1351AH/(1933AD)న లేడీ ఎవెలిన్ ముర్రే(జైనాబ్ కొబోల్ద్) బ్రిటిన్ లో జన్మించి హజ్ చేసిన మొదటి ముస్లిం మహిళగా చరిత్ర
సృష్టించినది. తనను తాను ముస్లింగా ప్రకటించుకున్న తర్వాత, లేడీ ఎవెలిన్ తన పేరును జైనాబ్ కొబోల్ద్
గా మార్చుకుంది.
సనాతన క్రైస్తవ కుటుంబo లో జన్మించిన లేడీఎవెలిన్
ఇస్లాం ధర్మం సరైనది మరియు అత్యంత ఆచరణాత్మకమైన మతం అని నమ్మినది. లేడీ ఎవెలిన్ ఇస్లాం
యొక్క సారాంశాన్ని నిజంగా అర్థం చేసుకుంది మరియు దేవుని ఏకత్వాన్ని ధృవీకరించింది
మరియు తరువాత హజ్ కోసం పవిత్ర నగరమైన మక్కాకు వెళ్లాలని నిర్ణయించుకుంది
జైనాబ్ (లేడీ ఎవెలిన్) హజ్ యాత్ర సుదీర్ఘoగా కొనసాగింది. మొదట జైనాబ్(లేడీ ఎవెలిన్) సూయెజ్ (ఈజిప్ట్ లోని ఒక నగరం)కి రైలులో ప్రయాణించింది మరియు అక్కడ మశూచి మరియు కలరా టీకాలు వేయించుకోంది. తర్వాత జైనాబ్ (లేడీ ఎవెలిన్) ఒక ఫెర్రీ ద్వారా జెడ్డాకు వెళ్ళింది. ఫెర్రీ, జెడ్డా చేరుకోవడానికి దాదాపు నాలుగు రోజులు పట్టింది
హజ్ చేయడానికి అనుమతి కోరుతూ సౌదీ అరేబియా రాజుకు ముందుగా జైనాబ్ (లేడీ ఎవెలిన్) లేఖ రాసింది. సౌది అరేబియా రాజు అబ్ద్ అల్ అజీజ్, జైనాబ్ (లేడీ ఎవెలిన్) కథ మరియు ఇస్లాం (శాంతి మతం)కి తిరిగి రావడం పట్ల చాలా ఆకర్షితుడయ్యాడు. జైనాబ్‌కు హజ్ చేసే అధికారం మంజూరు చేయబడింది.జైనాబ్ మినా నుంచి అరాఫత్‌కు కారులో ప్రయాణించింది.
తరువాత, మస్జిద్ అల్ హరామ్‌కు చేరుకున్న తర్వాత, జైనాబ్(లేడీ ఎవెలిన్) తన భావాలను ఈ క్రింది విధంగా వివరిస్తుంది: “నేను మక్కా మసీదులో ఉన్నాను మరియు కొన్ని సెకన్లపాటు దాని యొక్క అద్భుతం కారణంగా నేను నా పరిసరాలను మర్చిపోయాను. యాత్రికులు తెల్లటి పాలరాతిపై నడుస్తున్నాము.దాని పైకప్పు యాభై అడుగుల ఎత్తులో ఉంది ఇంత అద్భుతమైనది నేనెప్పుడూ ఊహించలేదు.... అల్లాహ్ యొక్క ఇల్లు [కాబా] దృశ్యాన్ని వివరించడానికి నాకు మాటలు రావటం లేదు. మతపరమైన ఉత్సాహంతో నేను ఆధ్యాత్మిక ఔన్నత్యం యొక్క బలమైన తరంగంలో చిక్కుకున్నట్లు భావించాను…”
జైనాబ్(లేడీ ఎవెలిన్) తల్లితండ్రులు జైనాబ్ చిన్నతనంలో అల్జీరియాలో ఉన్ననందువలన జైనాబ్ అరబిక్ అనర్గళంగా మాట్లాదేది మరియు అరబిక్ భాషపై మంచి పట్టు సాధించినది..
జైనాబ్ తన తరువాతి రోజులను ఇస్లాం బోధిస్తూ
గడిపింది. ఆమె పుస్తకం "పిల్‌గ్రిమేజ్ టు మక్కా" హజ్ యాత్ర యొక్క పురాతన
రికార్డు.
జైనాబ్(లేడీ ఎవెలిన్) మరణం తరువాత, జైనాబ్ ను స్కాట్లాండ్‌లోని ఆమె ఎస్టేట్ సమీపంలోని కొండపై ఖననం
చేశారు. జైనాబ్ (లేడీ ఎవెలిన్) సమాధి మక్కాకు ఎదురుగా ఈ
క్రింది పదాలతో రాయబడి ఉంది: “అల్లాహు
నూర్-ఉస్-సమావతి వల్ ఆర్ద్ ” (“అల్లాహ్
స్వర్గం మరియు భూమికి కాంతి వంటివాడు. ")
No comments:
Post a Comment