22 August 2022

ఉషా మెహతా: 8 ఏళ్ళకు స్వాతంత్ర్య సమరయోధురాలు, 22 ఏళ్ళకు 'సీక్రెట్ కాంగ్రెస్ రేడియో' ప్రసారకర్త - ఒక లెజెండ్. Usha Mehta: Freedom Fighter at 8, aired 'Secret Congress Radio' at 22, became a Legend

 


గుజరాత్‌లోని సరస్ గ్రామానికి చెందిన ఉషా మెహతా అనే ఎనిమిదేళ్ల బాలిక 1928లో స్వాతంత్ర్య ఉద్యమంలో నిరసన ప్రదర్శనలో పాల్గొని, "సైమన్, తిరిగి వెళ్ళు Simon,Go back " అని నినాదాలు చేసింది.

కొన్ని సంవత్సరాల తరువాత, ఉషా మెహతాకు 22 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు, ఆగస్ట్ 8, 1942న మహాత్మాగాంధీ 'క్విట్ ఇండియా' ఉద్యమానికి పిలుపునిచ్చిన ఐదు రోజుల తర్వాత ఉషా మెహతా 'సీక్రెట్ కాంగ్రెస్ రేడియో'ని ప్రారంభించి వెలుగులోకి వచ్చింది.

క్విట్ ఇండియా ఉద్యమం లో బ్రిటిష్ పోలీసులు భారత జాతీయ కాంగ్రెస్ (INC) నాయకులందరినీ అరెస్ట్ చేసి జైళ్లలో వేశారు. కేవలం ఐదు రోజులలో, ఉషా మెహతా మరియు ఆమె సహచరులు విఠల్‌భాయ్ ఝవేరి, బాబూభాయ్ ఠక్కర్, చంద్రకాంత్ ఝవేరి మరియు చికాగో రేడియో యజమాని నాంకా మోత్వాని మరియు ఇతరులు 'సీక్రెట్ కాంగ్రెస్ రేడియో'ని ప్రారంభించారు.

ఆగష్టు 14, 1942'ఎక్కడో భారతదేశంలో('somewhere in India')' నుండి 42.34 మీటర్ల ఫ్రీక్వెన్సీలో వినిపించే 'సీక్రెట్ కాంగ్రెస్ రేడియో' గంటసేపు తన మొదటి ప్రసారం చేసింది  మరియు ఇంగ్లీష్ మరియు హిందీలో ప్రతిరోజూ ఒకటి లేదా రెండుసార్లు ప్రత్యక్ష ప్రసారం చేసేది.

బ్రిటీష్ వారు  గుర్తించకుండా ఉండటానికి ప్రతిరోజూ ప్రసారాల  లొకేషన్‌లను మార్చడం మరియు దేశభక్తి గీతాలు, అగ్ర నాయకుల సందేశాలు, నినాదాలు, రికార్డ్ చేసిన ప్రసంగాలు, బ్రిటీష్ దురాగతాల సెన్సార్ చేయని వార్తలు, నిషేధిత సమాచారం, రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన కొన్ని లీకైన వార్తలు మరియు ఇతర అంశాలను 'సీక్రెట్ కాంగ్రెస్ రేడియో' ప్రసారం చేసింది.

 సీక్రెట్ కాంగ్రెస్ రేడియో' ప్రముఖ INC నాయకులు గాంధీజీ, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ద్వారా ముందుగా రికార్డ్ చేసిన 'కంటెంట్'ని   మరియు డా. రామ్ మనోహర్ లోహియా, అచ్యుత్రావ్ పట్వర్ధన్, పురుషోత్తం త్రికామ్‌దాస్ వంటి ఇతర ప్రముఖుల ప్రసంగాలను కూడా ప్రసారం చేసేది.

'రహస్య ప్రదేశం'పై సమాచారం బ్రిటిష్ వారికి లబించే వరకు దాదాపు 3 నెలల పాటు 'సీక్రెట్ కాంగ్రెస్ రేడియో' అత్యంత ప్రజాదరణ పొందింది, నవంబర్ 1942లో పోలీసుల దాడితో 'సీక్రెట్ కాంగ్రెస్ రేడియో' మూసివేయబడింది. అన్ని పరికరాలను జప్తు చేసి ఉషా మెహతా  మరియు ఇతరులను అరెస్ట్ చేసినారు.  వారు నాలుగు సంవత్సరాలు  అనగా    మార్చి 1946 వరకు పూణెలోని ఎరవాడ సెంట్రల్ జైలు లో గడిపారు.

2వ ప్రపంచ యుద్ధం WWII (1939-1945) సమయం లో కాంగ్రెస్ రహస్య రేడియో స్టేషన్‌ను నడపడానికి ఉషా మెహతా చూపిన ధైర్యసాహసాలు, ప్రజానీకాన్ని ఏకం చేయడంలో సహాయపడి, స్వాతంత్య్ర పోరాటానికి మరింత బలం చేకూర్చినవి..

మార్చి 25, 1920న జన్మించిన ఉషా మెహతా  అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమంలో (1917లో స్థాపించబడినది) గాంధీజీ 'దర్శనం' పొందినప్పుడు ఆమె వయస్సు కేవలం ఐదేళ్ల మాత్రమే.  ఆ తర్వాత సూరత్ సమీపంలోని గాంధీ కార్మికుల శిబిరాలకు హాజరైన ఉషా మెహతా ఖాదీ నూలు వడికి సంపూర్ణ మద్య నిషేధం కోసం జరిగిన నిరసన ఉద్యమం లో పాల్గొన్నారు.

ఉషా మెహతా తండ్రి హరిప్రసాద్ మెహతా, బ్రిటీష్ క్రౌన్ క్రింద న్యాయమూర్తి, కాని అతను 1930లో పదవీ విరమణ చేసి ఆపై గాంధీజీ చారిత్రాత్మక ఉప్పు యాత్రలో పాల్గొన్నాడు.

కొన్ని సంవత్సరాల తరువాత ఉషా మెహతా 1932లో, కుటుంబం బొంబాయికి మారింది, ఉషా మెహతా  ముంబై లో తన విద్యను కొనసాగించింది మరియు స్వాతంత్ర్య ఉద్యమంలో మరింత చురుకుగా పాల్గొంది.

ఖేడా, బరూచ్‌, తర్వాత ముంబైలో ప్రాథమిక పాఠశాల విద్య పూర్తి చేసిన ఉషా మెహతా  గిర్గామ్‌లోని చందరామ్‌జీ హైస్కూల్ లో  1935లో మెట్రిక్యులేషన్ పూర్తి చేసి, 1939లో చౌపట్టిలోని విల్సన్ కాలేజీలో (ప్రస్తుతం 190 సంవత్సరాలు) చేరి, ఫిలాసఫీలో 1వ తరగతితో పట్టభద్రురాలైంది.

స్వాతంత్య్రానంతరం, 27 ఏళ్ల ఉషా మెహతా  తన విద్యాబాసాన్ని కొనసాగించినది. గాంధీజీచే తీవ్రంగా ప్రభావితమై, బ్రహ్మచారిణిగా మారింది, గాంధీ జీవనశైలిని అవలంబించింది. సౌకర్యాలు మరియు విలాసాలకు దూరంగా ఉంది, చివరి వరకు ఖాదీ చీరలు మాత్రమే ధరించింది, ఉషా మెహతా తన జీవితాంతం గాంధేయ తత్వాన్ని అవలoభించినది.

బొంబాయి యూనివర్సిటీ నుండి  ఉషా మెహతా  డాక్టరేట్ సంపాదించి, ముంబై అకడమిక్ మరియు పొలిటికల్ సర్కిల్స్‌లో సుపరిచితమైన వ్యక్తిగా, విద్యార్థిగా, టీచర్‌గా, ప్రొఫెసర్‌గా, ఆపై బొంబాయి విశ్వవిద్యాలయంలో సివిక్స్ & పాలిటిక్స్ విభాగానికి అధిపతిగా, తన సుదీర్ఘ కెరీర్‌ను ముగించి 60 ఏళ్ల వయస్సులో  1980లో పదవీ విరమణ చేశారు.

స్వాతంత్ర్య పోరాటంలో చిరస్మరణీయమైన పాత్రను పోషించిన ఉషా మెహతా రిటైర్ అయిన తర్వాత, ఆంగ్లం మరియు గుజరాతీ భాషలలో వ్యాసాలు, పుస్తకాలు మరియు ప్రసంగాల ద్వారా గాంధేయ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ సామాజిక సేవ ప్రారంభించినది.

ఉషా మెహతా గాంధీ స్మారక్ నిధి (GSN) అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.  ఇది గాంధీ స్మారక్ నిధి (GSN) తరువాత చారిత్రాత్మక మణి భవన్‌ను స్వాధీనం చేసుకొని దానిని దానిని జాతిపిత స్మారక చిహ్నంగా మార్చింది. ఉషా మెహతా గాంధీ పీస్ ఫౌండేషన్ మరియు భారతీయ విద్యాభవన్‌ కార్యకలాపాలలో చురుకుగా పనిచేసింది.

డాక్టర్ ఉషా మెహతా పద్మశ్రీ, పద్మభూషణ్ మరియు పద్మవిభూషణ్‌ తో సత్కరింపబడినది.

ఆగస్ట్ 2000 ప్రారంభంలో, డాక్టర్ ఉషా మెహతా ఆరోగ్యం కొoచం తగ్గినప్పటికీ, డాక్టర్ మెహతా ఆగస్ట్ 9న 'క్విట్ ఇండియా డే' యొక్క వార్షికోత్సవానికి హాజరయ్యారు మరియు ఆగస్టు 11 రాత్రి తుది శ్వాస విడిచారు.

డాక్టర్ ఉషా మెహతాకు ఆమె ముగ్గురు మేనల్లుళ్లు ఉన్నారు – ఒకరు ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కేతన్ మెహతా మరియు ఇద్దరు ప్రసిద్ధ వైద్య నిపుణులు, గురుగ్రామ్‌లో ఉన్న  డాక్టర్ యతిన్ మెహతా మరియు ముంబైలో ఉన్న డాక్టర్ నిరాద్ మెహతా.

No comments:

Post a Comment