23 August 2022

నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (1886-1967)వ్యక్తిత్వo సల్మాన్ హైదర్

 

హైదరాబాద్ యొక్క 7వ మరియు చివరి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (జననం: 6-4-1886; మరణం: 24-2-1967) ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు మరియు విద్య, వైద్యం, ఇంజినీరింగ్, సామాజిక సేవ, వాస్తుశిల్పం, వారసత్వం, కవిత్వం, కళ మరియు సంస్కృతి వంటి వివిధ రంగాలలో తన  సేవలకు,దాతృత్వంకు  ప్రసిద్ధి చెందాడు. నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన 25 సంవత్సరాల వయస్సులో 1911 ఆగస్టు 29న సింహాసనాన్ని అధిష్టించాడు మరియు 1911 మరియు 1948 మధ్య హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించాడు.

నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దాదాపు రూ. 50 మిలియన్ పౌండ్ల (భారత కరెన్సీలో 480.00 కోట్లు) విలువైన 185 క్యారెట్ల  పరిమాణంలో ఉన్న జాకబ్ డైమండ్‌ను పేపర్‌వెయిట్‌గా ఉపయోగించడం ఆశ్చర్యకరం. అపారమైన సంపద ఉన్నప్పటికీ, నవాబ్మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన సొంత కోసం చాలా తక్కువ ఖర్చు చేసేవాడు మరియు సాధారణ జీవితాన్ని గడిపాడు. నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడూ ఆడంబరాలలో పాల్గొనలేదు మరియు అన్ని రకాల విలాసాలను ఖండించేను.

నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నిర్మించన వాటితో నేటికీ ప్రజలు లబ్ధి పొందుతున్నారు. వాటిలో కొన్ని ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా హాస్పిటల్, చార్మినార్ నిజామియా టిబ్బి హాస్పిటల్, నిమ్స్, అసెంబ్లీ భవన ప్రాంగణం, జూబ్లీ హాల్, హైదరాబాద్ మ్యూజియం (స్టేట్ మ్యూజియం), హైకోర్టు భవనం, కాచిగూడ రైల్వే స్టేషన్, బేగంపేట్ విమానాశ్రయం, అసఫియా లైబ్రరీ (స్టేట్ సెంట్రల్ లైబ్రరీ), మోజoజాహి మార్కెట్ , స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ (ప్రస్తుతం SBIలో విలీనం చేయబడింది) , ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, నిజాం సాగర్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ మొదలైనవి.

నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఢిల్లీలో హైదరాబాద్ హౌస్‌ను నిర్మించాడు, ఇప్పుడు దానిని భారత కేంద్ర ప్రభుత్వం దౌత్య సమావేశాల కోసం ఉపయోగిస్తున్నారు. పూర్వపు రాచరిక రాష్ట్రమైన హైదరాబాద్‌లో భాగం అయిన తెలంగాణ,కర్ణాటక మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల నుండి వచ్చే హజ్ మరియు ఉమ్రా యాత్రికుల సౌకర్యార్థం సౌదీ అరేబియాలోని రుబాత్ మొదలగునవి.

నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గొప్ప దూరదృష్టి గలవాడు మరియు "ఆధునిక హైదరాబాద్ ఆర్కిటెక్ట్" అని పిలువబడ్డాడు. నిజాం ముస్లింలకే కాకుండా హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు మరియు పార్సీల అనేక ప్రార్థనా స్థలాల నిర్మాణం / పునర్నిర్మాణం మరియు చర్చిల నిర్వహణ కోసం దేశం లోపల మరియు వెలుపల అనేక మంది పూజారులకు, మరియు మసీదుల ఇమామ్‌,  మోజ్జాన్‌లకు  నెలవారీ గౌరవ వేతనాన్ని ఇవ్వడం తో  పాటు ఆర్థిక సహాయం అందించాడు. వాటిలో ప్రముఖమైనవి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోని బాలాజీ ఆలయం, (ప్రస్తుతం అది తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), హైదరాబాద్‌లోని సీతారాంబాగ్ ఆలయం, భోంగీర్‌లోని యాదగిరిగుట్ట ఆలయం, వరంగల్‌లోని వేయి స్తంభాల ఆలయం, మక్కా మరియు మదీనాలోని గొప్ప మసీదులు. 

నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హిందూ బనారస్ విశ్వవిద్యాలయం, ఆంధ్రా విశ్వవిద్యాలయం, లండన్ విశ్వవిద్యాలయం మొదలైన వాటి నిర్మాణానికి ద్రవ్య సహకారం అందించాడు. ఈ ప్రార్థనా స్థలాలకు మరియు విశ్వవిద్యాలయాలకు  ఆర్థిక సహాయం విడుదల చేస్తున్న నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఫర్మానాలు ఇప్పటికీ హైదరాబాద్‌లోని ఆర్కైవ్స్ విభాగంలో అందుబాటులో ఉన్నాయి.

మక్కా, మదీనాలోని పవిత్ర మసీదుల నిర్వహణ బాధ్యతలను మరియు  వాటి  ఖర్చులు నిజాం భరించాడు అన్న విషయం ఎంతమంది ముస్లిములకు తెలుసు? అలాగే నిజాం కు ప్రసిద్ధ TTD లేదా ఇతర ఆలయాలతో అనుబంధం ఉన్నవిషయం ఎంత మంది భక్తులకు తెలుసు? KSA రాజు సౌద్ నిజాంను కలవడానికి 1954లో హైదరాబాద్‌ని సందర్శించారు మరియు అతని ఆర్థిక సహాయానికి వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలిపారు.

 బనారస్ హిందూ విశ్వవిద్యాలయం మరియు ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపనకు నిజాం ధన సహకారాన్ని అందించాడు . ఆఖరి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారతీయ ఇతిహాసం "మహాభారతం" సంకలనం కోసం నిధులు సమకూర్చాడు.

నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ విదేశాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు ఎలాంటి వివక్ష లేకుండా స్కాలర్‌షిప్‌లు మంజూరు చేశారు. స్వాతంత్ర్య సమరయోధురాలు సరోజినీ నాయుడు అటువంటి లబ్ధిదారుల్లో ఒకరు. నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1940లో హైదరాబాద్ తెలుగు అకాడమీ స్థాపించుటకు అనుమతించారు.

నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు శాంతియుతంగా, సంతోషంగా జీవించారు. నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎప్పుడూ ఎవరినీ మతం, కులం ఆధారంగా వివక్ష చూపలేదు. అందరికీ సమాన హక్కులు మరియు గౌరవం ఇచ్చాడు.

నిజాం నవాబ్  చాలా దయగల రాజు అని, అతను తన ప్రజల కష్టాలు మరియు బాధలను భరించలేడని అంటారు. ఒకరోజు నిజాం ఒక రోగిని ఓదార్చడానికి ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించాడు, అక్కడ కాళ్ళు లేని ఒక పేదవాడు భూమిపై పాకటం చూశాడు. పేదవాడి ఈ దయనీయ స్థితి నిజాం ను చాలా బాధించింది. నిజాం వెంటనే దీనికి సంబంధించి అవసరమైన సంప్రదింపులు మరియు చర్చలు ప్రారంభించి,  పంజాగుట్టలో స్థలాన్ని కొనుగోలు చేసి రూ. 30 లక్షల వ్యయంతో  ఆర్థోపెడిక్ హాస్పిటల్ నిర్మించాడు. ఇప్పుడు దీనిని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)గా పిలుస్తారు.

అదేవిధంగా స్థానికంగా "తుగ్యాని సీతాంబర్" అని పిలువబడే 1908 నాటి గ్రేట్ మూసీ వరదలలో  సుమారు 50,000 మంది మరణించారు, 80,000 ఇళ్లను ధ్వంసం అయినవి మరియు జనాభాలో నాల్గవ వంతు మంది నిరాశ్రయులయ్యారు. అటువంటి భయంకరమైన విపత్తు పునరావృతం కాకుండా నివారణ చర్యలను రూపొందించడానికి మరియు నగరం యొక్క పునర్నిర్మాణంలో సలహా మరియు సహాయం చేయడానికి ప్రముఖ సివిల్ ఇంజనీర్ మరియు స్టేట్స్‌మన్ అయిన  సర్ ఎం. విశ్వేశ్వరయ్యను నిజాం నవాబ్  ఆహ్వానించాడు. ఆ విధంగా, హైదరాబాద్ జంట సరస్సులు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించబడినవి.

హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్‌ను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేసే ప్రతిపాదనను నిజాం తిరస్కరించినప్పుడు, 1948లో "పోలీస్ యాక్షన్" అని పిలవబడే ఆపరేషన్ పోలో   జరిగింది. హైదరాబాదు సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయబడింది.

 నిజాం జనవరి, 1950లో భారత ప్రభుత్వంచే హైదరాబాద్ రాష్ట్రానికి రాజ్ ప్రముఖ్‌గా నియమించబడ్డాడు. తన  రాజ్యం ముగిసిన తర్వాత కూడా, నిజాం అన్ని సామాజిక, విద్యారంగ మరియు సంక్షేమ కార్యకలాపాలకు మద్దతునిస్తూనే ఉన్నాడు.. నిజాం నవాబ్ 1965లో చైనాతో యుద్ధం (చైనా-ఇండియన్ వార్) సమయంలో భారత కేంద్ర ప్రభుత్వానికి 5 టన్నుల బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు.

 నిజాం నవాబ్ మాటలలో  మేరా పైఘామ్ మొహబ్బత్ హై జహాన్ తక్ పహుంచే.” ( నా సందేశం 'ప్రేమ', అది ప్రపంచం మొత్తానికి చేరాలి)

సమాచార సౌజన్యం: షౌకత్-ఎ-ఉస్మానియా  మరియు ఇతర సమాచారం.

No comments:

Post a Comment