలిసి షిబ్లీ యొక్క ఆశ్రితుడు protégé సయ్యద్ సులైమాన్ నద్వీని కాబూల్‌కు ఆహ్వానించాడు. ఇతర అంశాలపై ఉర్దూ రచనలు అనువదించడం కొనసాగింది.

షిబ్లీ నోమానీ యొక్క ఖలీఫా  ఉమర్ మరియు తొలి ముస్లిం న్యాయనిపుణుడు అబూ హనీఫా జీవిత చరిత్రలు పర్షియన్ భాషలోకి అనువదించబడ్డాయి మరియు ఆఫ్ఘన్ దౌత్యవేత్త అబ్దుల్ హదీ దావీ ఇక్బాల్ ఉర్దూ కవిత్వాన్ని పర్షియన్ భాషలోకి అనువదించారు.

ఇరాన్‌లో సంస్కరణలను భారతదేశం ఎలా ప్రభావితం చేసిందిHow India influenced reform in Iran:

ఇదే సమయంలో, ఇరానియన్లు వారి సంస్కరణ మరియు ఆధునీకరణ ప్రాజెక్టులలో కూడా భారతీయ సంబంధాలను ఉపయోగించుకున్నారు. ఉదాహరణకు, ఇరాన్ ప్రధాన మంత్రి ముహమ్మద్-అలీ ఫురుఘి భారతదేశంలో గడిపారు, తరువాత భారతీయ స్నేహితులు మరియు పరిచయస్తులతో తరచుగా కలసేవారు. ముహమ్మద్-అలీ ఫురుఘి పారిస్ శాంతి సమావేశం (1919-1920) సందర్భంగా సయ్యద్ సులైమాన్ నద్వీని కలిశాడు. తక్కువ మంది ఇరానియన్‌లకు ఉర్దూ తెలుసు, ఆఫ్ఘన్‌లలో భాష యొక్క ప్రాబల్యంతో పోలిస్తే, ఉర్దూ నుండి పర్షియన్‌కు అనువాదాలు ఇరానియన్ సాహిత్య మరియు మేధో వర్గాలలో గొప్ప ప్రభావాన్ని చూపాయి.

ఉర్దూ నుండి పర్షియన్‌కి ఇరానియన్ అనువాదకులలో ఒకరు సయ్యద్ ముహమ్మద్-తకీ దై అల్-ఇస్లాం 'ఫఖ్ర్-ఇ దై Fakhr-i Daʿi ' గిలానీ (1882-1964), ఫఖ్ర్-ఇ దై,  ఇతను 1950లలో షిబ్లీ యొక్క “పొయెట్రీ ఆఫ్ ది పర్షియన్స్” యొక్క కొత్త అనువాదాన్ని పూర్తి చేశాడు. ఫఖ్ర్-ఇ దై, బొంబాయిలో ముస్లిం మిషనరీగా పనిచేస్తున్నప్పుడు ఉర్దూ నేర్చుకున్నాడు – బొంబాయి ని అతను భారతదేశంలోని అందమైన నగరాల్లో ఒకటిగా మరియు వివిధ మతాలు మరియు వర్గాల ఉద్యానవనం అని అభివర్ణించాడు. ఫఖ్ర్-ఇ దై మధ్య భారతదేశంలోని ఇండోర్ కళాశాలలో పర్షియన్ బోధకుడిగా పనిచేసాడు.. ఫఖ్ర్-ఇ దై భారతదేశంలో ఎనిమిది సంవత్సరాలు గడిపాడు మరియు ఇరాన్‌కు తిరిగి వచ్చిన తరువాత షిబ్లీ నోమాని, సయ్యద్ అహ్మద్ ఖాన్, సయ్యద్ అమీర్ అలీ మరియు ఇతరుల వంటి భారతీయ ముస్లిం పండితుల రచనల పర్షియన్ అనువాదాలను ప్రచురించడం ప్రారంభించాడు.

ఆఫ్ఘన్ అనువాదకుల మాదిరిగా కాకుండా, ఫఖ్ర్-ఇ దై  స్వేచ్ఛానువాదం చేసాడు. ఇరాన్ యొక్క గొప్పతనం గురించి వివరించాడు.. అతను ఉర్దూ కవిత్వం మరియు ఉర్దూకి సంబంధించిన ఇతర సూచనల/references నుండి షిబ్లీ యొక్క ఉల్లేఖనాలను quotations పూర్తిగా తొలగించాడు.

ఫఖ్ర్-ఇ దై తన అనువాదం అసలుపై మెరుగుదలగా భావించాడు; అతని దృష్టిలో, అతను మూలం యొక్క తప్పులను సరిదిద్దాడు మరియు దాని లోపాలను అధిగమించాడు. షిబ్లీ యొక్క “పొయెట్రీ ఆఫ్ ది పర్షియన్స్” యొక్క అతని అనువాదం ఇరాన్‌లో బాగా విజయవంతం అయినది. ప్రముఖ ఇరానియన్ సాహిత్య పండితులు సెయిద్ నఫీసి, ముహమ్మద్-తకీ బహర్ మరియు జైనుల్ అబిదిన్ ముతామాన్ వంటి వారిచే ప్రశంసించబడింది.ఫఖర్-ఇ దై యొక్క ఇతర అనువాదాలు, ఉదా:కు  షిబ్లీ యొక్క కలాం చరిత్ర లేదా ఊహాజనిత వేదాంతశాస్త్రం వంటి ఇతర రచనలు  కూడా ప్రభావం చూపాయి.

ముగింపు:

1920లలో ఆఫ్ఘన్‌లు పర్షియన్ల కవిత్వాన్ని అనువదించినారు  మరియు ఆఫ్ఘన్ జాతీయ సంస్థలు (విద్యా మంత్రిత్వ శాఖ వంటివి) అనువాదానికి కొన్ని సంవత్సరాల ముందు మాత్రమే ఏర్పడ్డాయి మరోవైపు ఇరానియన్ పండితుడు  నఫీసీ - ఫఖ్ర్-ఇ దై యొక్క పర్షియన్ అనువాదం 1950లలో పూర్తయింది. అప్పటికి ఇరాన్ జాతీయ గుర్తింపు బలంగా స్థాపించబడింది మరియు టెహ్రాన్ విశ్వవిద్యాలయం వంటి సంస్థలు ఏర్పడినాయి.

షిబ్లీ యొక్క “పోయెట్రీ ఆఫ్ ది పర్షియన్స్” యొక్క ఈ రెండు పర్షియన్ అనువాదాలు(ఆఫ్ఘన్ మరియు ఇరానియన్) "పర్షియన్ ఆధునికత"కి చిన్న ఉదాహరణలు.

ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ నుండి వచ్చిన ఆధునికవాదులు ఉర్దూ నుండి అనువదించారు మరియు పెర్షియన్ కవిత్వాన్ని విశ్లేషించడానికి షిబ్లీ నోమాని వంటి భారతీయ పండితులపై ఆధారపడతారు.

మూల రచయిత:అలెగ్జాండర్ జబ్బారి యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటాలో అసిస్టెంట్ ప్రొఫెసర్. అతను ది మేకింగ్ ఆఫ్ పర్షియన్ మోడర్నిటీ: లాంగ్వేజ్ అండ్ లిటరరీ హిస్టరీ బిట్ ఇరాన్ అండ్ ఇండియా (కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ ప్రెస్,త్వరలో వేలుబడనుంది)వంటి గ్రంధాలు రాసారు.

తెలుగు సేత: సల్మాన్ హైదర్.

No comments:

Post a Comment