20 August 2022

భారతదేశం మరియు థాయిలాండ్ మధ్య చారిత్రక మరియు సాంస్కృతిక సంబంధాలు The historical and cultural connections between India and Thailand

 

భారతదేశం మరియు ఆగ్నేయాసియా ప్రాంతం మద్య సాంస్కృతిక మరియు వాణిజ్య సంబంధాల సుదీర్ఘ చరిత్ర ఉంది. భారతదేశంలోని సంస్కృత మరియు పాళీ గ్రంథాలలో  ఆగ్నేయాసియా ప్రాంతంను  కథాకోశ, సువర్ణభూమి (దేవుని భూమి) లేదా సువర్ణద్వీప (బంగారు ద్వీపం) వంటి వివిధ పేర్లను పిలిచారు. ఆగ్నేయాసియా ప్రాంతం  భారతీయ వ్యాపారులను ఆకర్షించిన ప్రాంతం మరియు ఈ ప్రాంతం సుగంధ ద్రవ్యాలు, సుగంధ కలప మరియు ముఖ్యంగా బంగారం వ్యాపారం కు ప్రసిద్ది చెందినది.  

ఆగ్నేయాసియా భౌగోళికంగా వియత్నాం, కంబోడియా, లావోస్, థాయిలాండ్, మయన్మార్ మరియు మలయ్ దేశాలను సూచిస్తుంది.

రెండు వేల సంవత్సరాల క్రితం నాటి ప్రాచీన  సంస్కృతం, బౌద్ధ మరియు జైన గ్రంథాలు రెండు ప్రాంతాల మధ్య పరస్పర సంబంధాలను ముఖ్యంగా  సముద్ర ప్రయాణo  మరియు వాణిజ్యంను వివరిస్తున్నాయి.  భారతీయ వ్యాపారులు తమతో పాటు భారతీయ మతం, సంస్కృతి, సంప్రదాయాలు మరియు తత్వశాస్త్రాన్ని తమతో పాటు ఆగ్నేయాసియా తీరాలకు తీసుకువచ్చారని చరిత్రకారులు పేర్కొన్నారు. "వారితో పాటు బ్రాహ్మణ పూజారులు, బౌద్ధ సన్యాసులు, పండితులు మరియు సాహసికులు కూడా వచ్చారు మరియు ఆగ్నేయాసియాలోని స్థానికులకు భారతీయ సంస్కృతిని పరిచయం చేయడంలో వారందరూ ముఖ్యమైన పాత్ర పోషించారు. కొంతమంది వ్యాపారులు మరియు బ్రాహ్మణ పూజారులు స్థానిక అమ్మాయిలను వివాహం చేసుకున్నారు మరియు స్థానిక పాలకులవద్ద  ఉద్యోగం చేయచేసారు

కొంతమంది భారత ప్రముఖ చరిత్రకారులు ఆగ్నేయాసియా – భారత దేశం కు మధ్యగల సంబంధాలు ఆగ్నేయాసియా ప్రాంతం లో భారతీయ రాజ్యాల ఏర్పాటుకు దారితీశాయని వ్రాశారు. ఆగ్నేయాసియా జనాభాకు భారతీయులు పూర్తిగా అపరిచితులు కానందున మరియు అనాదిగా ఉన్న వాణిజ్య సంబంధాలు ఆగ్నేయాసియాలో భారతీయ విస్తరణను ప్రోత్సహించినవి.  

 చరిత్రకారుడు RC మజుందార్ ఆగ్నేయాసియాలోని పురాతన భారతీయ రాజ్యాలను ‘భారతీయ కాలనీలు'గా ప్రస్తావించారు

ఆగ్నేయాసియాలో ఏర్పడిన  మొదటి భారతీయ రాజ్యం ఫునాన్, ఇది ఆధునిక కంబోడియా మరియు దక్షిణ వియత్నాంలోని లిన్-యి ప్రాంతం. ఇది రెండవ శతాబ్దం CE లో ఏర్పడినది..

థాయ్, మలయ్ మరియు జావానీస్‌తో సహా ఆగ్నేయాసియా ప్రాంతంలోని అనేక స్థానిక భాషలు పెద్ద ఎత్తున సంస్కృతం, పాలీ మరియు ద్రావిడ మూలానికి చెందిన పదాలను కలిగి ఉన్నాయి. థాయ్ భాష దక్షిణ భారత పల్లవ వర్ణమాల నుండి తీసుకోబడిన లిపిలో వ్రాయబడింది.

ఆగ్నేయాసియాపై భారతదేశం యొక్క అత్యంత ముఖ్యమైన ప్రభావం మత రంగంలో ఉంది. శైవయిజం, వైష్ణవం, థెరవాడ బౌద్ధమతం, మహాయాన బౌద్ధమతం మరియు తరువాత సింహళీస్ బౌద్ధమతం ఈ ప్రాంతంలో ఆచరించబడ్డాయి. "ఆగ్నేయాసియా లోని రాజకీయ మరియు పరిపాలనా సంస్థలు మరియు ఆలోచనలు, ముఖ్యంగా దైవిక అధికారం మరియు రాజ్యం యొక్క భావన, భారతీయ ఆలోచనల ద్వారా రూపొందించబడ్డాయి. ఉదాహరణకు, థాయ్ రాజును విష్ణువు అవతారంగా పరిగణిస్తారు"

రామాయణం మరియు మహాభారతం యొక్క ఎపిసోడ్‌ల యొక్క  తోలుబొమ్మ ప్రదర్శనలు మరియు థియేటర్ ఈవెంట్‌లలో ప్రదర్శించబడతాయి. ఆర్కిటెక్చర్ పరంగా, జావాలోని బోరోబోదుర్ స్థూపం, కంబోడియాలోని అంగ్కోర్ వాట్ ఆలయం, వియత్నాంలోని మై సన్ టెంపుల్ వంటి స్మారక కట్టడాలు ఈ ప్రాంతంలో భారతీయ ప్రభావానికి ఉత్తమ ఉదాహరణలు.

 థాయ్‌లాండ్‌తో భారతదేశం యొక్క మతపరమైన సంబంధాలు:

ప్రారంభ శతాబ్దాలలో, చారిత్రాత్మకంగా సియామ్ అని పిలువబడే థాయిలాండ్, ఫునాన్ సామ్రాజ్యం పాలనలో ఉంది. ఆరవ శతాబ్దం CEలో పునాన్ సామ్రాజ్యం క్షీణించిన తరువాత, ఇది బౌద్ధ రాజ్యమైన ద్వారావతి పాలనలో ఉంది. 10వ శతాబ్దంలో, ఈ ప్రాంతం ఖ్మేర్ పాలనలోకి వచ్చింది, ఇది భారతదేశంతో కూడా సంబంధాలు కలిగి ఉంది.

 పురావస్తు, ఎపిగ్రాఫిక్ మరియు ఇతర సాక్ష్యాలు థాయ్‌లాండ్‌లో భారతీయ సాంస్కృతిక చిహ్నాలను సూచిస్తున్నాయి. టాకువా-పాలో కనుగొనబడిన ఒక తమిళ శాసనం దక్షిణ భారతదేశంలోని పల్లవ ప్రాంతం మరియు దక్షిణ థాయిలాండ్ మధ్య వాణిజ్య సంబంధాలను తెలియజేస్తుంది. మణికర్రామం అనే దక్షిణ భారతీయుల వర్తక సంస్థ ఇక్కడ ఒక స్థిరనివాసాన్ని ఏర్పరచుకుంది, స్వంత ఆలయం మరియు కోనేరు ను నిర్మించింది మరియు 'స్వయం-సమృది ' కాలనీగా జీవించింది.

13వ శతాబ్దానికి పూర్వం సుఖోథై కాలంలో థాయిలాండ్‌లో బ్రాహ్మణిజం మరియు బౌద్ధమతం ఉనికిలో ఉన్నాయని గమనించడం ముఖ్యం. ద్వారావతి యొక్క సోమ రాజులు మరియు ఖేమర్లు బౌద్ధమతాన్ని ఆదరించారు మరియు అనేక బౌద్ధ భవనాలను నిర్మించారు, కానీ అదే సమయంలో బ్రాహ్మణ ఆచారాలు మరియు సంప్రదాయాలను కూడా స్వీకరించారు.

థాయిలాండ్ నేడు బౌద్ధ మెజారిటీ దేశంగా ఉన్నప్పటికీ, దేశంలో బౌద్ధ మరియు బ్రాహ్మణ దేవతలను ప్రక్క ప్రక్కన కలిగి ఉన్న అనేక దేవాలయాలు ఉన్నాయి. రెండు మతాల మద్య సహజీవనం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రముఖ బ్రాహ్మణ దేవతలైన గణేశ, బ్రహ్మ, విష్ణు మరియు శివులే కాకుండా, ఇంద్రుడు, వరుణుడు  వంటి వారిని కూడా థాయిలాండ్‌లో పూజిస్తారు.

రచయిత S N దేశాయ్, తన పుస్తకం 'హిందూయిజం ఇన్ థాయ్ లైఫ్' (2005)లో, రామాయణ ఇతిహాసం థాయ్ ప్రజా జీవితాన్ని   తీవ్రంగా ప్రభావితం చేసింది అన్నాడు.. రామాయణం ను  - థాయిలాండ్‌లో రామకృతి (రాముని మహిమ) లేదా రామకియన్ (రాముని వృత్తాంతం) అని పిలుస్తారు - థాయిలాండ్‌లో ఉన్నత వర్గాలు  మరియు సామాన్యులు రామాయణం ను బాగా ఆదరించారు. రామాయణ  ఇతిహాసంలోని భాగాలు బౌద్ధ దేవాలయాల గోడలపై చిత్రించబడ్డాయి మరియు నాటకాలు మరియు బ్యాలెట్ల రూపంలో ప్రదర్శించబడ్డాయి.

థాయ్‌లాండ్‌లో రాముడి కథకు సంభందించిన పురావస్తు ఆధారాలు లేనప్పటికీ, దేశంలోని కొన్ని పట్టణాలు రాముడి జీవితానికి సంబంధించిన పురాణగాథలను కలిగి ఉన్నాయి. ఉదాహరణకు, సెంట్రల్ థాయిలాండ్‌లో 10వ శతాబ్దం CEలో ఉద్భవించిన అయుతయ పట్టణం, శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య నుండి ఉద్భవించింది. "13వ శతాబ్దం నుండి, అనేకమంది థాయ్ రాజులు రామ అనే బిరుదును స్వీకరించారు, ఇది ప్రస్తుత రాజవంశంలో వారసత్వంగా మారింది" అని దేశాయ్ రాశారు.

No comments:

Post a Comment